Home » Yandamuri veerendranath » చీకట్లో సూర్యుడు


    "పొరపాటయిపోయింది మెసేజ్ చదువు ప్లీజ్" రెండు చేతులూ జోడించాడు నిఖిల్.

    నిఖిల్,

    ఆలోచించే మేధస్సున్న మనిషి పుట్టి 806 తరాలు దాటింది. మొదటి 750 తరాల విషయం వదిలెయ్, ఆ తర్వాత మనిషి ఎన్నో రకాల ఛాలెంజీలను ఎదురుకున్నాడు. అన్నింటినీ దిగ్విజయంగా సాధించగలిగాడు. కలలో కూడా వూహించలేని పనులు చేయగలిగాడు. కారణం అతడుతన నిరాశావాదాన్ని జయించగలగడమే!! ఈ రోజున అసాధ్యమనుకున్న కార్యం సాధించడానికి మీరంతా అంతరిక్షంలోకి దూసుకుపోతున్నారు! కారణం ఏమిటి? ఆశావాదం. ఆ ఆశావాదాన్ని చివరివరకూ వదలకు.
   
    నా జీవితం వృధా అయిపోతుందని ఎందుకనుకుంటావు? ఒక జీవితకాలంలో పూర్తి చేయలేనంత బాధ్యత నా మీదుంది, నీ గురించి ఆలోచించే సమయం గూడా లేనంత బిజీ అయిపోయాను. నేపాంబాంబు ఫలితం భూమినుంచి తొలగనంతవరకు ఇక నాకు పని సమస్యలేదు. విశ్వజననీయమైన ప్రేమ ముందు మనప్రేమ చాలా  చిన్నది. 'ఇది  నా భాష, ఇది నా జాతి, ఇది నా మతం, ఇది నా దేశం, దేశమును ప్రేమించుమన్నా' అన్నస్థాయినుంచి ఎదిగి, "ఇది నా భూగోళం  ఇది నా ప్రపంచం" అన్నస్థాయిలో మానవజాతి ప్రతినిధిగా వెళ్తున్నావు. నీ బాధ్యత గూడా నువ్వు తెలుసుకాగలిగినప్పుడూ నా గురించి ఆలోచించే సమయం నీకూ వుండకపోవచ్చు. బీ బ్రేవ్ విష్ యు ఆల్ ది బెస్ట్
                                                                                                                                       -శ్రీజ.

    అతడు చాలాసేపు అలాగే నిశ్చలంగా కూర్చున్నాడు. అతడి మూడ్ గమనించి కంప్యూటర్ కూడా మాట్లాడలేదు. చాలా సేపతరువాత అక్కడనించి లేస్తూ. ఒక విశ్వరహస్యం తెలుసుకున్న వాడిలా "నిజమే శ్రీజా. నీ మాటలే నాకు ధైర్యం. మరెప్పుడు నిరాశావాదాన్ని దగ్గరకు రానివ్వను" అనుకున్నాడు.

                              *    *    *

    అంతరిక్ష నౌకలో పగలూ రాత్రీ లేవు. బయటకూడా సూర్యాస్తమయాలూ సూర్యోదయాల స్టేజిని నౌక ఎప్పుడో దాటిపోయింది. జేగురు రంగు వెలుగులో అది నిరంతరం ప్రయాణం చేస్తూనే వుంది. ప్రతీ పది గంటలకీ ఒకరు చొప్పున వంతులవారీ నిద్రపోతున్నారు. ఆ నిద్రకూడా కేవలం నాలుగు గంటలే. వెంటనే మెలకువ వచ్చేస్తూ వుంటుంది. భూమ్మీద పగలూ రాత్రీ దాదాపు సమానంగా వుండటం వల్ల మనిషి ఎనిమిది గంటలకి నిద్రకి అలవాటు పడ్డాడు. అంతరిక్షంలో ఆ అవసరం లేకపోయింది. కంట్రోలు దగ్గర ఎప్పుడూ ఇద్దరూ మేల్కొని వుండేలా ఏర్పాటు చేశాడు యశ్వంత్.

    అంతరిక్ష నౌకలో ఏయే గదుల్లో ఏయే వస్తువులున్నాయో, ఏ యే ఏర్పాట్లున్నాయో అనూహ్యకి తెలీదు. మందులూ, నీరూ, గాలి, మనిషి జీవితానికి సరిపోయే అన్ని వస్తువులూ వున్నాయని తెలుసు. ఆమె ఏకాగ్రతంతా అంతరిక్షంలో బయాలజీ మీదే.

    ఆమె చివరి గదిలోకి వచ్చింది. ఆ గదిలో చాలావరకు నిత్యజీవితానికి ఉపయోగపడే వస్తువులే వున్నాయి. వారి, గోధుమ, మాంసాహారం లాటి విశిష్ట పదార్థాలన్నిటికి చోటులేదు. ఆ చిన్న గదిలో అయిదుగురు వ్యక్తులకి - డెబ్భై అయిదు సంవత్సరాలకి సరిపోయే ఆహారం ఎనర్జీ రూపంలో స్టోరు చేయబడి వుంది. రెండు తరాలకి సరిపోయే ఆహారం అది. ఆమె దృష్టి ఒక చిన్న డబ్బామీద పడింది.

    పసిపిల్లలకి ఇచ్చే పాల టిన్ అది. శూన్యంలో జన్మించిన నేరానికి పిల్లలకి పసితనంలోనే కృత్రిమ ఆహారం ఇవ్వకుండా- కనీసం బాల్యంలో అయినా "పాలు" అంటే ఎలా వుంటాయో చెప్పడం కోసం దాన్ని వుంచారు. మరో రకంగా చెప్పాలంటే ఆ టిన్ ఆమె కర్తవ్యాన్ని కూడా అన్యాపదేశంగా బోధిస్తూ వుంది.

    అంతలో ఆమె దృష్టి ప్రక్కన మరో వస్తువు మీద పడింది.

    వాటిని చూసి ఆమె చిగురుటాకులా వణికింది.

    తమ పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే , కాలం సర్పంలా సాగిపోతూ వుంటే, తాము వరుసగా ఒకరి తరువాత ఒకరు మరణిస్తే- తమ శవాలు అనాధప్రేతాల్లా శూన్యంలోకి తోసివేయబడకుండా- భూలోకవాసులు తమకిచ్చిన ఆఖరి బహుమతులు అవి.

    అయిదు శవ పేటికలు


                                                                           3

    "బ్రహ్మవిద్యా! మనం బయలుదేరి ఎన్నాళ్ళయింది?" అడిగింది అనూహ్య.

    అనంతమయిన ఈ ప్రయాణంలో సమయం  గడపటానికి చక్కటి నేస్తం అయిపోయింది బ్రహ్మవిద్య. యశ్వంత్ తో సహా ఎవరికి బోర్ కొట్టినా బ్రహ్మవిద్యతో చేస్ లాంటివి ఆడటం, కబుర్లు చెప్పడం, కథలు వినడం చేస్తుంటారు. కన్ ప్యూజన్ లోంచి బయటపడాలనుకున్నప్పుడల్లా అనూహ్య బ్రహ్మవిద్యతో వాదానికి దిగుతుంది.

    "ఆరునెలల పదిహేడురోజుల పద్దెనిమిది గంటల యిరవై నిముషాల పన్నెండు సెకండ్లు."

    "ఈ లెక్కన గాలక్సీ అంచు చేరడానికి ఎంతకాలం పడుతుంది?"

    "మరో పదిహేను సంవత్సరాలు. అదీ మనం  అనుకున్నట్లుగా బయలుదేరినప్పటికంటె వేగం రెట్టింపు అవుతూ వస్తే."

    "అది సాధ్యపడుతుందంటావా? అంటే లెక్కప్రకారం మనం కాంతి వేగానికి రెట్టింపు వేగంతో వెళ్ళగలగడం."

    "తప్పకుండా. ఒక్కసారి జూపిటర్ గ్రహాన్ని దాటాక ప్రయాణం వేగం పుంజుకుంటుంది. ఎందుకంటే ఇంతవరకు మీరు రోదసీలో వదిలేసిన చెత్తాచెదారం అంతా జూపిటర్ వరకే పరిమితం. ఏ చిన్న దెబ్బ తగిలినా అది వేగాన్ని తగ్గిస్తుంది. అదీ మన వాహనం స్పెషల్ గా తయారు చేయబట్టి. ఇప్పటికే అరడజనుసార్లు ఏవో వస్తువులు వచ్చి కొట్టుకొన్నాయి నాలుగయిదుచోట్ల మన నౌకకి సొట్టలు పడ్డాయి. సోట్టలంటే ఎన్నో చిన్నవి అనుకోకు. చూశావంటే భయపడతావు."

    "నిజంగానే భయం వేస్తోంది. మన ప్రయాణం జయప్రదం అవుతుందన్న నమ్మకం నీకుందా?"

    "భయం తర్వాత-ముందు కంట్రోలు రూంలోకి వెళ్ళండి! మనం అష్టరాయిడ్ బెల్ట్ లోకి ప్రవేశించబోతున్నాం" అంది బ్రహ్మవిద్య. ఆమె కంట్రోలు రూంలోకి పరిగెత్తింది. అప్పటికే యశ్వంత్ బిజీ అయిపోయాడు.

    "ఆస్టరాయిడ్ బెల్ట్ అంటే మనం  జూపిటర్  గ్రహానికి దగ్గరలోకి వెళుతున్నామన్న మాటేగా?" అడిగింది అనూహ్య.

    "అవును. కాని జూపిటర్ దగ్గరకు అనకు. ఈ వలయం దాటడానికే మనకు చాలా రోజులు పడుతుంది. అందులో చాలా ప్రమాదకరమయిన ప్రదేశం ఇది."

    "ప్రమాదం అంటే ఏ రకంగా?" అడిగింది అనూహ్య.

    "ఇదెలా ఏర్పడిందో ఎవరూ కనిపెట్టలేకపోయారు. బహుశా ఏదైనా గ్రహం పూర్తిగా గ్రహంగా మారకుండానే జూపిటర్ అయస్కాంత శక్తికి బద్దలయిపోయిందని శాస్త్రజ్ఞుల నమ్మకం. కొన్ని మీటర్ల నుండి కొన్ని వందల కిలోమీటర్లు వెడల్పులో ఇవి జూపిటర్ కిందభాగంలో తిరుగుతుంటాయి. అవి ఢీకొట్టుకుని గ్రహాలమీద కూడా లోతైన గుంటలని ఏర్పరుస్తుంటాయి, కొన్ని భూమివరకు కూడా చేరతాయి. ఇదంతా ఓ పెద్ద పిండిమర అనుకుంటా. ఈ ఉపగ్రహాలే కొట్టుకుని పిండి పిండయి అణువులుగా తిరుగుతుంటాయి. చిన్న వాటితో మనకు భయం లేదు. పెద్దదేదయినా తగిలితే మాత్రం నామరూపాలు లేకుండా దుమ్ముగా మారిపోతాం" అందరూ అప్రమత్తంగా కూర్చున్నారు. అంతవరకు వాళ్ళు దగ్గరగా చూడని ఉపగ్రహాలు స్ర్కీన్ మీద కనిపిస్తున్నాయి. దూరంగా ఎర్రటి రంగు పులుముకున్నట్లుగా జూపిటర్ గ్రహం.

    నిముషాల గంటలవుతున్నాయి. ఫిలిప్స్, అనూహ్య అలాగే నిద్రలోకి జారిపోయారు.

    "ఇక ప్రమాదం గడిచినట్టే ననుకుంటాను" అన్నాడు వాయుపుత్ర. అతడంటుం గానే ఎర్రబల్బు వెలిగింది.

    "డేంజర్, డేంజర్" కంప్యూటర్ ఎర్రటి అక్షరాల్లో చూపిస్తోంది. యశ్వంత్ కంట్రోలు చేతిలోకి తీసుకున్నాడు. నిఖిల్ అతడి పక్కనే కూర్చుని సహాయం చేస్తున్నాడు.

    "అటు చూడండి" వాయుపుత్ర గట్టిగా అన్నాడు. నాలుగైదు ఉపగ్రహాల గుంపు వాహనం మీద దాడిచేయటం స్ర్కీన్ మీద స్పష్టంగా కనిపిస్తోంది. మరొకటి కిందనుంచి పైకి దూసుకువస్తోంది.

    చుట్టుముట్టిన చతురంగ బలాలను ఎదుర్కొంటున్న ఏకైక వీరుడిలా సుహృద్భావ్ పైకి కదలి వెళుతోంది.

    అందరూ ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. యశ్వంత్ రెండు పక్కలనించి వస్తున్న అపాయన్నెలా తప్పిస్తాడో అర్థంకావటంలేదు. ఇంత కష్టపడి వచ్చి గాలక్సీ మధ్యలోనే నాశనం అయిపోవలసివస్తుందా? ఆ బృందంలో ఎవరికీ చావంటే భయంలేదు. కానీ ఈ పథకం ఫెయిలయితే ఆ వార్త భూమిని చేరడానికే కొన్నేళ్ళు పట్టవచ్చు. ఈ తరువాత మరో బృందాన్ని పంపడం అసాధ్యమైన కార్యం. మొత్తం మానవజాతి భవితవ్యం కొద్ది నిముషాల మీద ఆధారపడి వుంది.

    రెండు పక్కలనించి ఉపగ్రహాలు దగ్గరగా వచ్చాయి. అవి వాహనానికి తగిలినా లేదా ఒకదాన్నొకటి ఢీకొట్టుకున్నా ప్రమాదం సుహృద్భావ్ కే. కొన్ని వందల మైళ్ళ దూరంలో మరో ఆస్టరాయిడ్ అడ్డంగా వుంది. యశ్వంత్  మనసులోనే లెక్కవేశాడు. గుంపు దగ్గరగా వచ్చింది. నౌక ఒక్కసారిగా పైకి లేచి, క్షణంలో క్రింద రెండు ఉపగ్రహాలూ ఒకదానికొకటి కొట్టుకోవడం జరిగిపోయింది.

    ఆ విస్ఫోటనం వాళ్ళు కలలో కూడా ఊహించనంత భయంకరమైంది. రెండు నాపాం బాంబులు ఢీ కొన్నట్లు  వున్న ఆ శక్తికి చుట్టుపక్కల ఉపగ్రహాలన్నీ చెల్లాచెదరైపోయాయి. కొన్ని ముక్కలై అటు ఇటు ఎగరసాగాయి. తెరమీద ఆ దృశ్యం భయంకరంగా వుంది.

    "స్పీడు పెంచాలి" అరిచాడు నిఖిల్.

    "లాభం లేదు. మనం మేగ్జిమమ్ లో వెళుతున్నాం. ఇంత కంటే వెళితే జూపిటర్ ఆకర్షణలో పడిపోతాం" యశ్వంత్ అన్నాడు. అందరూ ఊపిరి బిగపట్టారు. ఆ నిశ్శబ్దంలోంచి, "మన  స్పీడ్ పెరుగుతుంది" అంది బ్రహ్మవిద్య. యశ్వంత్ ఆశ్చర్యంగా మీటరువైపు చూశాడు. నిజంగానే వేగం బాగా ఎక్కువయింది.

    "కింద ఢీ కొట్టుకున్న ఆ రెండు శక్తుల కైనెటిక్ ఎనర్జీ మన వాహనాన్ని పైకి ఎగరగొడుతోంది. దారిలో ఏ అడ్డూ లేకపోతే  బయటపడతాం. మనంతట మనం ఏం చెయ్యలేం-"

    తెరమీద ఏమీ కనిపించలేదు. వున్నట్లుండి సుహృద్భావ్ పక్క వొరిగింది. యశ్వంత్ వేళ్ళు కంప్యూటర్ కీ బోర్డుమీద చకచకా పనిచేస్తున్నాం. అందరూ బెల్ట్ లు తగిలించుకోండి" యశ్వంత్ గట్టిగా అరిచాడు. అంతలోనే ప్రమాదం జరిగిపోయింది.

    ఏం తగిలిందో తెలియలేదుగాని ఆ తాకిడికి వాహనం ఒక్కసారిగా కనిపించింది. కంట్రోలు వదిలేసి యశ్వంత్ దూరంగా ఎగిరిపడ్డాడు. నిఖిల్ కుర్చీని పట్టుకున్న వాడల్లా కింద కలాగే జారిపోయాడు కొద్దినిముషాలుపాటు ఆ కంపనం నౌకను కదిలించింది.

    కుర్చీల్లో కూర్చున్న ముగ్గురూ నిస్సహాయంగా పడున్న యశ్వంత్ నీ, నిఖిల్ నీ చూస్తుండడం తప్ప మరేం చెయ్యలేకపోయారు. కొద్ది నిముషాల తరువాత కంప్యూటర్ 'వాహనం' కంట్రోలును సరిచేసింది. వాయుపుత్ర పరుగున వచ్చి యశ్వంత్ తలను పైకెత్తాడు. రక్తం ధారగా కారుతోంది. నిఖిల్ పెద్దగా మూలుగుతున్నాడు. అతడి కాలు పానెల్ క్రింద యిరుక్కుపోయింది. ప్రధమ చికిత్సలో డాక్టరు ఫిలిప్స్ బిజీ అయిపోయాడు. ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా వాహనాన్ని కంట్రోల్ వదలిపెట్టకూడదు. వాయుపుత్ర వెంటనే కమాండర్ సీటులో కూర్చున్నాడు. రిచర్ స్కేలు మీద పది డిగ్రీలు చూపిస్తోంది. అంత అధృతమైన భూకంపంలాంటి ప్రమాదంనించి తప్పించుకోవటం అదృష్టమే. అతడు తెరవైపు చూశాడు. ఆస్టరాయిడ్ బెల్ట్ దాటి శూన్యంలోకి పరుగెడుతూంది సుహృద్భావ్. పక్కనే రక్తపు మడుగులో యశ్వంత్! యశ్వంత్ తల మీద గట్టిదెబ్బే తగిలింది. డాక్టర్ ఫిలిప్స్ తన రక్తాన్ని ఎక్కించవలసి వచ్చింది, నిఖిల్ కాలు మెలిక పడటంతో అతడు కదలలేని స్థితిలో వున్నాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra