Home » Suryadevara rammohan rao » సూపర్ స్టార్


    మొఖం, మెడ, భుజాలు, కడుపు, పొత్తికడుపు సాప్ట్ గా ఉన్నాయి. తనలో శారీరకంగా వచ్చిన మార్పులకు సంతృప్తిపడ్డాడు ఆనందించాడు.

    అప్పుడు.....అతనిలోని నిరాశ, నిస్పృహలు, సంతృప్తి, అసహనం అదృశ్యమయ్యాక....అప్పుడు తిరిగి తను టేకప్  చేసిన కేసు గురించి ఆలోచించసాగాడు.

    చిన్న అనుమానమని నిర్లక్ష్యం చేయవద్దు.....

    ఎక్కడ లాజిక్......రీజనింగ్ ఎండ్ అయితే అక్కడే కొత్త ఆలోచనలకు  శ్రీకారం చుట్టు......

    నేరపరిశోధనకులు లాజిక్ మీదే ఆధారపడాలితప్ప.....డ్రామా మీద కాదు.

    కేసుని ఎక్కడ ఆరంభించాలో.....ఇప్పుడెక్కడున్నావో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో......ఆ కేసులోనిదశల్ని, పరిణామక్రమాన్నీ స్ఫురణకు తెచ్చుకొని తిరిగి ఆలోచించు.....

    ఒక పెన్సిల్.....పేపర్   తీసుకో.....

    కేసు ఎక్కడ ప్రారంభమయిందో మార్క్ చేయ్....

    ఆ పైన దాని దశల్ని రాసుకుంటూ వెళ్ళు....

    జయధీర్..... గొప్ప తెలివితేటలుగల నేరస్థుడు.....

    అంతర్జాతీయస్టాయి నేరస్థుడు.....

    ఎవరన్నారు? ఎవరు అతనికి ఆ బిరుదునిచ్చారు.....? కొత్త ప్రశ్న ప్రభులో రెయిజ్ అయింది.

    ఆ ప్రశ్నకు ఎదురుగా ఎఫ్.బి.ఐ, వాషింగ్టన్ డిసి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా....కొత్త సమాధానం వచ్చింది.

    ఏ బేస్ తో ఎఫ్.బి.ఐ. జయధీర్ ని అలా గుర్తించింది....? మరో ప్రశ్న రెయిజ్ అయింది ప్రభు మనస్సులో.....

    తనకు తెలీదు..... అని రాసుకున్నాడు. ఆ పైన తన తెలీనితనానికి, మందభాగ్యానికి సిగ్గుపడ్డాడు.

    ఇండియన్ పోలీసులు ఆకలి మంటను భరించలేక పడుపువృత్తి చేసుకునే అభాగినుల్ని, రోడ్ మీద గీత దాటే వెహికల్ యజమానుల్ని, లాకప్ లో ఉన్న ఆడకూతుర్ల ధనమానాల్ని దోచుకోవటానికే పనికివస్తారు తప్ప- నేరపరిశోధనకు, శాంతి భధ్రతల్ని కాపాడటానికి పనికిరాని వ్యంగ్యంగా చెప్పే విదేశీ పోలీసుల సూటి విమర్శ గుర్తుకు వచ్చింది. మరింత సిగ్గుపడ్డాడు ప్రభు. తను ఐ.పి.ఎస్.....ఇండియన్ సర్వీస్.... గొప్ప అర్హత...పదవి....అధికారం... జీతం.... కారు.... క్వార్టర్స్.....ఏసీ ఆఫీసు.... క్రింద పనిచేసే సిబ్బంది.....ఆర్థిక బలం..... న్యాయవ్యవస్థ సహకారం. ప్రభుత్వపు అండ..... కాని  తను మాత్రం నేరపరిశోధకులకు ప్రామాణిక గ్రంధాయిన ఎఫ్.బి.ఐ, స్కాల్ లాండ్ యాడ్, ఇంటర్ పొల్ డైరీలనుకాని, ప్రచురణల్ని, కొత్తపద్దతుల గురించి వ్రాసిన పుస్తకాలనుకాని చదవలేదు. నేను ఒక పేదపాఠకుడ్ని...ఐయామ్ ఏ పూర్ రీడర్.... నిత్య విజ్ఞాన్వేషినికాను....షిట్.....నా చైతన్యం ఒక బుల్ షిట్.... ఇక పై వాటన్నిటిని చదివి వంటబట్టించుకోవాలి....తన తప్పుల్ని తెలుసుకొని మంచినిర్ణయానికొచ్చాడు ప్రభు.

    మానసిక ఒత్తిడిలేనందువల్ల తీసుకున్న గొప్ప ప్రభు.

    ఎస్.బి.ఐ జయధీర్ ని అంతర్జాతీయ స్థాయి నేరస్థుడిగా గుర్తించటానికి గల కారణాలు.... అతనిపై వాళ్ళు మోపిన కేసులు..... అతన్ని పట్టుకొనేందుకు వాళ్ళు చేసిన ప్రయత్నం.....ఆ సందర్బంలో వాళ్ళు సేకరించిన సాక్ష్యాలు.... గుర్తులు.....

        గు...ర్తు...లు...
        పుట్టుమచ్చలు....
        ప్రత్యేక గుర్తులు...
        ఎత్తు....లావు...రంగు...
        జుత్తు....కళ్ళు....అలవాట్లు...

    సెంటిమెంట్స్....ఆరు అంకె సెంటిమెంట్ .....సరికొత్త ఆలోచననలు....శోధనా.....ప్రభులో ఆరంభమయ్యాయి....సాధ్యమయినంతవరకు పక్కా విచారణ....వివరాల సేకరణ. అసాధ్యమయిన చోట ఒక దానికొకటి జాయింట్ చేసి ఆలోచించటం..

    ఒక.....దాని.... కొకటి....జాయింట్..... చేయటం....?. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఆరోజు ....అదే ప్లైట్ లో జయధీర్ దిగాడు....పక్కా నిజం.... తిరుగులేని సత్యం.....స్యూయార్క్ లో టేకాఫ్ అయినా పాలమ్ ప్లైట్ మధ్యలో ఎక్కడా ఆగదు....వయా లేదు..... ఢిల్లీలోనే లాండ్ అవుతుంది. సో..... జయధీర్ వచ్చాడు.... ఎలా వచ్చాడో తెలుసు...ఎందుకొచ్చాడు....? ఎందుకొస్తాడు..... డబ్బుకోసం....అమ్మాయిలతో సుఖపడటం అతని కలవాటు.... అది ఏ దేశంలో ఉన్నా మర్చిపోలేడు... వుమెన్.....వైన్.....వీక్ నెస్....డబ్బులెలా సంపాదిస్తారు..... తన తెలివి తేటలతో పథకాల్ని సిద్ధంచేసి అవసరమైన వారికి అమ్ముకుంటాడు.... ఢిల్లీలో దిగి ఏ దిశగా వెళ్ళాడు.....ముందు రిలాక్స్ అయ్యే గుణం అతనికుంది ఆ తరువాతే పథకాల గురించి ఆలోచిస్తాడు.  ఇప్పుడు గోవా వెళ్ళి ఉండవచ్చని జాయింట్ చేస్తే..... చేసే చూస్తాను.... గోవాలో అమ్మాయితో..... రెండు కొబ్బరిచెట్ల మధ్య వేలాడదీసిన నైలాన్ ఉయ్యా.... అందులో బికినీ డ్రస్ లో ఓ సెక్స్ బాంబ్.... ఆ బాంబ్ ఎక్కడనుండి వచ్చి ఉండవచ్చు.... గోవానుంచే...... డబ్బుంటే గోవాలో దొరకని సుఖం లేదట.... అది జయధీర్ కి మాత్రం తెలీదా....? తెలుసు..... వరల్డ్ ఫేమస్ బీచ్ రిసార్ట్స్ లిస్ట్ లో గోవా ఉంది..... కొంతమంది మగవాళ్లు ఇంటర్ కోర్స్ అయ్యాక బాగా రిలాక్సయి గొప్పగా ఆలోచిస్తారు..... తెలివిగా ప్రవర్తిస్తారు..... ఉత్సాహంగా పనిచేస్తారని ఒక ఎమినెంట్ మానసిక శాస్త్రవేత్త వ్రాయగా తను చదివాడు.

    గోవా కేసట్ ని ఎడిట్ చేసివ్వమని అడిగిన వ్యక్తి జయధీర్ కాని జయధీర్ మనిషికాని అయుండవచ్చు. పరిశోధనలో ముందుకువెళ్తే...? వెళ్తాను.

    హంపీ ఎడిట్ చేసిస్తానని ప్రామిస్ చేసింది.

    విల్సన్ కూడా ప్రామిస్ చేసాడు.

    వాళ్ళిద్దరూ మంచివాళ్లు.....మాటకు కట్టబడేవాళ్లు.... డబుల్ గేమ్ ఆడే నేచర్ లేదు.....ఆ ప్రయత్నంకూడా వాళ్లు చేయలేదు..... అవకాశం వచ్చిందిగదాని గోవా అజ్ఞాత వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేయలేదు.... చేసే ప్రయత్నంకూడా జరగలేదు. వాళ్ళకా అవసరం లేదు- అక్రమంగా డబ్బుసంపాదించాలనే ఆలోచన ఉన్నవాళ్లు కాదు - రమణీ క్రియేషన్స్ సీరియల్ షూటింగ్ లోపడి తీరికలేక వాళ్ళాపని చేయలేదు.

    పైగా గోవా టూరిస్ట్ ఎట్రాక్షన్స్ డాక్యుమెంటరీ టెలీకాస్ట్ అయ్యేది. దూరదర్శన్ వాళ్ళ షెడ్యూలు ప్రకారం- ఇంకా నెలరోజులుంది.

    హర్రీలేదు..... ప్రమాదం అంతకంటే లేదు..... నాగర్ల్ ఫ్రెండ్ తో ఉండగా షూట్ చేసారని భావించాను - అది టెలీకాస్టు అయితే నా సంసారం కూలిపోతుందంటూ అజ్ఞాతవ్యక్తి చెప్పిన విధానాన్ని హంపీ వాళ్లు నమ్మారు. ఒకళ్ళ సంసారాన్ని కూల్చే శాడిస్టులు వాళ్ళుకాదు. కానప్పుడు భవానీమీద ఎటాక్ చేసి కేసట్ ని తస్కరించాల్సిన అగత్యం ఏముంది....? అంత తొందరెందుకు........? కానుక ఆ వ్యక్తి జయధీర్ అనే భావించి ముందుకు సాగాలి.

    ఆపైన వినాయక నిమజ్జనం ఊరేగింపులో జరిగిన పకడ్బందీ లూటీలు..... అంత తెలివిగల నేరస్థులు హైదరాబాద్ లో లేరు. ఇక్కడున్న వాళ్ళంతా ఊర నేరస్థులు..... మొరటువాళ్లు...... ఇంటిలిజెంట్ క్రిమినల్స్ కాదు..... ఆ లూటీ చేయటానికి చాలామంది కావాలి. అంతమంది బయట రాష్ట్రాలనుంచి వచ్చే అవకాశంగాని, వీలుకాని లేదు, ఉండదు.

    సో....ఇక్కడవాళ్ళే ట్రైనింగ్ అయి ఉండాలి. అంత కంప్యూటరైజ్డ్ గా ట్రైనింగ్ ఇచ్చిన వాళ్లేవరూ.....? లూటీసొమ్ము.... కోటి పైన ఉండవచ్చని అంచనా..... అంటే జయధీర్ చేయించేదగ్గ లూటీనే....

    లూటీని షూట్ చేశావట......బ్రతకాలని లేదా అనే బెదిరింపు..... బెదిరింపే కాని..... ఆ తరువాత ఫాలో అప్ లేదు..... బెదిరింపు ఫలితాలు కనిపించలేదు- అంటే..... ఎవరో తొందరపడి బెదిరించారే తప్ప....ఆ కేసట్ మూలంగా వాళ్ళకంత ప్రమాదం లేదన్నమాట.....లూటీ చేసిన వ్యక్తులు అస్పష్టంగా కనిపించారు..... వారిలో పాత నేరస్థులు ఉండవచ్చు......ప్రయత్నిస్తే ఒకరిద్దరినైనా పట్టుకోవచ్చు..... అదీ వాళ్ళకు తెలిసుండవచ్చు. కెమేరాకి జూమ్ ఉంటుందని - దాన్ని ఉపయోగించి దూరంగా ఉన్న సబ్జెక్ట్ ని దగ్గరగా చూపించవచ్చని వాళ్ళకు తెలీకపోదు.


        EXTREME CLOSE - UP

    lsolated detail of a subject bills the screen.....అని కూడా తెలీకపోదు.

                BLG CLOSE-UP

    On a person, this shot would bo full face, perhaps even cutting off part of the person's head. అదీ కాకపోతే కనీసం క్లోసప్ తీసినాచాలు.

        CLOSE - UP

    from the shouldery to the top of the head
    Medium close-up: from about the middle of the chest to the top of the head. అని వీడియో కెమేరా బేసిక్స్.... ఇవి నేరస్థులకు తెలీటం, తెలుసుకోవటం పెద్ద కష్టంకాదు.

    ముందు బెదిరించినవాళ్లు ఆ తరువాత మౌనం వహించారు. దీనికి రెండు కారణాలుండవచ్చు - తొందరపడి టెన్షన్ లో బెదిరించినా పెద్ద  ప్రమాదమేమీ ఉండదని తరువాత భావించి ఉండవచ్చు.

    ప్రమాదం ఉన్న నేను తెరముందుకు రానుగనుక నాకు ఢోకా లేదని లేనప్పుడు ఊరకే  ఆందోళన పడి అవతల వారి దృష్టిని ఆకర్షించటమో..... తనవేపుకి తిప్పుకోవటమో ఎందుకని భావించి ఉండవచ్చు.

    ఇకపోతే ఢిల్లీ కేసట్ ని..... అందులో కనిపించే 16వ వ్యక్తిని మేగ్నిఫై చేసి చూడాలి.

    ఆ తరువాత గోవా కేసట్ లో కనిపించే అమ్మాయిని, అబ్బాయిని మేగ్నిఫై చేసి చూడాలి. రెంటిలో ఏదైనా కామన్ గా ఉంటే..... శరీరపు గుర్తులుకాని- వేషధారణగాని - ఏదైనా ఫర్వాలేదు.

    అతనికెంతో అనుమానం రాకపోతే ఊరకే ఎందుకు బెంబేలుపడి ఎడిట్ చేయమని బెదిరిస్తాడు.....? ఖచ్చితమైన అనుమానమే వచ్చి ఉంటుంది. అంటే క్లోజ్ షాట్స్ ఉండి ఉండాలేమో....కాని తనకు కనిపించలేదు.

    ఒకటి.... హంపీ నిజంగానే క్లోజ్ షాట్స్ తీసి ఉండవచ్చు.

    రెండు..... తీసిన నా దృష్టికి రాకుండాచేసి ఉండవచ్చు.... హంపీ సంస్కారవంతమైన యువతి.... సామాజిక స్పృహ ఉన్న మెచ్యూర్డ్ కెమేరా వుమెన్..... ఎధిక్స్ ఉన్న స్త్రీ..... అలా పోలీసుల్ని బోల్తా కొట్టిస్తుందా.... ఆమెకేమిటి లాభం.....? డబ్బుమీద ఆశలేనప్పుడు...... నీతి నిజాయితీలంటే ప్రాణమిచ్చే ప్రిన్సిపల్డ్ యువతీ చీకటి లాభాలకోసం ప్రయత్నించదు.

    పోనీ నష్టమేదన్నా ఉంటుందా.....?:

    అప్పుడు ఉలిక్కిపడ్డాడు ప్రభు....

    నష్టం ఉంటుంది..... అది ఆగంతకుడి మూలంగా కావచ్చు.... సాక్ష్యం చెప్పిన అమాయకుల్ని,క్లూ ఇచ్చిన నిజాయితీపరుల్ని పోలీసులు హింసించటం - అసలు నేరాన్ని, నేరస్థుల్ని పట్టించుకొకపోవటం ఇండియన్ పోలీసు వ్యవస్థకు పట్టిన చెదలు....

    ఢిల్లీ....గోవా.... హైదరాబాద్....

    ఢిల్లీలో దిగాడు.....

    గోవాలో రిలాక్సయ్యాడు.....

    హైదరాబాద్ లో లూటీ పథకం అమ్మి సొమ్ము చేసుకున్నాడు..... ఈ ముగ్గురూ ఒకరే..... ఆ ఒకరు జయధీరే అని పరిశోధన సాగించాలి. దీని మూలంగా నష్టంలేదు - మరో దారికూడా లేదు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra