Home » Balabhadrapatruni ramani » అనూహ్య

    "ఏవుందీ?" ఒళ్ళు కొవ్వెక్కి అది తీరక  ఇలా ఏక్సిడెంట్లు చేస్తారు.... "కానిస్టేబుల్ డానికి ఇంకో రెండు తిట్లుకూడా కలిపి చెప్తున్నాడు.
    నేను అటువైపు బాధగా  చూశాను.
    అదే సమయానికి కార్లోంచి తల బయటికి పెట్టివివేక్ కూడా చూశాడు.
     నాకు అవమానభారంతో తలకొట్టేసినట్లయింది అప్పటివరకూ వున్నదైర్యం ఎవరో లాగేసుకున్నట్లయింది. తల క్రిందకి వాలిపోయింది.
    అతని కారు ఏమీ పట్టనట్లుగా మమ్మల్ని దాటుకుని వెళ్ళిపోయింది.
                                                          *        *        *
    చలిగాలి రివ్వున కొడుతోంది. నేను కొంగునిండ మునగదీసుకుని కూర్చున్నాను.
    మధ్యాహ్నం అనగా పోలిస్ స్టేషన్ కి వచ్చాం. ఎస్.ఐ. రావాలంటారు. అతనేమో రాడు!
    సమీర్  ఎవరెవరికో ఫోన్లు చేశాడు. ఎవరూ తగల్లేదు. "షిట్...." అనుకుంటూ జుట్టంతా పైకి ఎగదోమకున్నాడు. విజయకి ఫోన్  చేద్దామా అనుకున్నాను.
    కానీ 'నా  సంగతి  నేను చూసుకోగలను' అని ధీమాగా అని  వారంకూడా అవలేదని ఆ ప్రయత్నం మానుకున్నాను.
    కానిస్టేబుల్స్  నాకేసి ఆదోలా చూస్తున్నారు.
     రేగిన  జుట్టుతో నలిగిన  చీరతో నన్ను చూసుకుంటే నాకే కాలేస్తోంది!
    ఆ బెంచీమీద కూర్చుంటే అమ్మమ్మా, అమ్మా, విజయా వివేక్  అందరూ గుర్తొచ్చారు. నా వాళ్ళందర్నీ వదిలి నేనిక్కడ ఎందుకున్నానూ? విధి లిఖితం!
    సాయంత్రానికి ఎస్.ఐ వచ్చాడు.
    "నీ  పేరేంటి?" సమీర్ ని అడిగాడు.
    "సమీర్....సీ ఐయామ్ ధనుంజయరావ్ నేవ్వూ.... యూ నో ధనుంజయరావ్...." సమీర్ చెప్తున్నది వినిపించుకోకుండా-
    "ఆ అమ్మాయిని ఎక్కడనుంచి తెచ్చావు?" అమర్యాదగా అడిగాడు.
    దెబ్బతిన్నట్లుగా చూశాను.
    మర్యాదలు పొందడం తప్ప ఇలా అగౌరవాలూ, అవమానాలూ నాకెప్పుడూ ఎదురుకాలేదు.
    "షీ ఈజ్ మిసెస్ వివేక్"
    "నువ్వు ఆగు..." అని సమీర్ నీ అడ్డుకున్నాను. వివేక్ పేరు వాడుకోవడం నాకు ఇష్టంలేదు!
    "నేను  మీ ఫోన్  ఓసారి  వాడుకోవచ్చా?" అడిగాను.
    "ఇంటికి చెయ్యాలా?" అడిగాడు ఎస్.ఐ.
    నేను తలఊపి శరత్ చంద్ర నెంబర్ డయల్  చేశాను.
    "అనూహ్యా.... ఎక్కడినుండి?" అన్నాడు.
    "పోలిస్ స్టేషన్ నుండి"   
    "ఆఁ!!!" అతను ఆశ్చర్యంగా అన్నాడు.
    నేను నా పరిస్ధితి మొత్తం వివరించాను.
    ఇంకో అరగంటలో శరత్ చ0ద్ర వచ్చాడు. ఆ అరగంటా  అక్కడవాళ్ళ చూపులూ, మాటలూ నాకు నరకం చూపించాయి.
    లాకప్ లో వున్న చిల్లర దొంగలు ఫ్రీగా సినిమా చూస్తున్నట్లుగా మమ్మల్నిద్దరినీ చూస్తున్నారు.
    నా కళ్ళల్లో పోలీస్ స్టేషన్ లో రేప్ లూ, లాకప్ డెత్ లూ గిర్రున తిరిగాయి. ఆంజనేయ దండకం చదువుకుంటూ కూర్చున్నాను.
    శరత్ చంద్ర వచ్చి ఫార్మాలిటిస్ పూర్తిచేశాక నా వైపు తిరిగి "వెళ్దామా?" అన్నాడు.
    నేను  సమీర్ వైపు చూశాను.
    "అతను వెళ్తాడ్లే....పద...." అతను నన్ను తీసుకుని బయటికి వచ్చేశాడు.
    అతను కారు స్టార్ట్ చెయ్యగానే  నేను అప్పటిదాకా బిగబట్టుకుని వున్నానేమో, ఇంక ఆగలేక వెక్కి వెక్కి ఏడ్చేశాను. శరత్ చంద్ర నా తల మీద చెయ్యి వేశాడు.
    "ఆ  కుర్రాడెవరూ?" అడిగాడు.
    "సమీర్ అనీ .....ఈ మధ్యే ఆర్ట్ ఎగ్జిబిషన్ కి వెళ్తే పరిచయం అయ్యాడు. చాలా మంచి కుర్రాడు" అన్నాను.
    "తెలిసింది" నవ్వాడు.
    నేనేం మాట్లాడకుండా పైట చెంగు మూడులేసుకుంటూ కూర్చున్నాను. కారు అతని ఇంటిముందు ఆగగానే ఆశ్చర్యపోయాను.
    "ఈ మూడ్ లో  నువ్వు కాసేపు  విశ్రాంతి తీసుకోవడం అవసరం! దిగు" అని తను దిగాడు.
    నేను  వేరే దారి లేక దిగి  అతని  వెంట లోనికినడిచాను. శరత్ చంద్ర  పనివాడికి డబ్బులిచ్చి ఏదో తీసుకురమ్మని పంపాడు.
    నేను అతని ఇంటినీ, ఇంట్లోని ఇంటీరియర్ డెకరేషన్ నీ  చూసి ఆస్వాదించే మూడ్ లో  లేను. తల తేలిపోతోంది. నిద్రా , ఆకలీ  కలిసి నీరసంగా  మారింది.
    "అనూహ్యా.... హేవిట్" అంటూ నా ముందు  ఏపిల్స్, బిస్కెట్స్ తెచ్చి పెట్టాడు అతను.
    నేను గబగబా తినసాగాను.
    అతను నా ప్రక్కనే కూర్చున్నాడన్నా సంగతి నేను  గమనించలేదు. నాలుగు ఏపిల్ ముక్కలు తిన్నాక నాకు కడుపులో  చల్లగా అనిపించింది.
    అతను సీసా తెచ్చుకుని గ్లాసులో  డ్రింక్ పోసుకుంటూ "అనూహ్య ఒక పెగ్ విస్కీ కొట్టానంటే అలసటా, టెన్షన్ అంతా  మటుమాయం!" అన్నాడు.
    నేను అవాక్కయిపోయి చూశాను.
    "కమాన్" అతను గ్లాసు నాకు అందిస్తూ అన్నాడు.
    "వద్దు....నేను ఇంటికి వెళ్తాను" లేచి నిలబడ్డాను.
    శరత్ చంద్ర అదోలా చూసి
    "వద్దకపోతే  బలవంతం చెయ్యనులే. కూర్చో!" అని డ్రింక్ సిప్ చెయ్యసాగాడు.
    తీసివున్న కిటికీ రెక్కలు పెద్ద శబ్దం చేస్తూ టప టపా కొట్టుకున్నాయి. ఈదురుగాలి కాస్తా  కాసే పటికి వానగా  మారింది.
    "తెరిచివుంచేవు సుమా.... త్వరపడీ నీ హృదయమూ...." శరత్ పాడసాగాడు.
    నాకు భయం మొదలయింది!
    బయట వాన జోరందుకుంది. లేచి  అంతనికి దూరంగా  వెళ్ళిపోయాను.
    సమయం ఏడవుతోంది.
    వివేక్ న గురించి వెతుకుతాడా? పోతే  పోనీ అనుకుంటాడా? నాకు మళ్ళీ ఏడుపోచ్సింది.
    ఫోన్ దగ్గరకు  నడిచి  డయల్ చెయ్యబోయాను. నా చేతిమీద తన చేతిని వేశాడు శరత్ చంద్ర.
    "అనూహ్యా....ఎందుకు తొందరా? వాన తగ్గనీ.... నేను దింపుతాగా....షాలా....వర్షం....పడ్తోంది!" అతని  మాట రాన్రాను ముద్దగా మారడం గమనించాను.
    "నేను ఇంటికి ఫోన్ చెయ్యాలి" అన్నాను.
    "ఎందుకు? నీకోసం వివేక్ వస్తాడా ?" అతను పెద్దగా  నవ్వాడు. "నేనెప్పుడూ మీరిద్దరూ కలిషి నడవడంకూడా షూడలేదు. నీ కోసం అతను వస్తాడా?" అని నవ్వుతూనే వున్నాడు.
    నా గుండెల్లో భగ్గుమంది.
    "రాకపోతే నేనే వెళ్లిపోతాను" అని వెళ్ళాడానికి బయలుదేరాను.
    "అనూహ్యా...ఆగు...ప్లీజ్...." అతను గింజుకున్నాను.
    "నువ్వంటే నాకు  చాలా ఇష్టం!" నా మెడమీద తన ముఖాన్నీ రుద్దుతూ అన్నాడు. "ఆ షమీర్ కంటే నాతో బావుంటుందిలే!"
    "ఛీ!" అన్నాను.
    "ఐదునిమిషాలు ఓపికపట్టు!"
    "నాకిష్టంలేదు" ఏడ్చేస్తూ అన్నాను.
    శరత్ చంద్ర నన్ను వదలిపెట్టేశాడు. తూలుతూ వెళ్ళి మళ్ళీ ఇంకో పెగ్ ఫిక్స్  చేసుకుని- "ఏవన్నావ్.... ఇష్టంలేదా!" ఆశ్చర్యంగా అడిగాడు.
    "నేను... నేను మీతో  ఫ్రెండ్ షీప్ చేశాను అంతే! ఇలాటివన్నీ నాకిష్టం లేదు" అన్నాను.
    "మూడు నెలలుగా నాతో  కలిసి తిరుగుతూ ఇలాంటివి ఎక్స్ పెక్ట్ చెయ్యలేదా.... ఎందుకు  మీ ఆడవాళ్ళు  ఇలా నటిస్తారు?" అని  ఆగి అతను సిప్ చేశాడు.
    ఆ తర్వాత  "నేను నా చుట్టూ ఇందరు అమ్మాయిలు తిరుగుతున్నా, నా వెంటపడ్తున్నా నిన్నే ఎందుకు షెలక్ట్ చేసుకున్నానో తెలుసా?" అన్నాడు.
    నేను అప్పుడే  స్పృహలోకి వస్తున్నదాన్లా అతను చెప్తున్నది వింటున్నాను.
    "ఈగో సంతృప్తిపరుచుకోవడంకోసం! నన్ను  కదన్న అమ్మాయిని  మళ్లీ నా చుట్టూ తిప్పుకోగలిగానన్న అహం!" అని నవ్వాడు.
    నేను నమ్మలేని నిజాల్ని  వింటున్నట్లు అతను చెప్పేది వింటుండి పోయాను.
    "నీకు పెళ్ళయిపోయిందని  తెలిసిసాలా  ఆనంద పడ్డాను. సొసైటీలో అది మనకీ  భద్రతనిస్తుందని నాకు తెలుసు! ఇంక  నీలో  వున్న  భావుకత్వం, అమాయకత్వం....ఇవన్నీ  నీకోసం టైమ్ స్పేర్  చెయ్యడానికి కారణాలు! అనూహ్యా...నీకో  నిజం  తెలుసా?....
    ఒక క్లాసులో పదిమంది అమ్మాయిలున్నారనుకో..... ఆ క్లాసులో  ఒక అబ్బాయి గోడమీద సాలెపురుగుని చూపించి అది కాసేపట్లో బంగారు ఈకలోచ్చి ఎగరబోతోంది నేను  షూ....మంత్రం వేసా అన్నాడనుకో!
    తోమ్మిదిమంది అటు చూడకుండా నవ్వితలలు తిప్పుకున్నాక, ఒక్క అమ్మాయి అమాయకంగా  అటే చూస్తూ కూర్చుందనుకో! అనుకో.... అప్పుడు  ఆ అబ్బాయి  ఆ అమ్మాయిపట్ల ఇంట్రెస్ట్ పెంచుకుంటాడు! అలాంటి చిన్నకారణం చాలు! నీలాంటి అమ్మాయిలమీద  ఇంట్రెస్ట్ పెరగడానికి నాకూ అలాంటిదే నీ మీద కలిగింది....."
    తాగినవాళ్లు నిజాలే చెప్తారన్నది సత్యం! నాలో ఏ మూలైనా అమాయకత్వం దాగివుంటే అది ఈ  దెబ్బతో పటాపంచలైంది.
    అతను ఆకస్మాత్తుగా నా చెయ్యి పట్టుకుని తనవైపు లాక్కుని "డోంట్ బీ షెంటిమెంటల్.... రా.... హాయిగా అనుభవించు" అన్నాడు.
    నేను ఊహించని ఈ పరిణామానికి బిత్తర పోయాను. నోరు పెగలనీకుండా అతను నా ముఖాన్ని తన చేతులమధ్య బిగించి ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
    నేను నా సర్వశక్తులూ కూడదీసుకుని అతని నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
    అతని గోళ్ళ గాట్లు నా బుగ్గలనిండా పడ్డాయి! దడెల్ న తలుపు తెరుచుకుంది!
    నేను ఆశగా అటు చూసేసరికి,వివేక్ నిలబడి వున్నాడు.                           

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra