Home » Vasireddy seeta devi novels » నిశాగీతం



    "కాకపోవచ్చు. ఈ నాతాకక్యనికి సూత్రధారుడూ__డైరక్టరూ అయినవాడే ఆమెకు ఆ పేరు పెట్టివుండవచ్చును."
    "ఆ పేరు పెట్టడంలో నీకేమైనా  ప్రత్యేకత కన్పిస్తోందా జయంత్? మానసి అనే ఎందుకు  పెట్టాలి? ఏ కమలో, విమలో పెట్టోచ్చుగా?"
    "అది వాడి అహంకారాన్నీ వాడిమీద వాడికున్న నమ్మకాన్నీ  తెలియజేస్తుంది. పేరు ప్రతిష్టలుగల ఒక ప్రముఖ మానసిక శాస్త్రవేత్తను, మానసిక సంక్షోభంలోకి పెట్టడానికి అతడు ఎంచుకొన్న పేరు అది."
    "ఓ.కె," చిరునవ్వు నవ్వుతూ తల ఊపాడు ఉదయ్.
    "శివరామయ్యకూ మానసికీ మధ్యవున్న సంబంధం?" ఆగి జయంత్ ఉదయ్  కళ్ళల్లోకి చూశాడు.
    "ఆగావేం? ఊఁ! చెప్పు!"
    "నువ్వేమనుకున్నావ్?"
    "తండ్రీ కూతురనేగా నమ్మాను ముందు?"
    "ఆ తర్వాత?"
    "కాదేమో అనే అనుమానం రాకపోలేదు. కానీ  వారిమధ్య వున్న బాంధవ్యాన్ని గురించి నేను ఒక నిర్ణయానికి రాలేదు."
    "వాళ్ళిద్దరి మధ్యా వున్న సంబంధం......"
    "ఊఁ చెప్పు."
    "భార్యాభర్తల సంబంధం"
    ఉదయ్ చివ్వున తలెత్తి ఆశ్చర్యంగా చూశాడు.
    "వాళ్ళిద్దరూ భార్యభర్తలంటావా?" సాలోచనగా ప్రశ్నించాడు ఉదయ్.
    "కాదు. మానసి  శివరామయ్య ఉంపుడుగత్తె!"
    "అలా అని ఎందుకనుకోవాలి? ఇంతకుముందు నువ్వు మనసిని ప్రతిభాశాలి అయిన  నటీమణి అన్నావుగా? ఆమె డబ్బు తీసుకొని ఈ పాత్ర ధరించి ఉండొచ్చుగా? శరీరం అమ్ముకోవలసిన అవసరం ఏముంటుంది ఆమెకు?"
    "ఆమెమీద నీకున్న అభిమానంవల్ల నీకు అలా నిన్పించడం సహజమే."
    "అభిమానమా?"
    "మరి? అంతకుమించినది ఇంకా ఏమైనా ఉంటే చెప్పు. అది నువ్వు చెప్పాల్సిన విషయం."
    ఉదయ్  పెద్దగా నవ్వాడు.
    ఊఁ ఆ తర్వాత?"
    "వీరభద్రుడు, సినిమాల్లోనో, నాటకాల్లోనో విలన్ వేషం వేసే  బాపతు. బహుశా వీడుకూడా మానసి కంపెనీలో పనిచేసేవాడే అయివుండొచ్చు.
    "అడివయ్యా?"
    "అడివయ్య శివరామయ్య నమ్మినబంటు. ఆ తోటలో ఎన్నో ఏళ్ళగా  పనిచేస్తున్నా వాడేమోననిపిస్తుంది."
    "మరి బుచ్చిబాబు?"
    "బుచ్చిబాబనేవాడెవడో చెప్పడం కష్టం. వాడు  తోటలో పనిచేసే వాడైనా అయివుండొచ్చు లేక....."
    "ఊఁ ఆగావేం? చెప్పు లేక?....."
    "అడివయ్య కొడుకయినా అయివుండొచ్చు. ఇకపోతే నాటకంలో ప్రవేశించని పాత్ర ఒకటి వుంది."
    "ఎవరి పాత్ర?" ఆశ్చర్యంగా చూశాడు ఉదయ్.
    "అది శివరామయ్య అమెరికాలో తన మేనల్లున్నాడని వర్ణించి చెప్పిన పాత్ర. సూరిబాబు పాత్ర. సూరిబాబంటూ ఎవడూ లేడు. ఇది కల్పితపాత్ర. స్టేజిమీద కన్పించకుండా, సంభాషణాపరంగా నాటకంలొ విన్పించే పాత్ర."
    "ఇంతకూ ఈ నాటకానికి సూత్రధారుడెవడంటావ్?" ఉదయ్  కుతూహలంగా అడిగాడు.
    "ఇంకెవరూ? శివరామయ్యే!"
    "సైకియాట్రిస్ట్ నే మానసిక సంక్షోభంలోకి తోసి మతిపొగొట్టగల ప్రతిభావంతుడంటావా?"
    "కాదా!"
    ఉదయ్ ఆలోచిస్తున్నాడు.
    "మరైతే వీళ్ళుకాక మరో పాత్ర వుందంటావా?" ప్రశ్నార్థకంగా చూశాడు జయంత్.
    "నీ  అభిప్రాయం ఏమిటో చెప్పు. ఆ తర్వాత నా ఎనాలిసిస్ ఏమిటో వివరిస్తాను" ఉదయ్  జయంత్ ను ప్రోత్సహిస్తున్నట్టుగా అన్నాడు.
    "యస్. యస్. సూరిబాబు కల్పితపాత్ర కాకపోవచ్చు. సూరిబాబు అనేవాడు ఏ అమెరికాలోనో సైకియాట్రి చదివినవాడై వుండొచ్చు. ఇంత బ్రహ్మాండమైన పథకం వేసి నిర్వహించగలిగిన ఆ సూరిబాబు సామాస్యుడు కాడు. తప్పకుండా వాడూ...."
    "ఆగావేం? చెప్పు?" ఉత్కంఠంతో అడిగాడు ఉదయ్.
    "వాడిపేరు సూరిబాబు  కాకపోవచ్చు. వాడు విదేశాల్లో  మంచి అనుభవం సంపాదించినవాడై వుండొచ్చు." జయంత్  రావు ఆగి  ఉదయ్ కేసి  "అవునా?" అన్నట్టు చూశాడు.
    "ఓ.కె. ఇంతకూ ఈ క్రైం థ్రిల్లర్ కు మోటివ్ ఏమిటి?" ఉదయ్ రావు  ముఖంలోకి  సూటిగా చూశాడు.
    "వెరీ సింపుల్ ! అతి మామూలు విషయం. మానవ సంబందాలన్నిటికి ఏది  మూలమో, ఏది  హేతువో, అదే . ఇక్కడా అదే."
    "అంటే?"
    "డబ్బు! మానసి, వీరభద్రుడు, అడివయ్య, బుచ్చిబాబు, సూరిబాబు___అందరూ డబ్బుకోసమే తమ తమ  పాత్రలు నిర్వహించారు. దీనికి మూలవిరాట్  అయిన శివరామయ్యకూడా  డబ్బుకోసమే ఇంత నాటకం  ఆడాడు. తోటలో  నిక్షిప్తమైన వజ్రవైడూర్యాల కోసం, ధనరాసులకోసం, స్టేజిమీద  తెరవెనుక ఆడే నాటకాన్ని వాస్తవీకరించాడు. ఎంతో మేథాసంపత్తి వున్నవాడు మాత్రమే, ఈ భయానక భీభత్స వాస్తవదృశ్యనాటకాన్ని ఆడగలడు. అఖండ తెలివితేతలున్న నిన్నే అర్భకుడ్ని చేసి  ఒక ఆట  ఆడించాడు ముప్ప తిప్పలు పెట్టి మూడు రాత్రిళ్ళు నిన్ను ఒక అయోమయం ప్రపంచంలోకి తోసేశాడు. అవునా?"
    జయంత్ గ్లాసులో మిగిలివున్న విస్కీ ఒక్కసారిగా గొంతులో పోసుకున్నాడు.
    "అద్భుతంగా  వుంది నీ ఎనాలిసిన్!"
    "థ్యాంక్యూ"
    "పాత్రలను విశ్లేషించావు. ఈ నాటకంలోని ఉద్దేశ్యాన్ని నిర్వచించావు. బావుంది. ఈ నాటకంలో పాత్రలూ, విషయమూ, అన్నీ నీ మొత్తం  విషయాన్ని విశదీకరించగలవనుకుంటాను ట్రైటు రికన్ స్త్రక్ట్ ది ఎంటైర్  ఎపిసోడ్."
    "యస్. ఇప్పుడు నేను చెయ్యగలననే నమ్మకం  నాకు కలిగింది." అంటూ గ్లాసులో విస్కీ పోస్తున్న జయంత్ ను వారిస్తూ "ఈ  పెగ్గుకూడా తీసుకున్నావంటే ఆ తర్వాత ఆలోచించేదీ, మాట్లాడేదీ, డాక్టర్  జయంత్ కాదు. విస్కీ యే!" అన్నాడు డాక్టర్ ఉదయ్ చంద్ర.
    వెంటనే జయంత్ బాటిలూ, గ్లాసూ పక్కకు  పెట్టాడు.
    నోట్సు రాసుకున్న కాగితాలు మరోసారి  శ్రద్దగా  చదువుకొని మళ్ళీ చెప్పడం  ప్రారంభించాడు జయంత్.
    "ముఖ్యమైన సంఘటనలకు మాత్రమే  వివరణనిస్తూ విషయ సీరుయాస్ గా చూస్తూ అన్నాడు.
    "ఒక నేలరోజుల క్రితం 'మానసి' అనే ఓ అందమైన యువతిని శివరామయ్య తీసుకొచ్చి ప్రశాంత నర్సింగ్ హొమ్ లొ చేర్పించాడు. మానసి పర్సుయేషన్ మానియాతో  బాధపడుతున్నట్టుగా నటిస్తూ, డాక్టర్  ఉదయ్ చంద్రను నమ్మించింది. ఆమె తండ్రిగా  నటిస్తున్న శివరామయ్య  డాక్టరు ఉదయ్ చంద్ర పుట్టుపూర్వోత్తరాలు, వివరాలు సేకరించడం మొదలుపెట్టాడు. కొన్ని వివరాలు దొరగ్గానే శివరామయ్య ఇంటికి వెళ్ళాడు మానసి  తనకు  జబ్బు తగ్గిపోయినట్టు నటించింది. శివరామయ్య సేకరించిన వివరాలకు, అంతకుముందు తన దగ్గరవున్న సమాచారంతోపోల్చి చూసుకొన్నాడు" ఆగాడు జయంత్.    
    "ఊఁ తర్వాత?"
    "పసివాడుగా ఉన్నప్పుడే దేశం వదలి అమెరికా వెళ్ళిన కుర్రాడూ, ఈ ఉదయచంద్ర ఒక్కడేననే  నమ్మకం కుదిరింది. అంతే ఈ నాటకానికి తెర లేచింది. ఈలోపల మానసి  ఉదయ్ కు చేరువైంది. అతడి అభిమాన్నాని పొందగలిగింది! మధ్య కొంత  నయమైనట్టుగా నటించి శివరామయ్యతోనే  తిరిగివెళ్ళింది. అక్కడ  రంగం  సిద్దంచేసుకొని, నాటకంలోని పాత్రలకు అవసరమైన  ట్రైనింగ్  ఇచ్చి, అన్ని హంగులూ సిద్దం చేసుకొన్నారు. ఆ తర్వాతమళ్ళీ  మానసికి రోగం తిరగబెట్టినట్టుగా నాటకం  ఆది శివరామయ్య మానసిని నర్సింగ్  హొమ్ లొ చేర్పంచాడు. ఉదయ్ కు ఉచ్చులు బిగించే కార్యక్రమంలో కృతకృత్యులయ్యారు." ఓ క్షణం ఆగిమళ్ళీ  అందుకొన్నాడు....
    "చెరువు అడుగున వున్న చెప్పాను గాలంవేసి  బయటికిలాగి బుట్టలో వేసుకొన్నట్టు డాక్టర్  ఉదయ్ చంద్రను ప్రశాంత నర్సింగ్ హొమ్ లో నుంచి లాగి తమ ఉచ్చులో బిగించారు. తమవెంట  తీసుకెళ్ళారు. ఇక్కడ  వాళ్ళు టైమింగ్ విషయంలో చాలా జాగ్రత్తపడ్డారు. పెద్దతోటలో, శిధిలావస్థలోవున్న  తిమ్మిది స్తంభాల భవనంలోకి మొదటిసారిగా ప్రవేశించే సమయాన్ని చాలా జాగ్రత్తగా నిర్ణయించారు.
    మునిమాపువేళ! చీకట్లు  ముసురుకుంటున్న సమయంలో తోటకు చేరడం  జరిగింది. శివరామయ్య ఆ రోజూ  కావాలనే మార్కెట్  కు వెళ్ళాడు. ఆలస్యంగా  పళ్ళబుట్ట పట్టుకొచ్చాడు. కావాలనే  ఆలస్యం చేశాడు.
    "అవును!" ఏదో  ఆలోచిస్తూ అన్నాడు ఉదయ్.
    "మొదటిరాత్రే భయంకరమైన  నాటకానికి  తెర  లేచింది. మనసు నడక తెలిసిన మనిషినే మాయలో పడేసే ప్రయత్నంలో కొంత విజయం సాధించారు. మొదటి రాత్రి భూతాలు, కొరివిదయ్యాల నాటకం ఆరంభం అయింది. ఎవరిపాత్ర  వాళ్ళు  సమర్థవంతంగా నటించారు."
    "అలా భయపెట్టడానికి  కారణాన్ని విశ్లేషించి చెప్పు."
    "డాక్టర్  ఉదయ్ చంద్రా ! అధోచేతనంలో సుప్తావస్థలో వున్న ఓ  భయంకర రహస్యాన్ని వెలికితీయడమే అతడి  అంతిమ లక్ష్యం. అదంత తెలివైన  పనికాదని  అతడికి  తెలుసు అందువల్లనే  ఇంత ఘోరమైన, దారుణమైన నాటకం  ఆడించాడు. మామూలు పరిస్థితుల్లో ఉదయ్ చంద్ర  వంటి  మానసిక శాస్త్ర  వైద్యుడ్ని అతడి  కోరికకు విరుద్దంగా ట్రాన్స్ లోకి పంపించడం అసాధ్యం. అందుకే అతడిచుట్టూ ఓ భయంకరమైన వాతావరణాన్ని సృష్టించి, అభూతకల్పనలతో కథలల్లి చెప్పడం జరగింది. అతడ్ని శారీరకంగా, మానసికంగా బలహీనుడ్ని చేసే ప్రయత్నంలోనే  ఇవన్నీ జరిగాయి. ఆ స్థితికి  చేరుకున్న మనసును వశం  చేసుకోవడం తేలికైన పని  అని అతడికి బాగా తెలుసు."
    "అతడంటే?"
    "అతడెవడైనా సరే, సామాన్యుడు మాత్రంకాడు. ప్రతిభగల సైకియాట్రిస్టు అయివుండాలి. అంతేకాదు. సమాజానికి సహాయపడవలసిన అతడు. తన విజ్ఞానాన్ని స్వార్థంకోసం మానవ హాని కలిగించే నేర మనస్తత్వం గలవాడూ, దుర్మార్గుడూ, అయివుండాలి!" డాక్టర్ జయంత్  ఆగి సిగరెట్  వెలిగించాడు.
    టేబుల్ మీదకు వంగి, అంతవరకూ రాసిన కాగితాలను ఓసారి  సర్ది మళ్ళీ  పైకి పైకి  మాట్లాడుతూనే  రాయడం ప్రారంభించాడు.
    "అలా  మూడురోజులపాటు ఉదయచంద్రమీద ప్రయోగాలు నీరాఘాటంగా సాగిపోయినాయి."
    "ఆ మూడు రోజులూ మూడు  యుగాలు పీడకలలో గడిపినట్టుగా అన్పిస్తోంది నాకు" అన్నాడు జయంత్  ముఖంలోకి చూసి.
    జయంత్ తన ధోరణిలో రాసుకుంటూ చెప్పుకుపోతున్నాడు
    "జువ్విచెట్టు ఫంగస్ వెలుగును కొరవిదయ్యాలుగా, ప్యాకెట్ బ్యాటరీతో మాస్క్ లో  అమర్చిన వెలిగే  కళ్ళూ, వీరభద్రుడి కథలూ, అడవయ్య అభూతకల్పనలూ, ఉదయ్ చుట్టూ ఓ భయంకర వాతావరణాన్ని సృష్టించడానికి ఉపయోగపడ్డాయి. అయినా లొంగిరాలేదని గ్రహించిన అతడు, ఆ రాత్రి, ఉదయ్ ను  మెట్లమీదకు రప్పించి, మెట్లు విరగ్గొట్టికిందపడెయ్య దానికి ప్రయత్నం జరిగింది. చివరి ప్రయత్నంగా తలమీదకొట్టి స్పృహ తప్పేట్టు చెయ్యడం జరిగింది. ఆ స్థితిలోనుంచి కోలుకుంటూ, స్పృహలోకి వస్తున్న ఉదయ్ మనసును వశం చేసుకొని, ట్రాన్స్ లోకి పంపించడం జరిగింది. టాన్స్ లో వున్న  ఉదయ్ ను  బాల్యావస్థ (ఏజ్ రిగ్రెషన్) లోకి పంపించి, ధనరాసులు ఎక్కడ నిక్షిప్తం చేయబడ్డాయో తెలుసుకొనే ప్రయత్నం జరిగింది. బావి దగ్గర పనసచెట్టుక్రింద ఆ నిధిని పాతిపెట్టినట్టు బాల్యావస్థలోకి నెట్టబడిన  ఉదయచంద్ర....కిరణ్ ద్వారా తెలుసుకొన్నారు. ఇక్కడ మరో ముఖ్య విషయం...."

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra