Home » D kameshwari » Chikati Tolagina Ratri


    మాడిపోయిన ముఖంతో ఇంటికి వెళ్ళాడు. ఎవరితో మాట్లాడకుండా గదిలోకి వెళ్ళి మంచం మీద వ్రాలాడు.
    కాని అతని భయాలన్నీ మరో రెండు గంటలలో దూరమయ్యాయి.
    "ఓరేయ్! రమాదేవి భోజనానికి పిలిచిందిరా!' అన్నాడు సారధి గదిలోకి వచ్చి, లైటార్పేసి మంచం మీద వెల్లికిలా పడుకొని ఆలోచిస్తున్న కుమారస్వామికి నమ్మశక్యం కాలేదు.
    "ఎప్పుడు?" అన్నాడు.
    "యిప్పుడే పంపింది రెడ్డిని. వంట తయారయిపోతే అక్కడికే తీసుకొస్తే కలిసి తినవచ్చంది"
    అది వాళ్ళకి మామూలు. ఒకరోజు ఆ యింట్లో, మరోరోజు యీ యింట్లో. ఒక్కొక్కసారి నోటీసు తక్కువయితే, వంట తయారయిపోతే పిక్నిక్ వెళ్ళినట్టు యిక్కడ చేసినవి అక్కడికి తీసికువెళ్ళి అంతా ఏ పెకాడో ఆడి, సరదాగా కలిసి తినడం అలవాటు.
    ఎలాగో వెళ్ళాడు కుమారస్వామి. ఆమెతో మాటలు కలపడానికి భయపడ్డాడు. మాటలు తడబడ్డాయి. కాని, ఆమె ఏం జరగనట్టు నవ్వుతూ మాట్లాడితే, సాయంత్రం జరిగిన సంఘటన దృష్ట్యా ఏం అర్ధం కాని అయోమయంలో పడ్డాడు కుమారస్వామి.
    మరో పదిహేను రోజులు గడిచాయి.
    "తిరుపతి వెడదామనుకుంటున్నాను" అంది రమాదేవి సాయంత్రం లానులో కూర్చుని టీ త్రాగుతుండగా సారధితో. సారధి నోరు తెరచి ఏదో అనేలోగానే నీకు నాతొ రావడానికి వీలుంటుందా?' అంది ఆమె మళ్ళీ.
    "ఆ....ఆ....వస్తాను, వీలుంటుంది....వీలుండకేం...." తబ్బిబ్బఅయ్యాడు జవాబు చెప్పడానికి సారధి. మహా అదృష్టం పట్టబోతున్నట్టు ఏదో సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.
    "వాళ్ళు ముగ్గురూ కూడా వస్తారేమో అడుగు సరదాగా వెళ్ళి వద్దాం!' అంది. కాసేపటికి సారధి ఉత్సాహం పొంగే పాల మీద నీళ్ళు చిలకరించినట్లు అయింది. వాళ్ళు రాకూడదని వీలుండకూడదని మనస్సులో ఒక క్షణంలో వెయ్యి దేవుళ్ళని తలుచుకున్నాడు.
    ఆ వెయ్యి దేముళ్ళు సారధి మొర ఆలకించారు. తక్కిన ముగ్గురూ రమాదేవి ఆహ్వానాన్ని అందుకోలేనివాళ్ళం అయ్యామని ఏడుపు మొదలుపెట్టారు. స్వామి సరిగ్గా ఆరోజే చీఫ్ ఇంజనీర్ తో కలిసి బొంబాయి వెళ్ళడానికి ముందే ఫిక్స్ అయింది. శర్మకి ఆ ముందురోజే చెల్లెలి పెళ్ళికి వెళ్ళాల్సి వుంది. వెంకట్రావు ఆఫీసుకి ఇన్స్ క్షన్ కి పై అధికారి ఆ తారీకునే వస్తున్నారు. సారధి అదృష్టానికి, సారధికి దొరికిన అవకాశానికి అసూయపడుతూనే "బెస్ట్ ఆఫ్ లక్ ' అంటూ సారధిని విష్ చేశారు.
    "మనం ఇద్దరమే గదా, మద్రాసు వరకు ప్లేనులో వెడదాం. మద్రాసులో నా ఫ్రెండు కారిస్తారు. కారులో తిరుపతి వెడదాం. నలుగురూ వస్తే పోనీ సరదాగా కారులోనే వెడదాం అనుకున్నాను" అంది రమాదేవి. ప్రోగ్రాం చేంజి చేసుకోకూడదా అని అడిగే ధైర్యం ఆ ముగ్గురికీ లేక పోయింది.
    తిరుపతిలో ---- ఆరాత్రి కాటేజీలో నిద్రపట్టక దొర్లుతున్నాడు సారధి. మొదటిసారి ప్లేను ప్రయాణం, అందులో రమాదేవితో . మద్రాసులో ఆమె ఫ్రెండు ఇంట్లో రాచమర్యాదలు, అక్కడ నించి కారులో వెనక సీట్లో రమాదేవితో కూర్చుని ఇక్కడికి రావడం, ఉదయం దైవదర్శనం చేసుకోడం, భోంచేయడం , ఇద్దరూ చెరో రూములో పడుకోడం, ఇంతేనా? ఇదేనా తను కోరింది? ఇంతేనా ఇంతేనా తను ఆశించింది? ఇందుకేనా వచ్చింది?
    గడియారంలో ఒకోముల్లు ముందుకు వెడుతుంటే సారధి మనసులో అలజడి ఆరంభమయింది. అశాంతి ఎక్కువయింది . అమూల్యమైన కాలం కరిగిపోతున్నట్టు బాధ పడుతున్నాడు. ఎక్కడ తెల్లావారపోతుందో అని గాభారాపడిపోతున్నాడు. కాలాన్ని వెనక్కి త్రిప్పే శక్తి లేకపోయినా కాలాన్ని సద్వినియోగపరచుకోలేని తన చాతకాని తనాన్ని పిరికితనాన్ని నిందించుకుంటూన్నాడు.....
    తెల్లవారిపోతుంది.....మాములుగా లేస్తారు. కాఫీ త్రాగుతారు, టిఫిను తింటారు. ప్రోగ్రాం ప్రకారం పాపనాశనం వెళ్ళొస్తారు. భోంచేస్తారు. ఎండ కాస్త తగ్గాక బయలుదేరి కాళహస్తి చూసి మద్రాసు కేళతారు. ఆరోజు అక్కడ వుండి హైదరాబాదు తిరిగొస్తారు! యిందు కోసమేనా శలవు పెట్టి వచ్చింది. యిందు కోసమేనా యింత ఆరాట పడ్డాడు. దీనికోసమేనా తక్కినవాళ్ళు రాకూడదని ప్రార్ధించింది.
    సారధి ఆవేశంగా మంచం దిగాడు....నాలుగు అడుగులు గుమ్మం వైపు వేశాడు. కాళ్ళు వణికాయి. చిరుచెమటలు పట్టాయి. రమాదేవిని తననుంచి విడదీస్తున్న బ్రహ్మరాక్షసిలా ఆ గదుల మధ్య తలుపు కనిపించింది. తలుపు దగ్గిర ఊపిరి బిగపట్టి రెండు మూడు నిమిషాలు నిల్చున్నాడు సారధి. .... అవతల నించి ఏ చప్పుదయినా వినిపిస్తుందేమోనని.....తలుపు మీద చెయ్యి వెయ్యబోతే చెయ్యి వణికింది.....ధైర్యం చాల్లేదు. మళ్ళీ వెనక్కి వచ్చి మంచం మీద కూర్చున్నాడు..... విసుగ్గా, అశాంతిగా మంచం మీద వ్రాలాడు.....
    వాచి చూశాడు. రేడియం ముల్లు ఒంటిగంట చూపెడుతుంది.... తెల్లవారడానికి ఇంక నాలుగు గంటలు. నాల్గుగంటలు మాత్రమే వ్యవధి. ఏం చెయ్యాలి......రమాదేవి ఏం చేస్తుంటుందో ఆమె తనలాగే నిద్రపట్టక బాధపడుతుందేమో! .... లేక హాయిగా పడుకుందో. ఈ వేదనంతా , ఈ ఆరాటం అంతా తనకేనేమో! ఆవిడ ఉద్దేశం ఎలా వుందో ఎలా తెలుసుకోవడం? మరోసారి లేచాడు సారధి.....ఓ రెండడుగులు ముందుకు వేశాడు.
    గదిలో ఏదో చప్పుడయింది. సారధి చటుక్కున మంచం మీదికి వెళ్ళి పడుకుని చెవులోగ్గి వినసాగాడు. గదిలో బాత్ రూము స్లిప్పర్స్ చప్పుడయ్యాయి. లైటు స్వేచ్ వేసిన చప్పుడు తలుపు తీస్తున్న చప్పుడు అయింది.
    రమాదేవి తలుపు తీస్తుంది.....తీసి వస్తుంది. వచ్చేస్తుంది. గదిలోకి వస్తుంది......సారధి ప్రాణాలుగ్గబట్టుకుని కదలిక లేని బొమ్మలా పడుకుని ఓ కన్ను మాత్రం తెరచి వుంచాడు.....రామాదేవికీ నిద్ర పట్టలేదన్న మాట! ఆమె తనలాగే అవస్థ పడుతున్నదన్నమాట!....మగవాడు తనే చెయ్యలేని ధైర్యం ఆమె మాత్రం ఎలా చేస్తుంది! తనో చవట దద్దమ్మ! కాబట్టి యింత టైమూ వృధా చేశాడు తన సంగతి గుర్తించి లాభం లేదని ఆమె చొరవచేస్తుంది.
    సారధి అనుకున్నట్టుగా మధ్య తలుపు కాక వీధి వరండాలోకి వున్న తలుపు తెరచుకుంది. కుర్చీ లాగిన చప్పుడు కిటికీ లోంచి గుడ్డి వెన్నెలలోకి చూశాడు సారధి. రమాదేవి వరండాలో కుర్చీ వేసుకు కూర్చుంది. ఆమెకీ ధైర్యం చాలడం లేదులా వుంది. అవును మగాడు తానే వెనకాడుతుంటే ఆవిడ యింతకంటే ఏం చొరవ చేస్తుంది. యింతకన్న ఏం స్పష్టంగా చెప్పుతుంది. తనకి బుద్ది లేదు.
    నెమ్మదిగా చప్పుడు కాకుండా తలుపులు తీసి రమాదేవి వెనకగా నించున్నాడు సారధి.
    ఫేము కుర్చీలో తల వెనక్కి బాగా వాల్చి తదేకంగా చంద్రుడి వైపు చూస్తూ, పరధ్యానంగా ఆలోచిస్తుంది రమాదేవి, తెల్లటి జరీ చీర, తెల్ల జాకెట్టు, ప్రొద్దుట దేవ దర్శనానికి తలారా స్నానం చేసిన జుత్తు ముడివిడి బుజాల నిండా పరచుకుంది.
    వెన్నెల నీడలు కనుపాపల్లో ప్రతిఫలిస్తున్నాయి.....ఎంతో మనోహరంగా కనిపించింది రమాదేవి. అ వెన్నెలలో సారధికి, అతని వళ్ళు వేడెక్కింది. మరో అడుగు ముందుకి వేశాడు. బరువైన అతని ఉచ్చ్వాస నిశ్వాసాలు ఆ నిశీది నిశ్శబ్దంలో సుస్పష్టంగా వినిపిస్తున్నాయి. రమాదేవి చాకితురాలై తల వెనక్కి త్రిప్పి చూసింది.
    "నీవా?" అంది ఆశ్చర్యంగా. "నిద్రపట్టలేదా నీకూ" అంది మళ్ళీ. సారధి జవాబీయలేకపోయాడు.....అలాగే నిలబడ్డాడువెనగ్గా వెళ్ళి రమాదేవి తల గుండెలకి అదుముకోవాలనిపించింది ఆ క్షణంలో.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra