Home » Yandamuri veerendranath » Rakshasudu


    రాబోట్ మరణించాడు.

 

    తన కళ్ళముందే తన అనుంగు సహచరుడు ఈ లోకంనుంచి శలవు తీసుకొని నిష్క్రమించాడు!!

 

    అతడికో క్షణంపాటూ కోపం వచ్చింది. ఈ లోకాన్నంతా దగ్దం చెయ్యాలన్నంత కోపం వచ్చింది. కానీ అది క్షణం సేపే. చెయ్యివచ్చి పడగానే లేచిన నీటి తుంపర్లు అతడి కళ్ళల్లో చిప్పిల్లిన నీళ్ళతో కలిసి బుగ్గల మీదకి జారినాయి!

 

    ఎందుకు చేశావ్ రాబోట్ - ఎందుకు ఇంత తొందర పడ్డావ్?

 

    పైన కలకలం వినిపించింది.

 

    బోటు పేలిపోయిన షాక్ నుంచి వాళ్ళు తేరుకున్నట్టున్నారు. మళ్లీ తన గురించి వెతకటం మొదలు పెట్టారు.

 

    సహచరుడి మరణం గురించి తీరిగ్గా విచారించటానికి కూడాలేదు. మొహం చుట్టూ నీళ్ళు, ఉప్పగా తగులుతున్నాయి. సముద్రంనుంచి కాలువలోకి నీరు వెనక్కి ప్రవహించటం ప్రారంభమయిందన్న మాట!

 

    అతడు రాబోట్ చేతిని ఆప్యాయంగా స్పృశించాడు.

 

    తీర్చుకుంటాను మిత్రమా నీ యీ మరణానికి కారణమయిన ఆ వంకచెక్కా రామ్మూర్తిని ఇంతకంటే దారుణమైన చావు వరించేలా చేసిగాని విశ్రమించను!!

 

    అంతలో అతడిమీద వెలుతురు పడింది. వెంటనే రివాల్వర్ పేలిన ధ్వని.... బులెట్ అంగుళం పక్కగా అతడితలపక్కనుంచి దూసుకుంటూ నీళ్ళలోకి మునిగిపోతూ వుండగా చూసేడు. తనమీద పడిన వెలుతురు దూరం నుంచి వెనుదిరిగిన పోలీసు జీపుదని.

 

    అతడి మనసంతా రాబోట్ పట్ల కృతజ్ఞతాభావంతో నిండిపోయింది.

 

    అతడూ మరణిస్తూ కూడా తనకు సాయం చేశాడు. ఈ విస్ఫోటనమే గానీ జరగక పోయివుంటే ఇన్ స్పెక్టర్ తిరిగి వచ్చేవాడు కాదు.

 

    అతడు నీటి అడుగునే నెమ్మదిగా కదలటం ప్రారంభించాడు. నీళ్ళలో కొమ్మల కదలికలను బట్టి పైనుంచి బుల్లెట్ల వర్షం కురుస్తూంది. చేతిలోనూ కాలిలోనూ గుచ్చుకున్న బుల్లెట్స్ ప్రాణాలు తోడేస్తున్నాయి. ఎంత రక్తం పోయిందో తెలీదు.

 

    ఈ లోపులో జీపు దిగి విజయ్ ఆ ప్రాంతానికి పరుగెత్తుకు వచ్చాడు. అయినా కాల్పులు ఆగలేదు. వంకచెక్కా రామ్మూర్తి ఈరోజు అటో ఇటో తేల్చుకునే ఉద్దేశంతో వున్నాడు. పేలిపోయిన అతడి పడవ, అందులో నల్లుల్లా మాడిపోయిన అతడి అనుచరులు, అతడిని దాదాపు పిచ్చివాడిని చేశాయి. తన వాళ్ళకి సైగ చేశాడు. నలుగురైదుగురు నీళ్ళలోకి దూకారు.

 

    నీళ్ళలో కనపడుతున్న రక్తం బట్టి అవతలి వ్యక్తికి గాయం తగిలిందని గ్రహించాడు రామ్మూర్తి. ఇంక అతడు ఎటూ తప్పించుకుపోలేడు. ఈ లోపులో కాలువ మట్టం మరింత హెచ్చింది. మరింత వేగంగా వెనక్కి వెళ్ళసాగాయి నీళ్ళు. నీళ్ళలో నడుస్తూన్న అతడు, తన శరీరాన్ని మరో చెయ్యి పట్టుకోవటంతో చప్పున విదిలించుకుని తోసెయ్యబోయాడు. అప్రయత్నంగా తల నీటి బయటకు వచ్చింది.   

 

    "నేనే" అన్నాడు విజయ్. అతడి మాట పూర్తికాకుండానే మళ్ళీ అవతలి వడ్డు నుంచి బుల్లెట్స్ వచ్చి పడ్డాయి. ఇద్దరూ చటుక్కున నీళ్ళలో మునిగిపోయారు. మూడు నిముషాల తరువాత ఒడ్డు తగిలింది. చెట్టుచాటుకి పరుగెత్తారు.

 

    త్రికోణ ఆకారంలో చిన్న దీవిలా వుంది అది. అటువైపు నుంచి నది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. ఇటు కాలువ వుంది. అతడు జేబులోంచి పిస్తోలు తీశాడు. కానీ నీళ్ళలో పూర్తిగా తడిసి ఎప్పుడో పాడయిపోయింది అది.

 

    "నేను పిలవగానే వచ్చినందుకు థాంక్స్, కానీ నా ప్లానంతా వీళ్ళకు ఎలా తెలిసిపోయిందో అర్థం కావటం లేదు".

 

    విజయ్ అతడివైపు చూశాడు. అతడి బట్టల్లోంచి ఎరుపు రంగు ధారగా కారుతూంది. అందులో జీపుస్టార్ట్ అయిన శబ్దం వినిపించింది.

 

    పోలీసులు వెళ్ళిపోతున్నారు!

 

    "హేట్సాఫ్ టు యువర్ డిపార్టుమెంట్" అన్నాడు అతడు. విజయ్ మొహం జేవురించింది. మాట్లాడలేదు. మామూలు పోలీసులు వాళ్ళు! ఈ సిస్టమాటిక్ కాల్పులని ఎదుర్కోవటం వారికి తెలీదు. తమ ఇన్ స్పెక్టర్ ని వదిలి వెళ్ళిపోతున్నారు. రేపు రికార్డుల్లో తమ ఇన్ స్పెక్టరు స్మగ్లర్లు కాల్పుల్లో మరణించినట్టు వ్రాసుకుంటారు. అతడిని వంటరివాడిని చేసి తాము పారిపోయినట్టు తెలియనివ్వరు.

 

    "ఎవరు వాళ్ళు" అని అడిగాడు విజయ్. అతడి ప్రశ్నకి సమాధానంగా అన్నట్టు "నువ్వు తప్పించుకోలేవు, లొంగిపో" అన్న కేక అటునుంచీ వినిపించింది. విజయ్ మొహం జేవురించింది. ఆ స్వరం తన తండ్రిది!

 

    ఆందోళనతో అతడివైపు చూశాడు. అతడి కళ్ళు నిస్సత్తువతో మూత పడుతున్నాయి. మోకాళ్ళ మీద నుంచి క్రిందికి కూలిపోతున్నాడు.

 

    విజయ్ అతడిని పట్టుకుంటూ "ఎలా? ఇప్పుడెలా?" అని గొణిగాడు.

 

    "మనల్ని ఎలాగూ వాళ్ళు వదిలిపెట్టరు. ప్రాణం వున్నంతవరకూ పోరాటమే".

 

    విజయ్ గొంతెత్తి గాలిలోకి అరుస్తూ "పోలీస్ హియర్.... మర్యాదగా లొంగిపొండి" అన్నాడు బిగ్గరగా.

 

    అట్నుంచి నవ్వు వినపడింది, దాని అర్థం వారిద్దరికే తెలుసు. ఈ పోరాటంలో ఇనస్పెక్టరు చనిపోయినా కూడా, దాన్ని నిరూపించటానికి సాక్ష్యాధారాలు లేవు... ఉండవు.

 

    ఇన్ స్పెక్టర్ తన తోలుపట్కాలోంచి పిస్తోలు తీసేడు. అదృష్టవశాత్తూ అది సరిగానే వుంది. గాలిలోకి ఒకసారి పేల్చేడు.

 

    "విజయ్" అట్నుంచి రామ్మూర్తి గొంతు వినపడింది. "అతడిని మాకు వదిలిపెట్టు. లేకపోతే అనవసరంగా నీ ప్రాణాలు కూడా పోతాయి".

 

    సమాధానంగా విజయ్ మరోసారి పిస్తోలు పేల్చేడు. 'అతడి'కిదంతా లీలగా తెలుస్తూంది. కళ్ళు మూతలు పడుతున్నాయి. స్పృహతప్పుతున్నట్టు గమనించాడు. అంతలో పక్క నుంచి విజయ్ స్వరం వినబడింది. "ఈ చెక్క పట్టుకో- వీలైనంత దూరం వెళ్ళిపో".

 

    అతడా మాటలకి బలవంతంగా కళ్ళు తెరిచాడు. "వెళ్ళిపో, ఇక్కడుంటే వాళ్ళు ఎలాగైనా చంపుతారు. నేను వాళ్ళని సాధ్యమైనంతవరకూ ఆపుతాను" అన్నాడు. పగిలిన పడవ తాలూకు చెక్కని ప్రవాహంలో ఆపుతూ.

 

    "కా.... కానీ.... అది నీ ప్రాణాలకి ప్రమాదం".

 

    విజయ్ పేలవంగా నవ్వుతూ, "ఎలాటి వాడైనా మానాన్న తన కొడుకుని చంపుకోడని నా ఉద్దేశ్యం" అన్నాడు.

 

    ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు.

 

    అతడి కళ్ళలో 'కసి'ని గమనించాడు విజయ్. రాబోట్ మరణానికి అతడు బాగా కదిలిపోయినట్టు గమనించాడు. ఆ ఆవేశంలో అతడిని వదిలేస్తే మరిన్ని హత్యలు జరగటం ఖాయం. ఒక నిశ్చయానికి వచ్చినట్టు పిస్తోలు వున్న చేతిని పైకెత్తేడు. ఏం జరుగుతుందో గ్రహించేలోపులో దాంతో అతడి తల మీద కొట్టాడు. బలమైన దెబ్బకాదు, కానీ ఆ పరిస్థితుల్లో అది చాలు.

 

    అతడికి స్పృహ తప్పుతూ వుండగా విజయ్ మాటలు వినబడ్డాయి.

 

    "సారీ ఫ్రెండ్. ఈ పరిస్థితుల్లో ఇలా చెయ్యటం తప్పనిసరి! మళ్ళీ కలుసుకుందాం.... బ్రతికి వుంటే".

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra