Home » Suryadevara rammohan rao » సూపర్ స్టార్


    "సుహాసిని తీసే సీరియల్ పేరేంటమ్మా....?"

    "పెణ్ .......అంటే స్త్రీ అని అర్థం...."

    "సబ్జెక్ట్ ఏమిటమ్మా.....?"

    "స్త్రీ గురించి చెబుతుంది నాన్నగారు స్త్రీ సమస్యల గురించి కాదు. స్త్రీ ఎంతగొప్పది....? ఎంతటి ఔన్నత్యం..... మరెంతటి సహనం.... స్త్రీకి ఉన్నదో చెబుతుంది. తరువాత తీసే సీరియల్ లో స్త్రీ సమస్యలను డీల్ చేస్తోంది......"

    "ఆమెకంత ప్రోత్సాహం ఇస్తుంది ఎవరమ్మా.....?" తల్లి కల్పించుకుంటూ అంది.

    "ఆమె భర్త, ప్రముఖ  దర్శకుడు మణిరత్నం"

    "కదా..... అలాగే నువ్వూ పెళ్ళిచేసుకుంటే నీ భర్త నీకు కూడా మంచి  ప్రాత్సాహం ఇస్తారుగదా.....? చేసుకోకూడదా.........?" తల్లి మాటలకు హంపి నవ్వింది -ఆమె ఆరాటాన్ని,  అంతరంగాన్ని అర్థంచేసుకొని మనసారా నవ్వింది.

    "చూసారా నాన్నగారు..... అమ్మ ఎంత తెలివిగా విషయాన్ని డ్రైవ్  చేసిందో.....?" నాతోటే చెప్పించింది.... అమ్మకి సుహాసిని భర్త మణిరత్నం  అని తెలుసు. కావాలనే నాతోటి చెప్పించింది....." అంది హంపి ఇంకా నవ్వుతూనే.

    సీతారామారావు కూడా భార్య చమత్కారానికి నవ్వుకున్నాడు.

    "సుహాసిని సీరియల్ లో ఆర్టిస్ట్ లు  ఎవరమ్మా.....?" సీతారామారావు తిరిగి అడిగాడు.

    "అమల, రేవతి, శ్రీవిద్యలాంటి అనుభవమున్న పెద్ద తారల్ని పెట్టి తీస్తోంది. ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కోనటి నటిస్తుంది. అది చాలా  పెద్ద బడ్జెట్ సీరియల్ నాన్నగారు..... స్పాన్సరర్స్ ముందుకు రాకపోయినా సుహాసిని ధైర్యంగా తీస్తోంది. కెమేరా వుమెన్ కావాలని ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో చేరి  ఫోటోగ్రఫీలో డిప్లోమాచేసి అనుకోకుండా నటి అయిపోయింది. రాష్ట్రస్థాయి అవార్డులేకాక జాతీయ అవార్డునుకూడా అందుకుంది. పెణ్ కి సుహాసినే కథ, మాటలు, కెమెరా, దర్శకత్వం నిర్వహిస్తోంది....." అంటూ హంపీతల్లివేపు తిరిగి అంది-

    "సుహాసిని పెళ్ళికాకముందే ఫోటోగ్రఫీలో డిప్లోమా చేసింది. పెళ్ళి కాకముందే తమిళ, తెలుగు సినిమాల్లో నటించింది. పెళ్ళికాకముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వపు నందీ అవార్డుని, తమిళనాడు రాష్టప్రభుత్వపు ఉత్తమనటి అవార్డుల్ని తెచ్చుకోగలిగింది. పెళ్ళికాకముందే జాతీయస్థాయి ఉత్తమనటి అవార్డుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానుండి అందుకుంది. మణిరత్నానికి మామగారు కాకముందే సుహాసిని తండ్రి చారుహాసన్ రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి ఉత్తమనటుడి అవార్డులను అందుకున్నారు.

    సుహాసిని బాబాయి కమల్ హాసన్ సరేసరి- భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డుని ఎప్పటికైనా అందుకోగల నటుడు కమల్ హాసన్ ఒక్కరే. ఒకే కుటుంబములోని ముగ్గురు వ్యక్తులు జాతీయస్థాయి అవార్డులను అందుకో గలిగారు. మణిరత్నం దర్శకులు - క్రియేటివ్ జీనియస్. కాని సుహాసిని అంతకుముందే తన ప్రతిభను రుజువు చేసుకుంది..... తెలుసామ్మా.....?" నవ్వుతూ అంటున్న కూతుర్నిచూసి ఆమె నాటకీయంగా నుదురుని కొట్టుకొంది.

    "ఎందుకు పుట్టామో....ఏమి ఉద్దరించామో తెలీకుండా బ్రతికే బ్రతుకెందుకమ్మా....? తల్లిదండ్రులమీద ఆధారపడకుండా స్వశక్తితో ఏదైనా సాధించినవాళ్ళే మనుష్యులమ్మ...."

    "నీతో మాట్లాడటం కష్టమేతల్లి... నీ ఎదుగుదలను కన్నతల్లిగా కాదంటానా...? కాని నాబాధ నాది. నీకు పెళ్ళయి.... బుల్లి మనుమరాలినో, మనవడ్నో ఇచ్చావనుకో మాకూ కాలక్షేపమవుతుంది. ఆ తరువాత నీక్కావలసిన ఎత్తులకు నీవు ఎదగవచ్చు. మేం కాదంటామా.......? కొడుకులే అసమర్ధుల్లా, సోమరిపోతుల్లా ఇంట్లో కూర్చుని పెద్దల ఆస్తిపాస్తుల్ని తగలేస్తున్న ఈ రోజుల్లో కూతురు ఎదిగి, నలుగురి ప్రశంసలు అందుకుంటూ, తన కాళ్లమీద తాను నిలబడతానంటుంటే ఎ తల్లిదండ్రులు మాత్రం సంతోషపడరు.....? నా బాధ గురించికూడా కొద్దిగా ఆలోచించు తల్లి"

    "అమ్మా.... నీబాధ గురించి నే ఆలోచిస్తాను-మాబాధ పట్టించు కోవేమిటి...?" అంది హంపి తమాషాగా తన స్టోమెక్ ని చూపిస్తూ.

    "అయ్యో..... మర్చిపోయానే తల్లి..... ఇప్పుడే టిఫిన్ చేసి పట్టుకు వస్తానుండండి" అంటూ ఆమె వంటగదికేసి నడిచింది.

    "చెప్పమ్మా.... ఎందుకు సంతృప్తిపడలేక పోతున్నావని అడిగితే, సుహసిని గురించి చెప్పావు. ఎందుకని?" తిరిగి ప్రశ్నించాడు సీతారామారావు.

    "అనుభవమున్న ఆర్టిస్టులు - వృత్తిమీద గౌరవం ఉన్న ఆర్టిస్టులు సుహాసినికి దొరికారు నాన్నగారు...."

    "ఓ.... అదా.... కొంచెం శ్రమపడయినా సిన్సియారిటీ, టాలెంట్ ఉన్న ఆర్టిస్టుల్నే పెట్టుకోలేక పోయావమ్మా....?"

    "ఊరకే జెండాలు పట్టుకొని స్త్రీకి సమాన హక్కులని అరిచే స్త్రీలే కాని.... అన్ని రంగాలలోకి ప్రవేశించి తమ డామినేషన్ ని రుజువు చేసుకొనే ప్రాక్టికల్ వుమెన్ కరువయిపోయారు నాన్నగారు - కెమేరా వుమెన్ కావాలన్నా, మేకప్  వుమెన్  కావాలన్నా ఇంకా సందేహాలమధ్యే స్త్రీ మిగిలిపోతోంది. నటనను, ధైర్యంగా తీసుకోలేకపోతున్నారు స్త్రీలు. ఎందరో అద్భుతమైన నటనను ప్రదర్శించగల యువతులున్నారు - కాని బయటకు రావటం లేదు - హీరో, హీరోయిన్ పాత్రలకు నాకు  సరయిన ఆర్టిస్టులు దొరకలేదు నాన్నగారు....."

    "పైలట్ షూటింగ్ కూడా పూర్తి కావస్తోందిగదా.....? ఇపుడింకా నువ్వా  అసంతృప్తిలోనే ఉంటే కష్టంకాదా.....?"

    "నిజమే నాన్నగారు.....బట్..... ఎందుకో సంతృప్తిపడలేకపోతున్నాను. మనస్సును సరిపెట్టుకోలేకపోతున్నాను....."

    "ఏ సమాజంలోని ప్రజలకయితే సోఫెషనలిజమ్, నీతి, నిజాయితీ వ్యక్తిత్వం ఉండవో.... అక్కడ రాజీ తప్పదమ్మా.....ప్రస్తుతానికి రాజీపడి వారితోటే సాధ్యమయినంత మంచి ఫలితాలు తీసుకురావమ్మా.....ఇకిప్పుడు చేయగలిగింది కూడా లేదుగా....."

    "చేయగలిగింది ఉంది నాన్నగారు కాని ఎలాచేయాలో తెలీటం లేదు"

    కూతురి మాటలకు సీతారామారావు ఆశ్చర్యపోతూ "చేయగలిగేది ఉందా.....? చెప్పు తల్లి.....ఎలా చేయవచ్చో కలసి ఆలోచిద్దాం....." అన్నాడు కూతురి ఆవేదనని అర్థం చేసుకుంటూ.

    అనిల్ ని చూడటం - కేవలం నూటాయాభైకి అద్బుతంగా అతను నటించటం - తను ఆ సంఘటనని షూట్ చేయటం- చనిపోయిన స్త్రీ  అతని  తల్లేకావటం- భలేనటించారాని తను అనటం-అతను తనను చెంపదెబ్బ కొట్టడం- ఆ తరువాత భవానీ ఆపదలో ఉండగా అతన్ని చూడటం- భవానీ హెల్ప్ హెల్ప్ అని అరిచినా అతను పట్టించుకోనట్లు హడావిడిగా వెళ్ళిపోవటం- అన్నీ వివరంగా చెప్పింది హంపీ. వింటూ విస్మయపడ్డాడు సీతారామారావు......

    "పైగా అతను-అతని ఫ్రెండ్స్ నిరుద్యోగులు నాన్నగారు....." అతను దొరికితే నటించటానికి ఖచ్చితంగా ఒప్పుకుంటారన్న తన నమ్మకాన్ని వ్యక్తపరుస్తూఅంది హంపి.

    సీతారామారావు కొద్ది క్షణాలేం మాట్లాడలేదు.

    "నాలాగే అతని జీవితం ప్రారంభమయింది. పిరికివాడిగా, డ్రీమీగా, సోమరిపోతుగా తన జీవితాన్ని ప్రారంభించి ఉంటాడని నా ఊహ. చేతికందిన అవకాశాన్ని కాక కలల  ప్రపంచాన్ని సొంతం చేసుకొనే ఆశతో విలువైన వర్తమానాన్ని  వృధాచేసుకునే యువకుడతను. నీ ఆశాభావం నూటికి నూరుశాతం కరక్టు......నిజంగా అతనే దొరికితే ఆ పాత్రను పండించగలడు....." అంటూ కొద్ది క్షణాలాగాడు.

    "పోనీ ఓ పని చేయమ్మ.... పైలట్ షూటింగ్ ఆపేసి ఒక వారం అతనికోసం శోధిస్తే.....?"

    "లేదు నాన్నగారు. మరో ఐదురోజుల్లో నేను పైలట్ ని దూరదర్శన్ కి సబ్ మిట్ చేయాలి. ఎడిటింగ్, డబ్బింగ్, రీరికార్డింగ్ కి రెండురోజులు పడుతుంది- అదీ యుద్ధ ప్రాతిపదికపై చేస్తే........ ఇటు వీళ్ళతో సంతృప్తి పడలేను- అటు అతను దొరికేలా లేడు....." నిస్పృహగా తల విదిలిస్తూ అంది హంపి.

    "పోనీ.... ఈ రోజు.... ఈ రాత్రిలోపు దొరికితే అతనితో షూట్  చేయగలరా..... మేడమ్.....?"

    తండ్రికూతురు మాటలు వినిపించినవేపుకి ఉలిక్కిపడిచూసారు.

    అక్కడ భవానీ నించుని ఉన్నాడు.

    అర్థమయ్యాక తేరుకుంటూ "వాడ్డూ యూమీన్?" అంది హంపి.

    "ఎంతో ఎమోషనల్ గా డైరెక్ట్ చేసే మీరు ఈ సీరియల్ విషయంలో మాత్రం నిరాసక్తంగా  కనిపించటం నాకు బాధగా ఉంది మేడమ్. అందుకే సాయంత్రం ఆరుగంటలకు షూటింగ్ కి పేకప్ చెప్పగానే అతనికోసం వెతకటం ప్రారంభించాను. ఆరోజు నేను అతన్నెక్కడ చూసానో...... నేను హెల్ప్ హెల్ప్  అని అరవగా అతను ఎటుకేసి పరిగెత్తాడో- ఆ వేపుకి వెళ్ళి శోధించాను....."

    భవానీ చెప్పటం ఒక్క క్షణం ఆపగానే-

    "చెప్పు.....కమాన్ .... శోధించగా.....శోధించగా అతని అడ్రస్సు దొరికిందా.....?" హంపీ ఆతృతగా అడిగింది.

    భవానీ ఒకింత బాధగా అన్నాడు-

    "లేదు మేడమ్.....బట్ ....అతను తరుచూ కనిపిస్తాడని - అతనితో పాటు మరో ఇద్దరు యువకులు, ఒక యువతి ఉంటుందని చెప్పారు. ఆ యువతి తుఫాన్ పునరావాస శాఖలోపనిచేసే ఒక అధికారి ఇంట్లో పనిమనిషిగా చేస్తుందని ఒక కిళ్ళీకొట్టు యకమాని చెప్పాడు....."

    "ఆ ఇంటి కెళ్ళావా....?" బుల్లెట్ లా వచ్చిందా ప్రశ్న ఆమె నోటినుంచి.

    "వెళ్ళాను మేడమ్...."

    "ఏమయింది....?"

    "ఆమె రెండురోజుల్నుచి పనిలోకి రావటంలేదు-ఆ ఆఫీసర్ భార్య నన్ను, ఆ యువతిని కలిపి తిట్టిపోసింది.... నన్నా యువతి బంధువుననుకుందేమో.....మహాతల్లి"

    "ఆ యువతి పేరేమిటి.....?"

    "అదే అడిగితే......ఏమీ తెలీనట్లు నాటకమాడుతున్నానని తిట్టింది. మొగుడు మొన్న మేనెల తుఫాన్ నిధుల్ని బాగా తినేసినట్లున్నాడు-వులన్ రగ్గులు, స్టీల్ సామాన్లు, తుఫాన్ బాధితులకోసం దాతలిచ్చిన సామానుతో ఆ ఇల్లు నిండిపోయింది."

    "డామ్ ది....కరప్ట్ బాస్టర్డ్స్.....ఓ ప్రక్క లక్షలు ప్రజల సొమ్ము తినేస్తూ ఇంకా జీతాలు చాలటంలేదని మధ్యమధ్యలో సమ్మెలు...ఏం చేద్దాం మరి....?"

    "నే చెబుతానుండు తల్లి..... ఆ ఫోన్ నా దగ్గరకు జరుపు" అన్నాడు సీతారామారావు.

    భవానీ ఫోన్ తీసుకెళ్ళి ఆయన మంచం ప్రక్క నుంచాడు.

    "అతనిపేరేంటి భవానీ....." సీతారామారావు ప్రశ్నించాడు.

    భవానీ చెప్పాడు.

    సీతారామారావు 197కి ఫోన్ చేసి ఆ ఆఫీసర్  ఇంటి నెంబర్ తెలుసుకున్నాడు.

    ఆ వెంటనే ఆ ఆఫీసర్ ఇంటికి ఫోన్  చేసాడు.

    కొద్దిసేపటికి ఆవేపు ఫోన్ ఎత్తినశబ్ధం 'హలో' అన్నమాట వినిపించింది.

    "మేం సెవెన్ టౌన్ పోలీస్ స్టేషన్నుంచి మాట్లాడుతున్నాం. మీ ఇంట్లో పనిమనిషిని మీరు మాయం చేసినట్లు, ఒక యువకుడు కంప్లైంట్ ఇచ్చాడు...."    

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra