Home » Kommuri venugopala rao » Mahaapravaaham

   
    ఆమె చాలా గొప్ప డ్రైవరు. ఎలాంటి పరిస్థితిలోనూ కంగారుపడదు. పొరపాటు చెయ్యదు.


    డ్రైవింగ్ చేస్తోన్నంతసేపూ స్కూటర్లమిద పెళ్లాల నేసుకుని నాజూకులుపోతూ కారుకు అడ్డం వ్చచేవాళ్ళనూ, సైకిళ్ళనూ అడ్డందిడ్డంగా త్రొక్కుతూ మిది మిదికి వచ్చే వాళ్ళనీ, తాము చచ్చేది లేనిదీ కూడా చూసుకోకుండా అస్తవస్తోన్నా చూసుకోకుండా పొగరుగా, నిరలక్ష్యంగా పోజులు పెడుతూ నిలబడ్డవాళ్ళనీ తనలో తాను  బూతులు తిట్టుకుంటూనే వుంటుంది.


    " ముండా కొడుకులారా, మి లాంటి వాళ్ళు రోజుకు పదిమంది చచ్చినా దేశానికి నష్టం లేదురా. నా దగ్గర అదేదీ ...కొత్తగా కనిపెట్టారే. ..లేజర్ బీమ్... అదిపెట్టి కిరణాన్ని కొడితే... ఒక్కొక్కరూ నల్లుల్లా మాడి  వూరుకుంటార్రా."


    ఆమె అలా తిట్టుకుంటూనే వుంది .ఓ రిక్షా అతను ఎలా వచ్చాడో రయ్యిమని ప్రక్కనుంచి దూసుకొచ్చాడు. ప్రపంచంలోని పరమ మూర్ఖాతి మూర్ఖుడు కూడా అలా ప్రవర్తించడు. అప్పటికీభూలోకమ్మ చాలా స్మార్ట్ గా బ్రేక్ వెయ్యబట్టిగానీ, లేకపోతే రిక్షా త్రొక్కెవాడు, అందులో వున్న యిద్దరు ప్యాసెంజర్సు చచ్చివూరుకొనేవారు.


     రిక్షా అతను మాత్రం రెండు పల్టీ వుకొట్టి నాలుగడుగుల దూరంలో  పడ్డాడు.


     భులోకమ్మాకామ్ గా క్రిందకు దిగి కారు ఎక్కడెక్కడ గీతలు పడిందో చూసుకుంటోంది.రిక్షా అతన్ని గానీ, రిక్షాను గాని పట్టించుకోలేదు. తన త్రిప్పయినా ప్రక్కకి చూడలేదు.


    క్షణంలో నలభయి యాభయిమందిజనం మూగారు. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు జమంతా కారులో వెళ్ళే వాళ్ళని దుయ్యబట్టటం, మనుషుల్ని చంపటానికే వాళ్ళు కార్లు నడుపుతున్నారని వ్యాఖ్యానాలు చెయ్యటం సహజం. వాళ్ళ సానుభూతంతా దెబ్బతిన్న వాడిమిదేవుంటుంది.


    ఇప్పుడు అలాగే జరిగింది. కొంతమంది రిక్షా అతన్ని  ' దెబ్బ తగిలిందా' అని పరామర్శిస్తున్నారు. కొంతమంది రిక్షా ఎక్కడెక్కడ దెబ్బ తగిలిందో చూసి, దాని రిపేరుకు ఎంతవుతుందో లెక్కలు కడుతున్నారు. కొంతమంది ర్యాష్ గా డ్రైవ్ చేసినందుకు భూలోకమ్మని విమర్శిస్తున్నారు. మిగతావాళ్ళు  వినోదం చూస్తున్నారు.


    భూలోకమ్మ ఏమి జరగనట్లు కారు మళ్ళీ ఎక్కబోతున్నాది.


      "ఆగు" అని అరిచాడు రిక్షా అతను " నా రిక్షాను డ్యాషిచ్చి, నాకు చచ్చేంత పనిచేసి ,రిక్షా తుక్కు తుక్కు చేసి నంగనాచిలా వెళ్ళిపోతావా? ఇక్కడ్నుంచి అడుగుకూడా కదలనివ్వను."


    భూలోకమ్మ తాపీగా  వెనక్కి తిరిగింది.  " చచ్చేంతపని జరిగింది. చావలేదుగా."


    " అంటే? చచ్చిపోయినా అంతేగా. డబ్బుకట్టి మరీ కదులు."
    "డబ్బా? డబ్బెందుకురా పుండాఖోర్."


    ఆమె వాలకం చూసి అతను అదిరిపడ్డాడు. "  ఎందుకేమిటి? నీ రిక్షాను గ్రుద్దినందుకు."


    " ఎవర్రా గ్రుద్దింది? పింజారీ వెధవా! పిచ్చి పిచ్చిగా వాగావంటే మక్కెలిరగదంతాను. లే. అడ్డులే" అంటూ అరిచింది భులోకమ్మా కళ్ళేర్రజేసి.


     " లేవకపోతే?"


    " జట్టు పట్టుకొని యీడ్చవతల పారేస్తాను. లేరా చూస్తున్నాడు."


    జనంలోంచి యిద్దరు ముగ్గురు ముందుకొచ్చారు.


    "ఇదిగదో ఏమిటమ్మోవ్. రిక్షాను డ్యాష్ యిచ్చి, అతని పొట్ట కొట్టిందిగా ఏమిటి దబాయిస్తున్నావు?"  అన్నాడు ఒకతను ర్యాష్ గా.


    " నువ్వు నోర్ముయ్యిరా ముండాకొడకా. ఎవర్రా. గ్రుద్దింది.ఇంతకాలం కారు మెయిన్ రోడ్డుమిదనుంచి వెడుతూంటే వాడికి కళ్లు కనబడలేదా? వ్యాసెంజర్స్ ని ఎక్కించుకొని తొక్కుతున్నాడుకదా. వాడికెమయినా బుద్ధుందీ? రాంగ్ సైడ్ వచ్చి కారుని ఢీకొంటాడా? నా కారు గీతలు పడింది. పెయింటు వేయించాలంటే నాలుగొందలవుతుంది. నువ్విస్తావా? నీ బాబుగాడిస్తాడా? ఏం? రోడ్డుమిద ఎలా రిక్షా తొక్కాలో తెలీదూ? కార్లన్నా, కారుల్లో పోయే వాళ్ళన్నా అంత గుర్రు దేనికి?  వాడేదో మూర్ఖంగా వెధవ పనిచేస్తే మిలాంటి గాడిద కొడుకులంతా న్యాయమూర్తులైనట్లు, ధర్మాన్ని మిరే పరిపాలిస్తున్నట్లు వాడికి వత్తాసా. వొరేయి!రోడ్లమీద బడితెలా నిలబడి తీర్పుచెప్పటం కాదురా. మిరుకారులో వెడుతున్నప్పుడు అవతలవాళ్లు చేసే ఆగడమేమిటో తెలుస్తుందిరా."


    ఆమె  వాగ్దోరణికి హడలిపోయి అతను నోరు వెళ్ళబెట్టి చూస్తున్నాడు. గట్టిగా మాట్లాడితే చొక్కా పట్టుకొని అవతలకు విసిరేసేలా వుంది.


    ఈ గలటా అంతా చూసి పోలీస్ కాన్ స్టేబుల్ వచ్చాడు. " ఏమిటిది? రోడ్డుమిద న్యూసెన్స్  ఏమిటి? యాక్సిడెంటా? ఇద్దరూ స్టేషన్ కిపదండి" అంటూ అరిచాడు.

 
    "నేనెందుకురా?  స్టేషన్ కి రావటం" అంది భూలోకమ్మ.


    కాన్ స్టేబుల్ అదిరిపడి ఆమెవంక చూశాడు. "ఏయ్ ఎవరు నువ్వు? వరేయి అంటున్నావు. పద  స్టేషన్ కి.


    "పోరా ! నీలాంటి వాళ్ళని యింతమందిని చూశాను. తప్పెవరిదో చూసుకోకుండా ఇద్దర్నీ స్టేషన్ కి రమ్మనటమేనా? ఎవడిచ్చాడురా నీకు పోలీసు ఉద్యోగం? పిచ్చి పిచ్చి వేషాలేస్తే ఎస్. పి.కి.ఐ. ఎవరు?

సుబ్బారావావేకదూ? అతన్తో చెప్పి నీతోలు వొలిపిస్తానుండు"అంటూ కార్లో ఎక్కి కూర్చుని స్టార్ట్ చేసింది.


     జనమంతా గుడ్లు వెళ్ళబెట్టుకుని చూస్తూ వుండగా కారు ముందుకు దూసుకెళ్ళిపోయింది.


                         *    *    *    *

    
    సూర్యచంద్ర యింట్లో ఒక్కడే వున్నాడు. ఫోన్ చేసిన వ్యక్తికోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాడు.

    
     ఇంటిముందు  కారాగినట్లుంటే తలత్రిప్పి చూశాడు. ఓ నలభయియేళ్ళ పై చిలుకు వయసున్న స్త్ర్రీ కార్లోంచి దిగుతోంది. ఇంత పొడవూ, లావూ , మొహాన పెద్దబొట్టూ... యివిడేనా తనకి ఫోన్ చేసింది?


     భూలోకమ్మ లోపలికొచ్చింది. " నువ్వేనా కుర్రాడా సూర్యచంద్ర అంటే?"


     సూర్యచంద్ర తలవూపి "కూచోండి" అన్నాడు.


     భూలోకమ్మ అతని కెదురుగా వున్న సోఫాలో చతికిలబడింది.


    "మిరేనా....?"


    " నేనేగాని-అవునుబుల్లోడా! ఏమిటీ ఆ నవలట్లా రాశావు?"


    సూర్యచంద్ర ముఖం నల్లబడింది. " ఏం? బాగా లేదా?" అనడిగాడు మనసు చివుక్కుమనగా.


    "బాగానే వుంది. బాగా లేకపోతే యింత దూరం పని గట్టుకొని వచ్చేదాన్ని కాదు. కాని నీ అభిప్రాయాలూ చాలా వరకూ త్పప్పు అని చెబుదామనే వచ్చాను."


    " తప్పా?"

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra