"ఏమిటది?"
   
    "నిర్మాణాత్మకమైన స్వార్థం"

    లక్ష్మి కళ్ళు విస్ఫారితం చేసుకుని మధూహ వైపు చూసింది. తనముందు మామూలుగా ఆడుతూ పాడుతూ, సామాన్యమైన ఆడపిల్లలా కనపడే మధూహేనా ఈమె?

    కానీ ఇంకా ఏదో అనుమానం.

    ".....మధూ" అంది. "ప్రతివారూ నీలా ఆలోచించి, తమ స్వార్థం చూసుకుంటే ఇక ఈ ప్రపంచంలో ఆత్మీయతలూ, ఆప్యాయతలూ వుండవు కదా."

    "ట్రాష్...." అంది మధూహ నిర్లక్ష్యంగా. ఆమె మొహం ఆవేశంతో ఎర్రబడింది. "ప్రతివారూ ఇంతకన్నా స్వార్థంతోనే ఆలోచిస్తారు. కానీ పైకి చెప్పరు. నేను చెప్పే స్వార్థంతో ఇతరులకి కలిగే నష్టం ఏమీ లేదు. కేవలం నీ మంచికోసం నువ్వు ఆలోచించుకునే నిర్మాణాత్మకమైన స్వార్థం గురించే నేను చెపుతున్నాను. కానీ  నీ చుట్టూవున్న ప్రపంచంలోని మనుష్యులు అలా ఆలోచించారు. ఇంతమంది మగవాళ్ళని చూసాను కదా. ప్రతీవారికీ శారీరికంగానో, మానసికంగానో మరో స్త్రీతో వివాహత్పూర్వమో, తరువాతో ఒక అనుభూతి వుంటుంది. కానీ తమ భార్యలు అలా వుండటాన్ని ఒప్పుకోరు. నువ్వన్న అందమైన పదాలు.....ఏమిటవి? ఆత్మీయత, ఆప్యాయత....వాటిని భార్య దగ్గిర పెట్టుబడిగా పెడతారు. కుటుంబం, పిల్లలు, సామాజిక భద్రత, నైతిక విలువలు అంటూ భార్యని అజ్ఞానంతో, సెంటిమెంటుతో కట్టిపడేసి తమని తాము మోసం చేసుకుంటూ ఆవిడని మోసం చేస్తూ గడుపుతారు."

    "ఈ ప్రపంచంలో మగవాళ్ళందరూ నువ్వు అన్నట్టు లేరు మధూ. భార్యలతో సుఖంగా సంసారాలు చేసుకుంటున్న వారూ, ఏకపత్నీ వ్రతులూ కూడా వున్నారు."

    "వారి పేరున గుళ్ళూ, సత్రాలూ, చలివేంద్ర కేంద్రాలూ కట్టబడుగాక! కానీ నేనిక్కడ వ్యక్తుల గురించి మాట్లాడటం లేదు. సిద్దాంతాల గురించి మాట్లాడుతున్నాను. మగవాడికొక న్యాయం, ఆడదానికొక న్యాయం ఎందుకని ప్రశ్నిస్తున్నాను?"

    "ఒకపక్క భార్యని సుఖపెట్టి, మరోపక్క,  ఆ భర్త తన సుఖం కోసం బయటి ఆనందాన్ని అనుభవిస్తూ, భార్యని సంతృప్తిగా వుంచగలిగితే తప్పేముంది. ప్రస్తుతం చాలామంది చేస్తున్నది అదే. అది నిర్మాణాత్మకమైనా స్వార్థమే కదా"

    "బయటి ఆనందమంటే?"

    "పరాయిస్త్రీతో సంబంధం కావొచ్చు. స్నేహితులూ, పేకాట....ఏదైనా కావొచ్చు. భార్య కిష్టంలేదని తెలిసి, ఆమెను ఇబ్బంది పెట్టకుండా బయట చేసుకునే ఏ పనైనా నిర్మాణాత్మకమైన స్వార్థమే కదా"

    "మాటిమాటికీ ఆ పదం వెటకారంగా వాడకు"

    లక్ష్మి నొచ్చుకుంటూ, "అయ్యో, నేనా వుద్దేశ్యంతో అనటం లేదు. ఆ పద ప్రయోగం నచ్చి అంటున్నాను" అంది.

    మధుహ కాస్త ఆలోచించి, "నువ్వన్నది నిజమే. భర్త బయట ఎలా తిరిగినా తను తన భర్తతో సంతోషంగా వుండగల్గుతున్నానని ఒక స్త్రీ అనుకుంటే అంతకన్నా కావాల్సింది ఏముంది?" అంది.

    "మరి నువ్వు చెప్పేది ఏమిటి? ఏమాత్రం కొద్దిగా అసంతృప్తిగావున్నా స్మసారాన్ని విచ్చిన్నం చేసుకుని స్త్రీ  బయట  ఆనందాల్ని వెతుక్కోవాలనా? లేక  భర్తనీ, పిల్లల్నీ మోసం చేసి దొంగచాటుగా జీవితం రహస్యంగా గడపాలనా?"

    "నేను మనుష్యుల గురించి మాట్లాడుతూంటే, నువ్వు స్త్రీల గురించీ, భార్యల గురించీ మాట్లాడుతున్నావు. అసంతృప్తి అనేది వున్నప్పుడు దానినుంచి ఎలా బయటపడాలా అన్నది  ప్రతిమనిషీ నిరంతరం అన్వేషించవలసిందే అంటున్నాను. అది మానేసి తనలో తానే కుమిలిపోకూడదూ అంటున్నాను....."

    "ఎవరు చేసినా అదే."

    "కాదు. కుమిలిపోతారు. లేదా నిరంతరం దాని గురించే ఆలోచిస్తూ రాజీపడిపోయి, డిప్రెషన్ కిలోనై మరింత నష్టపోతారు. ఆత్మవంచన చేసుకుంటారే తప్ప ఆత్మ విమర్శ చేసుకోరు. ఉదాహరణకి నిన్నే  తీసుకో. నీకు భర్తవల్ల అసంతృప్తి బయటపడటానికి రెండు మార్గాలున్నాయి. అతడిని వదిలిపెట్టటం, లేదా అతనితోనే వుంటూ సంతోషంగా ఎలా వుండాలా అని ప్రయత్నించటం. మొదటిది సాంఘిక భద్రత దృష్ట్యా సాధ్యం కాదు. రెండో దాంట్లో మళ్ళీ రెండు మార్గాలున్నాయి. అతడి వుంటూనే రహస్యమైన అనందమార్గాలు వెతుక్కోవటమా? లేక వేరే వ్యాపకాల్లో ఆనందం చూసుకోవటమా? చాలామంది చేసేది రెండోదే.....పిల్లలపెంపకం, నగలు, చీరెలు వగైరా......"

    "నాకది చేతకాదు"

    "పోనీ ప్రహసిత్ తో వెళ్ళిపోయి అతడిని వివాహం చేసుకుంటావా?"

    "నీకేమయినా మతిపోయిందా?"

    ఆమె మాటలు మధూహ పట్టించుకోలేదు. "నీకా ధైర్యం కూడా వున్నదని నేననుకోను. అయినా దాన్ని నేనంత సమర్థించను కూడా....ఒక రోజు టెన్నీస్ కోర్టులో నిన్ను చూసి తలమునకలయ్యేటంత ప్రేమలో పడి, ఆ తరువాత నువ్వు వివాహితురాలివని తెలిసి, అంత తొందరగానూ "విత్ డ్రా" అయిపోగలగటం అనేది నాకెప్పటికీ అర్థంకాని ప్రే...మ...! ఆ మాటే నేనంటే మీరందరూ "అవున్లే. నీలాటి నిర్మాణాత్మకమైన స్వార్థపరురాలికి అంత నాజూకయిన సెంటిమెంట్లు ఎలా అర్థమవుతాయి?" అని ఎగతాళి చేస్తారు. ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే, వూరికే, నా జీవితం ఇలా అయిపోయిందే అని కుమిలిపోకు. మార్గాలు అన్వేషించు. చేతులు కాలినా ఫర్వాలేదు. కానీ ఆనందంకోసం దివిటీ పట్టుకుని వెతుకు. ఏదో ఒక మార్గం దొరక్కపోదు. సూర్యోదయం కాదని తెలిసినప్పుడు చీకట్లో ఏడుస్తూ కూర్చోవటం కంటే, తప్పుదార్లో అయినా ఏటో ఒకవైపు ప్రయాణం ప్రారంభించటం మంచిది."

    లక్ష్మి కొంచెంసేపు ఆలోచనలో పడి, చివరికి తలెత్తి, "నువ్వు చెప్పిన ఈ మార్గాలు తప్ప ఇంకేమీ లేవంటావా?" అంది.

    మధూహకి ఒళ్ళు మండిపోయింది. "ఉంది" అంది.

    లక్ష్మి ఆసక్తిగా ముందుకు వంగి, "ఏమిటది?" అని అడిగింది.

    "నువ్వు ఆత్మహత్య చేసుకోవటం" అని అక్కణ్ణుంచి లేచిపోయింది మధూహ.


                                                              *    *    *

    మధూహకి పుస్తక విజ్ఞానమే కానీ, అనుభవ జ్ఞానం లేదు. అందువల్ల "మరో దారేమయినా వున్నదా?" అన్న ప్రశ్నకి సరిఅయిన సమాధానం చెప్పలేకపోయింది.

    మరో దారి వున్నది.

    అదేమిటో.....ఆమెకి మధూహగానీ, విష్ణుగానీ చెప్పలేదు.

    ప్రహసిత్ చెప్పాడు.....ఒక అర్థరాత్రి!
 

                                                                         3


    "నేను నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటంలేదు. మనుష్యుల్లో దేవతలుంటారని ఏదైనా సినిమాల్లో డైలాగు వింటే నవ్వుకునేవాడిని. కానీ ప్రత్యక్షంగా చూస్తున్నాను. సారీ. నేను అంధుడిని. చూడలేను కదూ."

    "అలా మాట్లాడకు రాజూ..." అంది మధూహ ఓదార్పుగా. అతడు మామూలు మనిషి కావటానికి అన్నిరోజులు పట్టింది. గాయాలైతే తగ్గుమొహం పట్టాయిగాని, మొహమంతా వికృతంగా మారిపోయింది.

    అతడి ఆస్పత్రి ఖర్చులన్నీ మధూహే భరించింది. అతడంత తొందరగా తేరుకున్నడంటే మధూహే కారణం. తన దగ్గిర బంధువు విసిరిన ఆసిడ్ వల్ల అతడు అలా అయిపోయాడని ఆమె మనసులో చాలా గిల్టీ ఫీలింగ్ వుంది. డాక్టర్  విశాల్ చేసిన మోసానికి రాజు బలయ్యాడు. రాజు పాత్ర కూడా వుండి వుండవచ్చు. కానీ ఇది మరీ దారుణమైన శిక్ష!

    కేవలం జాలి వల్లే తనిదంతా చేస్తోందా! రాజంటే ప్రేమ లేదా? ఆమె ఆ  విషయం అంతగా ఆలోచించలేదు. ఒకప్పుడు ఆమె గుండెల్నిండా అతడంటే ప్రేమ వుండేది. చాలా దారుణంగా ఆమె మనసుని అతడు గాయపరిచాడు. డాక్టర్ విశాల్ ని ఆశ్రయించాడు......డబ్బుకోసం.

    అయినా అతడిని చేరదీసింది. లాలించింది. అన్నిటికన్నా ముఖ్యంగా.....ధైర్యం చెప్పింది! అంధుడనైపోయానన్న భావం అతడిని మానసికంగా కృంగతీసిన సమయంలో అండగా పక్కన నిల్చింది. స్త్రీ తన మొదటి ప్రేమని అంత సులభంగా మర్చిపోలేదు. ఆమె విషయంలోనూ అదే జరిగింది. అయితే అతడి మనసులోని ఒక వికృతమైన మచ్చ.....బ్లాక్ స్పాట్.....ఆమెకి స్పష్టంగా కనపడింది. దాన్ని ఒక పీడకలగా మర్చిపోవటానికి ఆమె శాయశక్తులా ప్రయత్నిస్తోంది!

    నువ్వు నాకు ఈ సేవలన్నీ ఎందుకు చేస్తున్నావో అర్థంకావటం లేదు మధూ! అద్దంలో చూసుకోలేకపోయినా నామొహం ఎంత వికృతంగా వుందో నేను వూహించగలను."

    "దయచేసి నువ్వలా మాట్లాడటం మానేస్తావా?"

    "నిన్నింకోసారి ఆలోచించుకొమ్మని చెపుతున్నాను. నాకు పైసా రాబడి లేదు. జీవితాంతం నన్ను నువ్వే పోషించవలసి వస్తుంది."

    "నీకు తొందర్లో  కళ్ళు తిరిగివచ్చే అవకాశం వున్నదని డాక్టర్ చెప్పాడు. ఎవరో స్పెషలిస్టు వస్తున్నాడట."

    "దానికెంతవుతుంది?"

    ఆమె కాస్త తటపటాయించి, "పదివేలు" అంది.

    "ఎక్కడనుంచి సంపాదిస్తాం? మామూలు ఆస్పత్రి ఖర్చులకే అప్పు చేసినట్టున్నావ్ కదూ."

    ఆమె సమాధానం చెప్పలేదు.

    "ఈ సాయంత్రం డాక్టర్ విశాల్ క్లినిక్ కి తీసుకువెళ్ళు."

    ఆమె ఆశ్చర్యంగా "ఎందుకు?" అంది.

    "చెప్తాగా" అన్నాడు అతడు క్లుప్తంగా.


                              *    *    *


    ఆమెని ముందుగదిలో కూర్చోపెట్టి అతడు లోపలి వెళ్ళాడు. డాక్టర్ విశాల్ లేడు. పదినిముషాల తరువాత వచ్చాడు.

    ఈ లోపులో చిన్న సంఘటన జరిగింది.

    ఆమె కూర్చున్న చోటుకి నర్సువచ్చి, "మీరు పేషెంటా?" అని అడిగింది.

    "కాదు. రాజుతో కలిసి వచ్చాను."

    రాజు పేరు చెప్పేసరికి నర్సు, "మరిక్కడ కూర్చున్నారేమిటి? రండి" అంటూ లోపలికి తీసుకువెళ్ళి మరో గదిలో కూర్చోబెట్టింది. డాక్టర్ విశాల్ కి రాజు అంతరంగీకుడని అక్కడి స్టాఫ్ అందరికీ తెలుసు. అందుకని మధూహకి ఆ గౌరవం లభించింది. అయితే రాజు అంధుడవటం వలన, మధూహ తన పక్కనుంచి నడిచి వెళ్ళి ఆన్టీ......రూమ్ లో కూర్చున్న సంగతి తెలీదు.

    డాక్టర్ విశాల్ రాగానే రాజుతో సంభాషణ ప్రారంభించాడు.

    "ఎలావుంది ఆరోగ్యం ఇప్పుడు?"

    "కళ్ళుతప్ప మిగతా అంతా ఓ.కె."

    "ఆ ఆసిడ్ విసిరిన వాడు దొరికాడా?"

    "లేదు."

    "ఇంకేమిటి విశేషాలు" అడిగాడు విశాల్. అతడు చాలా పొడిపొడిగా మాట్లాడుతున్నాడన్న విషయం గమనించాడు రాజు. "నా ఉద్యోగం సంగతి అడుగుదామని వచ్చాను" అన్నాడు డైరెక్టుగా సంభాషణలోకి వస్తూ. డాక్టర్ విశాల్ మరింత డిప్లమాటిక్ గా "నీకు జరిగిన అన్యాయానికి నేను చాలా బాధపడుతున్నాను రాజూ. కానీ కళ్ళు లేకుండా నీవిప్పుడు ఏపని చేయగలవు?" అన్నాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra