Home » Suryadevara rammohan rao » సూపర్ స్టార్


    "ముప్పై...."

    "మీకెందుకు పెళ్ళికాలేదో నాకర్థమయిందండి"

    "నీకా.....?: ఎందుకు?"

    "మీరు ఉద్యోగం చేసే ఆఫీసు పేరు చేప్పిఉంటారు"

    "అయితే?"

    "అయితే ఏంటండి........ ఏ ఆడపిల్ల తండ్రి మాత్రం తన కూతురు గొంతు కోస్తాడండి........?"

    "దిసీజ్ టూమచ్" అన్నాడు కె.మె కోపంగా.

    "టూమచ్ కె మీకింత కోపమయితే- కోటిమచ్ కి ప్రేక్షకులెంత కోపం తెచ్చుకోవాలండి....?"

    "ఓరి నాయనో ఇక నావల్లకాదు"

    "తెలుగు టీవీ ప్రేక్షకులు టీవీముందు కూర్చున్నప్పుడల్లా అనేమాట మీకెలా తెలిసిందండి.....?" కోడి కాలును కె.మేకి అందిస్తూ అన్నాడు బ్రహ్మానందం.

    ఉన్నట్టుండి భోరుమని ఏడ్చేసాడు కె.మే.

    "ఇప్పుడండి భోరుమని ఏడ్చేసాడు కె.మే.

    "ఇప్పుడండి.... ఇప్పుడు మీలో నాకు తెలుగు టీవీ ప్రేక్షకుడు కనిపిస్తున్నాడు."

    కె.మె వెక్కిళ్ళుపెట్టి ఏడుస్తున్నాడు.

    "ఒరే బ్రహ్మానందం.....పాపం వదిలెయ్యరా" దశరధ కల్పించుకొంటూ అన్నాడు.

    "ప్రజలు వీళ్ళను ఒదిలేస్తారండి- వీళ్ళే ప్రజల్ని వదిలేయటం లేదండి- చివరిగా చిన్న అనుమానమండి - అది తీర్చేస్తా ఒదిలేస్తాను....."

    "అదే చివరిదయితే సరే" అన్నాడు దశరధ.

    ప్రశ్నోత్తరాలని ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు గదండి వారానికొకసారి - అక్కడికేదో ప్రేక్షకుల అభిప్రాయాలకు విలువ ఇస్తున్నట్లు"

    "అయితే....?" కె.మే కన్నీళ్ళు తుడుచుకుంటూ అన్నాడు.

    "పొగిడే ఉత్తరాలు మాత్రం ముసిముసిగా నవ్వుకుంటూ ఒకామె చదివితే మరో పెద్దాయన తెగ ఆనందించేస్తాడు. మరి తిట్టే ఉత్తరాల సంగతేమిటి....? విమర్శించిన ప్రతి ఉత్తరానికి మిమ్మల్ని మీరు సమర్థించుకుంటూ భలే చెబుతారండీ సమాధానాలు. దాంతో ప్రేక్షకులకు కాలిపోదండి! టీవీ స్టేషనయినా, రేడియో స్టేషనయినా ప్రజల సొత్తు గదండి.... ప్రజల ఆశలకు, ఆశయాలకు అభిరుచులకు అనుగుణంగా నడుచుకోవాలి గదండి..."

    "మమ్మల్ని, మా పోగ్రామ్స్ ని మేమే సమర్ధించుకోకపోతే మరెవరు సమర్థిస్తారు....? కె.మే కలవరపాటుని కప్పి పుచ్చుకుంటూ అన్నాడు.

    "నిజమేనండి- చిన్న సలహా. మీ స్టాఫ్ మేకప్ మీద చూపే శ్రద్ధను- రంగు రంగుళ బట్టలు వేసుకోవటంమీద  చూపే శ్రద్ధను ప్రోగ్రామ్స్ మీద చూపిస్తే బావుంటుంది".

    "అలాగే చెబుతాను- నన్ను ఒదిలేయ్" దీనంగా అడిగాడు కెమే.

    "వదిలేయక ఛస్తావా........? కాని మాలాంటి అర్భకులకు కొంత మందు మిగలనివ్వండి చాలు. కనీసం భవిష్యత్ లో నైనా మీకు భవిష్యత్ ఉండేలా చూసుకోండి. దూరదర్శన్ చేసే వంద తప్పుల్ని ప్రేక్షకులు కాస్తారు- కానీ లక్ష  తప్పుల్ని మాత్రం క్షమించలేరు. దూరదర్శన్ లు అవినీతి  నిలయాలని మీ మంత్రిగారే... అదే ఉపేంద్రగారే శెలవిచ్చారు. మీరు లంచాలుపట్టి సీరియల్స్ ని- అదే చెత్త సీరియల్స్ ని ఓకేచేసే విధానంచూసి ఆయనే షాక్  తిన్నారట. సిగ్గు- శరం లాంటి పదాలు నిఘంటువులలో లేవని అనుకోకుడి ఎవరేమన్నా, ఎన్ని తిట్టినా దులిపేసుకు పోవటం ఇకనైనా మానేయండి. లేదంటే ప్రేక్షకులు తిట్టే అమ్మ... ఆలి బూతులు అన్యాయంగా మీవాళ్ళకు తగులుతాయి....." అంటూ బ్రహ్మానందం నోటిమీద చేయి అడ్డుపెట్టుకున్నాడు.

    కె.మె కొద్ది క్షణాలు గుక్కపెట్టి ఏడ్చాడు.

    "నేనేం చేయనండి..... ఎక్కడా ఉద్యోగంరాక ఓ ముప్ఫై వేలు లంచమిచ్చి దూరదర్శన్ లో చేరిపోయాను. ప్రేక్షకుల ఉసురు తగులుతోందని తెలుసు నాకు కానిప్పుడు ఇంకెక్కడ నాకు ఉద్యోగమిస్తారండి....? కళ్ళు మూసుకొని దులిపేసుకు బ్రతక్క తప్పదు" అన్నాడు వెక్కి వెక్కి ఏడుస్తూనే.

    "ఊరుకో..... ఊరుకో.... ఏనుగు వెళ్తుంటే కుక్కలు అరుస్తుంటాయి- అన్నిటిని పట్టించుకుంటే ఎలా....?" దశరథ కె.మేని అనునయిస్తూ అన్నాడు.

    "మీరు భలే సెలవిస్తారండి.....సరీగ్గా చెప్పారు..... ఏనుగు మదమెక్కి పొలాల్ని నమిలి మ్రింగేస్తుంది-విశ్వాసానికి మారుపేరయిన కుక్కలు ఆ పొలాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాయి. దూరదర్శన్ అచ్చం వైట్ ఎలిఫెంటే- తాగినమందు ఇప్పుడు ఒంటబట్టిందండి" బ్రహ్మానందం దశరధతో అన్నాడు.

    "ఒరేయ్....ఈ రోజుకి నీకోటా అయిపోయింది. నువ్విక నోరుముయ్" అన్నాడు దశరథ గద్దిస్తున్నట్లు.

    బహ్మనందం మత్తుగా సోఫాకి జారగిలబడ్డాడు.

    "ఇప్పుడు చెప్పు- స్క్రిప్ట్  ఓ.కే అయిందట?" దశరధ విషయంలోకి వస్తూ అడిగాడు.

    "ఎవరిది-?" కె.మే కన్ ఫ్యూజ్ అవుతూ అడిగాడు.

    "ఎవరిదేమిటయ్యా......? నేను ఎవరిగురించి వర్రీ అవుతాను.....?" తన అంతరంగాన్ని తెలుసుకోలేకపోయినందుకు దశరథ చిరాకుపడ్డాడు.

    "నేను చెప్పానా.....? వాళ్ళ మెదడు లంచాలు గుంజటానికే ఉపయోగపడుతుందని...." బ్రహ్మానందం వేదాంతిలా అన్నాడు.

    "ముందు నువ్వు నోర్ముయ్......ఆ హంపి సంగతి నేను చెప్పేది" ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తూ అన్నాడు దశరథ.

    "అవును..... మీరే ఒకింత ఇబ్బందిపెట్టి ఓ.కే చేయమని మా డిప్యూటీకి చెప్పారటగదా....?"

    "ఆహా..... వీడేమో ఈరోజు ఉదయమే నందీ హిల్స్ పై షూటింగ్ మొదలయినట్లు చెప్పాడు- పైలట్ షూటింగ్...." జెలసీగా అన్నాడు దశరథ.

    అయితే మీకేమిటి నష్టం....?" కె.మేకి అర్థంకాక అడిగాడు.

    "నష్టం జరగఖ్ఖర్లేదు - అవతలవాళ్లు బాగుపడినా- పచ్చగా ఉన్నా, కొత్త బట్టలేసుకున్నా మేం చూడలేం. వాళ్లెంత కష్టపడి పైకొచ్చినా మా కఖ్ఖర్లేదు- వాళ్ళలోని బొక్కల్ని వెదికి కంపుచేయాలనే చూస్తాం. నిజంగా కష్టపడి పైకొచ్చినా ఏ మాయలు చేయకుండా ఎలా పైకొచ్చాడనే కుళ్లు ఆలోచనలు చేస్తాం. అవన్నీ నీకెందుకయ్యా....మేం ఫ్రీగా పోసే మందుతాగి రహస్యాలు చెప్పుచాలు....." బ్రహ్మానందం కె.మే మీద చిరాకుపడ్డాడు.

    దశరథ బహ్మానందాన్ని కొట్టేందుకు లేచాడు.

    "క్షమించాలి సార్...... ఏమిటో నా వెధవనోరు- ఎప్పుడూ నిజాలు చెప్పి తిట్లుతినేందుకే తాపత్రయపడుతుంది" అన్నాడు బ్రహ్మానందం నొచ్చుకుంటున్నట్లు.

    "అది బ్రహ్మానందం చెప్పినట్లు తప్పుసార్..... షి ఈజ్ ఏ గ్రేట్ కెమేరా వుమెన్....."

    కె.మే మాటలకు దశరథకు అరికాలిమంట నెత్తికెక్కిపోయినట్లయింది.

    "డిప్లోమా పాసయితే చాలు- అనుభవమున్నా లేకున్నా, గోడకి పిడకలు కొట్టినట్లు షూట్ చేసినా మీకు జీతాలొస్తాయి. కాని బయట వాళ్ళ విషయంలొ రియల్ గా టాలెంట్ ఉన్న ఫోటో గ్రాఫర్స్ కాకపోతే అవకాశాలు  రావు. వేలకు వేలు కెమేరామెన్ లుగా దూరదర్శన్ లొ జీతాలు తీసుకుంటూ, బయట కంపెనీలకు కెమేరా మెన్ లుగా పనిచేసే కక్కుర్తి పనులు ఎందుకు చేస్తున్నారు.....? మీరు షూట్ చేయని ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు టీవీలో రాకుండా వెధవ రాజకీయలెందుకు చేస్తున్నారు.....? అది తప్పుకాదా? జెలసీతో కాదా...... నేనసలే మంచోడ్నికాదు- నేను నోరు విప్పితే మీ టీవీ జాతకాలన్నీ బయటకొస్తాయి. నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి" దశరధ మండిపడుతూ అన్నాడు.

    కె.మే భయంతో వణికిపోయాడు.

   
                      *    *    *

    ప్రభు అర్థరాత్రయినా నిద్ర పోలేకపోతున్నాడు. సి.బి.ఐ చీఫ్ నుంచి రోజుకు రెండు మూడు ఫోన్స్ వస్తున్నాయి- ఢిల్లీ కాల్ అంటేనే కాలుచెయ్యి ఆడటం లేదు.

    మరోప్రక్క సి.బి.సి.ఐ.డి క్రైమ్స్ డి.ఐ.జి అలా..... ఆ పైన డి.జి.పి. మందలింపు- ఏం చేయాలో.....? ఎలా పరిశోధనలో ముందుకు వెళ్ళాలో అర్థంకాక సతమతమయిపోతున్నాడు ప్రభు.

    తను జాబ్ లో చేరాక ఏవో ఇబ్బంది పెట్టేకేసులు ఎదురయినా సునాయాసంగా శోధించి నేరస్థుల్ని పట్టుకొని కాస్తోకూస్తో మంచిపేరుని డిపార్ట్ మెంట్ పరంగా సంపాదించుకున్నాడు.

    కాని నిజమైన ఛాలెంజ్...... జయధీర్ ని వేటాడిపట్టుకోవటం..... పోలీసు శాఖలో, నేరపరిశోధనశాఖలో పనిచేసే అధికారులకు ఎంతో సహనం, సంయ మనం, నేర్పు ఇరవై నాలుగుగంటలు పనిచేయగల శరీర ధారుడ్యం- అన్నింటికిమించి కామన్ సెన్స్ ఉండాలని తను ఐ.పి.ఎస్ ట్రైనింగ్ లో ముస్సోరిలో ఉండగా చెప్పటం గుర్తుకొచ్చి ఉలిక్కిపడ్డాడు. అప్పటివరకు తనలో గూడు  కట్టుకున్న నిరాశా, నిస్రృహల్ని, అసహనాన్ని ఎలా తన నుంచి దూరం చేసుకోవాలని కొద్ది క్షణాలు మధనపడ్డాడు.

    కొద్ది క్షణాలకు పచార్లు చేయటం ఆపి తను ఉంటున్న క్వార్టర్స్ టెర్రస్ పైకి వెళ్ళాడు.

    ఓసారి టైమ్ చూసుకున్నాడు.

    రాత్రి 12.30 ని సూచించింది రిస్ట్ వాచ్.

    టెర్రస్ మీద ఓ మూలగా ఉన్న వాలుకుర్చీ దగ్గరకు వెళ్ళాడు. తను అనుభవిస్తున్న టెన్షన్ ని వదిలించుకోబోతున్నానని మనస్సులో ఓసారి స్థిరంగా అనుకున్నాడు.

    కుర్చీలో జారగిలబడ్డాడు.

    కాళ్ళను ఫ్రీగా, ఎడంగా పర్చాడు.

    కుర్చీకున్న చేతులమీద తన చేతుల్ని వేసాడు.

    నెమ్మదిగా, గుండెలనిండా గాలిని పీల్చుకొని వదలసాగాడు.

    బ్రీతింగ్ మూమెంట్స్ మీద తన దృష్టిని పూర్తిగా కేంద్రీకరించాడు. ఎదురుగా కనిపిస్తున్న స్ట్రీట్ లైట్ మీద దృష్టిని నిలిపి ఏకాగ్రతతో బ్రీతింగ్ ఎక్సర్ సైజుని కొనసాగించసాగాడు.

    క్షణాలు.....నిమిషాలు...... కరిగిపోసాగాయి.

    ఇప్పుడు ప్రభులో చలనం లేదు- ప్రాణమున్న శవంలా అలా వీధి దీపంకేసే చూడసాగాడు.

    you may prefer to look at a particular object breath. slowly and deeply....అనే మాటలు ప్రభు మీద బాగా పనిచేస్తున్నాయి.

    ఆ నిశి నిశ్శబ్దంలో.....పగలంతా అలసి సొలసిన ప్రజల గాఢ సుషుప్తిలో ఉండగా, వృత్తి ధర్మాన్నే ప్రాణంగా భావించే ఒక సిన్సయర్ పోలీసాఫీసర్ తన వృత్తికి, తను తీసుకొనే జీతానికి న్యాయం చేకూర్చేందుకు తనను తాను సమాయత్తం చేసుకుంటున్నాడు.

    ముందుగా తన చేతుల్ని, చేతివేళ్ళను రిలాక్స్ చేసుకున్నాడు.

    ఆ తరువాత పొత్తికడుపు కండరాల్ని....

    కాళ్ళను, అరికాళ్ళను.....టెన్షన్ నుంచి రిలాక్స్ చేసుకున్నాడు.

    శరీరంలోని అన్ని భాగాలు రిలాక్స్ అయ్యాయి.

    శ్వాస చాలా మృదువుగా ఉంది.

    చేతులు, కాళ్ళు, తల దృఢంగా తయారయ్యాయి.  

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra