Home » Balabhadrapatruni ramani » మొగుడే రెండో ప్రియుడు

    అదే సమయానికి అతనూ వేగంగా నడుస్తూ, తెలుగు విభాగం వైపు దూసుకెళ్ళాడు.


    ఆ నడకలో దూకుడు చూడగానే వర్షిణి మనసు కీడుని శంకించింది. ఇంతలోకే విక్రమ్ ఒక పువ్వులచొక్కా అబ్బాయిని కాలర్ దగ్గర పట్టుకుని ఈడ్చుకుంటూ, బయటికి తీసుకెళ్ళిపోవడం కనిపించింది. వర్షిణి చేతిలోని పుస్తకాలు టేబుల్ మీదే వదిలేసి తనూ వెనకాలే వెళ్ళింది.

    అప్పటికే విక్రమ్ ఆ యువకుడ్ని కిందపడేసి కొడ్తూ కనిపించాడు. చాలామంది చుట్టూచేరి తమాషా చూస్తున్నారు కానీ, "ఇదేమిటీ?" అని ఎవరూ అడగలేదు.

    పువ్వుల చొక్కా అబ్బాయి పేరు గిరి. అతడి స్థితి దారుణంగా మారింది. ముక్కు నుండీ, నోటి నుండీ ఆగకుండా రక్తం కారుతోంది. అతని అరుపులూ, ఏడుపూ విక్రమ్ కి ఏమాత్రం దాక్షిణ్యం కలిగించడం లేదు!

    వర్షిణి సహించలేకపోయింది!..."ఆపండి ఏవిటీ దానవత్వం? అసలేం చేశాడు? ఎందుకింత ఘోరంగా శిక్షిస్తున్నారు?" అంటూ మధ్యలోకి వెళ్ళింది.

    విక్రమ్ రక్తారుణిమ నేత్రాలతో ఆమెవైపు చూశాడు. అంతలోనే నిర్లక్ష్యంగా పక్కకి తప్పుకో, అన్నట్టు సైగ చేశాడు.

    వర్షిణికి ఆవేశం కట్టలు తెంచుకుంది!

    "ఎందుకు కొడ్తున్నావో జవాబు చెప్పకుండా, ఒక్క దెబ్బకూడా వెయ్యడానికి వీల్లేదు!" అంది మొండిగా.
    విక్రమ్ ఆమెవైపు చిరాగ్గా చూశాడు.

    మిగతా వాళ్ళు భయపడుతూ జరుగుతున్నదంతా నిశ్శబ్దంగా చూస్తున్నారు.

    "విక్రమ్ కి చెప్పడం పెద్దగా అలవాటు లేదు. చెయ్యడం తప్ప!" అంటూనే అతని కడుపులో మరో రెండు పిడిగుద్దులు కొట్టాడు. గిరి భళ్ళున రక్తం కక్కుకుని "అమ్మా!" అంటూ అరచి కళ్ళు తేలేశాడు.

    విక్రమ్ వంగి అతని ముక్కు దగ్గర వేలు పెట్టి చూసి "ఇంకా పోలేదు!" అన్నాడు తేలిగ్గా.

    వర్షిణి అతనివైపు నిప్పులు కురిపించే కళ్ళతో చూస్తూ "ఛీ మనిషివా? రాక్షసుడివా?" అంది.

    అంతమందిలో అతన్ని ఆమె అలా అనేసరికి అందరూ నోళ్ళు తెరచుకుని చూస్తుండిపోయారు. అందరి గుండెల్లో దడ ప్రారంభమయింది.

    విక్రమ్ ఆమె దగ్గరగా వచ్చాడు.

    ఆమె అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, జంకూ, గొంకూ లేకుండా నిలబడింది! అతడేమీ మాట్లాడకుండా క్రిందపడ్డ పువ్వుల చొక్కా అబ్బాయిని భుజాన వేసుకుని బయల్దేరాడు.

    "ఎక్కడికి?" వెనుకనించి వర్షిణి అడిగింది. "శ్మశానానికి" అని చెప్పి అతను వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.

    "దుర్మార్గుడు" అదురుతున్న పెదవులతో అంటున్న వర్షిణి నోటికి తన చేతిని అడ్డుగా పెట్టింది భ్రమరాంబ "అసలు సంగతి తెలిస్తే, అతన్ని తిట్టినందుకు నువ్వు బాధపడ్తావు" కన్నీళ్ళతో చెప్పింది.

    "ఏవైంది?" విసుగ్గా కనుబొమలు చిట్లించి అడిగింది వర్షిణి.

    "నా వెంట రా, చెప్తాను" అంటూ భ్రమరాంబ, శిల్ప వర్షిణీ ఓ మూలకి తీసుకెళ్ళి చెప్పసాగింది.
    ....భ్రమరాంబ మామూలుగా తనకి ఇష్టమయిన ప్రబంధాల కోసం తెలుగు ర్యాక్ వైపు నడిచింది. ఆమె చాలాసేపు తనని ఎవరో వెంటాడుతున్నారనే విషయమే గ్రహించలేదు. కాసేపటికి ఆమెకి ఎవరో తననే గమనిస్తున్నారన్న విషయం అర్ధం అయి తలెత్తేసరికి గిరి ఎదురుగా నిలబడి వెకిలిగా నవ్వుతూ కనిపించాడు.

    ఆమె చటుక్కున అతన్ని తప్పించుకుని ఇవతలకి రావాలనుకుంది. కానీ అతను అడ్డుగా వచ్చి, ఆమెని ఒడిసిపట్టి ఏం జరిగిందో ఆమెకి తెలిసేలోపే గట్టిగా ఆమె బుగ్గ కొరికి వదిలేశాడు!

    జరిగినా అవమానానికి ఆమె నోట మాట రాలేదు! ఏడుపు కూడా రానంత అచేతనంగా మారి నిలబడిపోయింది. ఇదంతా దూరం నించి విక్రమ్ గమనిస్తున్నాడన్న సంగతి ఆమెకి అతను దగ్గరికి వచ్చేదాకా తెలియదు.

    విక్రమ్ వస్తూనే, వేలు నోటిమీద వేసుకుని భ్రమరాంబని ఏం మాట్లాడద్దని సైగ చేశాడు. ఆ తర్వాత జరిగినదంతా తెలిసినదే!

    "అప్పుడే ఎందుకు చెప్పలేదూ?" అంది శిల్ప విసుగ్గా-భ్రమర బుగ్గ ఎర్రగా కందిపోయి వుండటం అప్పుడు గమనించింది.

    "అంతమందిలోనా?" అడిగింది ఉక్రోషంగా భ్రమరాంబ.

    వర్షిణి ఆ మాటలు పట్టించుకోలేదు.

    స్వగతంగా 'అయినా అంతగా కొట్టడమా?' అనుకుంది.

   
                                             *    *    *

    విక్రమ్ హాస్పిటల్లోకి ఎంటర్ అవుతూనే, అక్కడున్న డ్యూటీ డాక్టర్ తో "పేషెంట్ ని అర్జెంట్ గా చూడాలి కండీషన్ ప్రమాదంగా వుంది" అన్నాడు.

    తాపీగా కుర్చీలో కూర్చుని, ఏదో మేగ్ జైన్ చదువుకుంటున్న ఆయన "ఏవైందీ?" అని అడిగాడు అంతే తాపీగా.

    "కాలేజీలో వెధవ పని చేశాడని చావగొట్టాను."

    ఆ సమాధానానికి ఆయన అదిరిపడి చూశాడు.

    విక్రమ్ భుజం మీదవున్న అతని శరీరంనించి రక్తం కారుతోంది.

    "పోలీస్ కేస్ అవుతుంది తెలుసా?" అడిగాడు డాక్టర్.

    "ఆ సంగతి తర్వాత చూసుకుందాం! ముందు పేషెంట్ ప్రాణాలు కాపాడండి" అన్నాడు విక్రమ్ చిరాగ్గా.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra