Home » Kommuri venugopala rao » Mahaapravaaham

   
    " తప్పన్నర. చూడు బుల్లోడా! నువ్వు చూస్తే మరీ అమాయకుడిలా వున్నావు. నీ అయియాలు మంచి వేగానీ, యీ ఛండాలపు  ప్రపంచాన్ని ఒక కోణం నుంచే చూస్తున్నావు. ఈ లోకంలోని మంచీ చెడులని  నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్నట్లు లేవు. మంచీ చెడూ అనేది ఓ వర్గంలో లేదు.  ఆడా మగా తేడాలో  లేదు. మనిషి బుద్ధిలోవుంది. వాడు ఏవర్గానికి చెందినవాడయినా, ఏ పార్టీకి చెందినవాడయినా, ఆడయినా, మొగయినా వెధవ వెధవే. మంచి వాడు మంచివాడే . నలభై ఏళ్ళు ఏ పార్టీలో వున్న తొత్తుకొడుకు కాటికి కాళ్ళు చాచుకున్న దశలో యింకో పార్టీలో చేరతాడు.


    "చూడబ్బాయ్ , పేదలు, కష్టాలు అని నువ్వు చాలా చాలా రాశావు. సరే , సరే .ఆర్ధికంగా కొంతవరకూ వాళ్లు వెనకబడి వున్నారు" ఒప్పుకుందాం. కాని అదొక్కటే కాదు నీతికి, నిజాయితీకి.గుర్తు.ఆర్థికంగా ఒకరు బలంగా వున్నంత మాత్రాన వాడిమిద అసూయ, బలహీనంగా వున్నంత మాత్రాన వాడిమిద జాలి- అది చాలా ముర్ఖత్వం . వాడు కష్టపడుతున్నాడా? వీడు కష్డపడటం లేదా? ఓ వ్యాపారమో వల్లకాడో-అలాంటిదేదో  వుందనుకో.అది చెయ్యటానికి ఎంత డబ్బు బయట్నుంచి తెచ్చి, ఎంత బుర్ర బద్దలు కొట్టుకుని ఎప్పుడూ టెన్షన్ ఫీలవుతూ, వేలకువేలు వడ్డిలు కడుతూ. రాత్రింబవళ్ళేనా కష్టపడేది? వ్యాపారస్థులు కష్టపడటం లేదా? వాళ్ళకు సరియైన తిండీతిప్పలూ, నిద్రా గిద్రా వుంటున్నాయా? ప్లీడర్లు కష్టపడ్డమే గాని. గుమస్తాలుగానీ,  వర్కర్లుగాని సరిగ్గా పనిచేస్తున్నారా? తొత్తుకొడుకులా రోజుకి ముప్ఫై ముఫ్ఫై ఐదు రూపాయలు డబ్బులు దొబ్బుతూ యింకా చాల్లేదు చాల్లేదని వెధవ కేకలెయ్యకపోతే ఆ డబ్బుని సరిగ్గా వుపయోగించుకుంటున్నారా? సగం త్రాగేసి , సగం బీడీలకూ , సిగరకెట్లకూ బ్రాకెట్లకీ, ముండలకూ పెట్టి వొట్టి చేతుల్తో యిళ్ళకివెళ్ళి హీరో ల్లాగా అన్నం పెట్టమని గొడవచేసి, పెట్టకపోతే పెళ్లాలని చితగొట్టి....  వీళ్ళ మిద జాలేమిటి బుల్లోడా!


    " ఎక్స్ ప్లాయి టేషన్ ఎక్స్ ప్లాయిటేషన్ అని చాలా సార్లు వుపయోగించావు. ఎవరు ఎవర్ని ఎక్స్ ప్లాయింట్ చేస్తున్నారు? ఎవరయినా యిల్లుకట్టిస్తున్నారనుకో...తాపీ వాడు గానీ, కరెంటువాడుగానీ, కార్పెంటర్ గానీ- వాడి డబ్బు వాడు కరెంటు వాడిగానీ, కార్పెంటర్ గానీ- వాడి డబ్బు వాడు ఎప్పటికప్పడు పిండుతూ ఓనర్ ని ఎంత కాల్చుకు తింటాడో , ఎంత ఏడిపిస్తాడో తెలుసా? ఇంట్లో ఫ్యానుగాని, మోటర్ గాని చెడిపోతే ఎలక్ట్ర్రీషియస్ చుట్టూ తిరిగితే నమ్మకంగా, సకాలంలో ఓనరు యిబ్బంది కనిపెట్టి సానుభూతితో ఎవడయినాచేస్తున్నాడు ఇష్టపడి,ఆవృత్తినికోరుకుని తొక్కురిక్షావాడున్నాడు ఇష్టపడి, ఆ వృత్తిని కోరుకుని తొక్కుతున్నాడు. కాని ప్యాసింజరు ఎక్కినప్పట్నుంచీ ఊరికినే తొక్కుతూన్నట్లు వెధవ పోజులు పెడుతూ ,అనవసరంగా కష్టపడిపోతున్నట్లు గొణుక్కుంటూ, అయిదు పైసల చిల్లర దగ్గర నానా అల్లరీ చేసేవారేగానీ, అది డ్యూటీగా  భావించి ప్యాసింజర్స్ ని సంతోషపెట్టే వాళ్ళెంతమంది? స్టేషన్లో  పోర్టర్లు యిబ్బందిలో భార్యపిల్లలు, లగేజితో వున్న ప్యాసింజర్ని ఎంత ఎక్స్ ప్లాయింట్ చేస్తున్నాడో ఎప్పడయినా ఆలోచించావా?  ఒకడు కారులో పోతోంటే పొగరుగా , ఛండాలంగా ప్రవర్తించి, వాడి ఓర్పుని పరీక్షిస్తూతలనొప్పి కలిగించే వాడే గాని, డిసిప్లిన్ తో ఎవడయినా ప్రవర్తిస్తున్నాడా? పోలీసోడు వున్నాడు. వాడి డ్యూటీ వాడు సక్రమంగా చేస్తున్నాడా? ఓ ఆడదాన్ని మొగాడు దారుణంగా ఏడిపిస్తోన్నా,ఓ బలహీనుడ్ని బలవంతుడు తంతూన్నా, ఏ రౌడీవల్లో , గూండావల్లో ఒకడు అన్యాయానికి గురవుతున్నా ఎంతవరకూ న్యాయం చెయ్యగలుగుతున్నాడు? ఎప్పుడో త్కిపుట్టినప్పుడు లేకపోతే ఎస్. పి దగ్గర్నుంచి ఆర్డర్స్ వచ్చినప్పుడు రోడ్డు ప్రక్క ఆపివున్న స్కూటర్లనీ,  సైకిళ్ళని అమాతంగా పట్టుకొని, పైన్ వేసి దేశాన్ని  ఉద్ధరిస్తున్నా,అని దరిద్రపు పోజు లెయ్యటం తప్ప, ముఖ్యమైన విషయాల్లో  ఎంతవరకూ ఉద్ధరిస్తున్నారు?కంప్లెయింటిచ్చిన వాడికి యిన్ ప్లుయెన్స్ లేకపోతే పోలీస్టేషన్లలో పోలీసులు ఎంతవరకూ న్యాయం జరుగుతోంది? అసలు న్యాయం చేద్దామని యీ పోలీసులు  ఎంతవరకూ ఆలోచిస్తున్నారు?  ఈ మధ్య వినియోగదార్లు.  హక్కులు అని పదేపదే  వినిపిస్తోంది.  ఈ వినియోగదారుడుకూడా తన వంతు డ్యూటీ వచ్చినప్పుడు ,అవతలి వినియోగదారుడి హక్కుల్ని ఎంతవరకూ పరిరక్షిస్తున్నాడు? గవర్నమెంటు వ్యాపారస్థుల్ని మోసగాళ్లుగా  భావిస్తూ వాళ్ళమిద సవాలక్ష ఆఫీసర్లని పెట్టి రకరకాలపేర్ల తో డబ్బులు గుండుతోంది. అసలీ గవర్నమెంటులో ఎంత చిత్తశుద్ధి వుంది. ఏ పార్టీ వాడొచ్చినా బడాయిలు చెప్పుకోటమేగాని, ప్రజలకి వోట్లకోసం ఎర వెయ్యటమేగాని, అసలు ప్రజల సమస్యలు వాళ్ళకేం తెలుసు? వీళ్ళ బాధ  భరించలేక, గోల పడలేక, తనుసాధక బాదకాల్ని ఎవరూ అర్ధం చేసుకోని నిస్సహాయస్థితిలో చాలామంది వ్యాపారాలెత్తేసుకుంటున్నారు. శృతమించిన ప్రాబ్లెమ్స్ భరించలేక ఫ్యాక్టరీలు మూతబడిపోతున్నాయి. ఒక వర్గమే యింకొక వర్గాన్ని పీక్కుతుంటోందన్న అభిప్రాయం తప్పు బుల్లోడా! ప్రతి మనిషి అవకాశమొస్తే రెండో మనిషిని పీక్కుతింటున్నాడు. ఈ సత్యం అర్ధంచేసుకుంటే నువ్వింకా బాగా రాయగలవు. వాస్తవిక త అంటే ఒక వర్గాన్ని సమర్థించటం కాదు.అన్ని కోమాల్నుంచీ జీవితాన్ని చూడగలగటం. అలా చూడగలిగి రాస్తే- అదీ రచయిత నిజాయితీ.అప్పటి దాకా నువ్వు ఆత్మవంచన చేసుకుంటున్నట్లే లెక్క."


    ఆమె చెప్పిన మాటల్లోని నిజా నిజాల గురించి సూర్య చంద్ర సీరియస్ గా ఆలోచిస్తూ ఆ మె మొహంలోకి చూశాడు.


    "అందులో కఠినత్వముంది. క్రూరత్వముంది. కాని జీవితముంది."


    " మిరెవరు? అనడిగాడు.


    " నేను  భూలోకమ్మని."


    రెండు నిమిషాలు మౌనంగా గడిచాయి.


    "సంఘంలో ఆడవాళ్లూ, వాళ్ళమిద జరిగే అక్రమాలూ. అత్యాచారాలూ, రేప్ లూ, వరకట్నపు చావులూ...."


    "అన్నీ నిజమే బుల్లోడా.తప్పకుండా   అవి రాయాల్సిందే. కాని ఆడదానిలోని రాక్షసత్వం,కష్టాల్లో వున్న ఇంకో ఆడదాన్ని క్రూరంగా చూడటం, ఆడదాన్లో నిస్వార్థం, అసూయ,అల్పత్వం, కుటుంబ పరిస్థితులు అలోచించకుండా మొగాడి బలహీనతమిద ఆడుకునే అల్పత్వం , నగలమిద వ్యామోహం, మొగాడ్ని నరుక్కుతిని, కాల్చుకుతినే దుష్టబుద్ధి-  నూటికి యాభయిమంది సమాజంలో వీళ్లు కూడా వున్నారని మరిచిపోకూడదు."


     సూర్యచంద్ర ఆలోచిస్తున్నాడు.


    " నే వొస్తాను బుల్లోడా! నీ ఆలోచనని యింకా విస్మరించి చూడు. గొప్ప గొప్ప భావాలొస్తాయి. రాకపోతే నా దగ్గరకు రా! బోలెడు అయిడియాలిస్తాను." అని తన ఎడ్రెసున్న కార్డు ముందు పడేసి, లేచి నిలబడింది.

    
                                                                      16


    కమల అనుకోకుండా వూరికి పోవల్సివచ్చింది. భర్త ఆనందరావు ఆముందటిరోజు రాత్రి చాలా విచారంగా,బాధగా ఆ మెముందు విలవిల్లాడిపోయాడు.


     " కమలా! నిన్ను విడిచి నేను వుండలేను" అన్నాడు ఆమె గుండెలమిద తలవాల్చి.


    " నాకు తెలుసండి" అంది ఆమె ప్రేమతో అతని క్రాఫ్ ని సవరిస్తూ.


    "అసలు... నువ్వు వెళ్ళకపోతే ఏం?"


    ఆమె నవ్వింది. "అదేమిటండీ యిప్పుడు.... అక్కడ చాలా అవసరం."


    ఆమెను వొళ్ళోకూర్చోబెట్టుకుని విడవకుండా ముద్దులు పెట్టుకుంటున్నాడు.


    అతని చేతులామె వక్షస్థలంమిద ఆడుకుంటున్నాయి.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra