Home » D kameshwari » Chikati Tolagina Ratri


                                         నగరంలో నాలుగిళ్ళు
    
    సాయంత్రం ఐదున్నరయింది. వడగాల్పు కాస్త తగ్గి చల్లగాలి తిరిగింది.
    ఎండకి భయపడి ఇళ్ళలోంచి బయటికి రావడానికి భయపడ్డ వాళ్ళందరూ నెమ్మదిగా బయటికి బయలుదేరుతున్నారు. ఆఫీసుల నించి ఉరుకుల పరుగులతో ఇళ్ళకి చేరేవారు , బజార్లకి సినిమాలకి బయలుదేరిన వాళ్ళు...... ఎక్కడచూసిన జనం, ఎటు చూసినా హడావిడి! ఏదో ప్రళయం ముంచుకోస్తున్నట్లు ఎవరికి వారే హడావుడిగా పరుగులు పెట్టె జనంతో రోడ్లన్నీ నిండిపోతున్నాయి.
    ఫ్యాక్టరీ కూత పెట్టింది. బిలబిలలాడుతూ జట్లుజట్లుగా కూలీలు చేతిలో క్యారియర్ల తో ఉషారుగా బయటికి వస్తున్నారు.
    రంగి, నర్శింలు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఇంటికి బయలుదేరారు. త్రోవలో జనాన్ని, సినిమా పోస్టర్లనీ , దుకాణాలలో నగలు, చీరలు చూస్తూ గబగబా నడవసాగారు. బజారు దాటి కొంతదూరం వెళ్ళాక మాములుగా సరుకులు కొనే పచారీ దుకాణం ముందు అగారిద్దరూ. రంగి చీర కొంగు నించి మడతలు పడిన మూడు రూపాయలు తీసింది. బియ్యం, అణా చింతపండు, అణా మిర్చి, అణా ఉప్పు అవీ కొంది. వెంట తెచ్చుకొన్న సీసాకాయలలో పావలా నూనె, బేడ కిరసనాయలు పోయించుకుంది. నర్శింలు పదిపైసల బీడీలు కొని ఒకటి అంటించుకున్నాడు. దిక్కులు చూస్తున్న రంగిని "ఎటేవ్ చూత్తండావు.....నడు " అన్నాడు. రంగి బుర్ర గోక్కుంది. "వుండు మావా, ఏందో మరిచిపోయాను".... ఇంకేది కొనాలో ఆలోచిస్తూ నిల్చుంది......" ఆ...ఆ....సావుకారూ పదిపైసల సోడా కారం యీయి . మరిగంట రెండణాల ఉల్లిపాయలు కూడా గట్టు......అదిగో ....ఆ ఉప్పు బిస్కత్తులు ఓ పదిపైసల వియ్యి" అంది. షావుకారు ఇచ్చిన పొట్లాలు అన్నీ చీర కొంగున కట్టుకుంది. బియ్యం నర్శింలు పైపంచలో మూటకట్టింది. సీసాకాయలు , క్యారియర్ పట్టుకుని షావుకారికి డబ్బిచ్చి బయలుదేరింది.
    'పద మావా".... నాలుగడుగులు వేశాక మార్కెట్టు రాగానే....."
    "ఏటి మావా.....సాపలు, మాంసం రోజూ కొండానికి మనం లచ్చాది కార్లమా....' అంది.
    'కొనేస్, రొయ్యలు కొని, యిన్ని ఉల్లిపాయలు లేసి, కమ్మగా పులుసేట్టేయియాల!" పులుసు గుర్తొచ్చి నర్శింలు నోట్లో నీరూరుంది. బీడీ తీసి కుసుక్కున ఉమ్మాడు. రంగి పావలా రొయ్యలు కొని క్యారియర్ గిన్నెలో పెట్టుకుంది.
    "నడు మావా, చీకట్టడ్డాది.....గుంటలేం సేస్తున్నారో....." అడుగులు త్వరగా వేస్తూ అంది.
    'ఉండే, పదిపైసలు మల్లెపూలు కొనకూడదంటే రంగీ" రంగి వద్దని వాదించే లోపలే నర్శింలు ఓ దండ కొని వాసన చూసి రంగికి ఇచ్చాడు.
    ఇద్దరూ గుడిసె చేరేసరికి దీపాలు పెట్టారు. తల్లిని చూసి రంగి ఆరేళ్ళ కూతురు , నాలుగేళ్ళ కొడుకు మట్టిలో యిరుగుపొరుగు పిల్లలతో ఆడుతున్న వాళ్ళు పరిగెత్తుకు వచ్చారు. రంగి కొంగు విప్పి తెచ్చిన బిస్కెట్లు ఇద్దరి చేతుల్లో పెట్టింది. బిస్కెట్లు చేతిలో పడగానే ఇద్దరి మొహం విప్పారింది, మళ్ళీ ఆడుకోడానికి పరిగెత్తారు. రంగి చూరు లోంచి తాళం తీసి గుడిసె తలుపు తెరిచింది. తెచ్చినవన్నీ క్రింద పెట్టి తడుముకుని దీపం బుడ్డి తీసి కిరసనాయిలు పోసి వెలిగించి గూట్లో పెట్టింది. నర్శింలు గుడిసె లోంచి రెండు నులకమంచాలు తీసికెళ్ళి వెనకాల దడి కట్టిన ఖాళీ జాగాలో పడేసి, కాళ్ళు చేతులు జాడించుకుని ఓ మంచం వాల్చుకు పడుకున్నాడు.
    రంగి గబగబా పెరట్లో ఇటికల పొయ్యి మీద నీళ్ళ కుండ పెట్టి రెండు చితుకులు మంట పెట్టింది. ప్రొద్దుట గబగబ యింత అన్నం వండుకుని తామిద్దరికీ ఇంత క్యారియర్లో పెట్టుకుని పిల్లలకి ఓ కుండలో ఇంత ఉప్పేసి అన్నంలో నీళ్ళు పోసి పెడ్తుంది. పిల్లలిద్దరూ దగ్గర్లోని ఎలిమెంటరీ స్కూల్లో చదువుకోడానికి పోయి మధ్యాహ్నం వచ్చి ఆ గంజన్నం తింటారు. ఆ కుండలు, మూకుళ్ళు అన్నీ తోమి , పొయ్యి రాజేసి ఎసరు పెట్టింది రంగి. చాటలో బియ్యం పోసుకుని పెరట్లో కూర్చుని మొగుడితో కబుర్లు చెప్పుతూ రాళ్ళేరింది. రొయ్యలన్నీ శుభ్రంగా కడిగి బాగుచేసి పెట్టుకుంది. నీళ్ళు కాగగానే మట్టిలో పొర్లుతున్న పిల్లలిద్దర్నీ లాక్కొచ్చి సబ్బుబిళ్ళతో తోమి గోరువెచ్చటి నీళ్ళు పోసింది. తరువాత తనూ రెండు చెంబులు చీర చుట్టబెట్టుకుని పోసుకుంది. తరువాత మావని పిలిచి వీపుతోమి నీళ్ళు పోసింది. ఆ కుండలో మరికాసిని నీళ్ళు మరిగాక తెచ్చిన సోదాకారం వేసి విప్పిన కుళ్ళు బట్టలన్నీ నాన బెట్టింది. ఎసరు మరిగాక బియ్యం పోసి అన్నం వార్చి, గబగబ రొయ్యల పులుసు కాచింది. సావకాశంగా కొప్పు ఊడదీసి నున్నగా దువ్వుకొని, మల్లెపూలు పెట్టింది.  పొయ్యి ఆర్పేసి పిల్లలకి, మొగుడికి అన్నాలు పెట్టింది. వాళ్ళు ఆవురావురు మంటూ అన్నం తింటుంటే తన కడుపు నిండిపోయినట్లయింది రంగికి. "పులుసు మా కమ్మగా వుందే రంగి' అంటూ మరే యింత అన్నం పులుసేసుకొని కలుపుకొన్నాడు. అందరూ తిని లేచాక ఆ మూకుడులోనే తనూ తింది. మిగిలిన అన్నంలో నీళ్ళు పోసి ప్రోద్దుటికి ఉట్టిమీద పెట్టింది. కుండలు కడుక్కుని, దీపం బుడ్డీ ఊదేసి, తడిక కట్టేసి పెరట్లో మంచం దగ్గరికి వచ్చింది. పిల్లలిద్దరూ పగలల్లా ఆడి, సాయంత్రం నీళ్ళు పోసుకుని వేడన్నం తిని వళ్లుమరచి నిద్రపోతున్నారు. రంగి రావడం చూసి కాలుస్తున్న బీడీ దమ్ము లాగి అవతల పారేశాడు నర్శింలు. తన ప్రక్కన పడుకున్న కొడుకుని, అవతల కూతురు పడుకొన్న మంచం మీద పడుకోబెట్టాడు. "ఏ ఎండలు మావా? మండ బెట్టేస్తుంది..... అబ్బ....అబ్బ..... కాస్త చల్లగాలి తిరుగుతోంది యిప్పుడే!" రంగి చీర దులుపుకొని మంచం మీద కూర్చుంది.
    "మావా, రేపు సినిమా కెళ్దారే .....అదేందో సానా బాగుందట అప్పి సెప్పింది."
    "సినిమా వూసు ఇప్పుడెందుకేస్ , రేపు సూద్దాం లే ..... అన్నాడు నర్శింలు రంగి చేయి పట్టుకొని లాగుతూ.
    "ఉండు మావా, నీ కెప్పుడూ ఇదే మాలోకం !" అంటూ గునిసింది రంగి. "మావా ..... మరిగంటే....ఆ పొద్దు సీతాలు కట్టుకుందే..... అలాంటి లైలాను సిల్కు కోక కొనుక్కొంటాను అమ్మోరి జాతరకి...." కోరిక బయటపెట్టడానికి మంచి సమయం ఏదో రంగికి తెల్సు. ఇలాంటప్పుడు అడిగితె మావ కాదనడని తెల్సు రంగికి.
    "కొనుక్కొందువుగానిలే..... ఏ పాటి డబ్బు కూడబెట్టినావేటి?" అన్నాడు నర్శింలు రంగి తలలో మల్లెలు వాసన చూస్తూ.
    "వుందిలే మావా,  సీరకి సరిపోతాది! ఒక్క సీర కాస్త మంచిదుంటే ఏ సినిమాకో ఎల్లినప్పుడు కట్టుకుందారిని ....."
    రంగి, నర్శింలు ఇద్దరూ కలిసి రోజుకి నాలుగురూపాయలు ఆర్జిస్తారు. మూడు రూపాయలు బియ్యం, ఉప్పు, కూర నారకి సరిపోతుంది. ఓ అర్ధరూపాయలో నర్శింలు బీడీలు, కర్ర పుల్లలు ఏవో ఖర్చుకి సరిపోతుంది. ఆ మిగిలిన అర్ధరూపాయి రంగి ఓ ముంతలో వేసి  దాస్తుంది. ఆ డబ్బులోనే సినిమాలకి, నర్శింలు వారానికో సారి చుక్కేసుకోడానికి అప్పుడప్పుడు బట్టా పాత కొనుక్కోడానికి దాస్తుంది రంగి. "సరేలే, కొందూ గాని.....' మాటలతో జాప్యం చేయడం ఇష్టం లేక రంగిని దగ్గరికి లాక్కున్నాడు నర్శింలు..... నర్శింలు చుక్కేసుకున్నప్పుడు తప్ప మిగతా సమయంలో రంగిని నెత్తి మీద పెట్టుకుంటాడు. ఆ నిషాలో తన్నిన తన్నులు రంగీ ఆ వెంటనే మరిచిపోతుంది..... "వుండు మావా .....ఓరన్నా సూత్తారు".... ముద్దులు గునుస్తూనే , రంగి దగ్గర చేరింది.

    
                                                 *    *    *    *
    
    ఆరుగంటలు ఠంగు ఠంగున కొట్టింది. సుబ్బారావు రాస్తున్న ఫైళ్ళ లోంచి తలెత్తి చూశాడు. ఆరుగంటలు ఇంకా రాయాల్సినవి, అర్జంటనబడేవి అరడజను పైన వున్నాయి. కాళ్ళు చేతులు లాక్కు పోతుంటే కుర్చీలో వెనక్కి జారపడి కాళ్ళు చేతులు చాచుకుని అవలించాడు బద్దకంగా సుబ్బారావు..... అతనికి కడుపులో ప్రేగులు అరుస్తున్నాయి.... పొద్దుట తొమ్మిదింటికి తిన్న తిండి ! మధ్యలో టీ అనబడే వేడినీళ్ళు తప్ప కడుపులో ఏం పడింది?.... లాభం లేదని ఫైళ్ళు మూసేసి, రాయాల్సినవి చంకన పెట్టుకుని, సైకులుకి కట్టుకుని కాళ్ళీడ్చుకుంటూ త్రొక్కుకుంటూ బయలుదేరాడు ఇంటికి సుబ్బారావు.  

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra