"నాకే పాపం తెలీదు" నిస్పృహతో అన్నాడు పరుశురాం.
"జులాయి నాయాళ్ళూ పోకిరీ గాడిదలూ ఆడపిల్లల పైన అత్యాచారాలు చేస్తుంటే ఊరుకోవడానికి చేతకానివాడ్ని కానురా! ఇది భారతదేశంరా తమ్మి. ఈ దేశంలో ఆడదానికి ఓ ప్రత్యేక స్థానముంది. అందుకే ఆరుగురు పిల్లల్ని కన్నాను. పరువు ప్రతిష్ట మరిచిపోయి ఏ ఆడది ఫలానావాడు తనను మానభంగం చేయబోయాడని కేసు పెట్టదురా ఆవారానాయాలా! అందుకే నిన్ను చిత్రోపట్టేసి ఆడపిల్లలున్న ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి నీ దివ్య మంగళ విగ్రహాన్ని ప్రదర్శిస్తాను. ఇప్పటికైనా చెప్పు శిక్ష తగ్గిపోద్ది. నేను కొట్టడం మానేస్తాను. మా సబ్ ఇన్ స్పెక్టర్ చేతులు దురదగా వున్నాయి. నాకు అని చేతులు నలుపుకుంటున్నాడు. వాడికి నిన్ను వదిలేస్తాను."
పరుశురాం రొప్పుతూ తలెత్తి చూశాడు.
" ఛీ! మీరు మనుషులా? రాక్షసులా ?" అన్నాడు.
ఇన్ స్పెక్టర్ పాపారావు వెకిలిగా నవ్వాడు.
"మనుషులు, రాక్షసులు కాని మధ్యరకం వాళ్ళని పోలీసులంటారు. నీ లాంటి వాళ్ళను కొత్త ఆవకాయ ముక్కను మనిలినట్టు నలిపి పారేయటానికి మాకు ప్రభుత్వం అధికారాన్ని కట్టిపెట్టింది. అమ్మనాకొడకా! నాకు కసి పెగిపోతోంది. మేమే లేకపోతే నీలాంటి మదమెక్కిన వాళ్ళను ఆణిచిపారేసెదెవరు?"
పరుశురాం ని వంచి వీపుపైన లాఠీతో బాదడం మొదలుపెట్టాడు ఇన్ స్పెక్టర్.
"సార్ సార్ మన స్టేషన్ కసలే లాకప్ డెత్ స్టేషనని పేరు. వీడు ఛస్తే ప్రజలు గొడవ చేస్తారు. ఎన్నికల్లొస్తునన్నాయో పక్క. నాయకులు ధర్నా చేస్తారు" అన్నాడు కానిస్టేబుల్.
"షటప్. వీడ్ని మొత్తం ఊరు ఛీ కొడుతుదిరా. వీడ్ని లేపేస్తే ఆడపిల్లల తల్లిదండ్రులు మనకి సన్మానం చేస్తారు. గండపెండేరాలు తొడుగుతారు."
ఓ కాని స్టేబుల్ పరిగెత్తుకొచ్చాడు."
"సార్ తమ యింటినుండి ఫోన్ వచ్చింది దొరా! అమ్మగారు చేస్తున్నారు."
"ఏంటి?"
" మీ నాలుగో అమ్మాయి మీ యింటికెదురుగా వున్న కిల్లీకొట్టు వాడితో లేచిపోయిందట సార్."
"ఆయ్" అరిచాడు పాపారావు.
"యస్సయిగారూ!"
ఎస్సై వెంటకరత్నం పనిమీద బయటికి వెళుతున్నాను. నువ్వు వీడి సంగతి చూసుకో" అని విసవిస వెళ్ళిపోయాడు ఇన్ స్పెక్టర్ పాపారావు.
ఎస్సై వెంకటరత్నం చూయింగ్ గమ్ నములుతూ అన్నాడు.
"పాపం అలసిపోయినట్టున్నావ్. నేనసలే జంటిల్ మన్. ని కాస్త రెస్ట్ తీసుకో. తరువాత తీరుబడిగా మాట్లాడుకుందాం!"
" అయాం ఇన్నో సెంట్ సార్. ఇది ఏదో ప్లాన్ ప్రకారం జరిగింది"అన్నాడు పరుశురాం మెల్లగా.
ఎస్సై నవ్వాడు.
"డోంట్ వర్రీ మై బోయ్. కొంతకాలంపాటు నీమీద ఏ విధమైన కేసులు లేకుండా చేస్తాను నేను."
"అంటే?" పరుశురాం అర్ధం కానట్టుగా అడిగాడు.
"ఎఫ్ ఐఆర్ రాస్తుంది నేనే. స్ట్ర్రాంగ్ గా రాస్తాను. నిన్నులోపల తోయించేస్తాను"అంటూ ఫెడీల్మని కొట్టాడు పరుశురాం. మూతిపైన. ఆ దెబ్బకి పరుశురాం కళ్ళు బైర్లు కమ్మాయి. అతని మూతినుంచి రక్తం కారుతోంది.
" ఏరా? నీకు అమ్మాయి కావాలా. తడికల బజారునుంచి ఓ కేసుని తెప్పించి అంటగట్టానంటే జీవితాంతం ఏడుస్తావు" ఎగతాళి.....
ఎస్సయి కొట్టిన దెబ్బలకి స్పృహతప్పి పడిపోయాడు పరుశురాం.
రాత్రి పదయింది.
అతన్ని చూడ్డానికిగానీ విడిపించడానికి గానీ ఎవరూ రాలేదు.
మెల్లగదా కళ్ళు విప్పి చూశాడు. పరుశురాం.
స్టేషన్ లో ఆఫీసర్లు ఎవరూ లేరు. ఇష్టం ముగ్గురు కానిస్టేబుల్స్ వున్నారు.
లేవడానికి ప్రయత్నించాడు.
ఒళ్ళు పచ్చిపుండులా వుంది.
గొంతు పొడారిపోయింది.
దాహంగా వుంది.
సెల్ తలుపు దగ్గరికి పాకి ఇనుపసువ్వల్ని పట్టుకుని "దాహం...... నీళ్ళు కావాలి" అన్నాడు అతికష్టంపైన.
కానిస్టేబుల్ సింహాచలం తలుపు దగ్గరికి వచ్చాడు.
"దాహంగా వుందా బాబూ?" అడిగాడు.
తలూపాడు పరుశురాం.
"స్కాచ్ తెప్పించనా?"
"వద్దు నీళ్ళు కావాలి."
"పోనీ కూల్ డ్రింక్స్ తెప్పించనా?"
"నాకు నీళ్ళు కావాలి."
"అయ్యో నీ ళ్ళేనా! ఒరే ఫోర్ ట్వంటీవన్ ఈ బాబుగారికి నీళ్ళు కావాలట. కొళాయిలో నీళ్ళొచ్చి ఎన్ని రోజులయిందో చెప్పరా?"
"నీ ళ్ళెక్కడ దొరుకుతాయి? కావాలంటే కొబ్బరిబోండా తెప్పించడానికి వీలుంటుంది."
"ఏదో ఒకటి. నాకు దాహంగా వుంది" అభ్యర్థించాడు పరుశురాం.
"ఆకలిగా లేదా?"
"వుంది."
"చికెన్ పాలావు బాగుంటుంది" సింహాచలం అన్నాడు.
"మీ యిష్టం . నేనే రుణపడతాను"అన్నడతను.
"పిచ్చివాడా పోలీసులకి దారుణపడకూడదు.మాకు రుణపడితే లాఠీ దెబ్బల్తో నే తేల్చుకుంటాం."


