Home » Kommuri venugopala rao » Mahaapravaaham


    అతను మిదకీ వ్రాలి ఆమెను అణువణువునా అక్రమించటం మొదలుపెట్టాడు.


                                         15


    సూర్యచంద్ర రాసి న నవల " జీవితమా? కార్చిచ్చా?" ఆ వారపత్రికకు పంపించిన కొద్దిరోజులకే సెలక్టయి సీరియల్ గా ప్రచురించబడసాగింది.


    అతనికి ఆశ్చర్యంగా  వుంది. తన అభిప్రాయాలలో పూర్తిగా విభేదించిన ఆ సంపాదకుడు యీ సీరియల్ నిఎలా ప్రచురిస్తున్నాడు?


    కొన్ని కొన్ని  వర్గాలలో య నవల సంచలనం కలిగిచింది. కమ్మిర్షియల్ నవలా ప్రభజనంతో విసిగెత్తిపోయి వున్న కొంతమంది పాఠకులు అతని రచనకు స్పందించి ఉత్తరాలు కూడా రాశారు.

    
    వారం వారం ఆ అపరిచిత స్ర్ర్ర్రీ దగ్గర్నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ఉత్తేజాన్ని కలిగిస్తోంది.


    అదే వొరవడతో నవలలు రాయటానికి అతను పథకాలు సిద్ధం చేసుకుంటున్నాడు.


                          *    *    *    *

    
    భులోకమ్మకి మొదట్నుంచీ ఓ అలవాటుంది. ఆమె ఎనిమిదో క్లాసువరకూ చదువుకుంది. రాత్రుళ్లు మూడు పెగ్గులు మందు కొట్టినా ఆమెకు  మాత్రాని నిద్రరాదు. ఆమె హోటలులో అన్ని దినపత్రికలూ, వారపత్రికలూ వస్తాయి. దినపత్రిగక హోటల్లో వున్నప్పుడే మధ్య మధ్య చదివేస్తుంది. వారపత్రికలు యింటికి తీసుకెళ్ళి రాత్రి రెండుగంటల దాకా చదివి అప్పుడు కళ్లు మూతలు పడినిద్రపోతుంది.


    "జీవితమా? కార్చిచ్చా?" అన్న నవల మొదట యధాలాపంగా చదవటం మొదలుపెట్టింది. తర్వాత తర్వాత ఆశక్తి కలిగి శ్రద్ధగా చదవసాగింది.

    
    ఆడవాళ్ళూ, వాళ్ళకి జరిగే అన్యాయాలూ, వ్యాపారస్థులు చేసే రకరకాల మోసాలూ, వాళ్లు చేసే దోపిడీ, ఆ దోపిడికి గురవుతోన్న అమాయక ప్రజలూ...


    ఓ వారం చదవుతూంటే రక్తం ఉడుకెత్తిపోయింది. " ఎవడ్రా యిది రాసినవాడు?" అని పత్రికదూరాన పడేటట్లు విసిరికొట్టి మరో రెండు పెగ్గులు తాగి పడుకుంది.

    
     మర్నాడు హోటల్ కు వెళ్ళాక ఆపత్రికకి ఫోన్ చేసింది.


    అవతల్నుంచి ఎడిటర్ ఫోన్  ఎత్తాడు.

    
     " మంజరి ఎవరు?" అనడిగింది.

    
    " జీవితమా? కార్చిచ్చా?" అనే నవల రచయిత.


    " అది తెలుసులేవయ్యా. ఆ మనిషి ఎవరని?"


    " అమ్మాయి కాదు అబ్బాయ్."


    "చదువుతూంటే తెలిసిపోతుందిలే. వాడు ఎవరని?"


    "ఏం? ఆ నవల మిక్కూడా నచ్చిందా?"


    " అవన్నీ నీకెందుకయ్యా? ఎవరో చెప్పమంటే..."


    " ఆ అబ్బాయి పేరు సూర్యచంద్ర."


    " వాడికి పోనూ గీనూ ఏదయినా తగలబడిందా?"


    "ఉంది."


    " చెప్పవయ్యా బాబూ. రాసుకుంటాను"


    ఎడిటర్ ఫోన్ నంబరు చెప్పాడు.


    భూలోకమ్మ ఓ నిమిషమాగి, ఆ నంబర్ డయల్ చేసింది.

    
     అవతల్నుంచెవరో రిసీవ్ చేసుకొన్నారు.


    "హలో"


    " నేను భులోకమ్మాని."


    " అంటే?"


    " అంటే ఏమిటయ్యా. నా పేరు భూలోకమ్మ అంతే."


    " ఎవరు కావాలి?"


    "సూర్య చంద్ర."


    " నేనే మాట్లాడుతున్నాను."


    " ఆర్ని! నువ్వేనా? అర్జంటుగా నీతో మాట్లాడాలి. నీ యిలెక్కడ చెప్పు . వస్తాను."


    " దేన్ని గురించి మాట్లాడాలి?"


    " దేన్ని గురించో ఒకదాన్ని గురించి. ఏం? విషయ మేమిటో చెబుతేగాని ఎ పాయింట్ మెంట్ యివ్వవా? ఏమిటి? పెద్ద పెద్ద కలక్టర్లే నన్ను ఏం మాట్లాడుతావూ అని ముందుగా అడగలేదు."

    
     సూర్యచంద్ర కేం మాట్లాడాలో తెలీక ఎడ్రెస్ చెప్పాడు.    


     " సరే, ఓ పావుగంటలో వస్తాను.యింట్లో వుండు."


    ఫోన్ క్రింద పెట్టేసి భూలోకమ్మ " జగ్గూ! ఒరేయ్ జగ్గూ" అని కేకేసింది డ్రైవర్ని.


     ఓ బాయ్ పరిగెత్తుకుంటూ వచ్చి " యివేళ డ్రైవరు రానని కబురు చేశాడమ్మగారూ"అన్నాడు.


    " రానన్నాడా? ఏమిటట కారణం?"


    " జరమొచ్చిందిట."


    "జరమా? పోయిన వారం వొంటో బాగాలేదని సెలవు పెట్టాడుగా?"


    "అప్పుడయారియా డయారియా అంటే..."


    "ఏడిశావులే నోరు మూసుకో . నీకంటే నేనే బాగా అర్థం చెప్పగలను. వెధవ డయారియామొహమూ నువ్వూనూ. కారులో పెట్రోలుందా?"


    "ఉందమ్మగారూ."


    "సరే . నేనే తీసుకెడతాను" అంటూ సీట్లోంచి లేచి బయటకొచ్చి హాలులో కాంపొండ్ లో ఓ ప్రక్కగా పార్క్ చేసి వున్న ఎంబాసిడర్ కారు దగ్గరకొచ్చింది.


    ఒక్క నిమిషంలో ఆమె కారులో ఎక్కి కుచోవటమూ, కారుముందుకు దూకటమూ జరిగాయి.


    బిజీగా, గజిబిజిగా వున్న విజయవాడ రోడ్లమిద భూలోకమ్మ అతి చాకచక్యంగా డ్రైవ్ చేస్తోన్న కారు చకచకమని దూసుకుపోతోంది.


    భూలోకమ్మ పదేళ్ళనుంచీ కారు మెయిన్ టెయిన్ చేస్తోంది. నాలుగయిదేళ్లుగా కారు డ్రైవ్ చేస్తోంది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra