Home » Vasireddy seeta devi novels » మళ్ళీ తెల్లవారింది

    "సుందరీ! ఏమిటి మరీ చిన్న పిల్లలా? ఇప్పుడేమైంది చెప్పు! నేనింకా బతికే వున్నానుగా?" నిష్ఠూరంగా అన్నాడు.
    "మరి... మరి... వాడు... చిన్నవాడు... నిన్న మొన్నటిదాకా కొంగుపట్టుకొని తిరిగినవాడు, మిమ్మల్ని వదిలి నేనెక్కడకు పోతానమ్మా అన్నవాడు... ఇవ్వాళ... ఇవ్వాళ... భార్య కొంగుపట్టుకొని... మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడండీ! నెలకింత పంపిస్తాడంట అన్నలకు కూడా చందాలు పంపించమని చెప్తాడట. ఎంతవాడయ్యాడండీ! ఎంతవాడయ్యాడండీ! నేను చెప్పలేదూ! ఆ పిల్ల సామాన్యురాలు కాదని...?
    "సుందరీ ఏమిటామాటలు? పరాయి బిడ్డను ఎందుకనాలి?"
    "ఊళ్లో అందరికీ వెళ్ళిపోతున్నామని చెప్పానండీ!"
    "అదా నీ బాధ! మావారికి ఇష్టం లేదు. ఓపిక వున్నంతవరకు ఎవరింటికీ వెళ్ళనన్నారని చెప్పు."
    "వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. రెక్కలు వచ్చాయి ఎగిరిపోయారు. సున్నితంగా వుండే ఆ ముక్కలకు ఆహారాన్ని అందించాం. అవి ఇప్పుడు వాడితేలాయి. వాటికి మరొకరు ఆహారం అందించక్కర్లేదు. అవసరం అయితే ఆ ముక్కులతో ఆహారం అందించిన శరీరాలనే పీక్కుతినగలవు."
    "సుందరీ! సుందరీ! ఏమిటి ఎలా మాట్లాడుతున్నావ్!"
    "అందరూ వెళ్ళిపోయారు. ఇక మనిద్దరం ఈ ఇంట్లో వంటరిగా పిశాచాల్లా తిరుగుతాం. "తనధోరణిలోనే కలలో పలవరిస్తున్నట్టుగా మాట్లాడుకుపోతున్నది.
    కామేశ్వరరావుకు భార్యకు మతి చలించిందేమోనని భయం వేసింది.
    "సుందరీ!" గావుకేక పెట్టాడు.
    సుందరమ్మ ఒక్కసారిగా తృళ్లిపడి ఈ లోకంలోకి వచ్చింది. తనకెదురుగా నేలమీద చతికిలపడి కూర్చుని వున్న భర్తను చూసింది.
    "చూశారా! వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. మనిద్దరమే..."
    "ఎందుకు సుందరీ అంత బాధపడ్తావ్! వాళ్ళెక్కడికి వెళ్ళారని? మనం వాళ్లను చదివించాం. ఎందుకు? మనకెదురుగా కూర్చోబెట్టుకోవడానికా? మొదట్లో మనిద్దరమేగా ఈ ఇంట్లో ప్రవేశించాం."
    "అవును మనిద్దరమే వచ్చాం. కాని మనతోపాటు మనసునిండా అమృతాన్ని, కళ్లనిండా కలల్ని, నింపుకొని వచ్చాం. ఎన్ని ఆలోచనలు - ఎన్ని కోరికలు - ఎన్నెన్ని ఆశలు - పెరిగబోయే సంసారాన్ని గురించి ఎన్నెన్ని ఆకాంక్షలు - ఇవన్నీ అప్పుడు మనతో వున్నాయి. ఇప్పుడు...మిగిలిందేమిటి? ఈ అలసి, ముడుచుకుపోయిన శరీరాలు మాత్రమే - ఈ వయసులో ఇద్దరం..."
    "ఏం చాలదా? నాకు నువ్వూ నీకు నేను ఉన్నాం. చంద్రం ఊళ్లోనే వున్నాడు. మనవళ్లున్నారు. వాళ్ళూ వస్తూ పోతూ వుంటారు. మనకు ఎవర్ని ఎప్పుడు చూడాలనిపిస్తే అక్కడివెళ్ళి చూసి వస్తూవుంటాం."
    "నా బాధ మీకు అర్ధం కావడంలేదు."
    "నాకు అర్ధం అయింది. ఇంకేం మాట్లాడకు. చూడు సుందరీ! నా శరీరంలో ఇంకా శక్తి వుంది. మనం ఒకరిమీద ఆధారపడి బతకక్కర్లేదు."
    "అవునండీ! మన పేరుమీద బ్యాంకులో లక్షలుంటే వీళ్లిలాగే చూసేవాళ్లా? పోటీలు పడి మనల్ని, మా ఇంటికి రమ్మంటే మాయింటికి రమ్మనేవాళ్లు కాదూ?"
    కామేశ్వరరావు భార్య ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. అతడికి చదువుకొనే రోజుల్లో చదివిన ఒక నవలలోని మాటలు గుర్తొచ్చాయి. ఆ నవల ఒక రచయిత్రి రాసింది. కామేశ్వరరావు బుర్రలో ఆ మాటలు మెదిలాయి. అందులో హీరోయిన్ తను ప్రేమించిన బీదకుర్రవాడ్ని పెళ్ళి చేసుకోవడానికి భయపడుతుంది. కారణం, కటిన దరిద్రంలో, కాట్లకుక్కల్లా, ఒకర్నొకరు పొద్దస్తమానం కరుచుకుంటూ వుండే తల్లిదండ్రుల మధ్య పెరిగింది. నిజమైన మమతానురాగాలు ఎలా వుంటాయో తెలియకుండా పెరిగింది. అందుకే బాగా డబ్బున్న తన బాస్ ను చేసుకోవడానికి సిద్ధపడింది. తనలో తను మధన పడుతుంది. తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటుంది అవును : డబ్బు! డబ్బు! నిజమే తను డబ్బుకోసమే ఈ వివాహానికి అంగీకరించింది. ఆమాట చెప్పడానికి తను సిగ్గుపడాల్సిన పని లేదు. డబ్బు లేకపోవడం అంటే ఏమిటో తనకు తెలుసు. డబ్బు ఎందుకు కావాలో కూడా తనకు తెలుసు. భార్యాభర్తల మధ్య అనురాగం చివరివరకూ నిలబడి వుండాలంటే డబ్బుకావాలి. ఆత్మీయతలూ, అనురాగాలూ - మమతలూ - మమకారాలూ - నిలబడి వుండాలంటే డబ్బు కావాలి తన భర్త తనను, తన తండ్రి తన తల్లిని కొట్టినట్టు, కొట్టకుండా వుండాలంటే డబ్బు కావాలి. తను భర్తను గౌరవంగా చూడాలంటే అతను డబ్బు సంపాదించాలి. అమ్మలా తను ఆత్మహత్య చేసుకోకుండా వుండాలంటే డబ్బు....'
    "ఏమండీ! మరి మీకు ఈ ఓపిక కూడా పోయాక"
    కామేశ్వరరావు ఆలోచనలనుంచి బయటపడి భార్య ముఖంలోకి ఓ క్షణం చూశాడు.
    "అప్పుడు ఎలాగూ తప్పదు. వాళ్లకూ తప్పదు .అవసరమైన అనుమానాలతో బాధపడకు" భార్యను ఓదార్చడం కోసం అన్నాడు. కాని ఆయనకు అనుమానాలు లేకపోలేదు.
    "వద్దు! వద్దు! ఆరోజు తనకు రాకూడదు. అలాంటి రోజు తను చూడకూడదు. తిరుగుతూ తిరుగుతూనే పోవాలి. తనకంటే ముందు తన భార్యపోవాలి. అసహాయ స్థితిలో, ఆశ్రయం కోసం ఎవర్నీ - కన్నబిడ్డల్ని కూడా దేబిరించకూడదు." మనసులోనే పదేపదే అనుకున్నాడు కామేశ్వరరావు.
    "అల్లుడు మంచివాడండీ!"
    "మన పిల్లలూ మంచివాళ్లే!"
    "అవును! చాలా మంచివాళ్లు. ఇంత మంచివాళ్లను ఏ తల్లీ కనకూడదు!
    "ఛ! ఏంమాటలవి? ఒక తల్లి అనకూడని మాటలు అంటున్నావు."
    సుందరమ్మ కళ్లలో నీరు తిరిగింది. భర్త ముఖంలోకి బాధగా చూసింది.
    "ఒక కథ చెప్పనా!"
    సుందరమ్మ ఆశ్చర్యంగా చూసింది.
    "కథా? ఏం కథ? ఎవరి కథ?"
    "ఒక అమ్మకథ"
    "అమ్మకథా!"
    "అవును! చెబుతాను విను. అనగనగా ఒక అమ్మ. ఆ అమ్మకు ఒకే కొడుకు. వాడికి రెండేళ్లప్పుడు తండ్రిపోయాడు. తల్లి రెక్కల కష్టం మీద పిల్లవాడ్ని పెంచింది. అపురూపంగా పెంచింది. చదివించింది. ఆమె జీవితం అంతా బిడ్డ చుట్టూనే పెనవేసుకుంది. వాడు ఒక యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తల్లి అభ్యంతరం చెప్పలేదు. కొడుకు ఇష్టమే తన ఇష్టం అంది. కాని ఆ యువతి ఒక చిత్రమైన కోరిక కోరింది. తనను అతడు ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాడో తెలుసుకోవాలనుకుంది. ఆ కోరిక ఏమై వుంటుందో ఊహించగలవా సుందరీ!" ఆగి ఆమెకేసి చూశాడు.
    "నీ అమ్మ మనతో వుండకూడదు అని వుంటుంది."
    "ఇది ఈనాడు అతిమామూలు కోరికే."
    "ఇది మామూలు కోరికా?"
    "అవును!"
    "మరి! ఇంకా ఏం కోరివుంటుంది? మీరే చెప్పండి."
    "అతడి తల్లి గుండెకాయను తెచ్చి బహుమతిగా ఇవ్వమని కోరింది."
    "ఇదేం కోరిక దాని బొంద కోరిక?"
    "కోరింది అంతే! అప్పుడు వాడేం చేసి వుంటాడో ఊహించగలవా!"
    "దాన్ని నాలుగు దులుపేసి, దాంతో తెగతెంపులు చేసుకొని వుంటాడు. ఏ కొడుకైనా అదేచేస్తాడు. ఇంత దారుణమైన కోరిక కోరిన ఆడదాన్ని ఏ కొడుకైనా ఎలా క్షమిస్తాడు?"

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra