Home » Suryadevara rammohan rao » మోడల్


    స్త్రీ అంటే ఎంత చులకనై పోయింది?! అది స్త్రీలే చేసుకుంటున్నాదా? మగవారి దోపిడా? ఇలా సాగుతున్నాయి మంగళ ఆలోచనలు.

    "సినిమాలు దిగజారి పోవటానికి పరాకాష్టగా ఒక ఉదాహరణ చెబుతాను. బలిదాన్ అనే హిందీ సినిమాలో హీరోయిన్ నగ్నంగా స్నానం చేస్తుండగా ఒకతడు గోడ పగులగొట్టి చూసే దృశ్యాన్ని సగం సినిమా చిత్రీకరించారు. ఒకరకంగా చూసుకుంటే బరితెగించిన సినిమా హీరోయిన్స్ కంటె మన మోడల్సేనయం. మూన్ మూన్ మాజా యాడ్ కి చేయకపోతే మరో అమ్మాయిని తెచ్చేవారు. లక్షలు, కోట్లు ఆర్జిస్తూనే చాటుమాటుగా నీలి సినిమాల్లో నటించే సినీ  నటీమణులకన్నా, కేవలం నగ్నంగా మాత్రమే నటించే మోడల్స్ నయంకదూ?" అంది బ్యాగ్ లోంచి చిన్న అద్దంతీసి దానిలో తన ముఖం చూసుకుంటూ.

    "మేకప్ పోతుందని నువ్వేం భయపడక్కర్లేదు మాయా. హైదరాబాద్ లో ఎంత ఎండవున్నా, గాలి లేకపోయినా చెమట పట్టదు. ఇండియా మొత్తంమీద హైదరాబాద్ గుడ్ సెంటర్ ఫర్ షూటింగ్....." అంటూ లేచి ఫ్రిజ్ లోంచి జ్యూస్ తెచ్చిచ్చింది మాయాకి మంగళ.

    "పదకొండు గంటలకి సిద్ధిక్ స్టూడియోలో వర్క్. రాగూడదు సరదాగా?" అడిగింది మాయా.

    "అలాగే షూటింగ్ చూసింది కాని, స్టూడియోలో స్టిల్ వర్క్ చూడలేదు మంగళ. అలాగేవస్తాం" అంది కమలిని  మంగళవైపు చూస్తూ.

    మాయా లేచింది. రెండడుగులు ముందుకువేసి వంగి కమలిని కాళ్ళకు నమస్కరించింది.

    తనపై మాయకున్న గౌరవానికి, భక్తికి కమలిని కళ్ళుచెమ్మగిల్లాయి. మాయా వెళ్ళిపోయింది.

    కమలిని ఆలోచనల్లో పడింది. చాలాకాలంగా తాను అనుకుంటున్న పని త్వరగా పూర్తిచేయాలనే స్థిర నిశయానికి వచ్చింది.

    వెంటనే లాయర్ సీతారామయ్యకు ఫోన్ చేసింది. "నువ్వు తయారయితే స్టూడియోకి వెళ్దాం మంగళ" అంది మంగళవైపు చూస్తూ కమలిని.

    మంగళ లేచింది. అంతలోనే ఆగిపోయి "లిరిల్ మోడల్ ని చంపే శారని కొంతమంది, ఆత్మహత్య చేసుకుందని కొందరు అంటుండగా విన్నాను, నిజమేనా?" అడిగిందిమంగళ.

    నిశ్శబ్దంగా నవ్వింది కమలిని........"ప్రదీప్ లాంటి కలుపుమొక్కలు పుట్టించిన పుకారది. ఆమె బ్రతికేవుంది. లిరిల్ సబ్బుకి వర్క్ చేస్తుండగానే ఆమెకు ఎయిర్ హొస్టెస్ జాబ్ వచ్చింది. మోడలింగ్ కంటె అదే నయమనుకొని వెళ్ళిపోయింది. ఆ తరువాత మోడలింగ్ చేయటానికి ఎయిర్ లైన్స్ డిపార్టుమెంట్ ఒప్పుకోలేదు. దాంతో  మానేసింది.

    అనూహ్యంగా కారెన్ లూనెల్ చేసిన లిరిల్ ఫిల్మ్ సూపర్ హిట్ అయింది. లిరిల్ సోప్ అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. కొందరికి జెలసీ పెరిగింది. దాంతో లిరిల్ సోప్ తయారుచేసే హిందుస్తాన్ లివర్ లిమిటెడ్ చంపేసిందని కొందరు, యాడ్ ఫిల్మ్ తీసిన హిందూస్థాన్ థాంపన్స్ కంపెనీ చంపేసిందని మరికొందరు పుకారు పుట్టించారు. ఫస్ట్ ఫిల్మ్ సూపర్ హిట్ అయినా ఆమె మోడలింగ్ కొనసాగించలేదంటే చనిపోయే వుంటుందని నమ్మేశారు. మామూలు ప్రజలకు అంతుబట్టని కోల్డ్ వార్స్ యిని. తప్పుడు ప్రచారాల ద్వారా ఒక కంపెనీని మరొక కంపెనీ ఇలా దేబ్బతీసుకోవటానికి ప్రయత్నిస్తుంటాయి. ఫీల్డులో  వున్న మాకే ఇండస్ట్రీయల్ వార్స్ అర్ధంకావు. కారెన్ లూనెల్ బుద్ధిగా పెళ్ళిచేసుకొని, భర్తతో గుజరాత్ లో వుంటోంది బ్రతికున్నవార్ని చంపటం, చచ్చినవారిని బ్రతికివున్నట్లు భ్రమింపజేయటం ఇండస్ట్రియల్ జెయింట్స్ కి తమాషా ఆట.

    సింథాల్ సబ్బు బాగా క్లిక్ అయింది. అదిచూసి ఓర్వలేని మరొక కంపెనీ ఆ సబ్బు వాడితే పిచ్చెక్కుతుందని పుకారు పుట్టించింది. మంచి కన్నా చెడు త్వరగా ప్రచారంలోకి వస్తుంది. అదే మామూలు కంపెనీ అయితే మట్టిగొట్టుకుపోయేది. సింథాల్ తయారుచేసే గాడ్రెజ్ కంపెనీ చాలా పెద్దది. ఆ పుకారుని సమర్ధవంతంగా త్రిప్పికొట్టగలిగింది.

    ఎంత పూలిష్ నెస్ - సబ్బు వాడితే పిచ్చెక్కుతుందా?"

    మంగళకు చాలా వింతగా అనిపించింది___తన ఫేవరేట్ లిరిల్ మోడల్ బ్రతికున్నందుకు సంతోషమేసింది.


                                                                 *    *    *

    మధు బొంబాయినుంచి రాగానే సరాసరి సముద్రాయాడ్స్ కి వెళ్ళాడు. సీట్లో కూర్చున్న పది నిమిషాల్లోనే ఫోన్ వచ్చింది.

    "హలో.....ఎవరూ మాట్లాడేది?" మధు అడిగాడు.

    "నేను రాంభూపాల్ ని మాట్లాడుతున్నాను."

    "ఎక్కడినుంచి.......?"

    "హైదరాబాద్ నుంచే......."

    "అదేమిటి.........నువ్వు మోడల్స్ ని వెతికేందుకు వెళ్ళలేదా?" కోపంగా అడిగాడు మధు.

    "వెళ్ళాను. ప్రయోజనం కనిపించలేదు......"

    "ఈ విషయం మనోహర్ గార్కి తెలిస్తే మండిపడతారు......"

    "అందుకే నీకు ఫోన్ చేశాను......"

    "అయితే నువ్వో పనిచేయి___ఆ పని కిరణ్ చూసుకుంటాడు. నువ్వు తక్షణం బయలుదేరి వెళ్ళిపో__మంచి లోకేషన్స్ సెలక్టుచేయి. లోకేషన్స్ సెలక్షన్ లో నీకు చెప్పాల్సినవసరంలేదు. నీతోపాటు కెమెరా తీసుకెళ్ళు. నీకు నచ్చిన లోకేషన్స్ ఫోటోస్ తీసి ఎప్పటికప్పుడు ఆ రీల్స్ పంపించు. నికాన్ ఎఫ్-3 కెమేరాతోపాటు74-150 ఎం.ఎం. జూమ్ లెన్స్ కూడా తీసుకెళ్ళు కోడక్ ఈస్టమన్ కలర్ ఫిల్మ్ వాడు.

    ప్రాణానికి తెగించి ఒక ప్రక్క  మనోహర్ గారు పడేం కాశారు. మనల్ని నమ్ముకొని-నువ్విలా చేయటం బొత్తిగా బాగోలేదు. బైదిబై కిరణ్ గురించి వివరాలు తెలిశాయా?"

    "కిరణ్ ఈరోజే గుడివాడనుండి ఫోన్ చేశాడు. గుడివాడకు ఏడుమైళ్ళు దూరంలో ఏలూరుపోయే రూట్ లో ఆరుగొలను అనే ఊరుందట. ఆ ఊరులో ఓకే అద్భుతమైన అందగత్తెను చూసాడట. వివరాలు త్వరలో అందిస్తానన్నాడు. నేను ఇప్పుడే బయలుదేరి వెళుతున్నాను.........."

    "వెరీగుడ్___లోకేషన్స్ సూపర్బ్ గా వుండాలి. ఇంతకుముందెవరు వాడినవి కాకూడదు. ముఖ్యంగా లోకేషన్స్ ఎవరికీ  తెలియగూడదు. లోకేషన్స్ బాగా నచ్చితే రహస్యంగా లోకల్ అధారిటీస్ నుండి పర్మిషన్ తీసుకో షూటింగ్ కోసం........ఇంకేమాత్రం ఆలస్యం చేయవద్దు........బీ కేర్ ఫుల్......"

    "అప్పుడే నాపై కైలాష్ వలపన్నాడు___వేటకుక్కలా నా గురించి సిటీ అంతా గాలిస్తున్నాడు....."

    "వెంటనే బయల్దేరు......మరొక్కక్షణం సిటీలో వుండవద్దు......" ఫోన్ పెట్టేశాడు.

    చందూ వచ్చాడు లోపలకు. రాగానే డోర్ దగ్గరగావేసి మధుకి దగ్గరగావచ్చి "మన ఆఫీసులో ప్రదీప్ కి ఏజెంట్ గా ఎవరో పనిచేస్తున్నారు ఇవ్వాళ కాకపోతే రేపైనా తెలుసుకోగలను వాళ్ళు ఎవరైంది. ఇకనుంచి ఫోన్ లో మన ప్రాజెక్టు గురించి మాట్లాడకండి" అన్నాడు నెమ్మదిగా.

    మధు ఆశ్చర్యపోయాడు చందూ తెలివితేటలకు. ప్రతి విషయం లోనూ జాగ్రత్తగా వుండాలి రోమాకౌర్ షూటింగ్ వివరాలు పూర్తిగా తెలిసిపోయాయి ప్రదీప్ కి. కేవలం తన బాస్ కి, తనకు, రోమాకే తెలిసిన వివరాలు బయటకు పోక్కాయని మనోహర్ హెచ్చరించినప్పటినుండే జాగ్రత్తగా వుండాల్సింది. రెండు రోజుల్లో ప్రదీప్  యాడ్ ఫిల్మ్ బ్యాన్ అవుతుంది. అది తెల్సిన ప్రదీప్ మరీ  పగబడతాడు. అప్పుడనిపించింది ప్రదీప్ కి బొంబాయినుంచి ఫోన్ చేసి వుండాల్సింది కాదని.

    రాంభూపాల్ కోసం వేట మొదలైందంటే........అది మామూలు విషయం కాదు. రాంభూపాల్ లోకేషన్ సెలెక్షన్ లో ఎక్స్ ఫర్ట్ అంటే ప్రదీప్ ఏదైనా యాడ్ ఫిల్మ్స్ తీసే ఆలోచనల్లో వున్నాడా? వుంటే దేనిమీద? లేక  రాంభూపాల్ ద్వారా మనోహర్ పథకాల్ని తెలుసుకొనేందుకా? తమ ఆఫీసులో ప్రదీప్ కి ఏజంట్ గా చేస్తున్నది ఎవరు?

    ఆలోచనల్నుంచి తేరుకుని "సాయంత్రం ఫ్లయిట్ లో 25 ఫిల్మ్ మేగజైన్స్ వస్తున్నాయి బొంబాయినుంచి. అవి హేండోవర్ చేసుకొని భద్రందా  దాచివుంచు. మన ఆఫీసులో మాత్రం కాదు, అర్ధమైందా?" అంటూ  చందూవైపు చూశాడు మధు.

    చందూ తలూపుతూ మధుకి సైగచేసి పిల్లిలా డోర్ వైపు అడుగులేశాడు. తలుపు దగ్గర ఓ క్షణం ఆగి మెరుపులా తలుపును లాగాడు.

    అక్కడే నిలబడున్న గిరీష్ కంగారుగా వెళ్ళిపోయాడు.

   

                                                                  *    *    *


    ఎయిర్ పోర్టునుంచి మరలా లారెంట్ ఆఫీసుకు వెళ్ళారు మనోహర్, ఆమె.

    వెంటనే  ఢిల్లీ లో వున్న తన మిత్రుడు జార్జికి ఫోన్ చేశాడు. జార్జి లైన్ లోకి వచ్చాడు.

    "జార్జ్.....నేను, మనోహర్ ని.........ప్యారిస్ నుంచి మాట్లాడుతున్నాను........నీ నుంచి ఓ సహాయం కావాలి....."

    "చెప్పు మనోహర్......వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ."

    నైపుణ్యం, సృజనాత్మకత___ఈ రెండు వున్న సీరియస్ ప్రొఫెషనల్ మనోహర్. అందుకే మనోహర్ అంటే యాడ్ ఇండస్ట్రీలో చాలా మందికి రెస్పెక్టు.

    "మరో గంటలో ప్యారిస్ టు  ఢిల్లీ____వయా ఫ్రాంక్ ఫర్డ్ , జర్మన్ ఎయిర్ లైన్స్ లుస్థాన్సాలో ఓ యువతీ  ఢిల్లీలో దిగుతుంది......ఆమెను ఎలాగైనా రేపటివరకూ ఆపుచేయాలి  ఢిల్లీలోనే.....చాలా అవసరం యిది. ఆమె నీ చేయి జారిందంటే నాకు లక్షల్లో నష్టంవస్తుంది. నేను ఆమె కోసమే ప్రత్యేకంగా ప్యారిస్ వచ్చానంటే ఆమెతో నా అవసరం ఎంత ముఖ్యమైందో గ్రహించు........."

    "మనోహర్ కంఠంలో అర్ధింపు, ఉద్వేగం క్షణక్షణానికి పెరిగిపోతున్నాయి. జార్జి పొరపాటుగా వదిలినా తన ప్రాజెక్టు పేకమేడలా కూలిపోతుంది. మనోహర్ లోని ఆరాటానికి రెక్కలుంటే లిప్తపాటు కాలం లోనే  ఢిల్లీ ఎయిర్ పోర్టులో వాలి వుండేవాడు.

    చేతికి చిక్కబోతున్నట్లే అనిపించి అంతలోనే సుదీర్ఘమైన దూరంలో లాండ్ అవబోతోంది. మనోహర్ లోని మట్టుదలతో ఆమె చేయి జారిపోయిన తాలూకు నిస్సహాయత పోటీ పడుతోంది. ఇక్కడే మనిషిని సంయమనం కావాల్సింది. మనిషి బలహీనుడైతే స్ల్పిట్ సెకండ్ చాలు అతనిలోని పట్టుదల, దీక్ష, ఆత్మవిశ్వాసాన్ని- నిస్పృహ దెబ్బ తీయటానికి నిస్పృహ బలపడితే పరాజయం, బలహీనపడితే విజయం.

    మనిషి జయాపజయాలకి మధ్య సన్నని సరిహద్దురేఖ, మంచికైనా చెడుకైనా ఈ రేఖే జీవితాన్ని గొప్పమలుపుకు గురిచేస్తుంది. ఈ రేఖ మనోహర్ జీవితాన్ని ఎటు త్రిప్పుతుందో.....!?

    "వివరాలు చెప్పు మనోహర్" జార్జ్ కంఠంలో పట్టుదల ధ్వనించింది. జార్జి అప్పటికే చాలా దూరం ఆలోచించాడు. ఆమెను సామ, దానదండోపాయాలద్వారా ఆపుజేయాలి, మనోహర్ వచ్చేవరకు అని.

    "పేరు తరంగిణి. గారపాటి తరంగిణి. ఎత్తు.5.9 ఫెంటాస్టిక్ స్ట్రక్చర్-36:24:36 మోడ్రన్ గా వుంటుంది. ఎలిగెంట్ లుక్. బుల్లి పెదాలు, ప్లాటెడ్ చీక్స్, హైఛీక్ బోన్స్, ఇంటలిజెంట్ ఇన్ మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ నడకలో, చూపులో నిర్లక్ష్యం, ఫ్రెంచి బాగా మాట్లాడవచ్చు. ఇంతకుమించి ఆమె గురించి వివరాలేం తెలియవు......"

    "ఆమె కంప్లెక్షన్.....?" సాధ్యమైనన్ని వివరాలు ఆమె గురించి తెలుసుకుంటే మంచిదని అడిగాడు జార్జి.

    "తెలియదు___ఎందుకంటే నేను ఆమెను చూడలేదు" ఉలిక్కిపడ్డాడు జార్జి___ఒక్కసారి గూడా చూడని యువతి గురించి అంత వివరంగా ఎలా చెప్పుగలిగాడు మనోహర్........!!!

    "బహుశా చాక్ లెట్  కలర్ ఫేస్ అయుండాలి......... మేకప్ లేకుండా ఆమె ఫోటో దిగివుంటే కలర్ బ్రొమైడ్ నిబట్టి కలర్ చెప్పగలిగేవాడ్ని. ఫోటోలో ఆమె మేకప్ లో ఉన్నట్లుగా అనిపించింది.........ప్లీజ్ జార్జి......క్విక్ క్యాచ్ హర్."

    జార్జి ఫోన్ పెట్టేసి వాచీచూసుకున్నాడు, ప్లయిట్ లాండ్ అవటానికి మరో 20 నిముషాలే వుంది. మరో నిముషంలో జార్జి కారు నలభై కిలోమీటర్ల దూరాన వున్న ఎయిర్ పోర్ట్ వేపు బుల్లెట్ లా దూసుకుపోతోంది.

    ప్యారిస్ లో పనులన్నీ పూర్తిచేసుకున్న మనోహర్ ఎయిర్ పోర్ట్ కి బయలుదేరాడు హడావుడిగా.

    ప్రదీప్ సక్సేనాతో పాతిక లక్షల డీల్ పెట్టుకున్న విక్రమ్ కి మనోహర్ ప్యారిన్ నుంచి  ఢిల్లీ కి ఫోన్ చేసినట్లు తెలిపే వీలులేదు, పథకం ప్రకారమే డ్రామా నడపగలుగుతున్నానని అనుకుంటున్నాడు, హైదరాబాద్ బంజారా హొటల్ రూమ్ నెం 116లో కూర్చుని.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra