Home » Suryadevara rammohan rao » సూపర్ స్టార్


    "ఉదయించే సూర్యుడిమీద కొన్ని షాట్స్ తియ్యాలి..... తూరుపువేపున్న ఆ కొండల్ని ప్రేమ్  లోకి తీసుకొని డిఫరెంట్ ఏంగిల్స్ లో షూట్ చేయండి. అజ్ఞాన తిమిరాన్ని తరిమే సంకేతం పొద్దుపొడుపు సూర్యుడు.... ఈ బ్యాగ్రౌండ్ మీద టైటిల్స్ ని సూపర్ ఇంపోజ్ చేయాలి....." అంది హంపీ ఎక్కడో ఆలోచిస్తూ.

    "మరి....మరి నందిని ఆ షాట్ లో రావాలన్నారు.....సీల్వౌట్ లో నందిని విడివడిన కురులతో సూర్యుడి కేసి పరిగెడుతున్నట్లు రావాలన్నారు...... అదీ...." విల్సన్ నసిగాడాపైన.

    "అందుకే అమంటే సగం ఇష్టముందడు. డిసిప్లిన్ లేని ఆర్టిస్ట్.....యూనిట్ మొత్తం తెల్లవారు ఝామున నాలుగున్నరగంటలకే లోకేషన్ కి వస్తే ఆమె మాత్రం తాపీగా వస్తుంది....." కోపంగా అంది హంపీ.

    "ఆ సుశీల్ కుమార్ అండచూసుకుని మరీ ఆటలాడుతోంది. అతని సపోర్టే లేకుంటే ఈమెపొగరెక్కడుండేదో..... నిజానికి ఆమె ఈ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ లో నటించడం నాకూ ఇష్టంలేదు మేడమ్. బట్... మనకు టైమ్ లేదు- పైగా స్పాన్సరర్స్..... విల్సన్ మాటలు పూర్తికాకుండానే విసురుగా అంది హంపి-" డామ్ ది స్పాన్సరర్స్.......లేకపోయినా ఫర్వాలేదు. మన సీరియల్ బావుంటే మల్టీనేషనల్ కంపెనీలే ముందుకొస్తాయి.... మోస్ట్ డిజ్ గస్టింగ్ ఆర్టిస్ట్సు..... డోంట్ వేస్టు టైమ్.....కమాన్ రడీ టూ టేక్....." అంది కెమెరా ఉన్న ప్రాంతానికి వడివడిగా వెళ్తూ.

    కెమెరాని అప్పటికే భవానీ సిద్దంచేసి ఉంచాడు.

    హంపీ కవర్ చేయవలసిన ఫీల్ ని ఓసారి కెమేరాలోంచి చూసుకొని సంతృప్తిపడి విల్సన్ కేసి సైగ చేస్తూ తనే కెమెరాకి అభిముఖంగా ఉండటంకోసం ఎదురుగా ఉన్న చిన్న కొండపైకి వడివడిగా ఎక్కి, తన పొడవైన జుత్తుని వదులుచేసి వదిలివేసింది. అది గాలికి నెమ్మదిగా ఎగురుతుండగా ఆమె త్రీబైఫోర్త్ ప్రోఫైల్ మెయిన్ టయిన్ చేస్తూ ఉదయిస్తున్న సూర్యుడికి అభిముఖంగా వెళ్ళసాగింది.

    అప్పటికి హంపీ ఉద్దేశాన్ని గ్రహించిన విల్సన్  కెమేరాని ఆన్ చేసాడు.

    నిర్నిద్రమైన నీలాకాశపు అందాల్ని తనలో రికార్డు చేసుకుంటూ క్రమంగా టిల్ట్ అయి సెంటర్ పొజిషన్ కి వచ్చింది.

    క్రమంగా తూరుపు ప్రొద్దున సింధూరపు జరీ అంచు భువిని దివిని ఆక్రమించుకుంటోంది.

    ప్రతి డైరెక్టర్ కి, కెమేరామెన్ కి కొన్ని దృశ్యాలు ఎప్పటికీ ఇష్టమైనవిగానే ఉంటాయి. మణిరత్నానికి పొగమంచంటే చాలా ఇష్టం.....ఆయన ప్రతిసినిమాలో ఎక్కడో ఒకచోట ప్రాతఃకాలపు పొగమంచు మనోహరదృశ్యం తప్పకుండా ఉంటుంది. బి.నరసింగరావుకి రిక్షా తొక్కే కార్మికుడు.....భారతీరాజాకి, బాల చందర్ కి సముద్రపు ఒడ్డు దృశ్యం.....విశ్వనాథ్ కి నది...... ఆ నది ఒడ్డున నిలిచే పురాతన దేవాలయం- రాఘవేంద్రరావుకి ఫ్రేమ్ బ్యూటీ అండ్ రిచ్ నెస్.......... భారీతనం.....ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి.....ప్రత్యేకశైలి.....వెండితెరపై అద్భుతాల్ని సృష్టించిన క్రియేటివ్ జీనియస్ లు..... అలాగే హంపీకి ఉదయించే సూర్యుడంటే చాలా ఇష్టం....అజ్ఞాన తిమిరంలో నిద్రంచే అతి నిద్రాలోలగా సూర్య కిరణాలు విజ్ఞానాన్ని అందిస్తున్నట్లుగా ఆమె భావిస్తుంది..... అందుకే ఆ కొత్త సీరియల్ ఓపెనింగ్ షాట్ ని దాని మీదే కేంద్రీకరించింది. అది విల్సన్ కి బాగా తెలుసు.....

    విల్సన్ కుడిచేయి క్రమంగా జూమ్ మీదకు వెళ్ళింది. వైడ్ ఫీల్డ్ క్రమంగా తగ్గిపోతూ, ఉదయిస్తున్న సూర్యుడ్ని, హంపీని మాత్రమే కెమేరా అప్పుడు రికార్డు చేసుకుపోతోంది.

    ఒక యువతి సూర్యుడ్ని ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటుందే తప్ప ఆమె పర్టిక్యులర్స్ రావు. కనిపించవు. మానిటర్ లో చూస్తే ఆమె హంపీ అని గుర్తుపట్టటం అసాధ్యం.

    ఎవరువచ్చినా, రాకున్నా తన పని ఆగిపోదని నందినీకి బుద్ధిచెప్పడం కోసం ఆ షాట్ లో తను నటించినా, తనెవరయిందీ ప్రేక్షకులకు తెలిసే ఛాన్స్ లేకపోబట్టే హంపీ ఆ షాట్ లోకి ఎంటరయిపోయింది.

    నందిని ఆలస్యం చేయబట్టే హంపీ అలా సీరియస్ గా వర్క్ లోకి వెళ్ళిపోయినట్లు ప్రశాంత్ ఊహించాడు. తనక్కడ లోకేషన్ లో ఉండగా కనీసం విష్ కూడా చేయకుండా వెళ్ళిపోయిందని ప్రశాంత్ ఫీలయ్యాడు.

    కొద్ది సేపటికి హంపీ కొండదిగి వచ్చి అప్పుడు ప్రశాంత్ వేపు హలో అన్నట్లుగా చూసి తిరిగి విల్సన్ కి ఇన్ స్ట్రక్షన్స్ ఇవ్వసాగింది.

    "నేను ఆ కనిపించే రాయి మీద నించుంటాను. ఇంకా సరీగ్గా వెలుతురు రాలేదు. ఆ కొండలు అడ్డుపడుతున్నాయి. నా వెనుక 45డిగ్రీల కోణంలో బ్యాక్ లైట్ ని ఉపయోగించాలి....." అని హంపీ అంటుండగానే భవానీ హొండాజెనెసెట్ కి కనెక్ట్ చేసి ఉన్న లైట్ ని చెక్ చేసుకొని, జెన్ సెట్ ని ఆన్ చేసాడు అది చిన్నగా శబ్దంచేస్తూ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయసాగింది.

    విల్సన్ తలూపగానే హంపి చకచకావెళ్ళి ఏటవాలుగా ఉన్న ఒక చిన్న రాయిని ఎక్కి నించుంది, అప్పటికే ఆ రాయి వెనుక చేరుకున్న భవాని 45డిగ్రీల కోణంలో ఆమె వెనుక భాగంపైకి లైట్ ని ఫోకస్ చేసాడు.

    "ఆర్యూ రడీ మిస్టర్ భవానీ.........?"

    "ఎస్ మేడమ్......బట్"

    "The purpose of The back lights to separat the subject from the background.it provides high lights to The hair and shoulders of the subject" ఇక్కడ సబ్జ్ క్టుని నేను. నా వెనుక భాగంపైకి నువ్వు లైట్ ని ఫోకస్ చేస్తున్నావు. దాని మూలంగా ఈ బ్యాగ్రౌండ్ నుంచి నేను సెపరేట్ అవుతాను. నీవు ఫోకస్ చేసేకాంతి నా జుత్తుని, భుజాల్ని చివర టచ్ చేస్తుంది...." అని చెప్పి మౌనంగా ఉండిపోయింది.

    విల్సన్ కెమేరాని ఆన్ చేసాడు.........


                                            *    *    *

    "హంపీ....ది గ్రేట్ కెమేరా వుమెన్..... పైలట్ షూటింగ్ ఈ రోజు ఉదయమే నంది హిల్స్ పై ప్రారంభమైంది సార్...." అన్నాడు బ్రహ్మానందం విస్కీని గ్లాసులోకి వంపుతూ.

    దశరథ ఏం మాట్లాడలేదు.

    మరో ఐదు నిమిషాలు గడిచాయి.

    దశరథ ఒక పెగ్గు పూర్తిచేస్తే, బ్రహ్మానందం చాటుగా రెండు పెగ్గులు ఫినిష్ చేసాడు.

    అంతలోకి వచ్చేసాడు దూరదర్శన్ లో పనిచేసే ఒక కెమేరామెన్.

    "రండి బాబురండి.....మీ కోసమే ఎదురు చూస్తున్నాం" అంటూ బ్రహ్మనందం ఒక పెగ్గు అందించాడు అతనికి.

    కె.మె ఆత్రంగా పెగ్ అందుకొని ఒక్కగుక్కలో తాగేసాడు.

    "నీ ఇష్టమొచ్చినంత తాగవోయ్ ఛాయాచిత్రకార....." అన్నాడు దశరథ ఒకింత మత్తుగా.

    కె.మె కళ్ళు కృతజ్ఞతతో మెరిసిపోయాయి.

    "చిన్న అనుమానమండి కె.మెగారు" బ్రహ్మానందం మాటలు తడబడుతుండగా అన్నాడు.

    'కె.మె అంటే........?"

    "కెమేరామెన్ అని...."

    "ఏమిటా అనుమానం?"

    "నేను చాలా రోజుల క్రితం దాశరధిగారి ఇంటర్వ్యూ టీవీలో చూసానండి."

    "అయితే" కె.మె బాటిల్ అందుకొని రా కొడుతూ ప్రశ్నించాడు.

    "దాశరధిగారు గొప్పకవి కదండి.........?" బ్రహ్మానందం అలా మాట్లాడటం దశరథకి గొప్ప ఆనందం. అందుకే ఆయన మౌనంగా ఆ సంభాషణను వింటున్నాడు.

    "అవును......."

    "మన రాష్ట్రానికి ఆస్థాన కవిగాకూడా గౌరవింపబడ్డారు గదండి"

    "కాదన్నాదెవరు..........?"

    "దాశరథిగారు చాలా గొప్పవారని మీరోప్పుకున్నట్లేగదండి?"

    "ఒప్పుకున్నట్లే"

    "మీ టీవీ స్టేషన్ లో నండి?"

    "వాళ్ళయినా ఒప్పుకుతీరవల్సిందే"

    "హమ్మయ్య...."

    "ఇంతకీ విషయం ఏమిటి.....?"

    "దాశారదిగారికి చాలా విషయాలు తెల్సని, గొప్ప సాహితీ వేత్తనే గదండి మీ దూరదర్శన్ వాళ్ళు ఇంటర్వ్యూ హేసిన మీ స్టాఫ్ ఆర్టిస్ట్ నే ఎక్కువసేపు చూపించారు- దశరధిగార్ని అవమానించాలని మీ దూరదర్శన్ వాళ్ళకు ఉంటే వేరే రకంగా అవమానించవచ్చు గదండి........అయినా అసలు మీ దూరదర్శన్ కి రావటమే గొప్ప అవమానం కదండి...."

    కె.మేకి కిక్కు దిగిననట్లపించి మరో పెగ్ వేసుకొన్నాడు.

    "మీ దూరదర్శన్ లో తెలుగుభాష రానివాళ్ళకు తెలుగు నేర్పేందుకు తెలుగు పండిట్ కావాలని ఎనౌన్స్ చేసినా ఎవరూ రావటంలేదట. నిజమేనా సార్.........?"

    "తెలుగు పండిట్ కోసమా.......?"

    "మరే! భయపడి ఛస్తున్నారట"

    "ఎందుకు.........?"

    "వాళ్ళకొచ్చిన తెలుగుభాష ఎక్కడ మట్టిగొట్టుకుపోతుందో అని"

    "తెలుగు దూరదర్శన్ లో పనిచేసే వాళ్ళకు తెలుగు రాకపోవట మేమిటి.........?"

    "నేనూ..... అదే వాపోయానండి పాపం. ముందు నమ్మలేదండి..... కాని ఒక రోజు టీవీ చూసి నమ్మేసానండి"

    "ఏం చూసావ్........?"

    "పట్టణానికి బదులు పట్టనానికి అని చూపించారండి. పాపం గదండి- తప్పుగదండి. మాతృభాషతో ఆటలాడుకుంటే కళ్ళు పేలిపోవండి......? ఎక్కడా పనికిరాణి వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్తుంటారని మా గ్రామాలలో చెప్పుకుంటుంటారండి. ఈమధ్య మరో రంగంలోకి కూడా పనికిరాని వాళ్లు వెళ్తున్నారని తెలిసిందండి. నిజమేనాండి...?"

    "మరో రంగమా......? ఏ రంగం.......?"

    ఛా.... ఊరుకోండి - అన్నీ తమాషాలు.... ఏమీ తెలీనట్లే...."

    "నిజంగా తెలీదయ్యా..... నువ్వు చెప్పు"

    "నిజమేలేండి - ఏ భార్యమాత్రం తన భర్తపేరు చెప్పుకోగలదు...."

    "ఏమిటో నువ్వు మాట్లాడేది ఏమీ అర్థమయి చావదు"

    "ప్రజల భాషా, బాధ, భావాలు అర్థం కానప్పుడే గదండి అదృష్టం అర్థంకానివాళ్ళకే కదండి కొలువులు"

    "కొలువులా....? ఎందులో?"

    "నాతో ఎందుకులేండి బూతుమాటనిపిస్తారు"

    "ఏమిటో బ్రహ్మానందం..... ఏమీ అర్థమయి చావదు"

    "గొప్ప అదృష్టవంతులండి బాబు...... ఇంతకీ మీకు పెళ్ళయిందా....?"

    "కాలేదు"

    "మీ వయస్సెంతండి?"  

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra