Home » Mucherla rajani sakuntala » గెస్ట్ హౌస్

"లేదు...చిత్రావతి అడవి లోపలవున్న చిరుతలు, సింహాలు, నరమాంస భక్షకులు...ఎవరూ ఈ అడవి దాటి బయటకు రాకుండా చేసిన ఏర్పాటై వుంటుంది..." అన్నాడు నచికేత.
"అద్సరే...వీడికి ఆ తాళం చెవి ఎలా వచ్చింది..." సూరజ్ లో అనుమానం.
"బహుశా మనకన్నా ఓ వారం పది రోజుల ముందు వచ్చి దీనికి డూప్లికేట్ 'కీ' తయారుచేయించి వుంటాడు" అన్నాడు నచికేత...
"నాకైతే...ఆ ఇద్దర్నీ చూస్తుంటే హర్రర్ సినిమాల్లో డ్రాకులా క్యారెక్టర్ లా వున్నారు" సూర్యనారాయణ మనసులోని తనకున్న ఫీలింగ్ చెప్పాడు.
అప్పటికే పీటర్సన్ గేటు వేసి తాళం వేసాడు. అటువైపు నుంచి చూస్తున్నాడు పీటర్సన్...
ఐదుగురు చేతులు వూపారు.
బదులుగా పీటర్సన్, డేనియల్ చేతులు ఊపారు.

                                     * * *
"మన పని ఇక్కడితో అయిపోయినట్టేనా?" అడిగాడు డేనియల్...
"లేదు...దగ్గర్లో ఉన్న ఓ చిన్నపాటి అడవిలో గుడారం మన కోసం సిద్దంగా వుంది. రామయ్య కూడా ఈపాటికి తన తంతుకు కావలసిన ఏర్పాట్లు చేస్తూ వుండాలి..."
"రామయ్య వచ్చాడా?"
"అవును...డ్రైవర్ క్యాబిన్ లో వచ్చాడు నచికేత వాళ్లకు అనుమానం రాకూడదనే...సరిగ్గా మరో రెండు నిమిషాల్లో రామయ్య తన క్షుద్ర తంతు మొదలెడతాడు" చెప్పాడు పీటర్సన్...
సరిగ్గా రెండు నిమిషాలు తర్వాత...రామయ్య చిత్రావతిని ఆనుకుని ఉన్న ఓ చిన్న అడవిలో...ఓ గుడారం ముందు కూచుని ఉన్నాడు. అతని ఎదురుగా చితి...ఆ చితికి ఎదురుగా కూచుని తన తంతుని ప్రారంభించాడు. ఎప్పుడైతే తంతుని ప్రారంభించాడో...ఆ క్షణమే...?
                                                          19
గుబురుగా ఉన్న చెట్టు
ఆ చెట్లకు కాసింత దూరంలో చిన్న గుడారం...
ఆ గుడారం బయట రామయ్య పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు.
ఆ స్థలంలో కొంత మేర గడ్డి పీకేసి చదును చేయబడి వుంది.
గుడారంలో కాగడా వెలుగుతోంది...గుడారం బయట యజ్ఞగుండం లాంటిది వుంది.
ఎండు పుల్లాలు వేసి నిప్పు అంటించాడు రామయ్య.
ఆ యజ్ఞగుండం చుట్టూ ఎరుపు, నలుపు, తెలుపు రంగులతో ముగ్గులు వేసి వున్నాయి.

                                     * * *
మిడ్ నైట్, సరిగ్గా పన్నెండు గంటలు.
 రామయ్య కళ్ళు రక్తవర్ణంలోకి మారాయి.
ఒంటిమీద రక్తంతో తడిచిన గోచీలాంటిది తప్ప మరేమీ లేదు.
బిత్రోచిని సంతృప్తి పరచడానికి, బిత్రోచికి కావలసిన 'బలి' ని సమర్పించడానికి అతను ఆయత్తమవుతున్నాడు.
అతని తంతు మొదలయ్యే సమయంలో...అతి క్షుద్రమైన ఆత్మలన్నీ వికృత నాట్యాన్ని మొదలెడతాయి...భయానకమైన సంఘటనలు సృష్టిస్తాయి...భయోత్పాతాన్ని కలిగించి అతని తంతుని అడ్డగించే ప్రయత్నం చేస్తాయి...
ఇవన్నీ ఆ క్షుద్రోపాసకుడి సంయమన శక్తి...అతీత శక్తిని పరీక్షించడానికే.
ఏ సమయంలో అతను ఉలికిపాటును ప్రదర్శించినా, మూడు రకాల జంతువుల రక్తంతో తడిచిన తన చిన్నపాటి వస్త్రాన్ని చూసుకున్నా, అతని తంతు బెడిసి కొడుతుంది. వికృతమైన, భయంకరమైన మరణాన్ని అతను పొందుతాడు.
అతను మరణించకముందే క్షుద్ర ఆత్మలు అతని శరీరాన్ని చిద్రం చేస్తాయి.
ఇవన్నీ తెలిసి కూడా రామయ్య అలాంటి భయంకరమైన క్షుద్ర తంతుకు సిద్దపడ్డాడు. ఇది పీటర్సన్ ఆజ్ఞ.
తను ఈ తంతును నిర్విఘ్నంగా కొనసాగించిన మరుక్షణం...చిత్రావతి అడవిలో బిత్రోచి గెస్ట్ హౌస్ ని చేరుకునే ప్రయత్నంలో ఉన్న ఐదుగురిలో విచిత్రమైన మార్పులు వస్తాయి. క్షుద్రం, నీచం, స్వార్ధం ప్రవేశిస్తాయి. తెలివి, బలం ఉన్నవాడు మిగతా వాళ్లని చంపడానికి ప్రయత్నిస్తాడు. చివరికి బిత్రోచి గెస్ట్ హౌస్ ను చేరుకునేలోగా ఏ ఒక్కరూ మిగలరేమో. అందరూ క్షుద్రోచితమైన ఆలోచనలతో మారిపోవడం జరుగుతుంది.
బిత్రోచి గెస్ట్ హౌస్ తలుపులు తెరుచుకున్న మరుక్షణం...
బిత్రోచి సంతృప్తితో సమర్పణను స్వీకరించిన మరుక్షణం , పీటర్సన్ ని కరుణిస్తుంది...రామయ్యను ఆదరిస్తుంది.
ఈ ప్రపంచాన్ని శాసించగలిగే సర్వ క్షుద్రశక్తులు వాళ్లిద్దరి వశమవుతాయి.
బిత్రోచి నిద్ర లేస్తుందా? అందుకే భయంకరమైన ఈ చివరి తంతును మొదలు పెట్టాడు రామయ్య...
ఆ తంతు...అ...కో...రా...
                                        * * *
"ఈ అడవిని చూస్తోంటే భయమేస్తోందిరా...
సినిమాల్లో అడవిని చూడ్డమేగానీ, నిజంగా మనకి తెలీదు అడవుల గురించి..." సూర్యనారాయణ సూరజ్ తో అన్నాడు.
వాళ్ళు అప్పటికి నడక సాగింది రెండు గంటలకు పైగా అయింది. కాళ్ళు నొప్పి పెడుతున్నాయి.
"అబ్బ...నాకిక ఓపిక లేదు బాబూ" అంటూ ప్రభు ఓ చెట్టు దగ్గర కూలబడ్డాడు.
చీకట్లు అలుముకున్నాయి....
అందరి గుండెల్లోనూ దడ మొదలైంది. ఎప్పుడే జంతువు విరుచుకుపడుతుందో? ఎప్పుడే విషసర్పం కబళిస్తుందో?
కీచురాళ్ల రొద మొదలైంది.
నడుస్తుంటే ఎండుటాకులపై అడుగులు పడ్డప్పుడల్లా చప్పుడు వేస్తోంది. నిశ్శబ్దంగా నడుస్తుంటే ఆ సౌండే డీటీఎస్ లో సోకుతుంది వాళ్లకి...
ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవడమంటే అదేనేమో?
ఏదో సరదాకు, థ్రిల్లింగ్ గా ఉంటుందనుకుని ఈ అగ్రిమెంట్ ఒప్పుకోవడం పెద్ద పొరపాటుఅయ్యిందని ఎవరి మట్టుకు వాళ్ళు అనుకుంటున్నారు.
నచికేత కూడా చెట్టుకు ఆనుకొని కూచుండిపోయాడు.
సూరజ్ మినరల్ వాటర్ బాటిల్ ఓపెన్ చేసి తను తాగి అందరికీ అందించాడు.
నచికేత ఏర్ బేగ్ ఓపెన్ చేసి మ్యాప్ తీసాడు.
చీకటిగా ఉండడం వల్ల సరిగా చూడలేకపోతున్నాడు.
విలియమ్స్ టార్చిలైట్ బయటకు తీసాడు. టార్చిలైట్ వెలుతురులో మ్యాప్ ను పరిశీలించసాగేడు నచికేత.
"నచీ...మనం కరెక్టు రూట్ లోనే వెళ్తున్నాం కదా..."విలియమ్స్ అడిగాడు.
"మనం ఏ రూట్లో వెళ్లినా గెస్ట్ హౌస్ ను చేరుకుంటాం...ఎందుకంటే ఈ అడవి మధ్యలోనే గెస్ట్ హౌస్ ఉంటుంది.
కాకపోతే మనం సేఫ్టీ ప్లేస్ గుండా ప్రయాణించాలి..." చెప్పాడు నచికేత...
"ఈ అడవిలో నుంచి మనం బయట పడగలమా?" అడిగాడు భయం భయంగా ప్రభు...
"మనం ఈ వెంచర్ ని రిస్క్ తో ప్రారంభించాం...ఇప్పుడిక భయపడి లాభంలేదు..." అన్నాడు నచికేత.
సూరజ్, సూర్యనారాయణ మౌనం వహించారు.
"ఈ రాత్రి మనం ఇక్కడ విశ్రాంతి తీసుకుందాం...రేప్పొద్దున్నే బయలుదేరొచ్చు..." చెప్పాడు నచికేత.
"మరో గంట నడిస్తే..." విలియమ్స్ అడిగాడు...
"రాత్రి వేళ ప్రయాణం మంచిది కాదు...విషపురుగులు, క్రూర మృగాలూ సంచరించే ప్రదేశం కాబట్టి...ఇక్కడ ఆగుదాం..." అన్నాడు నచికేత...
"అబ్బ...చలి చంపేస్తోంది...ముందు సెగలు వేద్దాం. ఆ తర్వాత కాస్త తిని చెట్టుపైన విశ్రమిద్దాం .." అన్నాడు సూరజ్...
అందరికీ ఆ ప్రపోజల్ నచ్చింది.
ఎండు పుల్లలు ఏరుకు వచ్చి మంట వేసారు. బ్యాగ్ లో నుండి బ్రెడ్, జామ్ బయటకు తీసారు. ప్రభు చిన్నపాటి కెటిల్ తీసాడు. మిల్కుపౌడర్ లో కాసిన్ని నీళ్ళు కలిపి, కెటిన్ లోని పాలను వేడి చేసాడు.
మరో పదినిమిషాల్లో వేడి వేడి టీ తయారు చేసారు అందరూ కలిసి.
చలిలో వేడి వేడి టీ తాగుంటుంటే రిలాక్స్ డ్ గా అనిపించింది అందరికీ.
'సిక్స్ ఇన్ వన్' నుండి వస్తున్న చిరు వెలుతురులో నిశ్శబ్దంగా ఉన్న ఆ వాతావరణం గమ్మత్తుగా వుంది. నిజానికి ఇలాంటి థ్రిల్లింగ్ అడ్వంచర్స్ చెయ్యాలని చాలా మందికి వున్నా భయం చేత చెయ్యరు. కేవలం సినిమాలో చూసి ఆనందపడాలంతే...
అలాంటిది నిజంగా తాము తామేనా అని తెగ ఆశ్చర్యంగా వుంది వారికి.
"జాము రాతిరి...జాబిలమ్మ..." పాట కేసెట్ ను సిక్స్ ఇన్ వన్ లో పెట్టాడు విలియమ్స్.  
కమ్మని ఆ పాటను ఎంజాయ్ చేయసాగారు..
ఎండు పుల్లలతో చేసిన ఈ చలి నెగడను చూసి కొన్ని జంతువులు పారిపోతాయి. మనం గంట కొకరం చొప్పున ఇక్కడ కాపలా కాద్దాం...మిగతా నలుగురు పడుకుంటారు. ఒక్కరు మాత్రం కాపలా కాయాలా. వన్ అవర్ తర్వాత రెండవవాళ్ళు...చెప్పాడు నచికేత.
ముందుగా నచికేత కాపలా ఉంటానన్నాడు.
మిగతా నలుగురు చెట్టు ఎక్కారు...ఏ క్షణమైనా, ఏ క్రూరమృగం ఎటువైపు నుంచి ఎటాక్ చేసినా ఆ చెట్టుపైన ఉంటే సేఫ్టీ అనే ఉద్దేశంతో ఆ ప్లాన్ చేశాడు నచికేత.
                                                          * * *
ఒక్కో ఎండు పుల్లను నెగడులో వేస్తున్నాడు నచికేత...
అతనికి నిద్రరావడంలేదు...అతని సిక్త్స్ సెన్స్ ఏదో ప్రమాదాన్ని హెచ్చరిస్తున్నట్టు అనిపిస్తోంది... 

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra