Home » Dr. dasaradhi rangacharya » Rigveda Samhitha - Part 1


    ఇది ఇట్లుండగా వృత్రుని సంహరించుటకు ఆయుధము కావలసి వచ్చినది. దధీచి ఎముకలతో చేసిన ఆయుధమున వృత్రుడు హతుడు అగునని నారాయణుడు చెప్పినాడు. ఇంద్రుడు దధీచిని అతని ఎముకలు ఇవ్వవలసినదని అర్థించినాడు. లోకోపకారకార్యముగాన దధీచి అందుకు అంగీకరించినాడు. యోగము అవలంబించినాడు. ప్రాణములు విడిచినాడు. విశ్వకర్మ దధీచి ఎముకతో వజ్రాయుధము నిర్మించినాడు. ఇంద్రుడు వజ్రాయుధముతో వృత్రుని వధించినాడు. 

    2. గోవులకు ఇంద్రునితో సమాన ప్రతిపత్తి కలిగించినాడు. పాలు జీవనాధారములు అని గురించినారు. పాలు ప్రాణిజాలమునకు సంపూర్ణ ఆహారము అగును. నేటికిని ఇది నిత్య సత్యము.

    3. సూర్యుని నుండియే చంద్రుడు వెలుగు పొందుచున్నాడు అని గ్రహించినారు.

           పదునాలుగవ అనువాకము - ఎనుబది అయిదవ సూక్తము
         ఋషి - రహోగణ పుత్రుడు గౌతముడు, దేవత - మరుత్తులు
                     ఛందస్సు - 5,12 త్రిష్టుప్, తక్కినవి జగతి.


    1. మరుత్తులు వ్యాపించువారు. శుభప్రదులు. రుద్రపుత్రులు. ప్రయాణములకు స్త్రీలవలె చక్కగా అలంకరించుకొందురు. ద్యావా పృథ్వులను వారే వృద్ధి చేసినారు. వీరులను, శత్రువులను తిరస్కరించువారు. అట్టి మరుత్తులు యజ్ఞములందు సోమపానము చేతురు. మదింతురు.

    2. మరుత్తులను దేవతలు అభిషేకించుచున్నారు. మహత్తుగల రుద్రుని పుత్రులు ద్యులోకమును నివాసము చేసికొన్నారు. పూజ్యలయినారు. ఇంద్రుని పూజింతురు. బలము పెంచుదురు. మరుత్తులు భూమి పుత్రులు. సంపన్నులయి వర్థిల్లుచున్నారు.

    3. భూమి గోరూపమయినది. ఆమె మరుత్తులకు మాతృమూర్తి మరుత్తులు ఆభరణములతో అలంకరించుకుందురు. అప్పుడు వారు ఎంతో శోభింతురు. వారు లోకములను బాధించు దుష్టులను శిక్షింతురు. మరుత్తులు పోవు మార్గమున నీరు ప్రవహించును.

    4. మరుత్తులు యజ్ఞవంతులు. ఆయుధధారులు. ప్రకాశకులు. మనోవేగవంతులు. వర్షించువారు. వారు రథమునకు ఆడలేళ్లను పూన్చుదురు. ఆ రథము కదిలినప్పుడు అశక్యములను సహితము కదిలింతురు.

    5. మరుత్తులు ఆడలేళ్లను కట్టిన రథమున సూర్యునివలె ప్రకాశింతురు. జనులకు అన్నము అందించుటకు మబ్బులను కురిపింతురు. ఆ వర్షధారలు, నీరు చర్మమును తడిపినట్లు భూమిని తడుపుచున్నవి.

    6. మరుత్తులారా ! మీ కొఱకు వేగముగా ఎగిరిపోవు గుఱ్ఱములు కట్టిన రథము సిద్ధము చేసినాము. మీ దోసిళ్ల నిండ ధనములతో తరలిరండు. దర్భలు పరచి ఉంచినాము. ఆసీనులుకండు. సోమము సిద్ధముగా ఉన్నది. సేవించుడు. మదించుడు.

    7. మరుత్తులు స్వంతబలమున వృద్ధిచెందినారు. మహిమలు ఆర్జించినారు. స్వర్గము చేరినారు. దానిని విస్తారము చేసినారు. విష్ణువు వర్షము కురిపించువాడు. మదము కలిగించువాడు. ఆ విష్ణువు ఈ మరుత్తులను రక్షించును. మరుత్తులు పక్షులవలె ఎగిరి వత్తురు. యజ్ఞములందు ఆసీనులు అగుదురు.

    8. మరుత్తులు శూరులవలె, వీరులవలె శీఘ్రగమనులు. యుద్ధములందు అన్నార్తులవలె అటునిటు తిరుగుదురు. వారు రాజులువలె దీప్తదర్శనులు. కనుకనే సమస్త భూతములు వారిముందు గడగడలాడును.

    9. త్వష్ట నిపుణుడయిన కార్యవంతుడు. అతడు ఇంద్రునకు వజ్రాయుధము నిర్మించి ఇచ్చినాడు. అది స్వర్ణమయము. వేయి అంచులు గలది. ఇంద్రుడు వజ్రాయుధమున వృత్రుని వధించినాడు. జలమును వర్షించినాడు.

    10. మరుత్తులు తమ బలమున జలమును మీదికి ఎత్తినారు. పర్వతము అడ్డము వచ్చినది. దానిని బద్దలుకొట్టినారు. నూరు తీవల వీణ 'వాణము'ను వాయించినారు. సోమపానము చేసినారు. ఉన్మత్తులు అయినారు. స్తుతికర్తలకు ధనములను ప్రసాదించినారు.

    11. మరుత్తులు బావిని ఎత్తుకొని వచ్చినారు. తమ కాంతులతో సర్వరక్షణలు కల్పించి బావిని గౌతముని వద్దకు తెచ్చినారు. దాహముతో ఉన్న గౌతమునకు నీరు పోసినారు. ఆ ఋషిని సంతృప్తుని చేసినారు.

    12. మరుత్తులారా ! మీరు ముల్లోకములందు ఉన్నారు. వర్షించుచున్నారు. మేము మిమ్ము స్తుతించుచున్నాము. హవిస్సులు అర్పించుచున్నాము. మాకు గృహములు, పుత్ర పౌత్ర ధనములను ప్రసాదించుడు.

    ఆలోచనామృతము :

    1. 10,11 మంత్రముల గౌతముని వృత్తాంతము వచ్చినది. గౌతమునకు దాహము అయినది. అతడు మరుత్తులను ప్రార్ధించినాడు. మరుత్తులు ఒక బావిని ఎత్తుకొని వచ్చినారు. మార్గమధ్యమున పర్వతము అడ్డువచ్చినది. మరుత్తులు దానిని బద్దలుకొట్టినారు. బావిని గౌతముని వద్దకు చేర్చినారు. అతని దాహము తీర్చినారు.

    ఇంతవరకు వర్షజలము, ప్రవాహ జలమును మాత్రమే పేర్కొనుట జరిగినది. ఇది భూగర్భజలములను బయటకి తెచ్చుట కావచ్చును. అడ్డువచ్చిన పర్వతము భూమిలోని రాయి కావచ్చును.

    ఇది రాతిని బద్దలు కొట్టి భూగర్భజలమును బయటకి తెచ్చుట. ఇది అసామాన్య కార్యము.

        ఎనుబది ఆరవ సూక్తము, ఋషి - రహోగణపుత్రుడు గౌతముడు,
                      దేవత - మరుత్తులు, ఛందస్సు - గాయత్రి.

    1. మరుత్తులు ద్యులోకము నుండి దిగివత్తురు. యజమాని ఇంట సోమపానము చేయుదురు. అట్టి యజమానికి రక్షణ కొదువ ఉండదు.

    2. మరుత్తులారా ! మీరు యజ్ఞమును జరిపింతురు. యజమానులు, స్తుతికర్తలు మిమ్ము ఆహ్వానించుచున్నారు. ఆలకించుడు.

    3. ఋత్విజులతో మరుత్తులను ఉత్సాహ పరిపించిన యజమానికి ఆలమందలు అనేకములు కలుగును.

    4. మరుత్తులు వీరులు. వారికొఱకు యజ్ఞమున సోమము సిద్ధముగా ఉన్నది. స్తోత్రములు జరుగుచున్నవి. మరుత్తులు వానిని మెచ్చవలెను.

    5. మరుద్గణములు శత్రువులను తిరస్కరింతురు. వారు యజమానుల స్తుతివాక్కులు వినవలెను. వారికి అన్నములు ప్రసాదించవలెను.

    6. మరుద్గణములారా ! మీరు సర్వదర్శనులు. కలకాలముగా మాకు రక్షణ కల్పించుచున్నారు. మేము మీకు హవిస్సులు అర్పించుచున్నాము.

    7. మరుత్తులారా ! మీరు హవిస్సులు స్వీకరించిన యజమాని ధనవంతుడు కావలెను.

    8. మరుత్తులారా ! మీరు బలవంతులగు నాయకులు. స్తోత్రపాఠకులు మిమ్ము స్తుతించి అలసి చెమర్చినారు. వారి కోర్కెలను తీర్చుడు.

    9. సత్యబలముగల మరుత్తులారా ! మీ మాహాత్మ్యమును ప్రకటించుడు. రాక్షసులను అణచుడు.

    10. మరుత్తులారా ! గుహలోని చీకటిని దాచిపెట్టుడు. రాక్షసులను పారద్రోలుడు. మేము కోరిన తేజస్సును మాకు ప్రసాదించుడు.

        ఎనుబది ఏడవ సూక్తము ఋషి - రహోగణపుత్రుడు గౌతముడు,
                  దేవత - మరుత్తులు, ఛందస్సు - జగతి.


    1. మరుత్తులు శత్రుంజయులు. బలయుతులు. ధ్వనివంతులు. ఇతరులకు లొంగనివారు. ఒకరిని ఒకరు విడువనివారు. రసములను కూర్చువారు. స్తవనీయులు. మబ్బులను కదలించువారు. అట్టి మరుత్తులు అలంకరించుకున్నపుడు సూర్యునివలె ప్రకాశింతురు.

    2. మరుత్తులారా ! ఆకాశ మార్గమున మీరు పక్షులవలె విహరింతురు. మీరు ఆకసమున మబ్బులను కూర్చుచున్నారు. అవి మీ రథములందు చిక్కుచున్నవి. వర్షము కలుగుజేయుచున్నవి. మిమ్ము పూజించు యజమానులకు తేనెవంటి నీటిని ప్రసాదించుడు.

    3. వర్షము శుభంకరము. మరుత్తులు మేఘములను వర్శమునకు ఆయత్తపరుచుచున్నారు. మరుత్తులు మబ్బులను ఎగురుకొట్టునపుడు భూమి విధవవలె గడగడలాడుచున్నది. విహారశీలూరు, చలన స్వభావులు, కాంతిమంతములగు ఆయుధములవారు అయిన మరుత్తులు సర్వమును కదలించుచున్నారు. తమ మహిమను ప్రకటించుచున్నారు.

    4. మరుత్తులు ప్రసార స్వభావులు. లేళ్లవాహనపువారు. నిత్యయవ్వనులు. ఎంతో బలవంతులు. జగములకు ఈశ్వరులు అగుచున్నారు. వారు సత్కర్మలకు అర్హులు. భక్తుల ఋణములు తీర్చువారు. అట్టి మరుత్తులు మా ఈ కర్మను రక్షించవలెను.

    5. మరుత్తులు ఇంద్రుని వదలకున్నారు. ఇంద్రుని హెచ్చరించుచున్నారు. యజ్ఞార్హమగు నామములు ధరించినారు. ఇది మా తండ్రులు చెప్పగా తెలుసుకున్నాము. అట్టి మరుత్తులకు సోమము సమర్పించుచున్నాము. స్తుతించుచున్నాము.

    6. మరుత్తులు ప్రకాశకులు. గమనశీలురు. స్తోత్రవ్యులు. వారు సూర్యకిరణములతో కూడి మేఘములను వహించుచున్నారు. ఋత్విక్కులతో కలిసి హవిస్సులు స్వీకరించుచున్నారు. భయరహితులయిన మరుత్తులు హర్షదమగు తమ స్థానమున నిలిచినారు.

        ఎనుబది ఎనిమిదవ సూక్తము, ఋషి - రహోగణ పుత్రుడు గౌతముడు
        దేవత - మరుత్తులు, ఛందస్సు - త్రిష్టుప్ 1,6 ప్రస్తార పంక్తి 2 విరాట్టు.


    1. మరుత్తులారా ! మీ రథములు కాంతివంతములు. వేగవంతములు. అశ్వవంతములు. ఆయుధవంతములు. వానిమీద పక్షులవలె ఎగిరి త్వరత్వరగా విచ్చేయుడు. అన్నములతో మా వద్దకు రండు.

    2. మరుత్తుల రథపు గుఱ్ఱములు పసుపు, ఎరుపు రంగువి. వారు బంగారమువలె మెరయు వజ్రాయుధముగలవారు. మరుత్తులు తమ రథము మీద భూమిని నలుగగొట్టుచు వత్తురు. దేవతలను స్తుతించు యజమానులకు శుభములు కూర్చవత్తురు.

    3. మరుత్తుల భుజములందు ఆయుధములు ఉన్నవి. వారు అడవులను పెంచినట్లు యజ్ఞములను వృద్ధిపరచుచున్నారు. ధనవంతులగు యజమానులు వారికొఱకు సోమము సిద్ధపరచినారు.

    4. గౌతములు జలములకయి మరుత్తులను స్తుతించినారు. వారికి బావి లభించినది. ఇప్పుడు గౌతములకు మంచి రోజులు వచ్చినవి. వారు జలముతో చేయవలసిన కర్మలను చక్కగా నిర్వహించినారు.

    5. మరుత్తులారా ! బంగారు రథమును ఎక్కి, ఇనుప చక్రధారలు కలిగి, బహుధా ఇటునటు తిరుగుచు శత్రువులను సంహరించి వర్షోదకము తెచ్చు మిమ్ము కీర్తించుచు గౌతముడు ఈ సూత్రమును ఉచ్చరించినాడు. ఇది ప్రశస్తమయిన సూత్రమని ఎల్లరు ఎరుగుదురు.

    6. మరుత్తులారా ! మేము మీ గుణగణములను విశేషముగా నుతించుచున్నాము. ఋత్విక్కులు కూడ మిమ్ము ఈ ఋక్కులతో నుతించుదురు. మాకు అన్నములు ప్రసాదించుడు.

        ఎనుబది తొమ్మిదవ సూక్తము, ఋషి - రహోగణపుత్రుడు గౌతముడు
      దేవత - విశ్వేదేవతలు, ఛందస్సు - 1-5,7 జగతి, 6 విరాట్టు, 8-10 త్రిష్టుప్.

    1. హింసింపబడనివి, నిరోధింపబడనివి, శత్రుసంహారకములు, కళ్యాణప్రదములు అయిన కర్మలు మమ్ము ఆశ్రయించవలెను. ఆశ్రయించిన వారిని విడువనట్టి, నిత్యము రక్షించునట్టి దేవతలందరు మా అభ్యుదయమును ఆశించవలెను.

    2. శుభప్రదులగు యజమానులందు అనురాగముగల దేవతలెల్లరు మమ్ము అనుగ్రహించవలెను. దేవతలు మాకు సంపదలు ప్రసాదించవలెను. మేము దేవతల మైత్రిని పొందవలెను. దేవతలు మాకు ఆయువును ప్రసాదించవలెను. దేవాన ఆయుః ప్రతిరస్తు జీవసే

    3. సనాతన కాలము నుంచి వచ్చుచున్న నిత్యమైన వేదవాక్కున భగుని, మిత్రుని, అదితిని, మరుత్తులను, అర్యముని, వరుణుని, సోముని, అశ్వినులను ఇంకను దేవతలను అందరిని ఆహ్వానించుచున్నాము. శోభన ధనములుగల సరస్వతి మాకు సుఖములు కలిగించవలెను. సరస్వతీనః సుభగామయస్కత్

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra