నవ్వేడు.

    సాధారణంగా అతడు ఎప్పుడూ నవ్వడు.

    నవ్వితే చాలా బావుంది.

    అప్రయత్నంగా, అన్ కంట్రోలబుల్ గా అతడి చేతిమీద చెయ్యివేసింది. అతడు గ్లాసు ఎత్తి "ఛీర్స్" అన్నాడు.


                                     3

    భైరవమూర్తికి యాభై ఆరేళ్ళు. దాదాపు ముప్ఫై ఏళ్ళుగా పోలీసు డిపార్ట్ మెంట్ లో ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. అంత వయసొచ్చినా ప్రమోషన్ రాకపోవటానికి కారణం అతడి నిజాయితీ!

    ఇరవైఏళ్ళ క్రితమెప్పుడో అప్పటి ముఖ్యమంత్రి కొడుకుతో తగాదా వేసుకున్నాడు. అరెస్టు వారెంటుతో వెళ్ళి భీభత్సం సృష్టించాడు. పేపర్ల కెక్కాడు. ముఖ్యమంత్రి రాజీనామా చేయవలసి వచ్చింది. చాలా లొసుగులు బయటపడ్డాయి సంచలనం రేగింది.

    అయితే రాజకీయ నాయకులు చాపక్రింద నీరులాటి వారు. ఆరేళ్ళ తరువాత తిరిగి అధికారంలోకి వచ్చాడు మాజీ ముఖ్యమంత్రి. సమయం చూసుకుని భైరవమూర్తిని శంకరగిరి మాన్యాలు పట్టించాడు.

    భైరవమూర్తి విసుగు చెందలేదు. అతడికి ఒక్కడే కొడుకు. లాయరు. అతడు కూడా తండ్రి లాటివాడే. తృప్తికి మించింది మరేదీ లేదని నమ్ముతారు ఆ కుటుంబమంతా!

    ప్రమోషన్ రానందుకూ, ఇన్ స్పెక్టర్ గానే పని చేయవలసి వచ్చినందుకూ భైరవమూర్తి ఎప్పుడూ బాధపడలేదు. అతడో విశిష్టమైన వ్యక్తి. అతడి ఏరియాలో నేరస్తులకి అతడంటే సింహస్వప్నం! ప్రతీదీ చట్టప్రకారమే చేయడతడు. ఎలాగో ఒకలా నేరం ఒప్పిస్తాడు.

    మరో రెండునెలల్లో ప్రమోషన్ వస్తోందని అతడికి తెలిసింది. సంతోషించాడు. తనకి ప్రమోషన్ వస్తున్నందుకు కాదు. ఆలస్యంగానయినా నిజాయితీ గెల్చినందుకు.

    అయితే "ముఖ్యమంత్రి కొన్ని కోట్లు సంపాదించి వుండవచ్చు. కానీ తనకున్న తృప్తి అతడికుండదు...." అన్నది తప్పు స్టేట్ మెంట్. డబ్బు సంపాదించలేని ప్రతివాడూ అలాగే అనుకుంటాడు. అవినీతి పద్ధతిలో లక్షలు సంపాదించినవాడు కూడా, తన పద్ధతిలో తాను జీవితాన్ని ఆనందిస్తూ వుండి వుండవచ్చు. "వాడు" ఎంత బ్రతుకుతున్నాడన్నది చూసుకోవాల్సింది. మనమెంత తృప్తిగా బ్రతుకుతున్నామన్నది.

    ఆ విషయంలో భైరవమూర్తికి ఏలోటూ లేదు. ఒక్కడే కొడుకు. చక్కగా అల్లుకున్న కుటుంబం అది. కొడుకు కూడా చేతికి అందివచ్చాడు. లాయరుగా మంచి ప్రాక్టీసు వుంది. తొందర్లో పెళ్ళి కూడా చేయబోతున్నారు.

    అప్పుడు జరిగింది అనుకోని ఒక సంఘటన, మొత్తం పొదరిల్లు కుప్పకూలిపోయే సంఘటన. మొట్టమొదటిసారి భైరవమూర్తికి దేవుడిమీద నమ్మకం పోయింది, ఎందుకు? ఎందుకిలా చేసావ్? అని దేవుణ్ణి అడిగాడు. దాదాపు పిచ్చెక్కిపోయాడు. పోలీసు డిపార్ట్ మెంట్ లో పనిచేయటం వృధా  అనుకున్నాడు.

    ఆ సమయంలో అతడికి ప్రమోషన్ వచ్చింది. ట్రాన్స్ ఫర్  అయింది. డాక్టర్ విశాల్  క్లినిక్ వుండే ఏరియాకి.


                                      4

    మధూహ చెంప ఛేళ్ళుమంది. "లక్ష్మి దగ్గిరకెళ్ళి ఆ గర్భం నకిలీదని ఎందుకు చెప్పావ్?" అంటూ ఆవేశంతో వూగిపోతూ మళ్ళీ చెయ్యి ఎత్తాడు రాజు.

    బలంగా తగిలిన ఆ దెబ్బకి మధూహకి కోపం రాలేదు. దుఃఖం రాలేదు. ఆశ్చర్యం వేసింది. రాజుకి  అంత ధైర్యం ఎలా వచ్చిందా? అని....! డబ్బు  సంపాదించాలి అన్నా తపన, కాస్త ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, కాస్త పిరికితనం మూర్తీభావించిన మనిషి రాజు .... ఇప్పుడతనికి అంత దైర్యం ఎలా వచ్చిందో, అతని  నోటి వెంట వస్తూన్న వాసన చెపుతోంది. అతడి కళ్ళు ఎర్రగా వున్నాయి. మనిషి నిలువెల్లా వణికిపోతున్నాడు.

    మధూహ అతని చెయ్యిపట్టుకుని వెనక్కి తోసింది. నిలదొక్కుకుని మళ్ళీ ముందుకు వచ్చాడు. "నిన్ను నమ్మి మా రహస్యాన్నీ చెపుతే, వెళ్ళి పేషెంటుకి చెపుతావా?" అంటూ రెండు భుజాలూ పట్టుకుని విసురుగా దగ్గిరకి లాక్కున్నాడు. ఆమెకూడా అంతే ఆవేశంగా, అవును. చెప్తాను. ఆమె నా స్నేహితురాలు. అందుకే చెప్పాను. అంతేకాదు. మీరు చేసే  మోసాలు మొత్తం ప్రపంచానికంతా చాటి చెపుతాను" అంది.

    అతడు మరింత రెచ్చిపోయి ఆమెని క్రిందికి తోసాడు. అతడిని ఆమె పట్టుకుని వుండటంతో ఆమెతో పాటు అతనుకూడా  క్రింద పడ్డాడు. ఆమెని ఆక్రమించుకుంటూ,  "ఏం చెప్తావు? ఏం చేస్తావే?" అంటూ పిచ్చివాడిలా గొణుగుతూ ఆమెని వివస్త్రని చేయటానికి ప్రయత్నించసాగాడు.

    అతడి ప్రయత్నం ఆమెకి అర్థమవటానికి అరనిముషం పట్టింది. నిర్విణ్ణురాలైంది. గింజుకోవటానికి కోదా ప్రయత్నించకుండా రుద్దకంఠంతో "రాజూ! ఏమిటిది? ఏమిటిది రాజూ?" అని మాత్రం అనగలిగింది. లోపల్నుంచి దుఃఖం తన్నుకు వస్తోంది. తన స్నేహితుడు ఈ విధంగా ప్రవర్తించగలడని కలలో కూడా అనుకోలేదు.

    అతడామెని పూర్తిగా ఆక్రమించుకుంటూండగా ఆమె స్పృహలోకి వచ్చింది. రెండు చేతుల్తోనూ దూరం జరపటానికి ప్రయత్నించసాగింది. "వదులు రాజూ. వదులు" అని అంటూనే వుంది. అతడు మాత్రం చాలా కసిగా కోపంగా వున్నాడు. అతడిలో అంత ఆవేశాన్ని ఆమె ఎప్పుడూ చూడలేదు. డాక్టర్ విశాల్ పట్ల అతడికి అంత గురుభక్తి వుందని ఆమె అనుకోలేదు. తను  పూర్తిగా మోసగింపబడినట్టుగా అతడు భావిస్తున్నాడు. తమ  రహస్యాలన్నీ ప్రపంచం మొత్తం వెల్లడి అయినట్టుగా భీతిల్లుతున్నాడు. ఆ భయం ఆవేశం రూపంలో బయటకొస్తుంది. ఈ విధంగా ప్రతీకారం తీర్చుకుంటున్నాడు.

    ఆమెలో శక్తి క్రమంగా తగ్గిపోసాగింది. ప్రతిఘటించడానికి కూడా శక్తిలేనట్టు నిస్సత్తువగా వుండిపోయింది. ఆమె అంతర్ చక్షువు వెంట కన్నీరు ధారాపాతంగా కారుతోంది. అది మనసుకి సంబంధించిన దుఃఖం. ఈ ప్రపంచంలో ఎంతమంది ఆడపిల్లలు, తెలిసీతెలియని వయసులో అప్పుడే విచ్చుకుంటూన్న గులాబీలాటి తమ మనసుని తొలిప్రేమ రూపంలో అబ్బాయిలకి అర్పించి వుంటారు? ఆ తరువాత అభిరుచులు కలవకనో, విధి వైపరీత్యం వల్లనో విడిపోయివుంటారు? తమ ఎంపిక తప్పని తెలుసుకోగలిగేటంత ఆత్మ విమర్శ చేసుకుంటారా.....? లేక అయిందేదో అయిపోయిందిలే అని మామూలు జీవితపు గాడిలో పడివుంటారా?......శరీరం పాడయిననందుకు కాదు దుఃఖం. తొలిప్రేమ అర్పించినందుకు! కరెక్టుగా ఎన్నిక చేసుకోలేక పోయినందుకు!! అంత విచక్షణాజ్ఞానం లేకుండా ప్రేమలో పడినందుకుకు!!!

    ఆమె ప్రతిఘటన లేకపోవటాన్ని అతడు మరోలా అర్థం చేసుకున్నాడు. సహకరిస్తోందనుకున్నాడు. విశాల్ క్లినిక్ లో హిప్నోటిక్ ట్రాన్స్ లో వున్న ఆడవాళ్ళని ఒకరిద్దరిని ఈవిధంగానే అతడు అనుభవించాడు. సగంలో మత్తునుంచి బయటపడి కొందరు గింజుకునే వారు. తరువాత సహకరించేవారు. కొందరీ విషయం బయటకు చెప్పుకోలేక మౌనంగా వుండిపోయేవారు.

    ఆవేశం తగ్గాక అతడు మామూలు  మనిషయ్యాడు. ఆమెలో ఏ రియాక్షనూ లేకపోయేసరికి విస్మయం చెందాడు. "సారీ. ఆ కోపంలో నన్ను నేను కంట్రోలు చేసుకోలేకపోయాను. నేను నిన్ను నమ్మి మా ప్రొఫెషన్ గురించి చెప్తే, అది నువ్వు బయటకు వెల్లడి చేసావన్న కోపంలో ఇదంతా జరిగిపోయింది." అన్నాడు. ఆమె మాట్లాడలేదు. ఆ మౌనం మరింత గిల్టీగా ఫీలయ్యాక జరగవలసింది కాస్త ముందు జరిగింది. అంతేగా" అంటూ నవ్వటానికి ప్రయత్నం చేసాడు. ఆమె బ్లాంక్ గా  చూసిందతనివైపు. ".......అవును. వీలైనంత త్వరగా మన వివాహానికి ముహూర్తాలు పెట్టిస్తాను" అంటూ మరోసారి ఆమెను దగ్గిరకు తీసుకోబోయాడు. ఆమె నెమ్మదిగా విడిపించుకుంది.

     భార్యభర్తల మధ్య కూడా రేప్ జరుగుతుందని ఆమె ఎక్కడో చదివింది. అదేమిటో అప్పట్లో అర్థం కాలేదు. ఇప్పుడవుతోంది. అది జీవితాంతం ఇలాగే వుంటుందేమో అన్న భయం కూడా మొదలవుతోంది.

    ఏదో ఎక్కడో తెగిపోయిన ఫీలింగ్.

                                      5


    ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతున్న విష్ణు స్వింగ్ డోర్స్ తెరుచుకోవటంతో తలెత్తి చూసాడు. లోపలికి వస్తూన్న భార్యని చూడగానే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి.

    లక్ష్మి ఎప్పుడూ ఆఫీస్ కి రాదు. అసలింత వరకూ ఎప్పుడూ రాలేదు కూడా.

    "బిజీగా వున్నారా?"

    "లేదు. కూర్చో. ఏమిటిలావచ్చావ్?"

    "ఇంట్లో తోచటం లేదు."

    "ఏదైనా వ్రాసుకోలేకపోయావా?"

    "దాని గురించే వచ్చాను. కొంచెం వివరాలు కావాలి. వివరాలంటే మరీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ కాదు. వ్యాపారం గురించి......అంటే..... ఎలా చెప్పాలో తెలియటం లేదు..... ఒక బిజినెస్ మాన్ దినచర్య, అతడి కష్టాలూ, విసుగూ.....చిరాకు......టెన్షన్.....వీటన్నిటి గురించీ వ్రాయాలనుకున్నాను."

    "ఈజిట్? వ్రాయి. బాగా వ్రాయి" అన్నాడు. ఆమె కొన్ని కాగితాలు అందించింది. అతడు పదినిముషాలపాటు శ్రద్ధగా చదివాడు. అంతసేపూ అతడినే చూస్తూ కూర్చుంది. అది తనకి సంబంధించిన సబ్జెక్టు కావటంతో ఇంటరెస్టింగ్ గా చదవసాగాడు. అంతా  చదివి. "సినాప్సిస్ బావుంది. బాగానే వ్రాస్తావే నువ్వు" అన్నాడు. ఆమెకి సంతోషం వేసింది. బయటవాళ్ళు మెచ్చుకోవటం వేరు. 'తన' వాళ్ళు మెచ్చుకోవటం వేరు. రచనే కాదు. ఏపనినైనా.

    ఆమె సంతోషానికి మరో కారణం కూడా వుంది. అతనితో మొత్తం చదివించింది! అదీ కారణం. అతడికసలు ఇలాటి వుత్సాహాలు లేవు. కానీ  కథ తన  ఫీల్టుకి సంబంధించినది అవటంతో ఇంటరెస్టింగ్ గా చదివాడు. ఆమెకు కావాల్సింది కూడా అదే. తన రచనా వ్యాసంగంలో అతడికి ఆసక్తి కలిగించటం! ఆ విషయంలో కృతకృత్యురాలైంది.

    అతడు స్క్రిప్టు చదివి బల్లమీద పెడ్తూ "చెప్పు. ఏం వివరాలు కావాలి?" అని అడిగాడు.

    "అలా అడిగితే చెప్పలేను. నేను మన ఆఫీసులో కొన్నాళ్ళు పని చేద్దామనుకుంటున్నాను."

    అతడికి పొల మారినట్టు అయింది. "మ......మన ఆఫీసులోనా?" అన్నాడు.

    ఆమె నవ్వుతూ, "......అదే....మీ ఆఫీసులో" అంది.

    "సర్లే. ఆ విషయం కాదు. అయినా.....నువ్వు....." తరువాత ఏం మాట్లాడాలో తెలియక ఆగిపోయాడు.

    "కొన్నాళ్ళు పనిచేస్తే  తప్ప ఈ  విషయాలన్నీ అవగాహనకు రావు. ఇంటర్వ్యూ పద్ధతిలో వివరాలు సేకరించటం కన్నా, ఇలా ప్రత్యక్షంగా చూస్తే ఇంకా బాగా వ్రాయొచ్చునిపించింది. బయట ఒక టేబులూ కుర్చీ వేయిస్తే మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా, నా పని నేను చేసుకుంటాను."

    "డిస్టర్బెన్స్ కాదు. కానీ....." అతడు సందిగ్ధంతో తటపటాయించాడు. "స్టాఫంతా ఏమనుకుంటుందో. అయినా నువ్వేం పనిచేయగలవు?"

    "కంట్రోల్"

    "వ్వాట్?"

    "......యజమాని భార్య తమతోపాటు కూర్చుంటే స్టాఫ్ ఎక్కువ కబుర్లు చెప్పుకోవటానికి వీలుండదు. అదొక్కటి చాలు నాకు మీరు జీతమిచ్చి పనిలో పెట్టుకోవాటానికి" నవ్వింది. "అయినా ఇదంతా నెలా రెండునెలలేగా....."  

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra