Home » Dr. dasaradhi rangacharya » Rigveda Samhitha - Part 1


    4. వ్యానవాయువు ప్రాణ అపానాది అయిదు స్థానముల విభక్తమయి నిలిచి ఉన్నది. ప్రాణ అపానాదులను మధించుట వలన సమస్త యజ్ఞగృహమున అగ్ని ప్రకాశించును. వీరుడగు రాజువద్దకు మిత్రుడగు రాజు దూతను పంపును. అట్లే భృగువువంటి యజమానులు అగ్నిని దేవతలవద్దకు దూతనుగా పంపుదురు.

    5. దేవతలు మహిమాన్వితులు. పాలకులు. యజమాని అట్టి దేవతలకు హవిస్సులు అందించును. అది చూచిన రక్కసులు మండుచున్న బాణములను ప్రయోగించును. ఉష అగ్నికి కూతురు అగును. తండ్రి కూతురుకు కాంతిని ఇచ్చినాడు.

    6. అగ్నిని తమ యజ్ఞగృహములందు ప్రజ్వలింపచేతురు. అగ్నికి నిత్యము నమస్కరింతురు. అగ్నీ! రెండు స్థలముల వర్ధిల్లు నీవు రథముమీదవచ్చి ఎవనిని అనుగ్రహింతువో వాడు అదృష్టవంతుడు.

    7. ఏడు నదులు సముద్రమును చేరినట్లు అన్నములు అన్నియు అగ్నిని చేరుచున్నవి. జ్ఞాతులతో కూడి భుజించుటకు మా అన్నము చాలుటలేదు. కావున అగ్నిదేవా ! దేవతల ధనము తెచ్చి మాకు అందించుము. దేవేషు ప్రతిమమ్ చికిత్వాన్ విదాః

    8. విశుద్ధము, దీప్తివంతము అయిన జఠరాగ్ని యజమానిలో వ్యాపించవలెను. ఆ అగ్నియే వీర్యరూపము ధరించి పుత్రోదయము కావించవలెను. బలవంతుడు దోషరహితుడు వయస్కుడు అయిన పుత్రుని కర్మలందు ప్రేరేపించవలెను.

    9. సూర్యుడు ఒక్కడు మాత్రమే మనోవేగమున సమస్త మార్గముల పయనించును. కావుననే సూర్యుడు ధనమును సాంతమును ఒక్కమారే గ్రహించును. ప్రకాశమానులు, శోభస్కర బాహువులుగల మిత్రావరుణులు గోవులను కాపాడవలెను. అమృతమువంటి పాలను కలిగించవలెను.

    10. అగ్నీ ! నీవు విద్వాంసుడవు. సర్వము నీముందు ఉన్నది. నీవు సర్వజ్ఞుడవు. నీవు నాకు తాతలనాటి స్నేహితుడవు. మన స్నేహము మరువకుము. అంతరిక్షమును సూర్యకిరణములు ఆవరించునట్లు వార్థక్యము నన్ను ఆవరించినది. బాధలపాలు చేయుచున్నది. అగ్నీ ! బాధలపాలుచేయు ముదిమిని నీవు ముందే కనుగొనుము. జరిమా మినాతి పురాతస్యా అభిశస్తే రధీహి

    ఆలోచనామృతము :

    1. అనేక సూత్రములు ఒకరు, ఇద్దరు దేవతలను స్మరించునవిగను, స్తుతించునవిగను ఉన్నవి. జీవన హేతువులయిన వారిని ఎన్నితీరులు ఎన్నిమారులు నుతించినను తక్కువే అగును.

    ఒక రాజు, వీరుడు వత్సరాజును గురించి అనేక కథలు, రచనలు ఉన్నవి. భారతదేశమును దాస్యవిముక్తము చేసిన మహాత్ముని గురించియు, నరులకు కరుణా వేదము ప్రవచించిన బుద్ధ భగవానుని గురించియు అనేక రచనలు, అనేక గాథలు ఉన్నవి.

    మానవజాతిని ఒక అంతస్తుకు పెంచిన వారిని ఎంత పొగడినను తక్కువే అగును.

    2. అగ్నిని ఇంద్రుని పలుసూత్రముల మంత్రముల స్తుతించుట, నుతించుట, ప్రార్థించుట, కీర్తించుట జరుగుచున్నది. అయినను ఒక్కొక్క మంత్రము నవ్యము, సుందరము, అంతరార్థ గర్భితము అయి ఉన్నది. మంత్రములన్నియు ఆశ్చర్యము, ప్రేరణ, స్ఫూర్తి, స్పందన కలిగించుచున్నవి. అయినను వివరించుటకు జ్ఞానము అవకాశము స్థలము కొరవడినవి.

    3. అంగిరసులకు అగ్నికి అవినాభావ సంబంధము ఉన్నట్లున్నది. అంగిరసులు అగ్ని సంభవులని చెప్పి ఉన్నాము. అగ్నిని దాని ఉపయోగములను అగ్ని తీరులను తొలిసారిగా కనుగొన్నవారును మానవాళికి మహోపకారము చేసినవారును అంగిరసులు అయినట్లు విదితము అగుచున్నది. అందుకే వేదము అంగిరసులను మనకు పితరులను చేసినది. పితరోవ

    4. ప్రాణములు అయిదు. ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము. ఇవి ఒకే ప్రాణమునకు అయిదు రూపములు. ఇవి అన్నియు అగ్నిరూపములే. వీటి కూడికవలననే జీవము నిలుచుచున్నది. అగ్నియే ప్రాణము అని ఎరుగుట వాటిని శాస్త్రీయముగా విభజించుట సామాన్య విషయముకాదు.

    5. అగ్నియే జఠరాగ్ని అగుచున్నది. అది అన్నమును జీర్ణముచేసి రక్తమును, వీర్యమును కలిగించుచున్నది. వీర్యమే సంతాన కారకము అగుచున్నది. అందువలన అగ్నియే సృష్టికారకుడు అగుచున్నాడు. పుత్రుడు అనవద్యం యువానం స్వాధ్యం కావలెననుట కన్న నేటికి చెప్పలేకపోయినాము.

    6. ముదిమిని గురించి ఎంత చక్కగా సూటిగా రమ్యముగా చెప్పినాడు ! ముదిమిని ముందే ఎరుగుమని అగ్నిని ప్రార్థించినది వేదము.

    ముదిమిని దూరముచేయు యత్నము ఆనాటి నుంచి సాగుచున్నది.

    7. ఉన్నవారి ధనము లేనివారికి ఇవ్వమన్నది వేదము.

        డెబ్బది రెండవ సూక్తము - ఋషి - శక్తిపుత్రుడు పరాశరుడు
               దేవత - అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్.

    1. అగ్ని నిత్యుడు. సర్వజ్ఞుడు. అతడు నరులకు కావలసిన ధనమును తనచేత ఉంచుకున్నాడు. బ్రహ్మ సంబంధమగు మంత్రములను గ్రహించినాడు. అటువంటి అగ్నిని అందరు ఆరాధింతురు. తనను ఆరాధించినవారికి అగ్ని బంగారమును ప్రసాదించును. అందువల్ల అగ్నిని మించిన ధనపతి లేడు.

    2. అగ్ని మాకు పుత్రునివలె ప్రియమయినవాడు. అతడు సర్వవర్తి. అయినను దేవతలు అగ్నిని కనుగొనలేక పోయినారు. వెదికి వేసారినారు. అగ్నిజాడ తెలిసికొనుటకు కాలినడకన సాగినారు. సుందరము, ఉన్నతము అయిన అగ్ని స్థలమును చేరుకున్నారు.

    3. పవిత్రులయిన మరుత్తులు మూడు సంవత్సరములు నేతితో అగ్నిని పూజించినారు. అగ్నీ ! అప్పుడు నీవు ఆవిర్భవించినావు. మరుత్తులు యజ్ఞార్హములయిన నామములను కనుగొన్నారు. అప్పుడు మరుత్తులు మరల పుట్టినారు. స్వర్గమునకు చేరినారు.

    4. ద్యావాపృథ్వులు విశాలములు. వాటియందు ఉన్న సమస్త దేవతలు రుద్రాగ్నిని స్తుతించినారు. మరుత్తులు ఇంద్రునితో కలిసి అగ్నిని కనుగొన్నారు.

    5. అగ్నీ ! దేవతలు నిన్ను గ్రహించినారు. నిన్ను చేరుచున్నారు. వారు నిన్ను తమ ఎదుట దర్శించినారు. నీవు కాళ్లు ముడుచుకొని కూర్చున్నావు. దేవతలు భార్యాసహితులయి నీకు నమస్కరించినారు. పూజించినారు. నిన్ను మిత్రుని చేసికొన్నారు. నీవు వారిని కాపాడినావు. దేవతలు తమ శరీరములను శుష్కింపచేసికొని నిన్ను గురించిన యాగములు చేయుచున్నారు.

    6. పాకయజ్ఞములు ఏడు + హవిర్యాగములు ఏడు + సోమయాగములు ఏడు మొత్తము ఇరువది ఒక్కటిని అగ్నిదేవా ! నీవే ధరించి ఉన్నావు. యజమానులు ఆ యాగములు చేయుచున్నారు. నిన్ను రక్షించుకొనుచున్నారు. నీవు వారి ఎడల సమానప్రీతి కనబరచుము. వారికిగల చరాచరములను రక్షింపుము.

    7. అగ్నీ ! యజమానులు అర్పించిన హవిస్సులను వహించినావు. దేవదూతవు అయినావు. ద్యావాపృథ్వి మధ్యమున ఉన్న అన్ని మార్గములు తెలిసియు అలసట లేనివాడవు. జనముల జీవనములకు అవసరము అయిన అన్నములను వృద్ధిపరచుము.

    8. సత్కార్యములు చేయు సప్తనదులు ద్యులోకము నుండి దిగినవి. భూలోకము ప్రవహించుచున్నవి. యజ్ఞమును తెలిసిన అంగిరసులు ధనము వచ్చు మార్గములను అగ్నీ ! నీవలననే ఎరిగినారు. మానవులు త్రావు గోవులపాలను నీవే ఇంద్రునకు అందించినావు.

    9. ఆదిత్యులు అమృతత్వము కొఱకు విఘ్నములేని యజ్ఞము చేసినారు. ఆదిత్యుల తల్లి పృథ్వి. తన పుత్రుల యజ్ఞము వలన పృథ్వి సర్వజగములను భరించు సమర్థురాలయినది. అగ్నీ ! నీవు ఆదిత్యులు సమర్పించిన చరు పురోడాశములను స్వీకరించినావు.

    10. ఈ యజ్ఞమునందు దర్భలు పరచుట మున్నగు సంపన్న యజ్ఞకార్యములను యజమానులు నిర్వహింతురు.అగ్నికి రెండు నేత్రములవంటి ఆజ్యాహుతులను అగ్నిలో వేసెదరు. అప్పుడు దేవతలు దిగివత్తురు. అగ్ని ప్రజ్వరిల్లును. అగ్ని జ్వాలలు నదులవలె దిశదిశల వ్యాపించును. అట్టి అగ్నిని దేవతలు తెలిసికొన్నారు.

        డెబ్బది మూడవ సూక్తము - ఋషి - పరాశరుడు, దేవత - అగ్ని,
                                    ఛందస్సు - త్రిష్టుప్.

    1. అగ్ని తండ్రి ధనమువలె అన్నమును ఇచ్చును. విద్వాంసునివలె సుఖకరమగు వెలుగును ఇచ్చును. అగ్ని అతిథివలె నిశ్చింతగా నిద్రించును. యజమాని గృహమును పురోహితునివలె వృద్ధిపొందించును.

    2. అగ్ని సూర్యునివలె ప్రకాశించును. యదార్థము గుర్తెరుగును. ప్రజలను సకల సంగ్రామముల దాటించును. ఎంతగానో స్తుతించబడిన అగ్నినిత్యుడు. అతడు ఆత్మవలె సుఖప్రదుడు, ధరింపదగినవాడు అగును.

    3. అగ్ని సూర్యునివలె సర్వము ధరించును. హితకరులగు మిత్రులు ఉన్న రాజువలె ప్రీతిని కలిగించును. అగ్ని ఎదుట కూర్చున్న యజమాని, ఋత్విజుడు పితాపుత్రులవలె ఉన్నచో అక్కడి అగ్ని భర్త ఉన్న భార్యవలె పవిత్రుడయి ఉండును.

    4. అగ్నీ ! నిన్ను యజమానులు గ్రామములందును, యజ్ఞగృహములందును ప్రజ్వరిల్లసేతురు. పూజింతురు. బహువిధముల హవిస్సులు అర్పింతురు. అగ్నీ ! నీవు అన్ని అన్నములు కలవాడవు అగుము. సర్వధనములను ధరింపుము.

    5. అగ్నీ ! యజమానులకు అన్న సమృద్ధి కలిగించుము. నిన్ను స్తుతించి హవిస్సులు అర్పించు విద్వాంసులకు సంపూర్ణ ఆయువు కలిగింపుము. యుద్ధములందు మేము శత్రు సంపదను పొందునట్లు చేయుము. దేవతలకు హవిస్సులు అర్పించి మేము కీర్తిమంతులము కావలెను.

    6. దేవయజన స్థానములను కోరునట్టి మంచిపొదుగు, తేజస్సుగల గోవులు పాలను ఇచ్చును. అట్లే కోరునట్టి నదులు దయా స్వభావము కలిగి పర్వతముల నుండి ప్రవహించును.

    7. అగ్నీ ! యజ్ఞార్హులయిన దేవతలు అందరు నీ అనుగ్రహమును కోరుచున్నారు. ద్యులోకమునందు ఉన్న నీకు హవిస్సులు అందించుచున్నారు. దేవతలు రాత్రికి నలుపు రంగును, ఉషస్సుకు ఎరుపురంగును కల్పించినారు.

    8. అగ్నీ ! మేము నరులము. నీవు మమ్ము ధనార్జనకు ప్రోత్సహించుచున్నావు. మేము ధనవంతులము కావలెను. నీవు ముల్లోకముల నిండి ఉన్నావు. కాపాడుచున్నావు.

    9. అగ్నీ ! మాకు రక్షణ కల్పింపుము. మా అశ్వములతో శత్రు అశ్వములను, మా భటులచే శత్రుభటులను, మా వీరులచే శత్రువీరులను వధింతుము. మా కొడుకులు పైతృక ధనములను పొందవలెను. వారలు విద్యావంతులు కావలెను. నూరు హేమంతములు జీవించవలెను. శత హిమానో అశ్యుః

    10. అగ్నీ ! నీవు మేధావంతుడవు. ఇపుడు మేము చేసిన స్తుతులు నీ మనసునకు హృదయమునకు ప్రియములు కావలెను. నీవు అందించిన హవిస్సులను దేవతలకు ఇచ్చుటకును, ధనమును సదుపయోగము చేయుటకు శక్తులము కావలెను.

                         (ప్రథమ మండలమున పన్నెండవ అనువాకము సమాప్తము.)

                    పదమూడవ అనువాకము - డెబ్బది నాలుగవ సూక్తము
            ఋషి - రహోగణపుత్రుడు గౌతముడు, దేవత - అగ్ని, ఛందస్సు - గాయత్రి.


    1. మేము హింసాదోషములేని అధ్వరమును నిర్వహించుచున్నాము. దూరమునుండి వినుచున్న అగ్ని కొఱకు మంత్రములు పఠించుచున్నాము.

    2. యజమానికి శత్రువులు ఉన్నారు. వారు అతనిని చంపదలచినారు. కుట్రపన్నుచున్నారు. అయినను అగ్ని యజమానికి ధనము వర్షించుచున్నాడు. అట్టి అగ్నికొఱకు మంత్రములు పఠింతుము.

    3. నీటిని పట్టి పెట్టిన వృత్రుని వధించినవాడును ప్రతి యుద్ధమునందును ధనము సంపాదించిన అగ్ని ఆవిర్భవించినాడు. తదుపరి పుట్టిన జంతువులన్నియు అగ్నిని స్తుతించుచున్నవి.

    4. అగ్నీ ! నీవు యజమాని ఇంట దేవదూతవు అయినావు. హవ్యమును కొనిపోవు దేవదూతవు అయినావు. యజమాని అధ్వరమును చూడదగిన దానిని చేసినావు.

    5. అగ్నీ ! నీవు బలమున జనించినావు. యజమానిని శోభన హవిస్సులు, శోభన దేవతలు, శోభన యజ్ఞములు కలవానిగా చేయుము.   

    6. అగ్నీ ! నీవు ఆహ్లాదకరుడవు. మేము స్తుతించుటకుగాను యజ్ఞస్థలమునకు దేవతలను కొనిరమ్ము. వారికి హవ్యములను అందించుము.

    7. అగ్నీ ! నీవు దూత్యము జరిపిన నాటినుండి నీ రథపు వేగము పెరిగినది. అందువలన రథపు ధ్వని వినిపించుటలేదు.

    8. అగ్నీ ! అంతకుముందు దిక్కులేనివాడు నిన్ను పూజించినాడు. నీవు అనుగ్రహించినావు. అతడు అన్నము కలిగి ప్రతిష్ఠావంతుడు అయినాడు.

    9. అగ్నీ ! దేవతలకు హవిస్సు ఇచ్చువారికి ప్రశస్త బలము దీప్తవంతమయిన ధనమును ఇచ్చుచున్నావు.

        డెబ్బది అయిదవ సూక్తము - ఋషి - రహోగణపుత్రుడు గౌతముడు
                      దేవత - అగ్ని, ఛందస్సు - గాయత్రి.


    1. అగ్నీ ! మేము నీకు హవ్యములు అర్పించుచున్నాము. నీకు ప్రీతి కలిగించు స్తుతులు చేయుచున్నాము. వానిని నీవు స్వయముగా స్వీకరింపుము.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra