Home » Mainanpati bhaskar » వేగు చుక్క



    ఒక మలుపు తిరగగానే పాదాలు రాళ్ళుగా మారిపోయినట్లు ఆగిపోయారు అనూహ్య, సాగర్.

    వేలకి వేలత్రాచులూ, మిన్నాగులూ, కొండ చిలువలూ ఒకదాన్ని ఒకటి పెనవేసుకు ఉన్నా అంత వళ్ళు జలదరించేలా ఉండేది కాదా దృశ్యం.

    దాన్ని మించి ఉంది అక్కడ కనబడుతున్నది.



                                        18


    కుంభకర్ణుడిలా నిద్రపోతున్నట్లు నటిస్తూనే, జరుగుతున్నదంతా గమనిస్తున్నాడు డ్రాకులా చాంగ్. అర్దరాత్రిపూట సాగర్  లేవడం, అనూహ్యని తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా ఎక్కడికో వెళ్ళిపోవడం అతనికి తెలుస్తూనే ఉంది.

    అయినా అతను లేచి వాళ్ళను వెంబడించే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు.

    వికృతమైన నవ్వుతో వంకర తిరిగాయి అతని మొద్దు పెదిమలు.

    మెల్లిగా లేచింది స్వరూప. నిద్రపోతున్న భర్తవంక ఒకసారి చూసి, చాంగ్ దగ్గరికి వచ్చింది.

    "వాళ్ళని అలా వెళ్ళిపోనిచ్చావేం?" అంది గుసగుసగా.

    "అయితే నువ్వుకూడా మేలుకునే ఉన్నావన్నమాట?" అన్నాడు చాంగ్. అతని చెయ్యి ఆమె వంటిని చనువుగా తడుముతోంది.

    నువ్వు పక్కనుంటే నిద్రెలా పడుతుంది!" అంది స్వరూప మత్తుగా వళ్ళు విరుచుకుంటూ.

    "ఫకర్, ఇబూకా, ప్రోఫెసరూ ఏరి? వీళ్ళుకూడా కనబడకుండా పోయారేమిటి?"

    "ఫకరూ, ప్రోఫెసరూ, ఏమయిపోయారో నాకూ తెలియదుగానీ ఇబూకా మాత్రం చచ్చిపోతూ ఉంటాడు ఈపాటికి లేకపోతే చచ్చిపోయి ఉంటాడు. చావుని వెతుక్కుంటూ వెళ్ళారు సాగారూ, వాడి లవరూ"

    "చావు వెదుక్కుంటూ వెళ్ళారా?" అంది స్వరూప, కొద్దిగా ఆందోళన చెందుతూ సాగారూ, అనూహ్య రసగుల్లా, గులాబ్ జామూలాగా కనబడతారు ఆమెకి. కొరికి నమిలి తినెయ్యాలన్నంత కోరిక కలుగుతుంది వాళ్ళని చూస్తుంటే___

    వాళ్ళిద్దరినీ చంపేస్తాడా ఏమిటి, చాంగ్ ఇప్పుడు.

    "లేకపోతే చావే వాళ్ళని వెదుకుతూ వెళ్ళిందనుకో" అన్నాడు చాంగ్ ఆనందంగా. "మామూలు చావుకాదు. యమబాధ భైరంచలేక, ఎప్పుడెప్పుడు చావు వచ్చి బాధలో నుంచి విముక్తి కలిగిస్తుందా అని కలవరించేటంత ఘోరమైన చావు వాళ్ళని వెతుక్కుంటూ, తరుముకుంటూ వెళుతోంది."

    వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ అలవోకంగా నవ్వింది ఆమె.

    "పీడా వదుల్తుంది కానీ, ఆ పిల్లని అరేబియన్ స్లేప్ మార్కెట్ లో ఆమ్మేస్తానంటివే" అంది అనూహ్య చావుని వాయిదా వేయించటానికి అతి చిన్న ప్రయత్నం చేస్తూ.

    చాంగ్ సమాధానం చెప్పలేదు.

    పెదిమల మీద చూపుడు వేలు పెట్టుకుని, నిశ్శబ్దం అని హెచ్చరించి, వెనక్కి చూడమన్నట్లు కళ్ళేగరేశాడు.

    తల తిప్పి చూసింది స్వరూప, పడుకుని ఉన్న సింగ్ అటు కదిలి, లేచి కూర్చుంటున్నాడు.

    భయంగా చూస్తూ, చాంగ్ కి దూరంగా జరిగింది స్వరూప. అతను మాత్రం తొణక్కుండా, నిర్లక్ష్యంగా చూస్తున్నాడు సింగ్ ని.

     వీళ్ళిద్దరినీ అసలు గమనించినట్లేలేదు సింగ్ తడుముకుంటూ లేచి చేతులని గుహ గోడకి ఆనించి నిలబడ్డాడు.

    "కళ్ళు లేని కబోదిలా అలా చూస్తాడేమిటి?" అన్నాడు చాంగ్ మెల్లిగా.

    "రేచీకటి- రాత్రుళ్ళు చూపు ఆనదు." అంది స్వరూప, వినీ వినబడనట్లు.

    గోడనుపట్టుకొని నడుస్తూ  గుహ లోపలి భాగం వైపు వెళ్ళిపోతున్నాడు సింగ్.

    పద్మవ్యూహం లాంటి గుహల సముదాయంలోకి తను వెళ్ళిపోతున్నానని తెలిసినట్లు లేదు.

    అతన్ని వింతగా చూస్తున్నాడు చాంగ్. బయటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చి మెలకువ వచ్చి ఉంటుంది సింగ్ కీ  రె చీకటి కావడంవల్ల దిక్కు తెలియకుండా గుహ లోపలికి వెళ్ళిపోతున్నాడు.

    "ఏయ్ ఎటెళ్తున్నావో చూసుకో!" అని హెచ్చరించడానికి నోరు తెరిచాడు చాంగ్.

    చప్పున అతని నోరు మూసేసింది స్వరూప.

     నిద్రలో నడుస్తున్నవాడిలా గుహ లోపలి భాగంలోకి వెళ్ళిపోయాడు సింగ్.

    తేలిగ్గా నిట్టూర్చింది స్వరూప.

    నిద్రలో నడుస్తున్నవాడిలా గుహ లోపలి భాగంలోకి వెళ్ళిపోయాడుసింగ్.

    తేలిగ్గా నిట్టూర్చింది స్వరూప.

    "నీ మొగుడు దాన్లోకి వెళ్ళిపోతే చూస్తూ ఊరుకుంటావేం?" అన్నాడు చాంగ్.

    "పోతేపోనిస్తూ ఆ ముసలి మొగుడు ఉంటే ఎంత లేకపోతే ఎంత! మొగుడు లేడని నాకేం దిగులా? నువ్వు లేవేమిటి?" అంది కవ్విస్తూ.

    ఆమె కవ్వింపు, ఆమె కర్కశత్వం, ఆమె  కపటం, ఆమె కరుణా రాహిత్యం అతనికి కసెక్కించాయి.

    కొంతమందికి వెన్నెలని చూస్తే వెచ్చటి తలపులొస్తాయి. ఆడవాళ్ళు వన్నెలూ చిన్నెలూ చూస్తే వళ్ళు వేడెక్కుతుంది కొందరికి. వేసవిలొ మల్లెల వాసన వాంచలు రేపుతుంది చాలామందికి.

    చాంగ్ ఇందుకు విరుద్దం. క్రౌర్యాన్ని, కిరాతకాన్నీ, హింసనీ, రక్తపాతాన్నీ చూస్తేనే గానీ, అతను రొమాంటిక్ మూడ్లోకి రాడు. కరడు గట్టిన శాడిస్టు అతను.

    కట్టుకున్న భర్తను నిర్ధాక్షిణ్యం చావు వైపు నెట్టుతున్న స్వరూపని చూడగానే అతనిలో కోరిక కట్టుతప్పి రంకె వేసింది.

    "దా!" అన్నాడు ఎర్రబడ్డ కళ్ళతో.

    పైకి నవ్వుతున్నా, లోలోపల వణికిపోతోంది స్వరూప. అతని పాశవిక ప్రవర్తనను భరించడం ఎంత దుర్భరమో ఆమెకి అనుభవపూర్వకంగా తెలుసు.

    జంకుతూనే అతన్ని చేరింది.

    ఆ తర్వాత అక్కడ గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో తుఫాను గాలులు వీచినట్లుయింది. ఆ తుఫానులో గడగడలాడి పోయింది స్వరూప. అరగంట తర్వాత, రొప్పుతూ కళ్ళుమూసుకు పడుకుండిపోయాడు చాంగ్.

    నీరసంగా కళ్ళు తెరిచింది స్వరూప. "ఎక్కడయినా శక్తిని హార్స్ ఫవర్ తో కొలుస్తారు, ఇన్ని గుర్రాలశక్తి సమానం  అని. నీ ఫవర్ ని కొలవాలంటే దేనితో కొలవాలో తెలుసా?

    "దేనితో?" అన్నాడు చాంగ్ కళ్ళు మూసుకునే.

    "బుతపవర్ వెయ్యి ఆబోతులకి సమానం నీ శక్తి!" అంది, అతన్ని ఉబ్బెయడానికి ప్రయత్నిస్తూ అతనితో ఆమెకి చాలా అవసరంఉంది. నిధికోసం జరుగుతున్న ఈ వేటలో, ప్రత్యర్ధులు ఎంతమంది ఉన్నా, చివరిదాకా నిలబడి దాన్ని చేజిక్కించుకునే శక్తి అతనికి ఒక్కడికే ఉందని ఆమెకి తెలుసు అతను ఏదైనా తలచుకున్నాడంటే, దాన్ని సాధించేదాకా వదలడనీ ఎన్నోసార్లు రుజువాయింది ఇదివరకే!

    ఆమెకి అతనితో ఎంత అవసరం ఉందో అతనికీ ఆమెతో అంతే అవసరం ఉంది.  అతని ఉద్దేశంలొ స్వరూప అతనికి సరైన పార్టనర్.

    ఆమె విచ్చలవిడితనం  అతనికి ఎంతో ఇష్టం అందుకే ఆమె షిప్పులొ తన పార్టనరు షిప్పు వదిలేసి దూరంగా వెళ్ళిపోయినా క్షమించాడు ఒక్క సారికి!

    అదే పని మరో ఆడది గనక చేసిఉంటే దారుణమైన శిక్ష వేసిఉండే వాడు అతను.

    ఎంతటి బలవంతుడికైనా ఏదో ఒక బలహీనత ఉంటుందంటారు.

    చాంగ్  బలహీనత స్వరూపరాణి.

    ఆమె చుట్టూ చెయ్యివేసి దగ్గరికి లాక్కున్నాడు.

    "చాంగ్" అంది స్వరూప గారంగా.

    "చెప్పు."

    "అంత బంగారం నీకు దొరికితే ఏం చేస్తావ్?"

    "నిన్ను బంగారంలో ముంచేస్తాను."

    "నిజంగా అంత పని చేస్తావా ఏమిటి? ఊపిరాడక  చస్తాను" అంది భయం నటిస్తూ.

    "ఊపిరాడకపోవడం అంటే గుర్తొచ్చింది నీ మొగుడు గుహలోకి వెళ్ళి పావుగంట దాటుతోంది. ఈపాటికి ఇంక ఊపిరందక గిలగిల్లాడు తుంటాడు" సాటి మనిషి చావుని ఊహించుకుంటేనే చాంగ్ వళ్ళు హర్షాతిరేకంతో పులకరించింది.

    నిర్లక్ష్యంగా పెదిమలు చప్పరించింది స్వరూప.


                                                                 *    *    *

    ఎదురుగా కనబడుతున్న దృశ్యాన్ని నిర్ఘాంతపోయి చూస్తూ నిల్చున్నారు సాగర్, అనూహ్య, సీతాపతి.

    అక్కడ ఆ  అడవి నడుమ, పుడమి కడుపులో మండ్రగబ్బల్లాంటి పిస్తోళ్ళూ, రివాల్వర్లూ ఉన్నాయి మిన్నాగుల్లాంటి షాట్ గన్స్ ఉన్నాయి. కోడెతాచుల్లాంటి రై ఫిల్సు ఉన్నాయి. కొండచిలువల్లాంటి సబ్ మెషిన్ గన్స్ వున్నాయి.

    అత్యంత శక్తివంతమైన ట్రాన్స్ మీటర్ ఒకటి ఉంది.

    ఇవన్నీ అక్కడ ఉన్నాయని తెలుసు సీతాపతికి.

    కానీ ఆయన కలలో కూడా ఊహించని దృశ్యం మరొకటి కనబడింది.

    ఆ ఆయుధాలన్నిటి మధ్యా కూర్చుని వున్నాడు సత్యనారాయణ సింగ్. అతను వాళ్ళ రాకని గమనించలేదు.

     యజ్ఞంలో కూర్చున్నవాడు అదేకధ్యానంతో మంత్రాలు చరువుతున్నట్లు ట్రాన్స్ మీటర్ లోకి చూస్తూ, నెమ్మదిగా చెబుతున్నాడు__

    "హెడ్ క్వార్టర్స్ కి రిపోర్టు.......నెంబరు నాలుగు సర్  యస్సర్! ఐయామ్ సారీ సర్! సముద్రంలో షిప్పు  తగలబడిపోయాక మళ్ళీ రిపోర్టు పంపడం కుదరలేదు. అవును నిజమే సర్. మనం ఈ ఆపరేషన్ మొదలెట్టిన తర్వాత వర్క్  ఫెయిలు కావటం ఇదే మొదటిసారి సార్! ఐయామ్  వెరీ సారీ సర్! ఇకముందు మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను."

    కంప్యూటర్ కి అమర్చబడిన ఆ ట్రాన్స్ మీటర్ ఎంత అత్యాధునిక మైనదంటే, అతను మాట్లాడుతున్నా మాటలని  వెనువెంటనే సీక్రెట్ కొడ్ లోకి మార్చి,  ప్రసారం చేస్తూంది హెడ్ క్వార్టర్సుకి.

    మాట్లాడటం పూర్తీకాగానే.  లేచి నిల్చున్నాడు సత్యనారాయణ సింగ్.

    అతనికి ఇప్పుడు రేచీకటిలాంటివేమీ వున్నట్లు లేదు. చకచకా నడుస్తూ వచ్చి, మసకచీకట్లో వున్నసాగర్ బృందాన్ని చూచి మంత్రం వేసిన పాములా ఆగిపోయాడు.

    అతని మొహంలోకి తదేకంగా చూస్తూ, ఏదో గుర్తుతెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు సీతాపతి.

    హఠాత్తుగా ఆయన  మెదడులో  మెరుపు మెరిసినట్లయింది.

    "సత్యం!" అని కేక పెట్టాడు పెద్దగా. "సత్యం! సత్యనారాయణ సింగ్! నువ్వా ? ఇక్కడా?"

    ఉలిక్కిపడ్డాడు సత్యనారాయణ సింగ్! వెదుకుతున్నట్లు సీతపతి మొహంలోకి ఏదో చూశాడు.

    "నువ్వు......నువ్వు......సీతపతిని కదూ."

    "అవును అవును" అన్నాడు సీతాపతి సంతోషం పట్టలేక "నిన్న నీళ్ళతోపాటు నిన్ను కూడా చూశాను సత్యం, కానీ గుర్తుపట్టలేకపోయాను. ఎన్నాళ్ళయింది నిన్ను చూసి."

    "నిన్న నేను కూడా నిన్ను చూశాను.....సీతాపతీ కానీ గుర్తుపట్టలేక లేకపోయాను" అన్నాడు సింగ్ తడారిపోతున్న గొంతుతో. "ఈ వేషం ఏమిటి? ఆ గొర్రె చర్మం ఏమిటి? గెడ్డాలూ, మీసాలూ ఏమిటి? నిన్ను చూసి ఏదో అడవి జంతువనుకున్నాను నిన్న."

    "అవును అవును అడివి జంతువునే, అడవి జంతువులాగే బతికాను నలభై ఏళ్ళపాటు ఇక్కడ ఆ రోజు గుర్తుందా నీకు? 

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra