Home » Dr. dasaradhi rangacharya » Sukla Yajurveda Samhitha


    అత్యంత గర్జనకారి మేఘముల ఉదరములందు శయనించు వర్షజలమును రాల్చుటకు దానిని కరింతును. సుఖకరవర్షము కలిగించుటకు నేను నిన్ను ద్రవింపచేయుదును. అత్యంత ఆనందకర జలముల వర్షము కొరకు నిన్ను ద్రవింపచేయుదును. శుద్ధమగునిన్ను శుద్ధ 'నిగ్రాభ్య' జలములందు కలుపుదును.

    సోమమా! నిన్ను పగటియందును -సూర్యుని కిరణములందును - లీనము చేయుదును.

    49. సోమమా! నీవు శ్రేష్ఠమవు. ఆదిత్యస్వరూపవు. ఎంతో శోభిల్లుదానవు. మహానుడును శుద్ధఆదిత్యుడు నీకు పురోగామి.

    సోమః సోమస్య పురోగాః - సోమమే సోమమునకు పురోగామి

    సోమమా! నీపేరే అహింసనీయము - జాగరణ శీలము - అందుకే నిన్ను నేను పూజించుచున్నాను. సోమాయ స్వాహా. (అదాభ్యమున ఉన్న సోమమునకు ఆహుతి ఇవ్వవలెను.)

    50. (రోటియందున్న సోమఖండములను సోమమున వేయవలెను)

    సోమమా! నీవు అందరిని వశమునందు ఉంచుకొనుదానవు. ఇంద్రునకు ప్రియ భోజనమవగుము. (మూడవ ఖండమును వేయవలెను)

    51. (దీక్షగొను యజమానులచే అధ్వర్యు గార్హ పత్యాగ్నిలో ఘృతము అర్పింపచేయవలెను)

    గోవులారా! మీరు ఈ యజమానులందే ప్రసన్నులు కావలెను. మీరు ఇచటనే ఆనందించండి. మీరు ఈ  యజమానులందే ఆనందించవలెను. మీ దూడలు మున్నగునవి సహితము ఈ యజమానులందే సంతోషించవలెను. స్వాహా (రెండవ ఆహుతి అర్పించవలెను)

    మాత పృథ్వి మాకు లభించవలెను. భూమి మీది అగ్ని మాకు లభించవలెను. అశ్వ గోధనములు మాకు లభించవలెను - స్వాహా (మూడవ ఆహుతి అర్పించవలెను)

    52. ఇది యజామానుల ఆత్మస్తుతి)

    సోమమా! నీవు యజ్ఞపు సాక్షాత్ సమృద్ధివి. మేము నీవలన ఆదిత్యరూప జ్యోతిని చేరుకున్నాము. ఇప్పుడు మేము ఆజన్మాంతము ధర్మాచరణులము అయినాము. మేము పృథ్వి నుండి ఎగిరినాము. స్వర్గమును. ఆరోహించినాము. దేవతలమ తెలిసికున్నాము. దివ్యజ్యోతిని దర్శించినాము.

    53. (ఒకే యజ్ఞపు పెక్కురు యజమానులు హవిర్ధాన శకటము క్రింద దూరి తూర్పు ముఖముగా బయటికి రావలెను)

    ఇంద్రావజ్రమా! మీరు శత్రువు  ముందునిలిచి పోరాడగలవారు. మామీద సేనను నడిపించు శత్రువును వధించండి. వానిని వజ్రమున హతమార్చండి. మాకు శత్రువైనవాడు గహనాటవినదాగినను జలము లందు దాగినను - ఇంద్రా! వానిని పరిమార్చుము.

    ఇంద్రా! మాకు నలుదిశల ఉన్న శత్రువును నాశము చేయుము.

    వజ్రమా! సర్వత్రసంచరించు శత్రువులను హతమార్చుము.

    భూమి, స్వర్గము, అంతరిక్షములందు ఆనందమయుడవై ఉన్న పరమాత్మా! మేము సుప్రజలము. మేము సుప్రజావంతులము కావలెను. అన్నాదుల సమృద్ధికలిగి స్వప్రజను పోషించువారలము కావలెను.

    54. (సోమము దేవతా స్వరూపము. ఉపయోగముననుసరించి పేర్లు మారును)

    1. యజమాని 'సోమరసమున యజ్ఞము చేయుదును' అనిన సోమము 'పరమేష్ఠి' అగును.

    2. 'ఇప్పుడు నేను సోమరసమున యజ్ఞము చేయుచున్నాను' అని యజమాని అన్నప్పుడు 'ప్రజాపతి' అగును.

    3. ఇంద్రాది దేవతల నిమిత్తమైన సోమము 'అంధస్సు' అగును.

    4. దానము చేయు సోమము 'సవిత' అగును.

    5. దీక్షనందుకున్నప్పటి సోమము 'విశ్వకర్మ' అగును.

    6. గోవును ఇచ్చి ఖరీదు చేసిన సోమము 'పూష' అనబడును.

    (పరమేష్ఠి, ప్రజాపతి, అంధస, అంధస-సవిత- విశ్వకర్మ- పూషాలకు ఆహుతులు అర్పించవలెను)

    55.7. కొనుటకు ఎత్తినసోమము 'ఇంద్రమరుత్' అగును.

    8.క్రయముచేయబడుచున్న సోమము 'అసురము' అగును.

    9. ఖరీదు చేసిన సోమము 'మిత్ర' అగును.

    10. యజమాని తొడపై నిలిచిన సోమము 'శిపివిష్ఠి' విష్టువు' అగును.

    11. బండిమీద కొనిపోబడు సోమము 'జగత్పాలక' 'విష్ణువు' అగును.

    (ఇంద్ర, మరుత - అసుర - మిత్ర - శిపివిష్ఠివిష్ణు - జగత్పాలక విష్ణువులకు ఆహుతులు అర్పించవలెను)

    56. 12. బాణలి నుండి దింపిన సోమము 'వరుణ' అనబడును.

    13.  అటక మీద ఉన్న సోమము 'అగ్ని' అనబడును.

    14.అగ్నీధ్రమునందలి సోమము 'ఇంద్ర' అనబడును.

    15. 'హృదయేత్వా, మనస్తేత్వా' అనుమాంత్రమున ముక్కలు చేసి తెచ్చిన సోమము "అధర్వ" అనబడును.

    (వరుణ - అగ్ని -ఇంద్ర - అధర్వలకు ఆహుతి అర్పించవలెను)

    57.16. ముక్కలు ముక్కలుగా తరిగిన సోమము 'విశ్వదేవ' నామకము.

    17. వర్ధిల్లి తన భక్తులను పాలించు సోమము 'విష్ణు' నామకము.

    18. అభిషవించబడు సోమము 'యమ' నామకము.

    20. దశాపవిత్రమున పవిత్రమను సోమము "వాయు" నామకము.

    21. పావనము చేయబడిన సోమము'శుక్ర' నామకము.

    22. పాలతో కలసిన సోమము కూడ 'శుక్ర' నామకము.

    23. సత్తుచే కలసిన సోమము 'మంథ' నామకము.

    (విశ్వదేవ - వర్ధనవిష్ణు - యమ - పోషకవిష్ణు - వాయు - పావన శుక్ర - దుగ్ధశుక్ర - మంథిలకు ఆహుతి అర్పించవలెను)

    58.24. గృహపాత్రములందున్న సోమము 'విశ్వేదేవ' సంజ్ఞకము.

    25. హొమము కొరకగు సోమము 'అసు' సంజ్ఞకము.

    26. హొమము చేయునప్పటి సోమము 'రుద్ర' సంజ్ఞకము.

    27. హుతశేషమై - భక్షణార్థము - సభామండపమునకు తెచ్చిన సోమము 'వాత' సంజ్ఞకము.

    28. ఆహ్వానాదులచే - ఆరగించుటకు అర్పించిన సోమము 'నృచక్ష' సంజ్ఞకము.

    29. పానము చేయుబడుచున్న సోమము 'భక్ష' సంజ్ఞకము.

    30. పానము చేసిన తరువాత 'జఠర' మందున్న సోమము 'నరాంశంస' సంజ్ఞకము.

    (విశ్వదేవ -అసు- రుద్ర - వాత- నృచక్ష - భక్ష- నరాశంసములకు ఆహుతులు అర్పించవలెను)

    59.31. అపభృత స్నానమునకు సిద్ధమైన సోమము 'సింధు' సంజ్ఞకము.

    32. జలాభిముఖముగా తెచ్చినసోమము 'సముద్ర' సంజ్ఞకము.

    33. జలనిమగ్నసోమము 'సలీల' సంజ్ఞకము.

    (సింధు - సముద్ర - సలిలములకు ఆహుతులు అర్పించవలెను)

    విష్ణువు మరియు వరుణుని ఓజోబలముననే ఈ లోకములు - లోకాంతరములు నిలిచిఉన్నవి. వారు తమ బలవీర్యములచే అందరిని మించిన బలవంతులైనారు. వారిని శత్రువు ఏనాడును ఓడించలేదు. తమ శక్తివలన వారు శత్రువు యొక్క సమస్త సంపదలను సాధించినారు.

    విష్ణు, వరుణులారా! యజ్ఞమునకు శీఘ్రముగా విచ్చేయండి. ఇదే మిమ్ము ఆహ్వానించుచున్నాము.

    60. ఈ యజ్ఞము ద్యులోకమున దేవతలకు అందినది. ఆ దేవతల దయవలన యజ్ఞఫలమగు విశేషధనము మాకు అందవలెను.

    అంతరిక్షమునకు చేరిన యజ్ఞము మానవులకు - వర్షరూపమున -అందినది. అంతరిక్షమునుండి నాకు వర్షధనము లభించవలెను.

    యజ్ఞము భూమినుండి సాగిపితరులను చేరినది. ఆపృథ్వినుండి నాకు స్వర్ణాదిధనములు లభించవలెను.

    ఇంత ఏల! యజ్ఞము ఏ లోకమునకు చేరిన ఆ లోకపు శుభములు యజమానికి అందవలెను.
   
    61. (యజ్ఞమున జరిగిన లోపములకు గాను 54 నుండి 60 వ మంత్రము వరకు 34 దేవతల పేర ప్రాయశ్చిత్తము చేసికొనుట జరిగినది. ఇది మహావీరఘటము పగిలినందుకు ప్రాయశ్చిత్తము)

    ప్రాయశ్చిత్త శమనము జరిగినది. ముప్పది నలుగురు దేవతలు ఫలదాయక తంతువులను విస్తరింతురు. ఈ యజ్ఞము నందలి అన్నమున ఆ దేవతలు సంతృప్తులయినారు. మహావీరఘటము పగులుట వలన విచ్ఛిన్నమైన యజ్ఞమును - ఆ దేవతలకు సమర్పించు ఈ ఘృత  ఆహుతివలన సంధించుచున్నాను - స్వాహా. ఇక ఈ మహావీర ఘటము సూర్యస్వరూపమై దేవతలందు చేరవలెను.

    62. (యజమానిచే అనిపించవలసినది)

    యజ్ఞమునందు ఆహుతులు ఇచ్చినాము. అట్టి ఆహుతుల శుభఫలము వివిధరూపముల వ్యాపించినది. అది-ఆ ఫలము -దిశాభేదమున- ఎనిమిది ప్రకారములు అయినది.

    యజ్ఞమా! నీవు నాప్రజలకు మహాధనమును ప్రసాదించుము. మేము ధనమును- పోషణ సాధనములగు అన్నాదులను- ఆయుష్యమును అందుకుముగాక. స్వాహా "సయజ్ఞధుక్ష్య మహిమే ప్రజాయాం రాయస్పోషాం విశ్వమాయురశీయ స్వాహా".

    ఆపవస్వ హిరణ్యవదశ్వవత్సోమ వీరవత్
    వాజంగోమన్త మాభరస్వాహా.

   

                        దాశరథి రంగాచార్య విరచిత
              శ్రీమదాంధ్ర వచన శుక్ల యజుర్వేద సంహితయందలి
         గ్రహగ్రహాన్నిమిత్తాంతమగు ఎనిమిదవ అధ్యాయము ముగిసినది.
                       సర్వేపి సుఖినస్సంతు

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra