Previous Page Next Page 
ఆనంద నిలయం పేజి 26


    అతడంటే చాలా జాలి కలిగింది జ్యోత్స్నకి....
    "మీకేం తక్కువయిందండీ! మంచి భార్య దొరుకుతుంది."
    జ్యోత్స్న మాటలకు అదొక రకంగా నవ్వాడు డాక్టరు.
    "సరేనండి - నా బేంక్ బేలన్స్ కి తగిన దాన్నే పెళ్ళి చేసుకుంటాను. మీరు మాత్రం నామీద కోపం ఉంచుకోకండి - వస్తాను."
    చేతులెత్తి గౌరవంతో జ్యోత్స్నకు నమస్కారం చేసి వెళ్ళిపోయాడు మచ్చల డాక్టర్.
                                     13
    పార్కులో జ్యోత్స్నని కలుసుకోవటం పూర్తిగా మానేశాడు.


    భాస్కర్. ఇంటిదగ్గిర సరేసరి! తల ఎత్తి చూడటానికయినా సాహసం కలగదు.
    భాస్కర్ ఎందుకు రావటంలేదు తనకోసం? తనను అపార్థం చేసుకుని అసహ్యించుకుంటున్నాడా? లేక తన మాటలకు మనసు గాయపడి దూరంలో ఉండాలని నిశ్చయించుకున్నాడా? తన జీవితంలో తనకు లభించిన కొద్దిపాటి ఆనందాన్ని చేజేతులా దూరం చేసుకున్నానా అని మధనపడింది జ్యోత్స్న.      
    బి.ఏ. పరీక్షలు దగ్గిరపడుతున్నాయి. ఎలాగైనా పరీక్ష పాసైతే, ఒక స్థిరమయిన ఉద్యోగంలో చేరే అవకాశం ఉంటుంది పట్టుదలగా చదవసాగింది. చదువు ధ్యాసలోపడి భాస్కర్ విషయంలో కొంతవరకు మరిచిపోగలిగింది.
    మొదటినుంచీ జ్యోత్స్న విధితో హోరాహరీ పోరాడి నిలదొక్కుకోవటానికి ప్రయత్నిస్తోనే ఉంది. జ్యోత్స్న విధిని ప్రతిఘటించాలని చూసినకొద్దీ, కసితో అన్నట్టు విధి జ్యోత్స్నని మరింత పరిహసిస్తోంది.
    జ్యోత్స్న పని చేస్తున్న షాపుయజమాని కొడుకు ఏదో పనిమీద షాప్ కి వచ్చాడు. జ్యోత్స్నని చూశాడు. వెంటనే ఏ మాత్రం సంకోచం లేకుండా జ్యోత్స్న దగ్గిరకు వచ్చి అదీ, ఇదీ మాట్లాడి, "సాయంత్రం సినిమాకు వస్తావా?" అని ఏకవచనంలో సంబోధించి జేబులోంచి వందరూపాయల నోటు తీసి అందించబోయాడు.
    ఇలాంటి సంఘటనలు జ్యోత్స్న జీవితంలో అతి మామూలు విషయాలయిపోయాయి. భయపడటమూ బాధపడటమూ, రెండూ మరిచిపోయింది. ఇలాంటి సంఘటనలు ఎదురయినపుడు వాటిని పెరగనీయకుండా బీజదశలోనే తుంచెయ్యటం జ్యోత్స్నకి అలవాటు. అప్పటిలాగే తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసింది. మధ్యలో మానేసినందుకు కోపగించుకుని షాపు యజమాని జీతం ఇవ్వలేదు.
    ఈ పరిస్థితుల్లో ఒక చిక్కులో పడింది జ్యోత్స్న. పరీక్ష ఫీజు కట్టాలి. ఆఖరితేదీ వారంరోజులే వుంది. ఫీజు కట్టకపోతే, చదివినదంతా వ్యర్థమయిపోతుంది. చేతిలో డబ్బులేదు. ఏం చెయ్యాలి? తను నోరువిప్పి అడిగితే ఎవరైనా ఇస్తారు, డబ్బు మాజీ తహసీల్దారు, మచ్చల డాక్టరు, అందరూ తనకు డబ్బు అప్పు ఇయ్యటానికి సిద్ధంగానే ఉంటారు. కానీ ఆ అప్పుకు తను చక్రవడ్డీ చెల్లించుకోవాలి. ఆ వడ్డీ డబ్బురూపంలో ఉండదు. వాళ్ళు కోరే పద్ధతిలో ఆ అప్పు తీర్చగలిగే శక్తి తనకు లేదు - అంచేత ఎవరినీ అడగలేకపోయింది.
    ఈ ఆపద సమయంలో భాస్కర్ చాలాసార్లు గుర్తుకు వచ్చాడు. కానీ, అతనితో మాట్లాడగలిగే ఉపాయమేముందీ? ఆలోచించగా, ఆలోచించగా, సుబ్బలక్ష్మి ఒక్కర్తే తనకు శరణ్యమనిపించింది. ఆ మూర్ఖురాలు ఏదీ అర్థం చేసుకోలేదు. ఆవిడ ద్వారా పని సాధించుకోవచ్చునేమో!
    ఆ రోజు సుబ్బలక్ష్మి వచ్చినప్పుడు "సుబ్బలక్ష్మి? నువ్వు నాకొక సహాయం చెయ్యాలి" అంది.


    "చెప్పండి. ఏమిటి?" హుషారుగా అడిగింది సుబ్బలక్ష్మి.
    "నేను పరీక్ష ఫీజు కట్టాలి. డబ్బులేదు."
    సుబ్బలక్ష్మి ముఖం పాలిపోయింది.
    "డబ్బా? డబ్బు నా దగ్గిరెక్కడిది? నా నెలజీతం మా అమ్మకి పంపేస్తాను. తిండి భాస్కర్ ఇంట్లో గడిచిపోతుంది."
    "పోనీ, ఎవరినైనా అప్పు అడగలేవూ?"
    "అప్పా? అప్పు నాకెవరిస్తారు? నన్ను చూస్తూనే చీదరించుకుంటారు. ఇంకా మీరడిగితేనే ఇస్తారు."      
    "భాస్కర్ గారిని అడిగి చూడగలవా!"
    సుబ్బలక్ష్మి కొంచెంసేపు ఆలోచించి "అలాగే అడుగుతాను. ఆయన మంచి ఆయన - ఇస్తే ఇవ్వవచ్చు" అంది.    
    జ్యోత్స్న కొంచెంసేపు తటపటాయించి "సుశీలగారు ఉండగా అడగవద్దు-" అంది.
    సుబ్బలక్ష్మి వెకిలిగా నవ్వి "నాకు తెలుసులెండి" అనేసింది. దగ్గరికీ, ఈ స్వామీజీ దగ్గరకూ వెళ్ళటం, విభూతులూ. తాయెత్తులూ తెచ్చుకోవటం - మొదలైనవి చూస్తోంది. పాపం డాక్టర్లు కుదర్చలేని రోగాన్ని, దేవుడైనా కుదర్చకపోతాడా అని ఆశపడుతోంది.
    అలా సుశీల ఎవరో స్వామీజీ దగ్గిరకు వెళ్ళిన సమయం చూసుకుని సుబ్బలక్ష్మి భాస్కర్ దగ్గరకు వచ్చి పైట సర్దుకుంటూ వెకిలిగా నవ్వుతూ "నాకు మీ సహాయం కావాలి!" అంది.
    సుబ్బలక్ష్మిని చూస్తేనే కంపరం భాస్కర్ కి. ముఖం చిట్లించి "ఏం కావాలి?" అన్నాడు.
    "నూట యాభై రూపాయలు కావాలి!"

 Previous Page Next Page