Home » Balabhadrapatruni ramani » అనూహ్య

  

                                                       11 వవారం  సీరియల్  
    అందరిలోకీ పొడుగ్గా వున్న కుర్రవాడు సడెన్ గా లేచి "ఎక్స్యూజ్ మీ మేడమ్! డ్రీమ్ గరల్ హేమమాలినీ మీకు అక్క అవుతుందా? అదే....ధర్మేంద్ర వైఫ్!..." అన్నాడు.
    ఎందుకు అడుగుతున్నాడో అర్ధంకాక నేను తల అడ్డంగా ఊపేశాను.
    ఒక్కసారిగా పిల్లలందరూ నవ్వడం మొదలెట్టారు.
    నాకు ఒళ్ళుమండి "వాట్ డూ యూ మీన్?" అని అరిచాను.
    వాడు తొణక్కుండా, బెదరకుండా "ఏంలేదు మేడమ్! ఫీచర్స్ చాలా  కలిస్తేనూ... కజిన్స్ ఏమో అనుకున్నాను"  అన్నాడు.
    "ఎక్కువగా మాట్లాడడం నాకు నచ్చదు. కూర్చో" అన్నాను.
    ఇంకా కొందరు పిల్లలు వాడివైపు అభినందిస్తున్నట్లుగా చూస్తూ  నవ్వుతూనేవున్నారు. ఆ నవ్వులు భరించలేక  టేబుల్ మీద వున్న డస్టర్ తో  బల్లమీద గట్టిగా కొట్టాను. అంతే! బాష్పవాయువు ప్రయోగించినట్లుగా క్లాస్ రూమ్ ఒకటే పొగ!
    మళ్ళీ నవ్వులూ, గొడవా!
    నాకు ఆ పొడుగాటి కుర్రవాడిమీద  చాలా కోపం  వచ్చింది! వాడికి నన్ను పోల్చడానికి హేమమాలినీ తప్పు ఎవరూ గుర్తురాలేదా? మాదురీదీక్షితో, జూహీ జావ్లావో గుర్తుకురావచ్చుగా!
    లంచ్ లో స్టాఫ్ రూమ్ లో ఆ కుర్రవాడి ప్రవర్తన  గురించీ, పిల్లల క్రమశిక్షణా రాహిత్యం గురించీ చెప్పాలనుకున్నాను. కానీ.... ఎవరికీ  వినే ఆసక్తేలేదు. చెప్పే తొందర తప్పు! అందరి మాటల్లో దొర్లే  పదాలు  అత్తగారూ, మొగుడూ, పనిమనిషీ, పిల్లలూ!
    ఇంతలో  ప్రిన్సిపాల్ వచ్చింది. ఆవిడ చేతిలో  వున్న పళ్ళెంలో గోరుచిక్కుడు కాయలున్నాయి. అవి ఒలుచుకుంటూ వీళ్ల మాటలు విని ఆస్వాదిస్తోంది అరగంటా అయిపోయింది. అంతా ఉస్సూరుమంటూ సెల్స్ లోకి వెళ్లే ఖైదీళ్ళా క్లాస్ ల వైపు నడిచాం.
    కొందరు చాక్ పిసూలు, నోట్ పుస్తకాలూ తీసుకునే నెపంతో ఆలస్యంచేస్తుంటే "ఆం....కదలండి...కదలండి" అంటూ  సార్ వచ్చి హూంకరించాడు.
    ప్రొద్దుటే నోరూరించేలా నవనవలాడుతూ గంపల్లోంచి దిగిన కూరగాయలు సాయంత్రానికి ఎట్లా  వడిలిపోయి, దొర్లుతుంటాయో అలా మారారు సాయంత్రానికి అందరూ!
    ఆ రోజు ముందటిరోజంత అలసట అనిపించలేదు. కాస్త అలవాటు పడ్డాను.
    బాత్ రూమ్ లోకి వెళ్ళి షవర్ తిప్పి స్నానం చేస్తుంటే పోయిన ప్రాణం తిరిగివచ్చినట్లయింది.
     బాత్ రూమ్ లో అద్దంలో మెరిసిపోతున్న నా ప్రతి బింబాన్ని తనివితీరా చూసుకున్నాను.
    మంచు తడిసిన గులాబీలా నా శరీరం మీద నీటి బిందువులు మెరుస్తున్నాయి! భుజాలమీద నీటి  బిందువులు మెరుస్తున్నాయి! భుజాలమీదున్న నీటి చుక్కల్ని నాలికతో స్పృశించాను. నా శరీరం అందినంత మేర నాకే ముద్దు  పెట్టేసుకోవాలనిపించింది. కంఠం క్రిందనుండి సన్నని లోయలోకి జాలువారే నీటి ధారలు చక్కిలిగింతలు పెడ్తూ ఒద్దికగా నిలబడ్డ పర్వత  శ్రేణులని అల్లరిపెడుతున్నాయి.
    నాకు మా ఊళ్ళో కార్తీకమాసంలో చేసే  కాలవస్నానాలు గుర్తొచ్చాయి. పసుపుముద్దలు నలుగు పెట్టుకుని నదిలోకి  దూకే  ఆడవాళ్ళు వికసించిన  కలువల్లా పైకి తెలేవారు నల్లని మేఘం చంద్రకాంతికి అడ్డు పడినట్లుగా వారి కురుల ఒళ్ళంతా కప్పి అక్కడక్కడా అందాల్ని ఆరపోసేవి!
    లయగా కదిలే  జఘనసీమలు ఘటాల్నీ, ఒంపులోంచి కొద్దిగా  పైకి లేచిన వెన్ను  వీణియనీ తలపించేవి! కనులు కవ్వించే కల్హరాలైతే, పెదవులు పరిహసాలతో పగడపు పట్టీలయ్యేవి! చూరుమీదకి పాకిన గుమ్మడి తీగెల్లా శరీరాలు వంకర్లుతిరిగేవి. పెట్టేడలు పెట్టుకున్న  పాదాలమీద పిక్కలు చెరుకువిల్లుల్లా వుండేవి.
    ఎవడైనా పురుధుడు పొరపాట్న అటుగా  వస్తే ఆ విల్లంబుల ధాటికి అతడికా  రాత్రి  శివరాత్రే! నోరిప్పితే  జానళిలూ, పాదం  కదిపితే థిల్లానాలూ! జయదేవుడికీ భావుకత్వం.... శ్రీ నాథుడుకి శృంగారం... పోతనకి పరవ శత్వం నేర్పేజాణల్లా వుండే పసిడి చానలు!
    'తొడలు ననటి కంబములు మెడలు బోక,
     బొదలు నెలుంగులును బరపుష్టతతులు, మాటలును గీరభాషలు మక్కళించి, చిగురుబోడులు
    వనకేళి సేయజేయు' అని అయ్యలరాజూ నారాయణా మాత్యుడు హంస వింశతిలో వీళ్ళ గురించే వర్ణించాడేమో అనిపించేది!
    నాకు మా ఊళ్ళో కాలవా, అందులో అరటి దోప్పల్లో పెట్టిన కార్తికదీపాలూ, వాన చునుకులకి టప్పు టప్పున క్రిందపడే పున్నాగపూలూ గుర్తొచ్చిఏదో పరిమళం మనసంతా  వ్యాపించి నట్లయింది.
    పింక్ కలర్ టర్కీటవల్ ఒంటికి చుట్టుకుని డోర్ తీసి బయటికి రాబోయి అలాగే ఆగిపోయాను! అక్కడ వివేక్ నిలబడివున్నాడు.
    నాకు మా పెళ్ళయిన కొత్తల్లో అతను కోరిన చిలిపి కోరికలు గుర్తొచ్చాయి.
    "ఒక్కసారి  తలుపు  తియ్యి... నాకు తెలీవి రహస్యాలా?" అనేవాడు.
    అప్రయత్నంగా నా బుగ్గలు మంకెనలయ్యాయి. టవల్  గుండెల మీద  గట్టిగా  పట్టుకున్నాను.
     తల క్రిందకి  వంచుకుని  కార్పెట్ ని బొటన వేలితో నలపసాగాను. "ఇలాగే  వస్తావా పెయింటింగ్ ఎగ్జిబిషన్ కీ?" అని అడిగాడు.
    నాకు చాలా సిగ్గేసింది! అతను ముందుకు వచ్చి ఆ టవల్  కాస్తా లాగేస్తేనో.... "నో!" అన్నాను.
    "ఏవిటి నో?" అడిగాడు.
    నేను తలెత్తి చూశాను.
    అతని స్వరం మామూలుగా వుంది. అంతలోనే టైమ్ చూసుకుంటూ "మనిషన్నాక టైమ్ సెన్స్  వుండాలి! ఆరింటికల్లా రెడీగా వుండమన్నానాలేదా? ఇంకో  అయిదునిమిషాల్లో వస్తే  కలిపి  వెళ్ళచ్చు!" అని విసురుగా వెళ్ళిపోయాడు.
                                                         *        *        *
    నా అందమైన  భావాల మీద ఎవరో బురద జల్లినట్లు ఫీలయ్యాను. తన్మయి ఈ పరిస్ధితిలో కనపడితే ఇలాగే అనేవాడా? నా కళ్ళు  నీటిచెలమలే అయ్యాయి.
    కళ్ళు తుడుచుకుని వార్డ్ రోబ్ లోంచి  గులాబీరంగు ప్లెయిన్  సిల్క్ చీర తీసి  కట్టుకున్నాను. ముత్యాలపెట్టు పెట్టుకుని, జుట్టుని అలాగే బ్రష్ చేసి వదిలేసి పెదవులకి గులాబీరంగు లిప్ స్టిక్ వేసుకున్నాను.
    ఏంచేస్తున్నా ఒక విషయం మాత్రం  గుండెల్లో  కలుక్కుమంటూనేవుంది! 'నా  అర్ధనగ్న శరీరం అతనిలో ఏ అలజడీ కలిగించలేదేనన్న బాధ!'
    సునీతాపట్నాయక్ ని చూస్తే  నాకు చాలా ఈర్ష్యగా అనిపించింది. ఆవిడ  వేసిన చిత్రపటాల గొప్పతనం  మాట అటుంచి.... ఆమె భర్త తన భార్య కళాప్రతిభని ప్రశంసించడమే గొప్ప కళాత్మకంగా వుంది! ప్రతివాళ్ళతోటీ, ప్రతి చిత్రం ఆమె ఎంత శ్రద్డంగా వేసిందో.... అప్పుడు ఎంత కష్టపడిందో చెప్తుంటే ఆనందంతో అతని కళ్ళు తడిగా  మారుతున్నాయి!
    సునీత భర్తని మృదువుగా వారిస్తూ  అతని భుజం  మీద తడ్తూ అపరిమితమైన ఆనందాన్ని  అనుభవిస్తోంది. ఇంటగెలిచి రచ్చ గెలవటం అంటే  ఇదేనేమో! దేశం  అంతా మెచ్చుకున్నా మనలోని కళని జీవిత భాగస్వామి గుర్తించకపోతే ఆ శూన్యాన్ని ఏ పురస్కారమూ భర్తీ చెయ్యదు! చెయ్యలేదు.
    "సునీత లాంటి వైఫ్ దొరకటం మీ అదృష్టం! నిజంగా  ఆ రంగుల మిశ్రమం అపూర్వం! సునీతా.... యూ గాట్ ఏ ప్రామిసింగ్ ప్యూచర్!" అన్నాడు  వివేక్ ఆమెను మెచ్చుకుంటూ.
    వివేక్ కి చిత్రకళని గురించి అంతటి జ్ఞానం ఎప్పటి నుండి కలిగిందో నాకు అర్ధంకాలేదు. బహుశా  దాన్నే  'ఎటికెపీ' అంటారేమో!
    ఆడిటోరియం బయట  క్యాంటిన్ వుంది. అందరూ టీ తాగుతున్నారు.
    నేనూ  వివేక్ కూడా అటు నడిచాం.
    వివేక్ నెమ్మదిగా నాతో అన్నాడు- "మనం విడి విడిగా తిరగడం  మంచిదేమో! నేను నీ ప్రక్కన  వుంటే నీ వైపు ఎవరూ  కన్నెత్తి  చూడరు"
    నేను  తీవ్రంగా  చూశాను. అతను "గుడ్ లక్" అంటూ  జనంలో కలిసిపోయాడు.
    నేను ఇంకా  ఆశ్చర్యంలోంచి కోలుకోకముందే "హాయ్ బేబీ హౌ ఆర్ యూ?" అన్న మాటలు  వినిపించి, తల తిప్పి చూశాను.
    ఎదురుగా నవ్వుతూ పిచ్చిడాక్టర్ పరశురాం నిలబడి వున్నాడు. నేను మర్యాదకి నమస్కరించాను.
    "ఇప్పుడెలా వుంటోందీ?" అడిగాడాయన.
    నాకు చర్రున కోపం వచ్చింది. ఎవరైనా వింటున్నారేమోనని అటూఇటూ చూసి-  "ఏవిటి ఎలా వుండటం?" అన్నాను.
    ఆయన సర్దుకుని "అదే...మీ సంసారం" అన్నాడు.
    నేను టీ తీసుకుని, సమాధానం చెప్పకుండా  సిప్ చేస్తూ వుండిపోయాను.
    "వివేక్ నీతో ఎలా  వుంటున్నాడూ? అన్ని విషయాల్లోనూ ఎడ్జెస్ట్ అయ్యాడా?" అని ఇంకా  ఏదో  అడగబోయాడు.
    నేను చిరాగ్గా  "వియ్ ఆర్ పైన్! మీరీ పెద్దవయసులో మా గురించి చాల శ్రమ  తీసుకుంటున్నారు పాపం!" వ్యంగ్యంగా అన్నాను.
    "నాకు శ్రమా? ఇట్స్ మై ప్లెజర్ ! అసలు అనుహ్యా...ఈ  వయసులో మాకుండే ఓరిమీ. దీక్షా ముందు ఈ కాలం కుర్రాళ్ళు దండగ..."
    "ఎక్స్యూజ్ మీ!" అంటూ ఆయనని తప్పించుకుని ముందుకి గబగబా నడుస్తూవుంటే నా పైట కొంగు ఎవరో పట్టుకుని  ఆపినట్లయింది.
    బిత్తరపోయి వెనక్కి తిరిగి చూశాను.
    కుండీల్లో షోకి పెట్టిన క్రోటన్స్ మొక్కకి చిక్కుకుని బెలగా చూస్తోంది నాకోంగు! విడిపించుకోనడానికి ప్రయత్నిస్తూవుంటే ఇంకా చిక్కుకుంటోంది. పెరట్లోని చామంతిని చులకనగా చూడ్డం, పొరుగువాడి క్రోటన్స్ ని ఆహా... ఓహో అనడం ఇదేగా అనాదిగా మన సంస్కృతి' అనుకున్నాను.
    "మే ఐ హెల్ప్ యూ?" అన్న మంద్రమైన స్వరం దగ్గరగా  వినిపించింది.
    నేను అతనివైపు చూశాను.
    ఓ చెంప కొడ్తే పాలూ, ఓ చెంప తడ్తే నీరూ  కారేటట్లుగా పచ్చగా, లేతగా వున్న  నవయునకుడోకడు నా పైటని తన చేతిలోకి తీసుకుని  మృదువుగా  ఒక్కటొక్కటిగా  ముళ్లన్నీ వేరుచేస్తున్నాడు.
     నల్లని టీ షర్ట్, బూడిద రంగు జీన్స్ పాంటూ  వేసుకుని, నిర్లక్ష్యంగా పైకి దువ్విన జుట్టుతో, చేతికి వేసుకున్న  రాగికడియంతో మొరటుగా కనిపించాలనే ప్రయత్నం  కనిపిస్తోంది. దీక్షగా  పెదవులు  బిగబట్టి నా పైటకి స్వతంత్రం బహూకరిస్తూన్నాడు!
    ఎర్రటి పెదవులమీద  అప్పుడప్పడే మొలకెత్తిన కోరమీసం నిగనిగలాడ్తోంది!
    అతను ఆఖరిముల్లు తీసి "అయిపోయింది...." అని అతంలోనే "ఆ!" అని అరిచాడు.
    నేను ఠక్కున అటు చూశాను. అప్పటికే అతని గులాబీరంగు వేల్లోంచి రక్తం చుక్కలు కారిపోతున్నాయి.
    "అరె....రే...." అంటూ  అసంకల్పితంగా నేను నా చేతిరూమాలుతో అతని వేలిని అదిమిపెట్టాను.
    అతను నవ్వుతూ  "ఐ యామ్ సమీర్.... మే ఐ నో యువర్ స్వీట్ నేమ్?" అని అడిగాడు.
     అలవాటుగా  మిసెస్ వివేక్ అనబోయి'ఛ' అనుకుని "అనూహ్య" అన్నాను.
    "ఓ...రియల్లీ స్వీట్ నేమ్!" అన్నాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra