Home » Adivishnu » Rakshasi Neeperu Rajakeeeyama


    ప్రసాదానికేం చెప్పాలో తోచలేదు. అందుచేత అతను మౌనంగా ఉండిపోయేదు.
    మళ్ళా సుమతే అన్నది ------
    "రామదాసుగారు సహ్రుదయులని విన్నాను. మా విషయంలోనూ అయన సహృదయతతో వ్యవహరిస్తే నా కధ ...... ఈ సుమతి కధ ...... సుఖాంతమే అవుతుంది..... అలా కాక నాగీత సరిలేకపోతే ప్రాణత్యాగ మొక్కటే నాకు రాసి పెట్టి వుంది ప్రసాదం గారూ! అదొక్కటే మార్గం..... నా అవివేకానికీ, నా తొందరపాటుకీ అదొక్కటే శిక్ష కానీ! ..... కాని ..... ప్రసాదం గారూ! అమ్మవుంది చూశారూ.... పాపం .... నా తర్వాత అమ్మ ఏమైపొతుందంటారు? నన్ను ప్రాణ సమానంగా పెంచింది. నాన్న లేని కొరత నాకు తెలీనివ్వలేదు. మరి, నేను చచ్చిపోతే అమ్మకెంత కష్టమో చెప్పిండి? ...... కనీసం ఊహించండి ..... నేను బతికి అమ్మని సుఖ పెట్టాలంటే రామదాసు గారు సవ్యంగా వ్యవహరించాలి. ఇది రెండు ప్రాణాల సమస్య! ఒక్క ఆడదాన్ని. నా చాతనవుతుందంటారా? అంత ధైర్యం నాకున్నదంటారా? ...... వారితో నేనోక్కర్తిని మాటాడి ఈ సమస్యని పరిష్కరించగలననే నమ్మకం మీకుంటే ,  మీరు తిన్నగా , మీకేం పట్టనట్టు సిరిపల్లె వెళ్ళిపొండి..... మీ ఇష్టం .... చెప్పవలసిన దంతా చెప్పాను. తర్వాత మీ యిష్టం ."
    ప్రసాదం లేచి నించున్నాడు.
    "వెళ్ళి పోతున్నారా?" అనడిగింది ఆందోళనగా సుమతి.
    'సిరిపల్లె వెళ్ళను. తల్లి తండ్రులకీ అన్నదమ్ములకీ మాత్రమె చెప్పవలసిన మీ కధ - నాకు చెప్పేరు. విని వూరుకుంటే మీరు నా కిచ్చిన గౌరవాన్నీ , స్థానాన్నీ దక్కించు కోలేని వాడినవుతాను. ఆలనా డెప్పుడో మీ తొందరపాటు ప్రేమని తృణీకరించెను. నిజమే. ఇవాళ మీరిచ్చిన గౌరవాన్ని మాత్రం కాదనను. అనలేను. నాచేతనైన సాయం నేను తప్పకుండా చేస్తాను." అన్నాడు ప్రసాదం.
    సుమతి కళ్ళల్లో నీళ్ళు మరీ ఉదృతంగా పొంగి వచ్చాయి. మోకాళ్ళ మీద తలవొంచి అన్నది -------
    "దెంక్సండి. చాలా దెంక్స్!"
    
                               *    *    *

    రామదాసు మేడ మెట్లు దిగి వస్తుండగా హల్లో సోఫాలో కూచున్న, ప్రసాదం వినయంగా లేచి నించున్నాడు. చేతులు రెండూ జోడించి నిలబడ్డాడు.
    రామదాసుగారు తిన్నగా ప్రసాదం ముందున్న సోఫాలో కూచున్నారు. కూచుని అన్నారు.
    "నువ్వూ కూచో!"
    ప్రసాదం సోఫాలో ఒదిగి ఒదిగి కూచున్నాడు. ప్రసాదాన్ని చాలా పరిశీలనగా చూశారు రామదాసు. ఇంకా చూస్తూనే , ఉలిక్కి పడి చూపు మార్చుకున్నారు.
    "ఎవరితను? అని గూడ అనుకున్నారు.
    "నీ పేరేమిటి?" అని అడిగేరు.
    "ప్రసాదం!"
    "మా వాడితో పాటు చదువు కుంటున్నావా?"
    'అవునండీ?"
    "ఆ ..... ఏమిటి నాతొ నీకొచ్చిన అవసరం? అర్జంటా?
    "సావకాశంగానే మాటాడవలసిన విషయం. నేనోచ్చింది పని మీద కాదు. మీరు చేయబోయే సాయం కూడా నాకు కాదు."
    "ప్రొసీడ్ !"
    'అసహాయస్థితిలో వున్న ఒక ఆడపిల్ల తరపున వచ్చెను"
    రామదాసు సాలోచనగా ప్రసాదం మొహంలోకి చూశారు. (అదే రూపు!) ఆ మొహాన్ని చూసి మళ్ళీ భయంతో చూపు మార్చుకున్నారు.
    'ఆ ఆడపిల్ల గూడా మీతో పాటు చదువు కుంటుందా?"
    "అవునండీ!"
    "సేసో! అయితే ఆడపిల్లలు - అందునా - అసహాయస్థితిలో వున్నఆడపిల్లలకి నువ్వు లీడరువా?"
    "ఆమె నా స్నేహితురాలు!"
    "రైట్ ....... విషయం చెప్పు ."
    ప్రసాదం సర్దుక్కుచున్నాడు. కధ నెమ్మదిగా ప్రారంభించేడు.
    "నేను చెప్పేది పూర్తిగా వినండి. న్యాయాన్యాయాలు విచారించండి. న్యాయమేదో మీరే చెప్పండి. మీరు పుర ప్రభువులు. మీ ఏలుబడిలో మేము వున్నాం. మీరు న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడే రక్షకులు. ఈ పవిత్రమైన విధి నిర్వహణలో చుట్టరికాలూ, ఆత్మీయతా ఈ మొదలైన వాటికి మీరు లోబడరు. విధి నిర్వహణని నిర్లక్ష్యం చేయరు. చేయగూడదు గూడాను."
    "ఉపోద్ఘాతం నా కోదిలేయ్. చెప్పవలసిందేదో తిన్నగా చెప్పు."
    "ఆ పిల్ల పేరు సుమతి!"
    "నీ స్నేహితురాలన్నావు గదూ! కానివ్వు."
    "మీ చిరంజీవి సుమతిని ప్రేమించేడు. పెళ్ళి కూడ చేసుకుంటానని మాటిచ్చాడు. సుమతితో చిరంజీవి చాలా దగ్గరై పోయి, ఇద్దరూ ఒకటేలా తిరిగారు. బహుశా - చిరంజీవి మీకా విషయం చెప్పి ఉండడు. ఇప్పుడు గర్భవతి. సుమతిని యిప్పుడు పెళ్ళి చేసుకోనని , గర్బస్రావం చేసుకున్న మీదట తన నిర్ణయం చెబుతానని చిరంజీవి సుమతితో అన్నాడు. పెళ్ళి కాక మునుపే అతను తండ్రయినట్టు మీకు తెలిస్తే మీరు తన్నేం చేస్తారో నని అతని భయంట. ఈ సమస్య మీ చేతుల్లో పెడుతున్నాను. మీరు పెద్దలు. చిరంజీవికి తండ్రే గాకుండా- మా అందరికి పితృ సమానులు. మీరు వాళ్ళ తొందరపాటుని క్షమించి, వాళ్ళ వివాహాన్ని మీ చేతుల మీదుగా జరిపిస్తారని ఆశతో వచ్చేను. ఈ మేలు చేయండి సార్!" అన్నాడు ప్రసాదం.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra