Home » Mainanpati bhaskar » Mister U

 

    కళ్ళార్పకుండా అతని వైపు చూసింది సృష్టి.
    అతని మెంటల్ మేకప్ ఆమెకు అర్ధం అవుతోంది.
    ఇంతవరకూ చెల్లెలి గురించి మాట్లాడనేలేదు అతను. మనసులోనే మధనపడుతున్నాడు . బయటకు చెబితే దుఖం బయటపడిపోతుందని కాబోలు.
    ఇప్పుడీ నరవానరం అతని చెల్లెల్ని చెర బట్టిందని తెలియగానే ఇంక టెన్షన్ని తనతో పంచుకోవాలనుకుంటున్నాడు.
    ఎవ్విరిథింగ్ విల్ బి అల్ రైట్.
    "రాజూ -- ఎవ్విరి థింగ్ విల్ బి అల్ రైట్ !" అంది సృష్టి అనునయంగా.
    ఏమీ మాట్లాడలేదు రాజు ..... మనసులోనే ప్రార్ధన చేసుకుంటున్నాడు.
    "రాజూ ......రాజ్!"
    ఏమిటన్నట్లు చూశాడు రాజు.
    "నీకు దేవుడంటే నమ్మకం వుందా?"
    "నాలుగు చేతులూ, కిరీటాలు, ఉండే ఊహగానపు దేవుళ్ళ మీద నమ్మకం లేదు గానీ ఏదో అంతుబట్టని దివ్యశక్తి ఈ లోకాన్ని శాసిస్తున్నది మాత్రం తెలుసు.
    "బాగా చెప్పావ్ ....ఆ అజ్ఞాత శక్తి ఏదో అర్ధమయిన తర్వాత, ఆ శక్తిని మనం ఎలక్ట్రిక్ కరెంటులా లేబోరిటరీ లో తయారు చేయగలమేమో!" అంది సృష్టి సరదాగా.
    సంతోషం లేని నవ్వు నవ్వాడు రాజు.
    "నీ సంగతేమిటి ?" దేవుడంటే నీకు నమ్మకం లేదా సృష్టీ!"
    మతం పేరిట జరుగుతున్న మారణ హోమాన్ని చూస్తున్న తర్వాత ఇంక వీటినన్నిటినీ జరగనిస్తున్న దేవుడి మీద నమ్మకం ఎట్లా వుంటుంది రాజూ- అంతుబట్టని ఆ అజ్ఞాత శక్తిని అరచేత్తో పట్టేసుకోగలననుకొంటోన్న మీ గురువు గారి అజ్ఞానం చూడు !" అని, ఎక్స్ పర్టు లాగా గబగబ సెల్ ఫోన్ మీటలు నొక్కింది సృష్టి. అప్పటిదాకా ఆమె అతనితో మాట్లాడుతూనే సెల్ ఫోన్ తో ఎక్స్ పెరిమెంట్స్ చేస్తోంది.
    ఆమె బటన్స్ నొక్కగానే -- మినీ స్క్రీన్ మీద రాజూ వాళ్ళ ఊరూ, కోట గోడ కనబాడటం మొదలెట్టాయి.   
    అంజనం ద్వారా యువ రాక్షసుడి చెరలో చిక్కుకుందని సంయుక్త చేత చెప్పించిన తర్వాత గ్రహశాంతులు చేయించడం మొదలెట్టాడు గురువు గారైన తులసీరావు.
    ఊళ్ళో కొందరు పారాయణం చేస్తున్నారు.
    కొందరు తడి బట్టలతో దణ్ణాలు పెడుతున్నారు.
    గ్రామదేవత గుళ్ళో కొందరు జంతు బలులు ఇస్తున్నారు. దున్నలు, మేకలు, కోళ్ళు తలలు తెగిపడుతున్నాయి.
    ఒక గణాచారి లాంటి వాడు ఒక గొర్రె పోతు పెదాలని తన పళ్ళతో పట్టుకుని ఒక్కసారిగా పైకి ఎత్తాడు. పళ్ళతో గొర్రె తాలుకూ కింది దవడని పట్టుకుని, దానిపై దవడని చేత్తో చీల్చాడు.
    దారుణమైన బాధపడి చచ్చిపోయింది గొర్రె.  
    "భక్తీ" అంది సృష్టి నిరసనగా. "ఇక్కడొక విషయం గమనించావా రాజూ - ఆహారం కోసం మిగతా జంతువులని చంపే పులీ, సింహం లాంటి సోకాల్డ్ క్రూరజంతువులూ కూడా వాటిని ఇంత క్రూరంగా చంపవు."
    "నిజమే !" అన్నాడు రాజు.
    "ఈ మనిషి అనేవాడు తనకు 'మనిషి' అని పేరుని తొందరపడి పెట్టేసుకున్నాడు రాజూ! నిజానికి ఈ మనిషి అనేవాడు ఇంకా జంతు దశలోనే ఉన్నాడు. ఆ మాటకి వస్తే, జంతువుల కంటే కూడా కనాకష్టంగా ఉన్నాడు ' అంది సృష్టి ఆవేశంగా.
    తల పంకించాడు రాజు. చటుక్కున అతనికో ఆలోచన వచ్చింది.  
    అయితే ఇది ఒక అల్ పవర్ ఫుల్ సెల్ ఫోన్ అంటావు. అంజనం వేసినట్లుగా దీనిలో అన్నీ కనబడతాయా?"
    "ఆహా! శుబ్బరంగా "అంది సృష్టి.
    ఈ కొత్త శతాబ్దం మొదట్లోనే ఊహించాడు ఫేమస్ సైన్సు ఫిక్షన్ రైటర్ అర్ధర్ క్లార్క్. ఏమనీ ....ముందు ముందు రాబోయే కంప్యూటర్ ల చేత పని చేయించడానికి రిమోట్ కంట్రోలు కూడా అక్కర్లేదని. అతను చెప్పినదాని ప్రకారం మనం ఒక హెల్మెట్ లాంటిది పెట్టుకోవాలి. మన మెదడులో ఉత్పన్నమయ్యే భావతరంగాలని ఆ హెల్మెట్ గ్రహించి కంప్యూటర్ కి ప్రసారం చేస్తుంది. మన మనస్సులో మెదలే భావాలను ఆ విధంగా గ్రహించిన కంప్యూటర్ అందుకు తగినట్లుగా పని చేస్తుంది " అని ఆగి మళ్ళీ చెప్పింది సృష్టి.
    "ఈ మనిషి మెదడు అనేది ఉందే అది ఇంతవరకూ పూర్తిగా ఎవరికీ అంతుబట్టలేదు రాజూ! మనిషి మెదడులో ఉండే గ్రేసేల్సు తో నూటికి తొంభై అయిదు శాతం నిద్రాణమై ఉంటాయి.
    మామూలు మనుషుల్లో నూటికి ఐదు శాతం గ్రేసేల్సూ పని చేస్తూ ఉంటె, అదే గొప్ప ఐన్ స్టీన్ లాంటి మహామేధావుల మెదడులో కూడా నూటికి పది పదిహేను శాతం కంటే గ్రేసేల్సు పనిచేస్తూ వుండవు. నూటికి నూరు శాతం గ్రేసేల్సూ మేల్కొని పనిచేసిన నాడు మెదడు ఎట్లాంటి అద్భుతాలు చేయగలదో చెప్పలేం . ఐన్స్టీన్ అన్నాడు కదా -- ఆయనే ఓసారి ఏం చెప్పాడో తెలుసా ? ఈ కొత్త మిలీనియంలో జరిగే పరిశోధనలు అన్నీ ఎక్కువగా మెదడు చేసే అద్భుతాల మీద , ఇంతవరకూ మనకు అంతుబట్టని అతీతశక్తులు -- అంటే ఎక్స్ ట్రాసేన్సారీ పెర్ సేష్షన్ ఇ.ఎస్.పి. అంటున్నామే -- వాటిమీదే జరుగుతాయని అంటాడు. ఇదిగో -- ఎవరో కనిపెట్టిన ఈ సెల్ ఫోన్ ని పోలిన ఇన్ స్ట్రుమెంట్ ఉంది. మన మనసులో మెదిలే భావాలకూ -- మనం చూడదలచుకోడానికి అనుసంధానం లాంటిది ఇది. మన భావాలనీ, దృశ్యాలనీ కో ఆర్డినేట్ చేస్తొందన్నమాట . ఇంకొంతకాలం పోయాక, ఇట్లాంటి ఇన్ స్ట్రుమెంట్స్ అవసరం కూడా ఉండదేమో - పురాణకాలపు ఋషులలాగా మనం మనోనేత్రంతోనే సమస్తం చూడగలమేమో! అప్పటిదాకా -- యా! నువ్వు చెప్పింది కరెక్టే ! ఇది ఒక అంజనం లాంటి సాధనం - అంతే రాజూ ఏదైనా అంతే! సైన్స్ ఔననే దాకా అది మూడనమ్మకంగా చలామణీ అవుతుంది. సైన్సు ఔనన్న తర్వాత టెక్నాలజీగా మారుతుంది." అంది ఉద్విగ్నంగా.
    చటుకున్న అన్నాడు రాజు.
    ఇదే గనుక అంజనం లా పనిచెయగలిగితే సృష్టి - మనం ఈ నరవానరం ఎక్కడ వుంటుందో చూడగలమా?"
    "చూడగలననే అనుకుంటున్నాను " అని గబగబ బటన్నూ నొక్కింది సృష్టి. స్క్రీన్ ముందుగా బ్లర్ అయింది. రకరకాల శబ్దాలు వచ్చాయి. తర్వాత స్క్రీన్ మీద చుక్కలు .....అడ్డంగా నిలువుగా గీతలు .....క్రిమినల్ చేత రహస్యాన్ని కక్కించడానికి పోలీసులు ధర్డ్ డిగ్రీ ఉపయోగిస్తుంటే, క్రిమినల్ ప్రతి ఘటిస్తున్నట్లుగా కీచుగా శబ్దాలు .
    కళ్ళార్పకుండా చూస్తోంది సృష్టి. హటాత్తుగా శబ్దాలు ఆగిపోయాయి. రొప్పు వినబడడం మొదలెట్టింది. రొప్పు క్రమక్రమంగా పెద్దదయింది. ఉన్నట్లుండి తెరమీద కనబడింది ఒక ఆకారం!
    నరవానరం!
    ఆ నరవానరం ఫలాన దిక్కున ఉన్నదని సూచీస్తున్నట్లుగా తేర మీద ఒక బాణం కనబడింది.
    "కానీ యువ కనబడదేం సృష్టీ ?" అన్నాడు రాజు.
    "ముందు నరవానరాన్ని టాకిల్ చేస్తే అన్నీ బయట పడతాయి" అంది సృష్టి.
    చిన్న స్క్రీన్ మీద బాణం గుర్తు కనబడుతున్న వైపు త్వరత్వరగా నడిచారు.
    నరవానరం ఎటు వెళ్తుంటే అటు వైపుకి చూపిస్తోంది బాణం గుర్తు.
    "ఇంక ఇది తప్పించుకోలేదు " అన్నాడు రాజు.
    ఇంతలో ఆ ఇన్ స్ట్రూమెంట్ లో నుంచి ఒక స్త్రీ కంఠం వినబడింది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra