Home » Yandamuri veerendranath » ధ్యేయం


    ఆమె ఇంక ఆగలేనట్టు అతని చేతులు తన చేతుల్లోకి తీసుకుంది. వాటిని పెదాల దగ్గరగా చేర్చుకుంటూ "ఐయాం సారీ..... ఐయాం సారీ  ప్రీతమ్! నన్నర్థం చేసుకున్నావు కదూ? నువ్వు కాబట్టి నన్ను అర్థంచేసుకున్నావ్. నిజంగా నీలాంటి స్నేహితుడుండటం నా అదృష్టం. ఐ లవ్ యూ" అంది.

    ప్రీతమ్ కి ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యంతోపాటు అమితమైన సంతోషం కూడా వేసింది. అప్పటివరకూ అమ్మాయిల కోసం అతనే ప్రయత్నించేవాడు. ఒకమ్మాయి, అందులోనూ ధాత్రి లాంటి అమ్మాయి కోసం అతనే  ప్రయత్నించేవాడు. ఒకమ్మాయి, అందులోనూ ధాత్రి లాంటి అమ్మాయి తనంతట తాను ఐ లవ్ యూ అనటంతో అతడికి పర్వతం ఎక్కినంత ఆనందం కలిగింది. అలాగే దగ్గరగా  వచ్చి ఆమె భుజాల చుట్టూ చెయ్యివేసి  మరింత సామీప్యానికి లాక్కున్నాడు. ధాత్రి అభ్యంతరం పెట్టలేదు. అతడు వంగి ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకోబోయాడు. ఆమె మొహం పక్కకి తిప్పుకొంది.

    "అదేమిటి ధాత్రీ, నీ కిష్టంలేదా? ఐ లవ్ యూ ధాత్రీ..... ఐ లవ్ యూ" అన్నాడు.

    ఇష్టంలేక కాదు. ఆమె అంతవరకూ పరాయి మగవాడి స్పర్శ ఎరగదు. మొట్టమొదటిసారి అతడి పెదవులు దగ్గరగా వచ్చేసరికి భయపడింది. ఆవిషయం గుర్తించగలిగేంత అనుభవం ప్రీతమ్ కి లేదు. అతడి జీవితంలో అప్పటివరకూ తారసపడిన వాళ్ళంతా  చౌకబారు స్త్రీలే. ఆమె మౌనంగా వుండటంతో నొక్కి పెట్టాడు.

    ధాత్రికి ఇబ్బందికరమైన ఫీలింగేదో కలిగింది. అతన్నుంచి బలవంతంగా దూరంగా జరుగుతూ "వద్దు, వద్దు ప్లీజ్," అంది.

    మొట్ట మొదటిసారి కాబట్టి ఏదో తప్పు చేస్తున్నానన్న భావన! ఆమె అక్కడినుంచి వడివడిగా దాదాపు పరుగెడుతున్నట్టు వెళ్ళిపోయింది. ప్రీతమ్ అలాగే నిలబడి వున్నాడు. ఒకప్పుడైతే ఆమెమీద కోపగించుకోవటమో, వెళ్ళి బ్రతిమాలటమో, లేకపోతే బలవంతంగా ముద్దు పెట్టుకోవటమో చేస్తుండేవాడు. కానీ ఇప్పుడు  అతడికి ఆమెకన్నా ముఖ్య అవసరం మరొకటి వుంది. డ్రగ్!

    అది వాడి చాలాసేపయినా దాని ప్రభావం అతడిమీద బాగా చూపిస్తూ వుంది. మరికొంచెం సేపట్లో డ్రగ్ లేకపోతే అతడు పిచ్చెక్కేలా వున్నాడు.

    అంతలో అతడికి సునీత గుర్తొచ్చింది.


                                                   *    *    *

    "ఎందుకొచ్చావు?" అంది సునీత గాభరాగా.

    "ఊరికినే. ఏం, రాకూడదా ఆంటీ?" అన్నాడతను అమాయకంగా. ఆమె ఏమీ మాట్లాడలేదు. ప్రీతమ్ వెళ్ళి చనువుగా సోఫాలో కూర్చున్నాడు. కూర్చుంటూ ఏమిటి ఆంటీ? అంత గాభరా  పడుతున్నావు. ఎవరైనా ఇప్పుడొస్తారా" అనడిగాడు క్యాజువల్ గా.

    "అబ్బెబ్బే, ఎవరూ రారు" అంది.

    "నాకు చచ్చేటంత ఆకలిగా వుంది ఆంటీ, నీ చేతి ఉప్మా తిని చాలా రోజులైంది. చేసి పెడతావా?" అడిగాడు కాస్తదీనంగా.

    "అలాగే, ఇప్పుడే వస్తాను" అని ఆమె వంటింట్లోకి నడిచింది. రెండు  నిమిషాలాగి అతడు వంటింట్లోకి తొంగి చూశాడు. ఆమె కూర్చొని ఉల్లిపాయలు తరుగుతోంది. అతడు గబగబా బెడ్ రూంలోకి నడిచాడు.

    బీరువా తాళం దానికి వేలాడుతోంది. లాకర్ లో ఎక్కువ డబ్బులేదు. ప్రక్కన మరో చిన్న బాక్సు తెరిచాడు. అందులో గొలుసు, రెండు గాజులు వున్నాయి. అవన్నీ  జేబులో  వేసుకొని నెమ్మదిగా  బయటకొచ్చాడు.

    ఇప్పుడు సునీత స్టవ్ దగ్గర నిలబడి రవ్వ మూకుట్లో పోస్తోంది. అతడు వెనకగా వెళ్ళి ఆమెని వెనకనించి కౌగలించుకున్నాడు. ఆమె చిన్న విదిలింపుతో "బయట కూర్చో ప్రీతమ్. ఎవరైనా వస్తే బాగోదు" అంది. అతడు ఆమెని  వదలిపెట్టకుండా మరింత గట్టిగా హత్తుకుంటూ "ఎవరూ రారు. వస్తే తలుపు చప్పుడవుతుంది కదా" అన్నాడు.

    రెండు నిమిషాల తరువాత ప్రీతమ్ వచ్చి బయట సోఫాలో కూర్చున్నాడు. మరో అయిదు నిమిషాల తర్వాత ఆమె అందించిన ఉప్మా తిని, ధ్యాంక్స్ చెప్పి బయట పడ్డాడు. ఈసారి అతడు కనీసం ఆమె దగ్గరికి కూడా వెళ్ళలేదు. ముందే చెప్పినట్టు అంతకన్నా పెద్ద అవసరం మరొకటి అతడి కోసం ఎదురుచూస్తోంది.


                                         6


    ట్రెయిన్ ప్లాట్ ఫాం దాటి కనుమరుగయ్యేంతవరకూ అలాగే నిలబడి వుంది నిఖిత. కళ్ళల్లో నిండుకున్న నీళ్ళు ఒక్కొక్క చుక్కా క్రిందికి రాల్తున్నాయి. రాము వెళ్ళిపోయాడు. తల్లిదండ్రుల్ని తిరిగి చూడగలనో లేదో అన్న అనుమానం అతనికి ఇసుమంతైనా రాకుండా కుటుంబ సభ్యులందరూ జాగ్రత్తగా వ్యవహరించి సంతోషంగా అతడ్ని సాగనంపారు.

    కొన్ని క్షణాలపాటు నిఖితకి భయమేసింది. తను ఒంటరిగా మిగిలి పోయానన్న ఫీలింగ్ కలిగింది! కొండంత బరువుని నెత్తిన పెట్టుకొని కూడా చిరునవ్వుతో కదలాల్సిన పరిస్థితి అది. కానీ క్షణాల్లోనే ఆమె మామూలు మనిషైపోయింది. ఆలోచన నుంచి తేరుకొని బయట గేటువైపు నడుస్తోంది. అలవాటు ప్రకారం ఆమె  చూపులు షాపులో వేలాడబడ్డ పుస్తకాలమీద నిలిచిపోయాయి. అప్పుడే వచ్చిన పేపర్లని ఏజెంట్ క్లిప్స్ విప్పి తగిలిస్తున్నాడు. తన కళ్ళని తానే నమ్మలేనట్టు దగ్గరగా వెళ్ళి చూసింది నిఖిత. ఆమెని అంత విస్మయపరిచింది మొదటి పేజీలో ఫోటో.


                          *    *    *


    ఆంధ్రదీపం దినపత్రికలో విలేఖరిగా పని చేస్తోంది సాధన. సాధన నిఖితకి చిన్నప్పటి క్లాస్ మేట్.

     అలికిడికి తలెత్తిన సాధన ఎదురుగా నిల్చొని వున్న నిఖితని చూసి మొహం విప్పారగా  "నువ్వా? ఎంత కాలానికి! బాగున్నావా! కూర్చో" అంటూ సాదరంగా ప్రశ్నలు అడిగింది. నిఖిత కూర్చుంటూ "నేనొక  చిన్న పనిమీద వచ్చాను" అంది.

    "పత్రికల  వాళ్ళతో  మీకు పనేమిటబ్బా" నవ్వుతూ అడిగింది సాధన. నిఖిత చదువు మధ్యలో ఆపుచేస్తే సాధన జర్నలిజంలో డిగ్రీ తీసుకొని ఆ పత్రికలో చేరింది. గిరిజన హాస్టళ్ళలో అవకతవకలు, బాలికలపై అత్యాచారాలు అన్నే రుజువుల్తో బయటపెట్టి అప్పటికే మంచి పేరు తెచ్చుకుందామె.

    "ఏమిటీ విషయం? చెప్పు" అడిగింది. నిఖిత ఒక క్షణం  తటపటాయించి "నేను చెప్పేదంతా సత్యం కావచ్చు లేదా అసత్యం కావచ్చు. కానీ  ఇప్పుడు చెప్తున్నది మాత్రం ఈర్ష్యా అసూయలతో గాదు" అంది.

    "అసలు విషయం ఏమిటో చెప్పు నిఖితా!"

    "ఈ రోజు ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి చూశావు కదా!"

    "చూశాను".

    "అందులో ఫస్ట్ ర్యాంక్  వచ్చింది సుకుమార్ అని నా స్నేహితురాలి తమ్ముడు".

    "అయితే".

    "అతడు బి.యస్.సి.లో కూడా సీటు రాక బి.ఏ. చదువుతున్నాడు. అటువంటి వాడికి ఫస్ట్ ర్యాంక్  ఎలా వచ్చింది?"

    "దానిదేముంది ఈసారి బాగా చదివి వుండవచ్చు". 

    "అలా కొట్టిపడేయకు సాధనా. కొంచెం ఆలోచించు. అంతకు ముందు అతను రెండుసార్లు ఎంసెట్ కి వెళ్ళినా ర్యాంకు రాలేదు. అలాంటిది ఫస్ట్ ర్యాంక్! సరే, ఈ విషయం  పక్కన వుంచు. ఆ అబ్బాయి  అక్క మహతి నాతో మాట్లాడుతూ 'మా నాన్నగారు. అప్పుడు నాకు దాని అర్థంబోధపడలేదు ఇప్పుడు తెలుస్తోంది. ఒక  జర్నలిస్టుగా నువ్వు దీని వెనుక రహస్యాలు శోధించకూడదూ?"

    సాధన నిశ్శబ్దంగా వుండిపోయింది. నిఖిత చెప్పిన దాంట్లో పాయింట్ కనపడుతోంది. కానీ దీన్ని ఎలా తవ్వితీయటం? ఒక పత్రికా విలేఖరికి అది సాధ్యమవుతుందా?

    ఆమె మౌనాన్ని మరోలా  అర్థం చేసుకున్న నిఖిత అన్నది. "ఇదంతా నాకు సంబంధం లేని విషయం సాధనా. నేనూ ఒప్పుకుంటాను. నిజానికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నా స్నేహితురాలి తమ్ముడికి. పాపం అమాయకపు పిల్ల మహతి  నన్ను  నమ్మి ఈ విషయం చెప్తే, నేనిలాగ వీటిని పత్రికలకి ఎక్కించకూడదు. కానీ ఒక  గంటక్రితం జరిగిన సంఘటన ఒకటి చెప్తాను విను. నేను మా అన్నయ్యని ట్రైన్ ఎక్కించి స్టేషన్ నుంచి బయటి కొస్తున్నాను. అప్పుడే ఒక పదహారేళ్ళ కుర్రవాడు నా ముందునుంచి వేగంగా పరిగెడుతూ వెళ్ళిపోయాడు. వెనుకనుంచి అతడి తండ్రి'పట్టుకోండి, పట్టుకోండి' అంటూ అరుస్తూ వచ్చాడు. ఆ అబ్బాయి ఆగలేదు. మాకెవరికి ఏమీ అర్థంకాలేదు. 'బాబూ వద్దు, ఆగు' అంటూ ఆయన ఏడ్చేస్తున్నాడు. అందరూ చూస్తుండగానే ఆ పిల్లవాడు స్పీడుగా వస్తున్న బస్సుకి అడ్డంగా పరిగెత్తి, బస్ క్రిందపడి మరణించాడు. ఒకరకంగా అది ఆత్మహత్యయే. ఆ విషయం మా అందరికీ తెలుసు.

    మేమందరం అక్కడికి హడావుడిగా వెళ్ళాం. తండ్రి ఏడుస్తూ చెపుతున్నాడు 'ఎంతో కష్టపడి చదివాడు బాబూ. చాలా బాగా వ్రాశాడు. ఫస్ట్ ర్యాంకు రాకపోయినా, వందోర్యాంకు లోపలే వస్తుందని అందరం నమ్మాం. కానీ, ఆ వెధవ ఎంసెట్ లో రెండువేల పైన ర్యాంకు వచ్చింది. భరించలేకపోయాడు. అందుకే....." అంటూ ఏడవసాగాడు. నిఖిత చెప్పటం ఆపింది. సాధన ఆమెవైపు బ్లాంక్ గా  చూసింది. ఇద్దరి మనసుల్లోనూ ఒకటే ఆలోచన-ఈ దేశం ఎటు పోతుందా అని! "చెప్పు సాధనా, నేనిలాగ నిన్ను కోరటంలో తప్పేదైనా వుందా?" అడిగింది నిఖిత.

    "లేదు, ఈ విషయం నువ్వు పూర్తిగా మర్చిపో. నేను లోతుగా తవ్వి ఈ రహస్యం బయట పెట్టేవరకూ విశ్రమించను" అంది సాధన పట్టుదలగా.

   
                         *    *    *

    వారంరోజుల వరకూ ప్రీతమ్ భయం భయంగానే గడిపాడు. సునీత ఇంటికి తను వెళ్ళినట్టు, నగలు పోయినట్టు తండ్రికి చెపుతుందేమో అనుకున్నాడు. చెపితే తండ్రి ఆ విషయమై నిలదీస్తే ఏం చెప్పాలో కూడా రకరకాలుగా వూహించుకున్నాడు. "నేను దొంగతనం చేశానా? అలా అని సునీత ఆంటీ చెప్పిందా? పద అడుగుదాం. వెంట మమ్మీని కూడా తీసుకెళ్దాం" అని ధైర్యంగా అనాలి. దాంతో తండ్రి ఏం  మాట్లాడలేడు. సునీత నగలు పోయిన విషయం "తండ్రికి" చెపుతుందేమో అన్న అనుమానం వుంది కానీ, పోలీస్ రిపోర్ట్ మాత్రం ఇవ్వదని అతని కెందుకో గట్టిగా నమ్మకం వుంది.

    వారంరోజులు గడిచాయి. తండ్రి తనని ఆ విషయం అడగకపోయేసరికి ప్రీతమ్ కి భయం చాలావరకు  తగ్గిపోయింది. సునీత  ఆ విషయం తండ్రికి చెప్పినా, తండ్రి మమ్మీకి భయపడి తనతో  ఆ విషయం ప్రస్తావించలేదు అనుకున్నాడు. కానీ నిజానికి జరిగింది అదికాదు. ప్రీతమ్ వచ్చి వెళ్ళిపోయాక సునీత చాలాసేపటివరకు వంటింట్లోనే పని చేసుకుంటూ వుండిపోయింది. ఇన్నాళ్ళ తరువాత అతడు తనను వెతుక్కుంటూ వచ్చి (కేవలం) టిఫిన్ తిని వెళ్ళిపోవటం ఆమెకి అంతుపట్టలేదు. 'ఇంకొకసారి ఇలా రావద్దు' అని గట్టిగా ఆమె చెప్పకపోవటానికి కారణం కూడా అదే.

    ఆ మధ్యాహ్నం ఆమె భోజనం చేసిన తరువాత బెడ్ రూం లోకి వెళ్ళి మంచంమీద వాలుతూ వుండగా ఎదురు బీరువా సగం తెరిచి కనిపించింది. అనమానం వచ్చి తీసిచూస్తే లోపల లాకర్లో పెట్టె కనపడలేదు. అప్పుడర్థమైంది. ఆమెకి ప్రీతమ్ ఎందుకొచ్చాడో! డబ్బుతోపాటు నగలుకూడా పోవటంతో ఆమెకి కంగారుపుట్టింది. వెంటనే కృష్ణమూర్తికి ఫోన్ చేసింది.

    "మధ్యాహ్నం ప్రీతమ్ వచ్చాడు" అంది ఇంకెలా మొదలు పెట్టాలో అర్థంకాక. అట్నుంచి కృష్ణమూర్తి కంగారుగా" ఎందుకొచ్చాడు? నేనక్కడికి తరచుగా వస్తున్నట్టు వాడికేమైనా అనుమానం వచ్చిందా?" అడిగాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra