Home » Yandamuri veerendranath » అతడు ఆమె ప్రియుడు


    సిరిచందన కూడా ప్రతిఘటించే ప్రయత్నం ఏమీ చేయలేదు. ఆ అడవిలో గట్టిగా అరిచినా ఎవరికీ వినబడదని తెలుసు. అందుకనే అలా ఒక  రాతికి అనుకొని కూర్చుండిపోయింది.

    ఫోన్ చేసి వచ్చిన ఇబ్రహీంఖాన్  శాస్త్రితో జరిగింది చెప్పాడు. సిరిచందన కూడా అదంతా విన్నది. మహర్షి తనని తీసుకెళ్ళటానికి వస్తున్నాడని తెలిసినప్పుడు  మాత్రం ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. తను ఇంత అపాయకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు తనని తీసుకెళ్ళటానికి భర్త రాకుండా, ఇంకెవర్నో పంపిస్తున్నాడని విని ఆమె మనసు గాయపడింది.

    ఈ లోపులో ఇబ్రహీం శాస్త్రితో డూప్లికేటు బిస్కెట్స్ విషయం అనుమానం కూడా చెప్పాడు.

    "ఇప్పుడు చేయవలసిన ప్రోగ్రాం చెప్తాను విను. నేను ఆ మహర్షి అనే అతను ఇచ్చిన బిస్కెట్స్ ని అక్కడే పరిశీలిస్తాను. అవి ఏ మాత్రం  డూప్లికేట్ వి అయినా అతన్ని అక్కడే చంపేస్తాను. నా రివాల్వర్ శబ్దం విని, కంగారుపడి వెంటనే సిరిచందనని తీసుకొని అక్కడికి రాకు. ఒకవేళ రివాల్వర్ శబ్దం వినబడకపోతే నేను  బ్రీఫ్ కేసులు పట్టుకొని మీ దగ్గరకొస్తాను, ఇట్నుంచి మనం వెళ్ళిపోవచ్చు."

    "మరి.....ఈ అమ్మాయి?" అడిగాడు శాస్త్రి.

    ఇబ్రహీం సిరిచందనవైపు చూస్తూ, "అది మన  బాధ్యత కాదు. నడుచుకుంటూ రోడ్డు వరకూ వెళ్ళి ఏ లారీయో ఎక్కి  వెళ్ళిపోతుంది" అన్నాడు.

    "ఒకవేళ ఆ మహర్షితోపాటు పోలీస్ డిపార్ట్ మెంట్ కూడా 'మాటు' వేస్తే మన పని కష్టమవుతుంది. మనం  మహర్షి కార్లో బైలుదేరీ  వెళితే, కొంతదూరం ప్రయాణం చేసి కారునీ, ఈ అమ్మాయినీ వదిలేయ్యొచ్చు. ఈ అమ్మాయి మనతో వుంటే సేఫ్" అన్నాడు శాస్త్రి. నిజానికి ఇబ్రహీం కన్నా శాస్త్రి తెలివైనవాడు. కానీ, శాస్త్రి తెలివితేటల్ని ఒప్పుకోవటానికి ఖాన్ కి అహం అడ్డొచ్చింది. "అవన్నీ నేను ఆలోచిస్తాను. చెప్పింది చెయ్" అన్నాడు కసురుకుంటున్నట్టు....."రివాల్వర్ శబ్దం విని కంగారుపడకని చెపుతున్నాను."

    శాస్త్రి కన్నా ఖాన్ బలంగా, ఎత్తుగా ఉంటాడు. అందువల్ల అతను చెప్పినమాట శాస్త్రివినక తప్పలేదు, "సరే నీ ఇష్టం" అన్నాడు. పదిన్నర వరకూ ఇద్దరూ డ్రింక్ చేస్తూ కూర్చున్నారు. పదిన్నరకి ఖాన్ బయలుదేరుతూ "జాగ్రత్త" అని మరోసారి హెచ్చరించి అరకు రోడ్డువైపు కొండదిగాడు. అతను వెళ్ళిన అయిదు నిమిషాలకి సిరిచందన మొట్టమొదటిసారి మాట్లాడుతూ "నాకెందుకో ఈ ఖాన్ ని చూస్తే అనుమానంగా ఉంది" అంది.

    అప్పటికే ఎనిమిదో పెగ్ డ్రింక్ లో వున్న శాస్త్రి "ఎందుకని?" అనిఅడిగాడు బొంగురుగా.

    "నా భర్తకి అతను ఫోన్ చేసినప్పుడు నా భర్త అతనితో బ్రీఫ్ కేస్ లలో డూప్లికేట్ బిస్కెట్స్ ఉండే అవకాశం వుంది అని చెప్పినట్టు ఇతను మనకి చెప్పాడు. ఏ పోలీసాఫీసరూ కిడ్నాపర్ కి ఆ విధంగా చెప్పడు" అంది.

    శాస్త్రికి ఆమె చెబుతున్న దాంట్లో నిజం ఉన్నట్లు తోచింది. "నిజమే" అన్నాడు...... "కానీ నీ భర్త ఊహించినట్టు మధ్యలో డ్రైవర్ ఆ బిస్కెట్స్ మార్చొచ్చు కదా?"

    "అతడు డ్రైవర్ కాదు, నా క్లాస్ మేట్ మహర్షి! బాగా చదువుకున్నవాడు" అంది సిరిచందన. "....అంతేకాకుండా ఇందులో ఇంకొక పాయింట్ కూడా వుంది/ డెభ్బై అయిదు పోలీసులు ఈ బ్రీఫ్ కేసుల్ని ఏ రాత్రి తొమ్మిదిన్నరకో అందజేస్తారు. అతను పదకొండింటికల్లా తీసుకొచ్చి ఇక్కడ అందజేయాలి. ఈ లోపులో అదే సైజు డూప్లికేట్ బిస్కెట్లు తయారు చేయించి బ్రీఫ్ కేస్ లో మార్చటం మహర్షికి సాధ్యంకాదు."

    "కరెక్ట్" అన్నాడు శాస్త్రి సాలోచనగా. "మరి మీ ఆయన ఈ విషయం ఎందుకు చెప్పి వుంటాడంటావ్?"

    "ఈ విషయం నా భర్త చెప్పి వుండడు. ఇదంతా ఇబ్రహీం ఆడుతున్న నాటకమని నాకనిపిస్తోంది" అంది సిరిచందన.

    శాస్త్రి తెల్లబోయి చూశాడు. అతడి కింతవరకూ ఈ ఆలోచన రాలేదు. సిరిచందనతో ".....ఇబ్రహీం అలా అబద్ధం చెప్పవలసిన అవసరం ఏముంది?" అన్నాడు. ఆమె తన పార్టనర్ అయినట్టు, తన ఆలోచన ఆమెతో పంచుకుంటూ.

    సిరిచందన అంది. "నా ఉద్దేశ్యం ప్రకారం పదకొండు గంటలకి మనకి  రివాల్వర్ శబ్దం వినిపిస్తుంది. ఆ తీసుకొస్తున్న డ్రైవర్ని ఇబ్రహీంఖాన్ చంపేస్తాడు. వీలైతే ఆ బ్రీఫ్ కేసులు పట్టుకుని తనొక్కడే కార్లో వెళ్ళిపోతాడు. లేదా ఈపాటికే ఇబ్రహీంఖాన్ డూప్లికేట్ బిస్కెట్స్ తయారుచేయించి బిస్కెట్లని ఇక్కడికి తీసుకొస్తాడు. మనకేమో ఆ కారు డ్రైవరే డూప్లికేట్ బిస్కెట్స్ తీసుకొచ్చినట్లు, అందువల్ల తను అతన్ని చంపేసినట్లు చెప్తాడు."

    శాస్త్రికి ఈ వాదన నూరుశాతం కరెక్టనిపించింది.

    "మరేం చేద్దాం" అన్నాడు.

    "మనిద్దరం కూడా అక్కడికి వెళ్దాం" అంది సిరిచందన. ".....దూరం నుంచి ఏం జరుగుతుందో చూద్దాం. ఇబ్రహీంఖాన్ గాని ఒరిజనల్ బిస్కెట్స్ తీసేసుకొని డూప్లికేట్ బ్రీఫ్ కేసులు ఆ స్థానంలో పెడితే నువ్వు అతన్నేం చేయాలో అక్కడికక్కడే నిర్ణయం తీసుకోవచ్చు. ఏది ఏమైనా అక్కడ జరుగుతున్నది ప్రత్యక్షంగా చూస్తేకాని ఇబ్రహీంఖాన్ నిజాయితీ నీకు తెలియదు."

    శాస్త్రి మరి ఆలోచించలేదు. "అవును పద" అంటూ ఆమె దగ్గరికొచ్చి, ఆమె కాళ్ళకున్న కట్లు విప్పుతూ, రివాల్వర్ ఆమెవైపు గురిపెట్టి "నడువ్" అన్నాడు.

    సిరిచందనకి సంతోషం వేసింది, మహర్షి బ్రీఫ్ కేసులు తీసుకొని వస్తున్నాడని తెలిసినప్పటి నుంచి ఆమె  మనసు మనసులో లేదు. ఒకవేళ పోలీసులే ఏదైనా మాస్టర్ ప్లాన్ వేసి డూప్లికేట్ బిస్కెట్స్ పంపించి వుంటే, దానికి బలి అవ్వవలసింది మహర్షి అని తెలిసినప్పటి నుంచి అతన్ని ఎలాగైనా రక్షించాలని ఆమె మనసులో అనుకుంటూ వచ్చింది. కరెక్టుగా ఆమె చెప్పిన తర్కానికి, శాస్త్రి దాన్ని నమ్మి ఈ విధంగా ప్లాన్ మార్చటం ఆమెకి చాలా సంతోషాన్నిచ్చింది.

    నిజంగా మహర్షి ఒరిజినల్ బిస్కెట్లే తీసుకొచ్చి అందజేసిన పక్షంలో ఏ అపాయమూ జరగదు. లా కాకుండా ఒకవేళ ఇబ్రహీంఖానే ఈవిధంగా నాటకం ఆడుతున్న పక్షంలో మహర్షి ప్రాణాలు పోవటం ఖాయం. ముందు మహర్షిని తను రక్షించుకోవాలి. అన్నిటికన్నా అది ముఖ్యం.

    .....అలా అనుకుంటూ ఆమె నడవసాగింది. వెనకే రివాల్వర్ తో శాస్త్రి నడుస్తూ వస్తున్నాడు.

    అప్పటికే అతడు దాదాపు పూర్తి సారా తాగి వుండటంతో కాలు కొంచెం బెణికి మనిషి తూలాడు. అది చిన్న కొండప్రాంతం అవటంవల్ల ఆ తూలటంతో అతను రెండుసార్లు దొర్లుతూ క్రిందకి జారసాగాడు. అతడి చేతిలో రివాల్వర్ అప్రయత్నంగా పేలింది.

    ఆ శబ్దానికి వెనుతిరిగి చూసిన సిరిచందనకి శాస్త్రి గట్టు మీద నుంచి క్రిందకి దొర్లుతూ ఉండటం కనబడింది. ఆమె క్షణం కూడా వృధా చేయదల్చుకోలేదు. మొత్తం బలాన్నంతా కాళ్ళల్లోకి తీసుకొని పరిగెత్తింది. జరిగిందేంటో గ్రహించి శాస్త్రి నిలదొక్కుకొని రాయి పట్టుకొని లేచి నిలబడే లోపులోనే , ఆమె చీకట్లో అదృశ్యమయ్యింది.

    డెభ్బై అయిదో కిలోమీటర్ రాయిదగ్గర నిలబడి ఉన్న ఇబ్రాహీంఖాన్  కి దూరంనుంచి రివాల్వర్ శబ్దం వినిపించింది. అది శాస్త్రి పేల్చిందే అని తెలుసు. అయితే అతడికి జరిగిందేమిటో అర్థంకాలేదు. శాస్త్రి సిరిచందనని కాల్చేశాడా అనుకున్నాడు. కోపంతో, చిరాకుతో అతడి నుదుటి నరాలు ఉబికాయి. వెనుతిరగబోయాడు. అదే టైంకి రోడ్డు మీద దూరంగా వస్తూ ఒక వెహికల్ కనబడింది.

    సిరిచందనగానీ, శాస్త్రి గానీ బ్రతికున్నారా లేదా అని అతడు ఆలోచించలేదు. వాళ్ళిద్దరూ చచ్చిపోయినా కూడా అతడి కొచ్చే నష్టం ఏం లేదు. కాబట్టి, అతడు ఆ కిలోమీటర్ రాయి దగ్గరే నిలబడి ఉన్నాడు. ఇంతలో వెహికల్ నెమ్మదిగా వచ్చి అక్కడ ఆగింది. అందులోంచి మహర్షి దిగి బ్రీఫ్ కేసులు రెండూ బయట పెట్టాడు.

    ఇబ్రహీంఖాన్ చెట్టు వెనుకనుంచి గట్టిగా అరిచాడు. "నువ్వు అలాగే వంద అడుగులు వెనక్కి నడిచి దూరంగా నిలబడి ఉండు. ఈ బ్రీఫ్ కేసుల్లో బిస్కెట్లు ఉన్నాయో లేదో నేను చూస్తాను" అన్నాడు.

    మహర్షి అదే విధంగా దూరంగా నిలబడ్డాడు. చెట్టుచాటు నుంచి ఇబ్రహీంఖాన్ వచ్చి బ్రీఫ్ కేసుల్ని తీసుకొని తిరిగి చెట్టుచాటుకి వెళ్ళాడు. వాటిల్ని విప్పి తన దగ్గర ఉన్న పరికరాల్తో పరీక్షించాడు. మొదటి నిమిషంలోనే అవి  డూప్లికేట్ వని తెలిసిపోయింది. అతడి మొహం కందగడ్డలా మారింది. రివాల్వర్ చేతిలోకి తీసుకున్నాడు. చెట్టుచాటునుంచే మళ్ళీ అరిచాడు. "మహర్షీ! బ్రీఫ్ కేసుల్లో బిస్కెట్లు సరిగ్గానే  ఉన్నాయి. నీవు  తిరిగి కారు దగ్గరికి రావచ్చు" అంటూ అతను రేంజీలోకి రాగానే షూట్ చేయటానికి వీలుగా రివాల్వర్ ఎత్తి  పట్టుకున్నాడు. గాయపర్చి నిజం కక్కించాలని ఖాన్ ఉద్దేశ్యం.

    అయితే మహర్షి వెనక్కి తిరిగి రాలేదు.

    "నువ్వు వెనక్కి రావచ్చు" అని గట్టిగా అరిచాడు.

    అట్నుంచి ఏ అలికిడీ లేదు.

    ఇబ్రహీంఖాన్ కళ్ళు చిట్లించి చూశాడు. అక్కడ ఏమీ కనపడలేదు. మళ్ళీ గట్టిగా "మహర్షీ, ఇదిగో సిరిచందన ఇక్కడే ఉంది వచ్చి తీసుకెళ్ళు" అని అరిచాడు. అతనిలో కోపం క్షణ క్షణానికి పెరిగిపోసాగింది. మహర్షి కనిపిస్తే కాల్చివేయటానికి సిద్ధమయ్యాడు. మహర్షి వస్తున్న జాడేమీలేదు. ఈసారి కోపం స్థానే కంగారు ఎక్కువైంది ఇబ్రహీంకి. ఏదో జరిగిందని తెలుసు. కానీ ఏం జరిగిందో తెలియటం లేదు. ఇలా డూప్లికేట్ బిస్కెట్స్ ఉన్న బ్రీఫ్ కేసు తనకిచ్చి వెళ్ళిపోవటంలో మహర్షి ఉద్దేశ్యం ఏమై ఉంటుంది?

    రవితేజ భార్య ప్రాణాలు ఎలాపోతే తనకేం అని ఒరిజనల్ బిస్కెట్స్ తీసుకొని చీకట్లో మాయమైపోయాడా?

    అలాంటి ఉద్దేశ్యం ఉన్నవాడు అసలు కార్లో ఇంతదూరం ఎందుకొస్తాడు? అట్నుంచి అటే అదే కార్లో మాయమైపోవచ్చుగా అని మళ్ళీ అనుకున్నాడు. ఎదురుగా ఉన్న డూప్లికేట్ బిస్కెట్లు తనని పరిహసిస్తున్నట్లు కనబడ్డాయి. వాటిని కాలితో బలంగా తన్నాడు. మళ్ళీ ఇంకొకసారి గట్టిగా "మహర్షీ" అని అరిచాడు.

    సమాధానంగా 'నిశ్శబ్దం' నవ్వినట్లు అనిపించింది. రివాల్వర్ జాగ్రత్తగా పట్టుకొని అతడు అడుగులో అడుగువేసుకుంటూ కారు దగ్గరికొచ్చాడు. సరిగ్గా  అదే టైంకి రోడ్డుకి అవతలి పక్కన అలికిడయ్యింది. చప్పున రివాల్వర్ అటు తిప్పాడు.

    దూరంనుంచి శాస్త్రి వస్తూ కుంటుతూ కనబడ్డాడు! ఇబ్రహీంకి ఏమీ అర్థంకాలేదు. అతడు రెండడుగులు వేసి "ఏమైంది?" అన్నాడు.

    "శాస్త్రి మొహం పాలిపోయివుంది. తాగిన మత్తంతా దిగిపోయింది. "సిరిచందన పారిపోయింది" అన్నాడు.

    "వ్వాట్?"

    "అవును."

    "ఆవిడ కాళ్ళకి కట్లెందు కిప్పావ్?"

    శాస్త్రి సమాధానం చెప్పలేదు.

    "నాకు రివాల్వర్ శబ్దం వినిపించింది, ఏమిటది?" అని అడిగాడు ఇబ్రహీం.

    "నేనే పేల్చాను" అన్నాడు శాస్త్రి.

    "ఎందుకు?"

    "ఆవిడ పారిపోతూ ఉంటే" అబద్ధం చెప్పాడు.

    "ఇడియట్! నేనడిగింది ఆవిడ కాళ్ళకి కట్లెందుకు విప్పావ్ అని"

    "ఇద్దరం కలిసి ఇక్కడికొద్దాం అనుకున్నాం" అన్నాడు శాస్త్రి.

    "మన ఒరిజినల్ ప్లాన్ లో అది లేదుగా" కోపాన్ని అనుచుకుంటూ అన్నాడు ఇబ్రహీం.

    "లేదు. కానీ ఇక్కడేం జరుగుతుందో చూద్దామని"

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra