Home » Balabhadrapatruni ramani » అనూహ్య

   ఆ క్షణంలో నాకా పేరుపెట్టిన  అమ్మమ్మమీద గౌరవం పెరిగిపోయింది.
    "అ...నూ...హ్య!" ఒక్కొక్క అక్షరమే ఒత్తిపలికాడు.
    నేను అప్పుడు గమనించాను, అతని చేయి ఇంకా  నా చేతిలోనే వుంది! గభాల్న వదిలేశాను.
    "అ...మళ్ళీ నెప్పి మొదలైంది" అన్నాడు గట్టిగా. అతని కళ్ళల్లో. గొంతులో  అల్లరి కనిపించింది.
    చిత్రంగా నాకు  కోపానికి బదులు నవ్వొచ్చింది. మగపిల్లలు చాల అల్లరి చేస్తారు.
    నాకు అల్లరంటే చాల ఇష్టం!
    నేను అక్కడినుండి కదలబోతూవుంటే , అతను సంభాషణని పొడిగిస్తూ "పెయింటింగ్ లో మీకు  ప్రవేశం వుందా?" అన్నాడు.
    నేను తల అడ్డంగా  ఊపాను.
    "అభిరుచుందా?" అడిగాడు.
    నేను మళ్ళీ తల అడ్డంగా ఊపాను.
    "భారతన్యాటంలో?" అడిగాడు.
    నేను తల అడ్డంగా ఊపాను.
    "అబద్దం చెప్పకండి డ్యాన్సర్ మాత్రమే ఇలా తల ఊపగలరు!" అన్నాడు.
    నేను ఈసారి బయటికే ఫక్కున నవ్వేశాను.
    ఇద్దరం జనంలోంచి కాస్త  దూరంగా నడిచాం.
    అతను నా వెంట వస్తూవుండటం చూసి "పాపం  మీ ఫ్రెండ్స్..." అని అసంపూర్తిగా ఆపేశాను.
    అతను విచారంగా మొహంపెట్టి "నేను ఒక ఫ్రెండ్ తో వచ్చాను. వాడికి తీరా ఇక్కడికి వచ్చాక ఓ గర్ల్ ఫ్రెండ్ దొరికింది. ఇంక నా మొహం ఎందుకు చూస్తాడూ?" అన్నాడు.
    నేను విచారం అభినయిస్తూ "సో సారీ!" అన్నాను.
    "నో....సారీ కాదు ఐ యామ్ హేపీ! వాడు  లేక పోబట్టే మీతో పరిచయం  భాగ్యం లభించింది" అన్నాడు.
    నేను సన్నగా నవ్వి, కళ్ళతోటే వివేక్ కోసం గాలించసాగాను.
    దూరంగా థన్మయీ, వివేక్ కలిసి నడుస్తూ కనిపించారు. వివేక్ ఏదో అంటూవుంటే తన్మయి అతని భుజంమీద పడి నవ్వుతోంది.
    నా మనసు  భగ్గున మండింది.
    సమీర్ ఏదో మాట్లాడుతున్నాడు నాకు వినిపించడంలేదు. నా మనసంతా తన్మయీ, వివేక్ ల చుట్టూ  పరిభ్రమిస్తోంది.
    "టీ తాగుదామా?" సమీర్ అడిగాడు.
    "వద్దు... ఇప్పుడే తీసుకున్నాను" చూపుమరల్చుకాకుండానే చెప్పాను.
    "ప్లీజ్.... నా కోసం " అన్నాడు.
    "వద్దు!" కరకుగా అనేశాను.
    అంతలోనే సర్దుకుని  "నాకు పడదు! వికారం" అన్నాను.
    "ఓ.కే!" అతను భుజాలు ఎగురవేసి టి కోసం కౌంటర్ వైపు వెళ్ళాడు.
    నేను వివేక్ వాళ్ళవైపు గబగబా  అడుగుల వేస్తుండగా నా భుజాన్ని  పట్టుకుని ఎవరో ఆపారు. నేను కోపంగా చూసేసరికి ఈసారి విజయ! నాకు ఆనందం వేసింది. "హాయ్! ఎప్పుడోచ్చావ్?" అన్నాను.
     "నీ సెలక్షన్ ని!" అని ఫక్కున నవ్వింది.
     నేను ఇంకా కోపంగా  "ఏం తక్కువైంది నా సెలక్షన్ కీ?" అన్నాను.
    "అబ్బే! ఏం తక్కువ కాలేదు. ఒకడు తాతయ్యాలా వుంటే ఇంకోడు మేనల్లుడిలా వున్నాడు" అంది.
    నేను కావాలనే విజయ కాలు తొక్కాను.
    "అబ్బా!" అని అరిచి వెంటనే "రాక్షసి" అంది.
    "నీతో ఓ విషయం మాట్లాడాలే!" అన్నాను.
    విజయ సీరియస్ గా "ఇద్దరిలో ఎవరైతే బాగుంటుందన్న విషయమా?" అంది.
    నేను చురుగ్గా చూస్తూ "ఔనూ!" అన్నాను.
    "ఇద్దరిలో మూసలాడే బెటర్.... ఓల్డ్ ఈజ్ గోల్డ్!" అంది.
    "నీ సలహాకీ థాంక్స్ నమస్కారం పెడ్తూ అన్నాను.
    ఇంతలో సమీర్ వస్తూ కనిపించాడు.
    "నీ కుర్రాడోస్తున్నాడు నే పోతాగానీ... రేపు మన  కాలేజిలో   ఓల్డ్  స్టూడెంట్స్  మీట్ వుంది. సాయంత్రం  నేనే మీ ఇంటికి  వస్తా.... రెడీగా  వుండు కలిసి వెళ్దాం... బై "అంటూ  తూనీగలా  వెళ్ళి జనంలో కలిసి పోయింది.
    నేనింకా సంభ్రమంలోంచి తేరుకోలేదు. ఎంత యాదృచ్చికం! నిన్నరాత్రే అనుకున్నాను నా ఓల్డ్  ఫ్రెండ్స్  ఏమై పోయరోననీ! అప్పుడే వాళ్ళని  కలిసే అవకాశం వచ్చింది. అంటే.... ఈ వ్యవహారంలో దైవకృప వుందన్నమాట!
    థాంక్ గాడ్! మీరుకూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయరేమోనని కంగారుపడ్తూ వచ్చాను" అన్నాడు సమీర్.
    నా దృష్టి సడెన్ గా ఆడిటోరియంలోకి వెళ్తున్న  వివేక్, తన్మయిల మీద  పడింది.
    "సమీర్.... పెయింటింగ్ గురించి నాకు  కాస్త వివరిస్తారా? అర్థింపుగా అడిగాను.
    "ఓ ఘ్యార్!" అతను ఆనందంగా దారితీశాడు.
    వివేక్ తన్మయిలు వస్తుంటే  వాళ్లకి అభిముఖంగా మేం నడిచాం.
    సమీర్ మధ్యలో ఆగిపోయి ఏదో వర్ణిస్తూవుంటే, నేను అతని భుజంమీద కొట్టి "అటు వెళ్దాం" అని ముందుకి చూపించాను.
    వివేక్ కళ్ళు ఈ దృశ్యాన్ని ఓ సెకన్ పాటు  వీక్షించి, వెంటనే కదిలిపోయాయి!
    సమీర్  నా చెయ్యిపట్టి లాగుతూ "ఈ కలర్ కాంబినేషన్  చూశారా? ఆరెంజ్ లో  ఎల్లోకలర్ మిక్స్ చేస్తే  ...సంధ్యకాంతులు!" అని వర్ణిస్తున్నాడు.
    నేను అతని చేతిని  విడిపించుకుని, చిరాగ్గా  చూస్తూ "ఇంక  పోదాం...బోర్ గా వుంది" అన్నాను.
    అతని కళ్ళు వెంటనే  ఉత్సాహంతో మెరిశాయి! తను  ఇంజనీరింగ్ స్టూడెంట్ ననీ, ఏక్టింగ్ అంటే   ఇంట్రెస్ట్ అనీ, బొమ్మలంటే అభిరుచనీ, ఇంకా  తన  హబీలూ, ఆశయాలూ, ఆశలూ అన్నీ చెప్తూనే వున్నాడు. ఆ వయసు  అలాంటిదేమో! వినేవాళ్ళుంటే చాలు విశేషాలు  పురుడుపోసుకుంటాయి.
    నేను నవ్వుతూ ఓపిగ్గా  అతను  చెప్పేవన్నీ విన్నాను.
    "మరి మీ  గురించో?" అన్నాడు.    
    నేను నా బ్యాగ్ లోంచి కాయితం తీసి నా ఫోన్  నెంబర్ వ్రాసిచ్చాను. అతని మొహం వెలిగిపోయింది. "నేను  నా ఫోన్ నెంబర్ మీకు  ఫోన్ చేసి చెప్తాను" అన్నాడు చిన్నపిల్లాడిలా.
    నేను "బై" అని కదులుతుంటే ఠక్కున  నా చేతిని అందుకుని "సి యూ!" అని  నొక్కి వదిలాడు.
    నేను అవాక్క యిచూశాను అతని మొహంలో అదే  చిరునవ్వు. "నా ఫోన్ కోసం  వెయిట్ చేస్తుండండి"అన్నాడు. నేను అతన్ని ఏమీఅనలేక వడివడిగా వచ్చేశాను. ఇంటికి వస్తూవుండగా  కార్లో వివేక్ అన్నాడు- "నీ బోయ్ ఫ్రెండ్ నాకు నచ్చాడు"
    "నాకు కూడా ...." అనేశాను. ఔను... నిజంగానే నాకు నచ్చాడు నన్ను 'ఆంటి' అని పిలవనందుకు!
                                                        *        *        *
    స్కూల్లో  మూడోరోజు దిగ్విజయంగా జరగబోతోంది అని నేను  అనుకుంటూవుండగానే ఈ  అవాంతరం ముంచుకువచ్చేసింది. స్కూల్లో ఇలాంటివి జరగవచ్చని  నేను అస్సలు  ఊహించలేదు!
    నేను ఎనిమిదో తరగతిలో హిస్టరీ  పాఠం   చెప్తున్నాను. హిస్టరీ  నాకు ప్రియమైన  సబ్జెక్ట్!
    తాంతియాతోసే, రాణీలక్ష్మీబాయిలు బ్రిటీషువారి మీద ఎలా  తిరుగుబాటుచేశారో చాలా  ఉత్సాహంగా వివరిస్తున్నాను. పిల్లలు కూడా అల్లరిచెయ్యకుండా బుద్దిగా వింటున్నారు దేశం గురించీ, దేశభక్తుల గుంరిచీ చెప్తూవుంటే నాకు తెలియకుండానే కళ్ళు తడిగా మార్తయి! అదేనేమో ఆర్ద్రత అంటే!
    అంతా  నిశ్శబ్దంగా వింటున్నారు. కేవలం నా గొంతు  మాత్రం  క్లాసులో  అందరికన్నా  పొడుగ్గావుండే పోకిరీ పిల్లాడు లేచి  నిలబడి, అదోలా నవ్వుతూ "చోళీకే పీచే క్యాహై ....చున్ రీకే నీచే క్యాహై?" అన్నాడు
    నేను  ఒక్కనిమిషం కట్రాటలా బిగిసి  నిలబడ్డాను. వాడు అడిగేదేమిటో నాకు అర్ధంకాలేదు. అంతలోనే తేరుకుని  "ఏమన్నావు?" అన్నాను.
    వాడు అంత  ఆవేశం ఎప్పుడూ కలగాలేదు.
    కర్ర తీసుకుని  వాడి దగ్గరకు  వెళ్ళి "చెప్తాను చేతులు పట్టు!" అన్నాను.
    వాడొకసారి ఎగతాళిగా చూసి, విలాసంగా చేతులు జాపి నిలబడ్డాడు. ఆ భంగిమ మరీ అసహ్యంగా అనిపించింది. కర్ర ఎత్తి  విసురుగా వాడి అరచేతుల్లో కొట్టడం ప్రారంభంచాను. అది హిస్టరీక్లాసు కాకపోయినా, దేశం గురించి నేను  ఎమోషనల్  గా  పాఠం చెప్తుండగా వాడలా అడగకపోయినా అంతగా  కొట్టేదాన్నికాదేమో!
    వాడు  కాసేపటికి పొగరంతా పోయి  వలవలా ఏడవడం ప్రారంభించాడు.
    "జాగ్రత్త! ఇంకోసారి పెద్దాచిన్నాలేకుండా ప్రవర్తించకు" అని చెప్పి క్లాసులోంచి వచ్చేశాను.
    స్టాప్ రూమ్ లోకి చిగురుటాకులా వణకసాగింది. నేను  పుట్టి బుద్దేరిగాక ఎవ్వరిమీదా  చేయి చేసుకోలేదు!
    ప్యూన్ వచ్చి "అనూహ్య మేడమ్ ని సార్  పిలుస్తున్నారు"  అని చెప్పాడు.
    నేను లేచి నడుస్తుంటే ఒళ్ళు తూలిపోసాగింది. ఎలాగో అధీనం చేసుకుని  ప్రిన్సిపాల్ రూమ్ లోకి అడుగు పెట్టాను. అక్కడ నేను ఇందాక కొట్టిన పిల్లవాడున్నాడు! వాడి వెనకాల ఓ మాంత్రికుడు లాంటి వ్యక్తి, పెద్ద కుంకుమబొట్టుతో, ఖద్దరు బట్టల్లో కుర్చీలో కూర్చునివున్నాడు.
    సార్ నన్ను  చూడగానే మండిపడ్తూ "ఏంటిది? పిల్లాడ్ని అట్లానా కొట్టడం? ఎవరనుకున్నావ్? కౌన్సిలర్ గారి అబ్బాయి!" అన్నాడు.
    నేను కోపాన్ని దిగమింగి, సహనాన్ని  అరువుదెచ్చుకుని "అసలేం జరిగిందో మీకు తెలుసా?" అన్నాను.
    "సర్లే.... ముందు ఆయనకీ,  ఆ పిల్లవాడికీ సారీ చెప్పు" అన్నాడు పురుగుని విదిలిస్తున్నట్లుగా.
    నాకు  మతి పోయింది. చెప్పేది వినిపించుకోడేం? నేను ప్రిన్సిపాల్ వైపు తిరిగాను. ఆవిడ తనకేం పట్టనట్లు కొన తో అరచేతిలో గోరింటాకు పెట్టుకుంటోంది.
    "అసలు  అతను ఎలాంటి అసభ్యకరమైన ప్రశ్న వేశాడో తెలుసా  మేడమ్?" అని అడిగాను.
    ఆవిడ ఓసారి బ్లాంక్ గా చూసి మళ్లీ తన పని  తను చేసుకోసాగింది.
    ఖద్దరు బట్టలు ఆసామి లేచి కిటికీలోంచి పాన్ తుపుక్కున ఉమ్మి నోరువిప్పాడు. పెల్లగాళ్ళకి పాఠలు చెప్పునీకి వచ్చినావా  లేకుంటే తన్నుడు తన్ననీకి వచ్చిన్నావా? నా పోరాగాడే దొరికిండా నీకు? నేనే అడుగుతున్న ఇప్పుడు....చోళీకే ఫీచే క్యాహై? చెప్పు! చెప్పనీకి సమజ్ చేయనీకి కాదా నీకు తనఖా ఇస్తున్నది? చెప్పు? చునురీకీ నీచే క్యాహై.... అంటే  అర్ధం  ఏంది?" అభినయంచేస్తూ అడిగాడు.
    నా శరీరంలోని రక్తం అంతా మొహంలోకి తను కొచ్చినట్లుగా ఫీలయ్యాను. అలవాటు లేని అవమాన భారంతో, దుఃఖం నా శరీరం కంపించసాగింది.
    "ఏం సారీ  చెప్తే నీ సామ్మేం పోతుంది?" కోపంగా అడిగాడు సార్.
     ఖద్దరు లాల్చీ మాంత్రికుడు మరోసారి కిటికీలోంచి తుపుక్కున ఉమ్మాడు తెల్లని గచ్చుమీద అసహాయుల రక్తం చారల్లా పడింది అతడి లాలాజలం!
    "పోన్లే ఆడది ఇడిసేయ్... అయిదువందల కోసం  కొలువుచేసే దానికి గింత పకరుంటే మంచిది కాదు! పో....పోయి నీ పని సూస్కో "అన్నాడు.
    సార్ అందుకుని "చూశావా అన్న ఎంత పెద్దమనిషో? సారీ చెప్తే నీ సొమ్మేం పోతుందీ?" అన్నాడు.
    "నోర్ముయ్!" నేను  అంత గట్టిగా అరవగలనని అప్పటిదాకా నాకే తెలీదు!
    నా అరుపుకి ప్రిన్సిపాల్ చేతిలోని కొన్ ఆకస్మాత్తుగా జారిపోయింది.  
               

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra