Home » Mucherla rajani sakuntala » గెస్ట్ హౌస్

"నచికేత...నాకు భయంగా వుంది...ప్రభు అన్నాడు.
విలియమ్స్ కు ఏం చేయాలో పాలు పోలేదు...గెస్ట్ హౌస్ సమీపించారు.
గెస్ట్ హౌస్ సింహద్వారం చూస్తుంటేనే గుబులు పుట్టిస్తోంది.
గొళ్లెం వేసివుంది. తాళం బదులు సన్నటి ఇనుప వైరు వుంది. దానికి మంత్రాక్షరాలతో ఉన్న రాగిరేకు వుంది.
వద్దు నచీ... వెనక్కి వెళ్లిపోదాం..." అన్నాడు సూర్యనారాయణ.
"ఇంత దూరం వచ్చి మనం వెనక్కి తిరిగి వెళ్లడమా?"
అంటూ నచికేత మంత్రాక్షరాలతో ఉన్న రాగిరేకును గట్టిగా తాకాడు.
రాగిరేకు చివరలు పదునుగా ఉండడం వల్ల వేలు కోసుకుంది. రక్తం చిమ్మి, గెస్ట్ హౌస్ సింహద్వారం ముందు చుక్కలు చుక్కలుగా పడింది. ఆ శబ్దం చాలా భయంకరంగా వినిపించింది. చిత్రంగా నేలమీద పడే రక్తం చుక్క, కిందపడుతూనే నేలమీద ఇంకి అదృశ్యమైపోతుంది.
గాలి ఒక్కసారిగా వేగంగా వీచడం మొదలెట్టింది.
అందరూ ఒకరినొకరు కరుచుకున్నారు.
నచికేత ఇదేమీ పట్టించుకోకుండా ఇనుప వైరు పీకి, తుప్పు పట్టిన గోళ్లెన్ని బలంగా లాగాడు...
పదకొండు యాభై ఎనిమిది...
పదకొండు యాభై తొమ్మిది...
గెస్ట్ హౌస్ లోపలి భాగమంతా దుమ్ముతో దూళితో నిండిపోయి వుంది.
గోడలకు పాతకాలం నాటి చిత్ర పటాలు వేలాడుతున్నాయి.
బలమైన గొలుసులతో సీలింగ్ కు వేలాడదీయబడిన ఊయల వేగంగా అటూ ఇటూ ఊగుతూ వుంది.
గెస్ట్ హౌస్ మధ్య భాగంలో నేల మాళిగలో ఉన్న ఓ శవపేటిక మీద పడుతోంది.
ఆ శవపేటిక మీద పడ్డ రక్తం చుక్కలు లోపలికి జారుతూ శవపేటిక లోకి ఒలికిపోతున్న శబ్దం...
పన్నెండు...
అర్దరాత్రి పన్నెండు గంటలు...
నూటయాభై సంవత్సరాల తర్వాత ఓ బీభత్స భయానక దృశ్యం అనుభవ వేద్యం కానుంది.
ఒక్కసారిగా పెద్ద శబ్దం...శవపేటిక భళ్లున పగిలింది. గెస్ట్ హౌస్ తలుపులు విసురుగా తెరుచుకున్నాయి.
ఆకాశంలో ఉరుములు, మెరుపులు.
చిత్రావతి అడవి యావత్తు వణికిపోతుంది.
చెట్లు ఏ క్షణం గాలి వేగానికి కూలిపోతాయో అన్నట్టు వున్నాయి.
ఆ అడవిలో సమస్త జంతుజాలం భయంతో వణికిపోతోంది.
అడవి మొత్తం కదిలిపోతుంది.
బి..త్రో..చి..ని..ద్ర..లే..స్తోం..ది.

                                                    * * *
రామయ్య మొహంలో వికృతానందం.
బిత్రోచి నిద్ర లేచింది...నచికేతను బలి తీసుకోవడమే తరువాయి...అనుకుంటూ చివరి అంకంలోని చివరి తంతును మొదలెట్టబోయాడు.
అప్పటికే ఆలస్యం అయింది.
తరళ తన చేతిలోవున్న మంత్ర దండాన్ని బిగించి పట్టుకొని బలమంతా ఉపయోగించి గాలిని చీల్చుతూ అతని తలమీద కొట్టింది.
ఒకే ఒక క్షణం...
అతని తల రెండుగా చీలి, రక్తం చివ్వున చిమ్మి యజ్ఞగుండంలో పడింది.
చిన్నపాటి శబ్దం కూడా చేయకుండానే రామయ్య ముందుకు విరుచుకు పడ్డాడు. యజ్ఞగుండంలో అగ్ని రామయ్యను కబళిస్తోంది...
క్షణాల్లో రామయ్య శరీరం అగ్నికి ఆహుతయ్యింది.

                                                                  * * *
పద్మాసనం వేసుకుని కూచుని నిష్టగా మంత్రోచ్ఛారణ చేస్తున్న రాబర్ట్ ఉలిక్కిపడ్డాడు.
బిత్రోచి నిద్రలేచింది.
నచికేతని, అతని స్నేహితులను కాపాడాల్సిన భాద్యత తనమీద వుంది.
రాబర్ట్ కళ్ళు మూసుకునే సుసిరియోని తలచుకున్నాడు.
"సుసిరియో...ఓ మంచి పనికోసం నేను నిన్ను ప్రార్ధించాను. విశ్వ వినాశనాన్ని నిరోధించే నా ప్రయత్నానికి సహకరించు..."
సుసిరియో ఆత్మ అతని ముందు సాక్షాత్కరించింది.
"మిస్టర్ రాబర్ట్...నా ప్రయత్నం నేను చేస్తాను...నా ప్రయత్నంలో నేను ఓడిపోతే, బిత్రోచికి బందీనై నరకాన్ని అనుభవిస్తాను...అయినా బాధలేదు...దిశైవను తలచుకో...అది నాకు దారి చూపిస్తుంది...సరిగ్గా నేను బిత్రోచిని నిరోధించే సమయానికి నువ్వు పీటర్సన్ ని చంపి వేయాలి. అతని రక్తవలయంలోకి చొచ్చుకుపోయి.
రాబర్ట్ దిశైవని ప్రార్ధించాడు.
దిశైవ దారి చూపిస్తుంటే సుసిరియో తన సర్వశక్తులు క్రోడీకరించి తన పూర్వికుల మంత్ర శక్తులను ఆవహింపచేసుకుని కదిలాడు.
                                      * * *
ఒక్కక్షణం ఏం జరుగుతుందో అర్ధం కాలేదు నచికేతకూ, అతని ఫ్రెండ్సుకూ...
గెస్ట్ హౌస్ తలుపులు తెరుచుకోగానే లోపల నుండి పెద్ద ఎత్తున శబ్దాలు మొదలయ్యాయి.
భయంతో వెనక్కి తిరిగి పారిపోయే ప్రయత్నం మొదలెట్టారు.
అప్పటికే బిత్రోచి గాలిని చీల్చుకుంటూ గెస్ట్ హౌస్ నుంచి బయటకు రాబోయింది.

                                        * * *
సుసిరియో ఆత్మ వేగంగా కదిలింది.
దిశైవ గాలికన్నా వేగంగా కదిలి గెస్ట్ హౌస్ ను చేరుకుంది.    
సుసిరియో ఆత్మ గెస్ట్ హౌస్ తలుపులను మూసింది.
బిత్రోచి అసహనంతో, అసంతృప్తితో కళ్ళెర్ర చేసింది.
క్షణక్షణానికి సుసిరియో ఆత్మకు ఉన్న శక్తి సన్నగిల్లుతుంది.
బిత్రోచి చూపుల తీక్షణకు గాలి బెదిరింది.
ఆ పరిసరాల్లో ఉన్న ప్రేతాత్మలు నచికేతను బిత్రోచికి బలి ఇవ్వడానికి కదిలాయి.
బిత్రోచి గెస్ట్ హౌస్ గేటు దాటి నాలుగడుగులు వేసేలోగా క్షుద్ర ప్రేతాత్మలు వేగంగా వచ్చాయి.
అదే సమయంలో ప్రభు మెడలోని చెయిన్ కిందపడింది.
అది అందుకునే ప్రయత్నం చేస్తుండగానే గాలి చీల్చుకుని ఏవో ప్రేతాత్మలు తమని వెంబడిస్తున్నాయని ఆ ఐదుగురికి అర్దమయింది.
అలానే ఆ చైన్ వదిలారు.
ఆ ప్రేతాత్మలు వీళ్లని వెంబడిస్తూ ఆ చెయిన్ దాటే ప్రయత్నం చేసి ఒక్కక్షణం భయంతో వెనక్కి తగ్గాయి.
ఆ చెయిన్ లో ఆంజనేయుడు తాయెత్తు, క్రాస్ వున్నాయి. వాటి తాలూకు వెలుగు చూడలేక ప్రేతాత్మలు వెనుదిరిగి గెస్ట్ హౌస్ లోకి చేరుకున్నాయి.
సుసిరియో ఆత్మ సంతృప్తి పడింది. తనే ఆ గెస్ట్ హౌస్ కు బంధనంగా నిలచింది. దిశైవ సుసిరియోను మెచ్చుకోలుగా చూసింది.
                                                    * * *
రాబర్ట్ కళ్ళు తెరిచాడు.
సుసిరియో ఆత్మ మాటలు గాలిలో నుంచి వినిపిస్తున్నాయి.
"మంత్ర దండానికి అంటిన రామయ్య రక్తం తడి ఆరకముందే పీటర్సన్ ను అదే మంత్రదండంతో చంపాలి. రామయ్యను చంపిన తరళ పీటర్సన్" ని చంపాలి.
                                       * * *
రాబర్ట్ తరళవైపు తిరిగి సైగ చేశాడు తనతో రమ్మన్నట్టు...
తరళ ట్రాన్స్ లో ఉన్నట్టు రాబర్ట్ వెంట నడిచింది. వాళ్లతో పాటు పరమహంస కూడా.

                                               * * *
ఒక్కసారిగా తన వెనగ్గా ఏదో శబ్దం వినిపించేసరికి ఉలిక్కిపడి ఎలర్ట్ అవ్వబోయేడు డేనియల్.
అప్పటికే రాబర్ట్ తన చేతిని నైఫ్ లా మార్చి డేనియల్ మెడమీద కొట్టాడు. ఒకే దెబ్బకు విరుచుకుపడిపోయేడు డేనియల్.
తరళ తండ్రిని అతి ఘోరంగా హత్య  చేయించిన వ్యక్తి.
కసి...కోపం...పగ...ప్రతీకారం...
వీటన్నింటికి మించి విశ్వనాశనానికి సిద్దపడే ఓ నీచమైన క్షుద్ర మాంత్రికుడిని చంపుతున్నాను అన్న తృప్తి.
ఆమె చేయి గాల్లోకి లేచింది. ఆమె చేతిలో ఉన్న మంత్ర దండం అతని తలను రెండుగా చీల్చింది.

                                      * * *
"మిస్టర్ రాబర్ట్...నువ్వు కానీ, నీ స్నేహితులు కాని పీటర్సన్ మృతదేహాన్ని చూడకూడదు. పీటర్సన్ చనిపోయిన వెంటనే మీరు వెనుతిరిగి చూడకుండా పోవాలి..." సుసిరియో ఆత్మ హెచ్చరించింది.
రాబర్ట్ వెంటనే తరళ చేయి పట్టుకుని పరమహంస వైపు తిరిగి..."కమాన్ క్విక్...పరుగెత్తండి...ఎవరూ వెను తిరిగి చూడొద్దు...రన్...రన్...ఐసే..." అంటూ పరుగు ప్రారంభించేడు.
అదే రాబర్ట్ చేసిన పొరపాటు.
పీటర్సన్ పూర్తిగా చనిపోయాడని నిర్ధారించుకున్నాక అక్కడ్నుంచి కదిలివుంటే పరిస్థితి మరోలా వుండేది.
కానీ కేవలం పీటర్సన్ చనిపోయాడనుకుని వాళ్ళు పరుగెత్తారు.
రాబర్ట్ చేసిన ఈ ఒక్క పొరపాటుకు పర్యవసానం పదమూడేళ్ల తరువాత ఎంత బీభత్సంగా మారుతుందో తెలుస్తుంది.

                                                          * * *
మెడమీద చేత్తో రుద్దుకుంటూ స్పృహలోకి వచ్చాడు డేనియల్.
ఒక్క క్షణం అంతా అయోమయం.
వెంటనే కళ్ళు నులుముకుని మరీ చూసేడు.
పరుగెత్తుకెళ్లి రక్తవలయంలో రక్తపు మడుగులో పడివున్న పీటర్సన్ ని సమీపించాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra