Home » Adivishnu » ఆనందం పరమానందం

"గుర్తుపట్టినా ఫర్లేదు. సత్యమూర్తి చేతిలో అయిదు లక్షలు  పడకూడదు. అది  పరమానందం పంతం. ఆ పంతం నెరవేర్చుకుని  పందెం  గెలిచేందుకు దునియా గాడు సాయపడినా,  ఈ సింహచలమే సాయం చేసినా పట్టించుకోడు. పద, వెడదాం!" అని లేచేడు సింహాచలం.
ఇద్దరూ పరమానందాన్ని చేరుకున్నారు.
భద్రాచలం దునియా చెవిలో ఏదో చెప్పేడు. దునియా పరమానందానికి చేతులు జోడించేడు.
"తమరు చెప్పదలుచుకున్నది వారి చెవిలో చెప్పండి!" అన్నాడు భద్రాచలం పరమానందంతో.
ముందు తటపటాయించినా, ఇంత దూరం వచ్చాక అభ్యంతరాలు చెప్పి ప్రయోజనం  లేదని పరమానందం దునియా  చెవిలో అరనిమిషం మాటాడేడు. ఆ విధంగా  వాళ్ళిద్దరూ ఒకరి చెవిలో మరొకరు అయిదు నిమిషాలు సంభాషించేరు.
భద్రాచలం తన కేమీ పట్టనట్టు ఒక కంటితో ఆడపిల్లల డాన్స్  చూస్తున్నాడు.
పరమానందం తాను తెచ్చిన లక్షా  పాతికవేలు - బ్రీఫ్ కేసుతో సహదునియా కిచ్చేడు. ఆ తర్వాత  భద్రాచలంతో అన్నాడు -
"పద, వెడదాం!"
భద్రాచలం దునియా చెవిలో ఏదో చెప్పి పరమానందంతో పాటు బయటకు వచ్చేడు.
"ఒక  గొప్ప వ్యక్తిని పరిచయం చేసేవ్!" అన్నాడు పరమానందం.
"చిత్తం! అది నా కర్తవ్యం!"
"అతని మాటలు వింటుంటే ఏమైనా చేయగలడనిపించింది. అందుకే డబ్బు మొత్తం - ముందే ఇచ్చేసేను."
"ఎందుకైనా మంచిది! రేపు ఈవినింగు తోతాస్ కంపెనీకి వెళ్లి విషయం కనుక్కోండి! సత్యమూర్తికి ఉద్యోగం వచ్చిందీ లేనిదీ తెలుస్తుంది!"
"అనవసరం."
"చిత్తం."
"ఉద్యోగం వదిలేయ్! అయిదు లక్షలు ముఖ్యం!" అన్నాడు పరమానందం.

                                                      *        *        *
తోటాస్ టైర్స్  దగ్గర సత్యమూర్తి ఆటో దిగేడు.
ఆ ఆఫీసు ముందున్న ఐస్ క్రీం షాపులో పరమానందం లిమ్కా తాగుతూ సత్యమూర్తిని గమనిస్తున్నాడు. ఆ పక్కనే వున్న  వున్న సోడా షాపులో సింహాచలం సోడా తాగుతూ పరమానందాన్ని గమనిస్తున్నాడు.
తోట పాండు  గదివైపు నడుస్తున్న సత్యమూర్తిని ఒకసిక్కు యువకుడు ఢీ కొట్టాడు. ఆ దెబ్బకి సత్యమూర్తి చేతిలో పర్సనల్ ఫైలు  కింద పడింది. ఆ ఫైలు సిక్కు యువకుడు తీసి సత్యమూర్తి కిస్తూ "సారీ!" అన్నాడు.
"ఫర్లేదు" అన్నాడు సత్యమూర్తి.
"అర్జంటు పనేమో! ఫైలు కిందపడటం మంచి శకునం కాదు!" అన్నాడు సిక్కు యువకుడు.
"నేను శకునాలను పట్టించుకొను. పైగా, ఉద్యోగమిస్తామ రమ్మని ఖబురు పెట్టిం తర్వాతనే కలుసుకుంటున్నాను!"
"ఎవర్ని తోట పాండుగారినా?"
"అవును"
"అమ్మో! జాగ్రత్తండీ!"
సిక్కు యువకుడి హెచ్చరిక విన్నాక - పాండు గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకున్నాడు సత్యమూర్తి.
"తోట పాండు గారు మీకు బాగా తెలుసా?"
"తెలుసా? ఆయన నార్త్ లో ఇంజనీరింగ్ చేసేటప్పుడు మా ఇంటోనే వుండేవారు. మా నాన్నకి పాండుగారు బెస్టు ఫ్రెండు. నేను అప్పుడు  చిన్నపిల్లవాడిని లేండి. నార్త్ లో మా పరిస్థితులు బావుండక ఆంద్రాకి వచ్చేం. నా ఉద్యోగం కోసం మా నాన్న పాండుగారిని ప్రాధేయపడ్డాడు.  తప్పకుండా ఇస్తానని పాండుగారు  ప్రామిస్ చేసేరు. మీలాగానే ఇంటర్వ్యూకి వెళ్లెను. ఆనేస్టీ గురించి నాలుగు ముక్కలు చెప్పమన్నాడు. సత్యహరిశ్చంద్రుడి గురించి చెప్పేను. ఆ దెబ్బతో నాన్నకి చెప్పేను. ఆ దెబ్బతో నాన్నకి కాలూ చెయ్యీ పడిపోయి నోట మాట కూడా పోయింది. మా స్ధితిగతులు తెలుసుకుని ఉద్యోగమిస్తాను రమ్మని పాండుగారే స్వయంగా ఖబురు పెట్టేరు. అప్పుడు జరిగిన ఇంటర్వ్యూలో కూడా అదే ప్రశ్న. అనేస్టీ మీద నా అభిప్రాయం అడిగేరు."
"అప్పుడు మీరు మహాదాత కర్ణ చరిత్ర గురించి చెప్పేరా?"
"లేదు, ఒళ్లు మండికొచ్చి తలతిక్క సమాధానం చెప్పేను."
"అదే! ఏం చెప్పేరు?" అని కుతూహలంగా అడిగేడు సత్యమూర్తి.
"ఆనెస్టీ అనేది అర్ధం లేని పదమన్నాను. అది పట్టుక్కూచుంటే పట్టగతులు వుండవన్నాను. ఆనెస్టుగా బతికేవాళ్లు పరమ మూర్ఖులన్నాను. అయ్ హేట్ దెమ్ అని కూడా అన్నాను!" అన్నాడు సిక్కు యువకుడు.
"అప్పుడు పాండుగారికి కోపం రాలేదా?"
"అదే ఆశ్చర్యం! రాలేదు. పైగా ఆనందించేరు. నా భుజం తట్టారు. ఉద్యోగమిచ్చేరు" అన్నాడు.
సత్యమూర్తి ఆలోచనలో పడ్డాడు. అతని వాలకం గమనించి సిక్కు యువకుడన్నాడు -
"సారీ! ముందు జాద్రత్త గురించి చెప్పేనే కానీ, మీ మనసు పాడుచేయడం నా ఉద్దేశం కాదు. గుడ్ లక్! వెళ్లిరండి!" అని సిక్కు యువకుడు అక్కడ్నించి వెళ్లిపోయేడు.

                                                               *        *        *
తోటాస్ టైర్స్ కార్యాలయం ముందున్న ఐస్ క్రీం షాపులోకి సింహాచలం అడుగుపెట్టేడు.
సింహాచలాన్ని చూడగానే పరమానందం మొహం తిప్పుకున్నాడు. అయినా పట్టువీడని విక్రమార్కుడల్లె సింహాచలం పరమానందాన్ని విడిచిపెట్టలేదు.
అతని ముందుకు వెళ్లి చేతులు జోడించి "నమస్కారమండీ!" అన్నాడు.
అప్పుడే అతన్ని చూచినట్టు అడిగేడు పరమానందం -
"నువ్వా? ఏమిటలా వచ్చేవు?"
"తమర్ని చూసి వచ్చెనండి!"
"అల్లాగా? నాతో పనేమైనా వుందా?"
"చిత్తం! పని అంటే పని కాదనుకోండి తమర్ని ఒక కంట కనిపెట్టమని అయ్యగారి ఆర్డర్సండి!"
"అవున్లే. ఎవరి జాగ్రత్తలో వాళ్లుండాల్సిందే! కూచో!"
"కూచుంటే డ్యూటీ చెడిపోద్దండి!"
"డ్యూటీయా?"
"చిత్తం తమకి తెలీకుండా తమర్ని చూసుకొడం డ్యూటీయే గదండీ! అదండీ! వెళ్లోస్తానండి!" అని మళ్లా నమస్కరించి వెళ్లిపోయేడు సింహాచలం.
పరమానందం మెదళ్లో ఒక మూల  దాక్కున్న చిన్న డవుటు - సింహాచలం రాకతో తేలిపోయింది. రాత్రి దునియా గాణ్ని చూచినప్పుడు - ఎందుకో గాని సింహాచలం గుర్తుకొచ్చేడు. వాడు వీడేమో అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ శంక పూర్తిగా తొలిగిపోయింది. ఈ సింహాచలమే ఆ దునియాగాడైతే తన మీద నిఘా డ్యూటీలో ఎందుకుంటాడు? సత్యమూర్తికి ఉద్యోగం దొరికితీరాలని తాపత్రయమెందుకు పడతాడు/ కనుక దునియాగాడు దునియాగాడే! సింహాచలం సింహచలమే!
మరో లిమ్కాకి ఆర్డరు ఇచ్చేడు పరమానందం.
                                                                *        *        *
తోట పాండుగదిలో -
వినయంగా నిలబడి వున్నాడు సత్యమూర్తి.
సత్యమూర్తి ఇచ్చిన విజిటింగ్ కార్డుని చూస్తూ తోటపాండు అడిగేడు -
"నీ పేరు ?"
"సత్యమూర్తండి!"
"అవునవును. ఆనందం చెప్పేడు. సత్యమూర్తి ట్రూత్ కి సింబల్! ఎక్కడైతే ట్రూత్ వుంటుందో అక్కడ ఆనెస్టీ వుంటుంది. బైది వే, ఆనెస్టీ మీద  నీ అభిప్రాయమేమిటి?" అని సూటిగా అడిగేడు తోటపాండు.
సత్యమూర్తికి వణుకు ప్రారంభమైంది. సిక్కు యువకుడు చెప్పినట్టు తిరగేసి చెప్పాలా? ఏం చెప్పాలి?
"ఏమిటి ఆలోచిస్తున్నావ్? ఆనెస్టీ గురించి నీ అభిప్రాయమేమిటని అడిగేను. దానికింత  ఆలోచనా?" రెట్టించి అడిగేడు తోట పాండు.
ఇక తప్పదన్నట్టు సిక్కు యువకుడి అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకుని చెప్పడం ప్రారంభించేడు.
"ఆనెస్టీ అనేది అర్థం లేని పదం!" అన్నాడు సత్యమూర్తి సిక్కు కుర్రాడి మాటలు గుర్తు తెచ్చుకుని.
తోట పాండు కళ్లు పెద్దవి చేసి చూశాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra