"వద్దులే. ఒక తెల్లకాగితంమీద సంతకం పెట్టివ్వు. మిగతాది మా వాళ్ళు చూసుకుంటారులే".

    ఆమె అలాగే చేసి, బయటకు వచ్చేసింది. మనసు నిర్లిప్తంగా వుంది. ప్రపంచమంతా ఉత్సాహంగా వున్నా ఆమెకి మాత్రం సంతోషంగా లేదు. ఆమె అలా వుండటానికి మామూలుగా అయితే రెండు కారణాలు వుండి వుండాలి. ఒకటి- తనవల్ల ప్రపంచం రక్షించబడిందన్న ఆనందం తనకి మిగలకుండా పోవడం. రెండు- తను అంత సులభంగా మోసపోయి, పరుగెత్తుకుంటూవచ్చి పెద్ద పెద్ద పోలీసు అధికారులకి చందమామ కథ లాటిది చెప్పి అభాసుపాలవటం. ఈ రెండే కారణాలు అయివుండాలి. కానీ కాదు. అనుదీప్ తననుంచి క్రమంగా దూరమవుతున్నాడన్న విషయాన్ని ఆమె అంతర్ చక్రక్షువులు గ్రహించాయి. తమ మధ్య ఏదో తెలియని దూరం ఏర్పడుతూంది. ఆ కళ్ళల్లో ప్రేమ లేదని కాదు. కానీ అది తనని దాటి వ్యాప్తమై- తనకి సానుభూతిని మాత్రమే మిగులుస్తూందేమో అన్న అనుమానం. తను గెలిచి ఓడిందో, ఓడి గెలిచిందో అర్థంకావటంలేదు.

    ధర్మారావు ఇన్ స్పెక్టర్ రవిశాస్త్రిని పిలిచి విద్య వ్రాసిచ్చిన కాగితాన్ని అందిస్తూ, "ఈ కుర్రవాడిని అరెస్టుచేసి లాకప్ లో పెట్టు. ఏం చెయ్యాలా అన్నది తరువాత చెప్తాను!" అన్నాడు.

                                       *    *    *

    హత్యకేసుల్లో సాధారణంగా న్యాయస్థానం బెయిల్ ఇవ్వదు. నేరస్తులు బయటకు వచ్చి సాక్ష్యాధారాల్ని తారుమారు చేస్తారని ఆ విధంగా చేస్తుంది కోర్టు. కొన్ని సార్లు శిక్ష ఖాయమయ్యేవరకూ బెయిల్ మీద వదిలిపెడుతుంది.

    అలా వదిలిపెట్టబడిన సంపత్, విశ్వనాథంలు ఈ హత్యానేరంనుంచి బయటపడటానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ హత్యకేసులో బెనిఫిట్ ఆఫ్ డవుట్ సంపాదించాలంటే వేలిముద్రలున్న క్యాసెట్ ని నాశనం చేయాలి. ప్రత్యక్షసాక్షి అయిన విద్యాధరి నోరు శాశ్వతంగా మూసెయ్యాలి. ఈ రెండూ చేస్తే చాలు.

    పోలీసు డిపార్ట్ మెంటులో మాజీ యస్సైగా విశ్వనాథానికి కాస్త పలుకుబడి వుంది. ధర్మారావు అనుదీప్ ని అరెస్టు చేయమని శాస్త్రికి సూచన్లు ఇచ్చాడని, ఆ రాత్రికే అరెస్టుకూడా జరగవచ్చునని విశ్వసనీయంగా తెలిసింది. ఒక తెల్లకాగితం మీద కంప్లైంట్ సంతకం పెట్టించుకుని, దాని ఆధారంగా ఈ అరెస్టు జరుగుతూ వుందని కూడా అతను తెలుసుకున్నాడు. కేవలం విద్యాధరి మెప్పుకోసమే ధర్మారావు ఈ పని చేయిస్తున్నాడు.

    దాంతో అతడి ప్లాన్ కి సరి అయిన పునాది దొరికింది.

    తామిద్దరూ అసలు విజయవాడలోనే లేరన్నట్టు ముందు పటిష్టమైన ఎలిబీలు సృష్టించుకున్నారు. అనుదీప్ అరెస్టు కావటానికి సరిగ్గా అయిదు నిముషాల ముందు విద్యాధరిని హత్య చేయడానికి ప్లాన్ వేశారు. దీంతో పోలీసులు ఇబ్బందిలో పడతారు. ముఖ్యంగా ధర్మారావు ఎందుకు ఆ సూచన ఇచ్చాడో చెప్పుకోలేడు. విద్యాధరి నుంచి పూర్తి వివరాలు తీసుకోనందున రవిశాస్త్రి సస్పెండ్ అవుతాడు.

    అనుదీప్ కి శిక్ష పడుతుంది. అతడికి విద్యాధరికి పాతకక్షలున్నాయనటానికి చాలా ఋజువులున్నాయి. ఈ విషయమై విద్యాధరి పోలీసులకి రిపోర్టు చేసింది. ఈ లోపులో అతడు హత్య చేశాడు. విద్యాదరికి సరియైన రక్షణ కల్పించలేదు పోలీసులు.

    ఈ నెపంనుంచి తప్పించుకోవటానికి పోలీసులు మూడు చెరువుల నీళ్ళు తాగవలసి వస్తుంది. అంధ్ హడావుడిలో, తమకేసు (రుజువులతో సహా) వెళ్ళిపోతుంది. తమకి తమ ప్రత్యర్థుల మీద పగతీర్చుకున్నట్టు కూడ వుంటుంది. అన్నివిధాలా లాభం.

    ఇలా ఆలోచించి, విద్యాధరి హత్యకి ముహూర్తం పెట్టారు వాళ్ళిద్దరూ.

                                          *    *    *

    రవిశాస్త్రి జీపు దిగి, అనుదీప్ ఇంట్లోకి ప్రవేశించాడు. అతడికిష్టంలేదు. కానీ తప్పదు. ఒకటి మాత్రం అదృష్టం. తన పరిధిలోవున్న పోలీస్ స్టేషనే కాబట్టి లాకప్ బాధలుండవు. తరువాత అతడిని ధర్మారావు ఏం చేయమంటాడా అన్న దానిమీద మిగతాది ఆధారపడి వుంటుంది.

    ఇన్ స్పెక్టర్ డ్రస్ లో వున్న శాస్త్రిని చూసి బెదురుతూ "అబ్బాయి లేడు బాబూ" అన్నాడు తండ్రి. శాస్త్రి వెనుదిరుగుతూ వుంటే "ఏమైనా తప్పు చేశాడా బాబూ" అని అడిగింది తల్లి.

    "అవును. ఒక అమ్మాయిని ప్రేమించటం-" మనసులోనే అనుకుని, "ఏమీలేదు. మీరు కంగారు పడకండి" అని అక్కణ్ణుంచి కదిలాడు.

    అనుదీప్ కోసం ఎక్కడ వెతకాలో తెలియలేదు. ఎందుకో తోచింది, అనుదీప్ ఆ సమయంలో విద్యాధరి దగ్గర వుంటాడని.

    అక్కడికి బయలుదేరాడు. అకస్మాత్తుగా మనసుకి ఏదో తోస్తుంది- అది వూహించని మలుపుకి కారణభూతమవుతుంది.

                                       *    *    *

    లైటు వేసుకుని విద్యాధరి ఆ రోజు పేపరు చదువుతూంది. ప్రథమ విద్యుద్ఘాత కెరటం ప్రభావం (ఇనిషియల్ షాక్ వేవ్) తగ్గిపోయాక పేపర్లు రకరకాల వార్తల్ని బాక్స్ ఐటమ్స్ గా ప్రచురించటం సాగించాయి. చాలా గమ్మత్తయిన వార్తలు. కరెంటు పోయినప్పుడు ప్రపంచపు వివిధ ప్రాంతాలలో ఏమేం జరిగాయో వాటిని- మామూలుకన్నా రెట్టింపు పేజీలు  ప్రచురించి, ప్రజలకి అందిస్తూ నష్టాల్ని భర్తీ చేసుకోసాగాయి.

    వార్తలు ఇంటరెస్టింగ్ గా వుండటంతో ఆమె వాటిని చదువుతూ చాలాసేపు వుండిపోయింది.

    బాగా చీకటిపడ్డాక- ఆ నిశ్శబ్దంలోంచి గదిబైట చప్పుడు వినిపించింది. ముందు ఆమె పట్టించుకోలేదు. కానీ చిన్న మూలుగు ఆమెలో ఉత్సుకత రేకెత్తించింది.

    ఆమె తలుపుతీసి బయటకు రాబోయింది.

    సరిగ్గా అదే సమయానికి, ఊహించని వేగంతో ఒక కత్తి ఆమె నడుమువైపు దూసుకువచ్చింది. ఒక విధమైన ఇంపల్స్ తో ఆమె పక్కకి జరగబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఆ కత్తి ఆమె కడుపులో గుచ్చుకునేదే. ఆమె హారర్ తో అరవబోయింది. కానీ భయంవల్ల నోటమాట రాలేదు.

    దూరంగా మరెవరో ఘర్షణ పడుతున్నారు. చీకట్లో వాళ్ళెవరో తెలియలేదు. అంతలో వీధి మొదట్లో మరో వ్యక్తి కనిపించాడు.

    అతడు కూడా ఇటే వస్తున్నాడు.

    ఒక్కసారిగా ఇంతమంది వ్యక్తుల్ని ఇంటిముందు చూసేసరికి ఆమెకి అంత భయంలో ఏమీ అర్థంకాలేదు. అందులో ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో తెలియలేదు.

    ఆమె అప్రయత్నంగా బయటకు పరుగెత్తింది.

    లోపలికి వెళ్ళిన వ్యక్తి లేచి ఆమె వెంటపడ్డాడు.

    ఈ అవకాశం తప్పిపోతే మరి దొరకదని కృతనిశ్చయుడై ఉన్నట్టు తోచాడా వ్యక్తి. ఎటు వెళ్తూందో తోచని పరిస్థితుల్లో ఆమె పరిగెత్తసాగింది. ఇంకో నాలుగైదు క్షణాలు గడిచి వుంటే అతడికి ఆమె దొరికి వుండేది. ఈ లోపులో వీధి మలుపు తిరిగి వస్తున్న వ్యక్తి దగ్గరయ్యాడు. అతడిని చూసి- ఆమెను వెంటాడుతున్న వ్యక్తి చప్పున వెనుదిరిగాడు. అదే సమయానికి అట్నుంచి ఒక కారు వచ్చింది. ఈ హడావుడిలో ఆ వ్యక్తి కారుని చూసుకోలేదు. ముందు అతడి చేతిలో కత్తి గాలిలోకి ఎగిరింది! తరువాత అతడి శరీరం..

    ఈ లోపులో, విడిగా దూరంగా ఘర్షణ పడుతున్న ఇద్దరిలో ఒక ఆర్తనాదం వినిపించింది. ఆ మనిషి కుప్పకూలిపోయాడు. రెండో వ్యక్తి అక్కణ్ణుంచి పరుగుదీసాడు. వీధి మలుపు నుంచి వస్తున్న వ్యక్తి మరి ఆలస్యం చేయకుండా రెండుసార్లు పిస్తోలు పేల్చాడు. ఆగిపోయిన కారు-కారు పక్కన విద్యాధరిమీద హత్యాప్రయత్నం చేసిన మనిషి శవం, కాస్త దూరంలో పిస్తోలు దెబ్బతిన్న మరో ఆగంతకుడు. అతడి పక్కనే రక్తపు మడుగులో మరో వ్యక్తి -  

    అంతా అయోమయంగా వుంది విద్యాధరికి. అప్పటివరకూ ప్రశాంతంగా వున్న వాతావరణం ఈ శబ్దాలతో దద్ధరిల్లిపోయింది. ఈ లోపులో, పిస్తోలుతో ఆమె దగ్గరగా వచ్చాడు ఆ వ్యక్తి- రవిశాస్త్రి. అంత రక్తాన్ని విద్యాధరికి చూసి స్పృహ తప్పుతున్నట్టు అనిపించింది. కారు క్రింద పడివున్న వ్యక్తి సంపత్, పొడిచి పారిపోతూ ఇన్ స్పెక్టర్ గుళ్ళకి బలిఅయినవాడు విశ్వనాథం. శాస్త్రితోపాటు ఆమె రక్తపు మడుగులో పడివున్న మూడోవ్యక్తి దగ్గరకు వెళ్ళింది. రెక్కలు విరిగిన జటాయువులా పడివున్నాడు.

    ......అనుదీప్!

                                        *    *    *

    "ఎలా వుంది డాక్టర్"

    "సీరియస్ గా వుంది." ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకి వస్తూ అన్నాడు డాక్టర్.

    విద్యాధరి ఇంటిలోకి ప్రవేశించబోతున్న ఇద్దరినీ ఎదుర్కొన్నాడు అనుదీప్ దాని ఫలితమే ఇది.

    తన గురించే అనుదీప్ తన ఇంటిముందు తచ్చాడుతున్నాడన్న సంగతి విద్యాధరికి తెలుసు. అదే తన ప్రాణాల్ని రక్షించిందని కూడా ఆమె గ్రహించింది. అయినా ఆమెకి విసుగ్గా వుంది.

    రేపీ ఘర్షణల గురించి అంతా పేపర్లో వస్తుంది. "ఒక అమ్మాయిమీద హత్యా ప్రయత్నం- ప్రేమికుడు రక్షించిన వైనం..." అంటూ

    దాంతో ఒక రకరకాల కథలు ప్రచారమవుతాయి. అసలే గొడవల్నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్న తమకి మళ్ళీ ఈ గొడవతో అనవసరమైన ఇబ్బంది ఏర్పడబోతుంది. నిప్పులేనిదే పొగ ఎందుకొస్తుందీ అనుకునేవాళ్లే ఎక్కువమంది ఈ సమాజంలో. ఒక హత్యజరిగి, అరెస్టయి, రిలీజ్ అయిన కొద్ది రోజుల్లో మరో రెండు హత్యలు... తన శీలం పట్ల కూడా రకరకాల రూమర్లు వ్యాప్తి చెందుతూ వుండవచ్చు.

    రవిశాస్త్రి "పాపం, అతడు బ్రతికి తొందరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించాలి" అన్నాడు.

    "ఎందుకు? మరింత తొందరగా వచ్చి వేధించటానికా?" అంది. రవిశాస్త్రి ఆమె మాటలకి విస్మయంగా చూశాడు.

    "మనమేమీ ప్రార్థించనవసరంలేదు. అతడికి రకరకాల క్షుద్రవిద్యలు తెలుసు. ఇదంతా నాటకం అయినా కూడా ఆశ్చర్యపడను-" అంది. రవిశాస్త్రి తన జీవితంలో ఎప్పుడూ అంత ఆవేశపడలేదు. కూతుళ్ళని కూడా చిన్నప్పటినుంచీ ఎప్పుడూ అలా కొట్టలేదు. సాచిపెట్టి విద్యాధరి చెంప పగిలేలా కొట్టాడు.

    అతడు అతికష్టంమీద ఆవేశాన్ని అణచుకున్నాడు. ఆ దెబ్బకి ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఉక్రోషం కూడా వచ్చింది.

    "ఏం? నే నన్నదాంట్లో తప్పేం వుంది?" అంది రోషంగా.

    "అతడిపట్ల నీ కసలు ఇష్టంలేకపోతే అది వేరే సంగతి. కానీ మనసులో ఇష్టాన్ని పెట్టుకుని, తెగేవరకూ తాడు లాగటం మంచిపద్ధతి కాదు".

    "నాకేం ఇష్టంలేదు అతడంటే..."

    "లేదూ?"

    "లేదు".

    అతడామె రెక్కపుచ్చుకుని గట్టిగా దగ్గిరకు లాగి, "లేదూ?" అన్నాడు. ఆమె జవాబు చెప్పలేదు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra