Home » Dr jandhyala papayya sastry » Karunasree Saahithyam - 2

           
                                  విషాదము
    అర్జునుఁడు

    అగుమాగు మొకింత బావా!
    అమదీయ హృదంతరమ్మున
    ఆగికోలేకుంటి భావా!
    వేగ మిది యేమో!

    మారుచున్నది యంతకంతకు
    మాధవా! నా యంతరంగము
    క్రొత్త భావన లేవియో తల
    లేత్తుచున్నవి.
    
    దేహమా కంపించుచున్నది.
    "ద్రోహమా' యనిపించుచున్నది
    మోహ మేదో కుంచుచున్నది
    స్నేహ బంధములన్.

    గాండివము చెవీడుచున్నది
    గుండె గజగజలాడుచున్నది
    ఎండుచున్నది గళము, నే ని
    ల్చుండలే నింకన్.

    బంధుగుల మ్రందింప భావం
    బందు సందియు ముద్భవించెను;
    అందఱను హతమార్చి నే నే
    మందుకోగలనో?

    వలదు జయలక్ష్మీ వికాసము
    వలదు రాజ్య రామా విలాసము
    వైభవోజ్జ్వల సౌద వాసము
    వలదు వలదయ్యా!

    శ్రీకృష్ణుఁడు

    ఇదియేమీ! ఇదియేమీ! యేమిది కిరీటి! ఈ వృధావిస్మయా
    స్పద నిర్విన్నత కర్ధ మేమి? గ్రహదోషమ్మో! పరీహసమో!
    మదిరాపాన మహాత్త్వమో! నిరురలో మాటాడుచున్నావో! నీ
    హృదయమ్మున్ బదిలమ్ము సేసికొనుమోయీ! సుంత వీరాగ్రణీ!

    గాండీవమ్మిది చేయిజారినది, మై కంపించెడిన్ , బాష్పముల్
    నిండెన్ కన్నులయందు - ఏమిటిది కౌంతేయా! ద్విషత్ సైన్యముల్
    "బండార మ్మది బైటపడ్డ" దని వేళాకోళముల్ సేయరే!
    రెండే రాజుకు "స్వర్గమో, జయమొ ' వేరే మార్గమే లేదిఁకన్!
    
    అంగేశుం గని భీతి నందితివో? ద్రోణాచార్యు వీక్షించియే
    కంగారేత్తెనో? ధార్త రాష్ట్రశతమే కంపమ్ము కల్గించేనొ?
    గంగానందను గన్న కాతరతయో? కాకున్న సంగ్రామమే
    సింగారమ్మగు రాచపుట్టువున కిస్సీ! యింత వైక్లబ్యమా?

    ఇందరు శౌర్యధైర్యధనులే! సమరంగణసార్వభౌములే!
    సందియ మింతలే డయిన సార్ధక మేమి! అధర్మపక్షులై
    ముందుకు వచ్చి వ్రాలిరి సమూహముగా; మన వింటి దెబ్బకున్
    జిందరవందరై పడి నశింపక తప్పదయా! ధనంజయా!

    అర్జునుఁడు

    గాండివము మోపెట్టవలెనా!
    కంఠములు దునుమాడవలేనా!
    మొండెములతో భండనస్థలి
    నిండిపోవలెనా!

    తాతలను తండ్రులను గురువుల
    భ్రాతలను పరిమార్చుటకు నా
    చేతులాడుటలేదు, నే నెటు
    సేతు సంగరము?

    అప్తమిత్రుల నసుఁగు పుత్త్రుల
    సదయహృదయముతోడ బలిగొని
    తృప్తిపడునో మనసులోపలి
    తృష్ణ , శ్రీకృష్ణా!

    ఖాండవము దహియించునప్పుడు
    ఖండపరశువు నోర్చునప్పుడు
    పొందుసూతి యేఱుంగఁడిట్టి య
    కాండతాండవము.

    ఎంతపని కొడిగట్టుచుంటిని!
    ఎంత ఘోరము సేయసుంటిని!
    భ్రాంతమై స్వాతమ్ము చింతా
    క్రాంత మగుచుండెన్.
    
    సిద్దవందితచరితు; కురుకుల
    వృద్దు; గాంగేయుని; పితామహు
      యుద్దమున దయమాలి విశిఖా
    విద్దు చేయుదునే!

    ఆర్యజనసన్నుతుని ద్రోణా
    చార్యు మద్గురుదేవు; కార్యా
    కార్యమూధుఁడనై యేదుర్చుట
    గౌరమ్మగునే?

    రాజ్యలోభాక్రాంతమతితో
    సజ్యమగు గాండివము గైకొని
    పూజ్యపాదుల మీఁదనా నా
    పురుషకారమ్ము!

    దుష్ట దుర్యోధనుఁడు లోభా
    కృష్ణ నిష్టుర మానసుండై
    ఇష్టజన విధ్వంసనమ్మున
    కిష్టపడినాఁడు.

    ధూర్తమతినై స్వార్ధమున కల
    ధార్తరాష్ర్తుల కసిమసంగిన
    కీర్తిగండునొ రాజ్యకాంక్షయు
    పూర్తిచెందునొకో!

    ఇట్టి దారుణ మారణ క్రియ
    కెట్టు లోర్చు మదీయహృదయము?
    కొట్టనీ! కౌరవులు, చేతులు
    కట్టుకొనియుందున్.
    
    త్రిజగతీరాజ్యమ్మె రానీ
    విజయ నామమె మాసిపోనీ
    స్వజనమును హింసింపఁజాలను
    నిజ సుఖమ్మనకై.
    
    గోడుగోడున నాలుబిడ్దల
    నెడిపించి, సమస్త రాజుల
    వాఁడి శరములఁ ద్రుంచి, నెత్తురు
    కూడు దినఁజాలన్.

    కక్షమెయి పోరాడుకొని యిరు
    పక్షముల నెందరు నశింతురో?
    రక్ష కలదే జాతి కింక? కు
    లక్షయము కాదే?

    "ధర్మ సమ్మూదమ్ము" చేతము,
    ఘర్మ కణ సంప్లుతము గాత్రము,
    మర్మములు దెగఁగోయు శోకము
    మాటి మాటికిని.

    పుణ్య పదవీ భ్రష్ణుఁడను "కా
    ర్పణ్య దోష హత స్వభావుండ"
    గణ్యమగు కర్తవ్య మార్త శ
    రణ్య! తెల్పఁగదే!
    
    శ్రీకృష్ణుఁడు

    చిక్కని పోటుమానిసి విసీ! నసిదప్పి త్రపాకరమ్ములౌ
    వాక్కులు పల్క ఁజొచ్చితి వవారిగ, వైరిగాణమ్ము మధ్య; నేఁ
    డెక్కడనుండి యూడిపడే నింత వివేకము నీకు; నవ్వరే
    "పక్కున' నీ యకాల సముపస్థిత శేముషిఁ గాంచి భూపతుల్!

    చిత్తము చిక్క బట్టుము; త్యజింపుము బేలతనమ్ము; మోము పై
    కేత్తుము , ధైర్యమున్ జెదరనీకుము; కొంపలు మున్గునయ్య నీ
    తత్తరపాటు నీ ముఖవిధంబు పరుల్ పసిగట్టిరేని; పో
    నిత్తు రధమ్మునా తరువు నీడ; కటన్ వినిపింతు నంతయున్.

                                 ప్రబోధము
    శ్రీకృష్ణుఁడు
    
    అల వారాణసి కౌరవోజ్జ్వలిత లక్షాగార రూక్షారుణ
    జ్వలన జ్వాలిక లీ నిమేషమునకున్ జల్లారలేదే! మహో
    జ్జ్వల గాండీవము సజ్యమై శరములన్ వర్షింపనేలేదె! ఈ
    చలి నీ కెక్కడ దాపురించినది? సంస్తంభించే సర్వాంగముల్!

    అంధత్వమ్మున గన్నుగాన కలనా; డా గ్రుడ్డిదర్బారులో
    గాంధారేయులు కాలదాన్నిరి జగత్కల్యాణ సంబంధియౌ
    సంధిన్; సల్పిన సంప్రదింపు లేదురై సంధించే; గాండీవమే
    సంధింపన్ బని గల్గె, లే వితరధా సంబంధబాంధవ్యముల్!

    తప్పదు హింస; ఎందుకు వృధావ్యధ నీకు? రధమ్ము వెన్కకున్
    ద్రిప్పితినేని సాయమరుదెంచిన యిందురు ధారుణీపతుల్
    దెప్పరటయ్య! మీసములు ద్రిప్పితి రా సభలోన; నాఁడటుల్
    గొప్పలు పల్కి నేఁడిటు దిగుల్వడి దిగ్బ్రమ నందఁజెల్లునే?

    అర్జునుఁడు

    గుండెలు రాయి చేసికొని, క్రూరుఁడనై కురురాజు సేనపై
    గాండివ మెక్కు పెట్టి, రిపుకంఠవిలుంఠన మాచరించి యీ
    భండనభూమి, తద్రుధిర పారణ మత్త పిశాచ డాకినీ
    మండల తాండవమ్ముఁ గన మామకమానస మొప్ప దచ్యుతా!

    ఇంక రణోత్సుకత్వము వహింపఁగఁజాలను; బాహువుల్ త్రపా
    సంకుచితమ్ము - లాత్మజన సంహరణక్రియ కంతరంగ మా
    శంకిత - మా మహేశ్వరుని సాక్షిగ, చాలక గాదు, పోరికిన్
    జంకియుఁ గాదు, క్రుంకు లిడఁజాలను రక్తనదీనదమ్ములన్!

    పెద్దన్నయ్య యహింసయే మదికి సంప్రీతిన్ సమర్ధించే; నా
    యుద్దేశమ్ములు మారెఁ, గ్రమ్ముకొనే , నెవో మోహమేఘమ్ము; లీ
    గద్దేల్ మిద్దె లశాశ్వతమ్ములు; మిధఃకార్పణ్యముల్ చాలిఁకన్
    వద్దయ్యా! పరపక్ష మారణ రణవ్యాపార పారీణతల్!

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra