Home » Vasireddy seeta devi novels » నిశాగీతం

    ఎవరు త్రవ్వారు?
    ఎందుకు  త్రవ్వారు?
    జ్యూయల్ బాక్స్!
    నగల పెట్టె!
    మస్తిష్కంలొ ఈ మెరుపు లేమిటి?
    నగల పెట్టెను పాతిపెట్టడం తను చూశాడు.
    అవును! తను చూశాడు.
    ఒడ్డున నిలబడి తను గోతిలోకి వంగి చూశాడు. పెట్టె గోతిలో అడుగున పెట్టి__పైనొచ్చాడాయన!
    పారతో మట్టిలాగి గోతిలో పోస్తున్నాడు.
    తనుకూడా రెండుచేతులతో ఈ మట్టిని గోతిలోకి తోశాడు.
    గొయ్యి నిండిపోయింది. దానిమీద నిలబడి కాళ్ళతో తొక్కుతూ మట్టిని చదును చేశాడాయన. తనుకూడా  మట్టిమీద  నిలబడ్డాడు. కాళ్ళు మట్టిలోక కూరుకుపోయినై. అంతా తమాషాగా ఉంది. కాళ్ళు ఎత్తి వేస్తూంటే మట్టితోందిగిపోతూ- పైకి వస్తూ  తమాషాగా ఉంది. ఇలాగే  వుంది.
    అప్రయత్నం గానే మట్టిమీద నిలబడి తొక్కుతున్నాడు ఉదయ్  సరిగ్గా ఇదే అనుభూతి. చిన్నపిల్లవాడిలా మట్టి కప్పివున్న గోతిమీద గంతులు వేస్తున్నాడు.
    "రా! బాబూ! వెళ్దాం" తన చెయ్యిపట్టుకొని మట్టిమీది నుంచి ఆయన నడిపించుకుపోతున్నాడు.
    ఆ గొంతు ఎవరిది?
    ఆ పిలు పెవరిది?
    ఆయన ఎవరు?
    తల తిరిగిపోతున్నది. కళ్ళు మండిపోతున్నాయి. చెవులు దిబ్బెళ్ళు పడిపోతున్నాయి. కణతలమీద నరాల చప్పుడు వినిపిస్తూంది.
    అగ్ని పర్వతం బద్దలైంది.
    పొగలు సెగలు  కక్కుతూ ప్రవహిస్తోంది! లోయల్లోకి వచ్చిపడి మెల్లమెల్లగా జారి ఆరి చల్లబడిపోతుంది లావా.
    "నాన్నా!"
    ఉదయ్ కంఠం చెట్లుదాటి, పుట్టదాటి, తోటదాటి బంగళాలూ ప్రతి ధ్వనించింది.
    హఠాత్తుగా బంగళాలోంచి పెట్రమాక్సు వెలుగు బయటకివచ్చింది. లైటుపట్టుకొని బయటికి వచ్చింది ఓ మానవాకారం  ఆ కారం వెనకే మరో రెండు ఆకారాలు.
    మనుష్యులు స్పష్టంగా కన్పించకపోయినప్పటికీ లైటు పట్టుకొన్నది వీరభద్రుడనీ, అతడి వెనుక వస్తున్నది శివరామయ్య, అడివయ్యో బుచ్చిబాబో అయివుంటాడని ఊహించాడు ఉదయ్ చంద్ర.
    దిగిపోతున్న మట్టిలొనుంచి బయటికి వచ్చాడు. గట్టి నేలమీదఆడుగులు వేగంగా పడుతున్నాయి. పనసచెట్టు  దాటి ముందకు  వేగంగా నడిచాడు. నడుస్తూ మిగతా పనసచెట్లకింద కూడా గోతులు తవ్వి మళ్ళీపూడ్చినట్టు గమనించాడు.
    ఈ తొమ్మిది పనసచెట్లు క్రిందా తవ్వారన్నమాట!
    అంటే మొదటి  చెట్టుకింద నగలపెట్టె  దొరకలేదన్నమాట! అన్ని చెట్లక్రిందా తవ్వి చూశారు. చివరి చెట్టుకింద దొరికివుండాలి జ్యూయాల్ బాక్స్.
    అన్ని పనసచెట్లకిందా ఒకేసారి తవ్వారేమో! ఏదో ఒక చెట్టు కింద...
    మామిటి తోపులో వెలుగుపడ్తోంది.
    మరో పదినిముషాల్లో బావి దగ్గరకు.....ఆ తర్వాత రెండు నిముషాల్లో వాళ్ళు పనసచెట్ల దగ్గరకు రావచ్చు.
    ఒక్క దూకులో అరటి తోటలోకి వచ్చాడు ఉదయ్.
    దట్టంగా చిక్కగావున్న అరటి తోటలోకి వచ్చాడు ఉదయ్. వాళ్ళు గమనించలేరు. నిశ్చంతగా  అరటితోటలోకి వచ్చాడు ఉదయ్. వాళ్ళు గమనించలేరు. నిశ్చంతగా అరటితోదాటి కంది చేలోకివచ్చి పడొచ్చు. కందిచేలొనుంచి ఐదు నిముషాల్లో రోడ్డెక్కి కారును చేరుకోవచ్చు.
    ఉదయ్ అరటితోట దాటి  వచ్చేసరికి తోటలో బావిదగ్గర వెలుతురు కన్పించింది.
    బావి ఒడ్డున పెట్రోమాక్స్ లైట్ పెట్టి  ముగ్గురూ తలోవైపు వెదుకుతూ కన్పించారు.
    పొడవాటి వాళ్ళ నీడలు చాలా దూరంవరకూ పడుతున్నాయి.
    ఒకనీడ అరటితోటవైపుకు కదిలివస్తోంది.
    ఉదయ్ కందిచేనుకు అడ్డంపడి పరుగుతీసి రోడ్డెక్కాడు. రోడ్డుమలుపుతిరిగి కారుదగ్గరకొచ్చాడు.
    కారులైట్లు వెయ్యకుండానే చీకట్లో కారును శరవేగంతో నడుపుతూ సాగిపోయాడు.
    కారులైట్లు వెలుగు వాళ్ళకు కన్పించే అవకాశం లేదని భావించాక, హెడ్ లైట్ల స్విచ్ ఆం చేసి  ఊపిరి పీల్చుకున్నాడు ఉదయ్.
    మెదడంతా మంచుగడ్డలా  వుంది. స్తబ్ధుగా వుంది. ఏమీ ఆలోచించే స్థితిలో కూడాలేదు. కొండచిలువలా ముందుకు సాగిపోతున్న రోడ్డుమీద దృష్టిని కేంద్రీకరించి కారునడుపుతూ పోతున్నాడు.
    అలా ఓ గంటన్నరపాటు యంత్రచోదిత రోబట్ లాగా స్టీరింగ్ ముందు కూర్చొని కారు  నడుపుతున్నాడు.
    తెలతెలవారుతోంది.
    తూర్పుదిక్కు అరుణరాగ రంజితమౌతూవుంటే, అంతవరకూ దేదీప్యమానంగా వెలుగుతూన్న హెట్ లైట్సు కాంతివెలవెల  పోతూంది.
    రోడ్డుపక్కన వున్న చెట్లమీదనుంచి పక్షులు గుంపులు గుంపులుగా లేస్తున్నాయి.
    రోడ్డుకూడలి వద్ద పాలకాన్స్ తో నిలబడివున్న  వాళ్ళు కన్పించారు.
    మరికొంతమంది సైకిళ్ళకు క్యాన్స్ తగిలించుకొని తొక్కుకుంటూపోతున్నారు.
    అడ్డరోడ్డు దగ్గిర అప్పుడే  తెరిచిన టీ కొట్టు దగ్గరగా వచ్చి కారుఆపాడు ఉదయ్.
    కుండలొవున్న చల్లటి నీళ్ళు డబ్బాతో తీసుకొని ముఖంమీద చల్లుకొన్నాడు. ఆ నీళ్ళు  నోట్లో పోసుకోవాలంటే మనస్కరించలేదు. టీకొట్టువాడ్ని అడిగి గ్లాసు  మంచినీళ్ళు అడిగితీసుకొని పుక్కిలించి ఉమ్మాడు. సూట్ కేసులోనుంచి టవర్ తీసి ముఖం  తుడుచుకొన్నాడు.
    "సార్ బన్ బట్టర్ ఇవ్వమంటారా? బ్రెడ్ బిస్కెట్ ఇవ్వమంటారా?" కౌంటర్లో నుంచి దిగి కుర్రవాడు అడిగాడు.
    ఉదయ్ ముఖం అదోలా పెట్టి చూసాడు.
    "ఇడ్లీ రొట్టె  కావాలంటే ఓ పావుగంట ఆగాలి."
    "అవేమి వద్దు. మంచి కాఫీచేసి ఇస్తే చాలు."
    "ఇన్ స్టంట్  కాఫీ ఇవ్వమంటారా సార్."
    "ఇవ్వు గ్లాసు  శుభ్రంగా కడుగు."
    టీకొట్టు కుర్రాడు కాఫీ కలిపి తెచ్చాడు. సగం తాగి గ్లాసు బల్ల మీద పెట్టి లేచాడు. పర్సులొనుంచి పదిరూపాయలనోటు తీసి బల్లమీద వుంచాడు.
    "చిల్లరలేదండీ. రాత్రి అమ్మకం తాలూకు చిల్లర ఓనరు పట్టుకెళ్ళాడు." తలగోక్కుంటూ చెప్పాడు టీకొట్టు కుర్రాడు.
    "అయితే ఉంచుకో!" ఉదయ్   కారుదగ్గిరకు నడిచాడు.
    "సార్! సార్!" అంటూ  కుర్రాడు నోటు పట్టుకొని కారు దగ్గరి కొచ్చాడు.
    "పర్లేదు వుంచు. నేను  మళ్ళీ  ఇటు వచ్చినప్పుడు ఇద్దువులే" ఉదయ్ కారు స్టార్ట్  చేశాడు.
    కారు వేగాన్ని పుంజుకొన్నది.
    తెల్లటి సూర్యకిరణాలు ముఖాన్ని తాకుతూవుంటే వింతఅనుభవం కలుగుతూంది.
    నిద్రాణమైణవున్న జీవశక్తులు మేల్కొంటున్నట్టుగా ఉంది పచ్చటి చేలమీద నుంచి తెరలుతెరలుగా వీస్తున్నా పైరుగాలి ఒంటిని తాకుతూవుంటే హాయిగా వుంది!
    అంతవరకూ స్థంభించిపోయినట్టుగా వుంది. పీడకలనుంచి బయట పడ్డట్టుగా ఉంది.
    మళ్ళీ తను ఇటు వస్తాడా? 
    తన మాట ఆ కుర్రాడు నమ్మాడా?
    తను తిరిగికుండా వుంటేనే....
    తను తిరిగిరాడా?
    రావల్సిన అవసరంలేదా?
    వస్తే.....చిల్లరకోసమే వస్తాడా?
    "అప్రయత్నంగా అతడి పెదవులమీద చిఒరునవ్వు రేఖ  కదిలింది.
    అవును! తను తప్పకుండావస్తాడు. మళ్ళీ వస్తాడు మళ్ళీమళ్ళీ వస్తాడు.
    ఆ తోట ఆ బంగళా___ఆ  మనుషులూ అన్నింటినీ....అందర్నీ  చూడాలి. వాస్తవంలొ చూడాలి. ఇంతవరకూ తను చూసినదంతా ఓ పీడకలలాగే చూశాడు. ఈసారి అలాకాదు. అన్నీ.....అందర్నీ....స్పష్టంగా చూడాలి.
    ఎందుకూ?
    ఏం జరిగిందని?
    తనకూ వాళ్ళకూ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఒక డాక్టరుకూ, పేషెంటుకూ వుండే సంబంధంకంటే ప్రత్యేక సంబంధంఏమున్నది?
    మానసి చికిత్సకోసం తన దగ్గిరకు  వచ్చింది. ఆమె తండ్రిగా శివరామయ్య వచ్చాడు. తను చికిత్స మొదలుపెట్టాడు. ఆమె వ్యాధికి మూల కారణమేదో తెలుసుకోనే ప్రయత్నంలోనే తను ఈ ఊరు వచ్చాడు. ఈ తోటలో ఈ బంగళాలొ కాలు పెట్టాడు.
    క్షీణించిపోతున్న ఆ తోటా, శిధిలమైపోతూన్న ఆ బంగళా, విచిత్రమైన మనస్తత్వలతో అక్కడ సంచరిస్తున్న ఆ మనుషులూ.....మానసీ, శివరామయ్య, బుచ్చిబాబూ, వీరభద్రుడూ, అడివయ్యా.....భీభాత్డ భయానకమైన ఆ వాతావరణమూ, అభూతకల్పనలూ, అనూహ్యమైన సంఘటనలూ, భూతాలూ, దయ్యాలూ, కొరివిదయ్యాలూ, నిప్పులు కురిసే ఆ కళ్ళూ, చెక్కమెట్లూ, విరిగిపోయే  ఆ పదమూడోమెట్టూ, భూగృహాలూ....రహస్యమార్గాలూ.....ఎర్రగులాబి, బుచ్చిబాబు, మానసీ! అడివయ్యా,
    కొరివి దయ్యాలూ, బావీ.....ఆ బావి ఒడ్డున  తనూ, బావిలోకి నెట్టబడిన తనూ, మెట్లమీదనుంచి క్రిందపడ్డ తనూ, తనమీదకు లంఘించైనా ఆ భయంకర ఆకారం. తలమీద తగిలిన దెబ్బ.....
    సెల్లార్ లొ బంధించబడిన  తనూ, పనసచెట్టుకింద తనూ, పసివాడిళా భయంతో 'నాన్నా' అంటూ అరిచిన తనూ  ఆ వ్యక్తిత్వం, ఆ పర్సనాలిటీ, తననే ప్రశ్నిస్తూన్న ఆదోచైతన్యంతో తనలో మళ్ళీ అంతర్లీనమై తనలో భాగమై__
    తనలో భాగమయి, తనతో కలిసిపోవాలని ప్రయత్నిస్తూ ఆదోచైతన్యమూర్తిని, మస్తిష్క కవాకూలుతెరిచి, ఆదోచైతన్యం ఇనుపతెరలును ఎత్తి, హృదయగవాక్షాలను తెరిచి, మనసారా ఆహ్వానించి తనలో అంతర్లీనం చేసుకొన్నా డాక్టర్ ఉదయ్ చంద్ర కు మరోజన్మ ఎత్తినట్టు ఉంది.
    బుర్రను చుట్టేసిన కారుమబ్బులు విడిపోయాయి.
    మనసును ఆవరించిణ కటికచీకట్లు తొలగిపోయాయి.
    మళ్ళీ  తనుతానై, ఎన్నో ఏళ్ళగా బంధించబడి అణగారి కుములుతున్న  చైతన్యస్రవంతి జలపాతంలా ప్రవహిస్తూ, అతడ్ని భావనాపరం పరలలొ ముంచెత్తుతోంది.
    తార్కికంగా ఆలోచించగల స్థాయికి చేరుకున్న మస్తిష్కం, కాలం అనే దారంలో గతంలో జరిగిన సంఘటనలను పూసలుగా  గుచ్చినట్టు స్పష్టంగా చూస్తోంది.
    ఎదురుగా వస్తోన్న లారీని తప్పించుకొనే ప్రయత్నంలొ యాక్సి లేటర్ మీద వున్నకాలు తీసి బ్రేక్  మీద నొక్కాడు.
    కారు వేగం తగ్గింది.
    ఉదయ్ భారంగా  నిట్టూర్పు విడిచాడు.
    అంతర్వాహినిలా సాగుతున్న అతని ఆలోచనలకు బ్రేకు పడింది.
    ఎనిమిది గంటల ఇరవైనిముషాలకు కారు ప్రశాంత నర్సింగ్ హొమ్ గేటుముందుకొచ్చి ఆగింది. వాచ్ మాన సెల్యూట్ కొట్టి గేటు తెరిచాడు.
    కారు దిగి లోపలకు వస్తున్న ఉదయచంద్రకు స్టాఫ్ నర్సు  ఎదురయింది.
    "గుడ్ మార్నింగ్ డాక్టర్" అంటూ ఉదయ్ ను చూసి నోరు తెరిచి అలాగే నిలబడిపోయింది.
    "గుడ్ మార్నింగ్ సిస్టర్!" అని ఆమెకేసి  ఆశ్చర్యంగా చూస్తూ వాటీజ్  ద మాటర్ సిస్టర్? ఎనీథింగ్ రాంగ్? ఏమైంది? ఎనీ ప్రాబ్లం?" ఆదుర్దాగా అడిగాడు.
    "నర్సింగ్ హొమ్ లొ అంతా బాగానేవుంది. నథింగ్ టు వర్రీ!"
    "మరి?"
    "మీరే! ఏమిటి అలా ఉన్నారు?" బాధను ఆమె ముఖంలో స్పష్టంగా చూశాడు ఉదయ్.
    "నేనా? నేను ఎలా వున్నాను సిస్టర్?"
    "ఓ మైగాడ్! ఎన్నో రోజులుగా నిద్రాహారాలు లేని మనిషెళా వుంటాడో అలా వున్నారు. కళ్ళచుట్టూ నల్లటి వలయాలూ, కనుపాపల  మీదకు వాలిపోతూ బరువుగా రెప్పలూ, పాలిపోయిన చెక్కిళ్ళూ చూస్తూంటే...."
    "ఊఁ చూస్తూంటే...."
    "మీరు....మీరు డాక్టర్  ఉదయ్ చంద్రేనా అనిపిస్తోంది డాక్టర్  గారూ, ఏమైంది? ఇన్నిరోజులున్నారేం? డాక్టర్ రావ్  చాలా వర్రీ అయిపోతున్నారు. మన పేషెంట్సుకు ఆయనమీద బొత్తిగా భయంగానీ, విశ్వాసంగానీ లేవు. చాలా ఏడిపిస్తున్నారు ఆయన్ని. ఎదురు తిరుగుతున్నారు. ఆటలు పట్టిస్తున్నారు. అయినా, పాపం ఆయన, చాలా ఓపిగ్గా వాళ్ళను చూస్తున్నారు. ఇంతకీ మీరు  చెప్పనేలేదు. ఏమైందక్కడ? మానసి బాగా ట్రబుల్ ఇచ్చిందా?" ఉదయ్ కళ్ళల్లో ఏదో  వెతకడానికి ప్రయత్నించింది సిస్టర్ విజయకుమారి.
    "నో!నో!అలాంటిదేమీలేదు సిస్టర్  మానసి బాగానే....."
    "ఐ డోంట్ బిలీవిట్. మానసి విషయం  నాకు మొదటినుంచీ అనుమానంగానే వుంది. ఆవిడది సగం నాటకం."
    "ఎందుకలా  అనుకుంటున్నావ్?"
    "ఆవిడప్రవర్తన చూస్తుంటే నాకలా అన్పించేది. మిమ్మల్ని ట్రావ్ చెయ్యాలని....."
    "అదేమిటి సిస్టర్ ? నన్ను ట్రాప్ చెయ్యడమా? అంటే?" ఆశ్చర్యంగా చూస్తూ దృఢంగా అడిగాడు.
    "ఆవిడకు  మీరంటే ఇష్టం. మిమ్మల్ని ఎలాగయినా?" ఆగింది సిస్టర్.
    "ఊఁ చెప్పు సిస్టర్__ఎలాగైనా ?ఆగావేం చెప్పు"
    "నన్నేం చెప్పమంటారు డాక్టర్. మీకు మాత్రం తెలియదా ఏం?" సిగ్గుపడిపోయింది సిస్టర్.
    "యూ ఆర్ రైట్ సిస్టర్ . మానసి నన్ను ట్రాప్ చేసింది."
    సిస్టర్ చివాల్న తలెత్తి చూసింది.
    "నాకు మొదటినుంచీ అనుమానంగానే వుంది? ఆమె ప్రవర్తన చూస్తుంటే  మిమ్మల్ని ఎలాగైనా వలలో  వేసుకోవాలనే ఈ పిచ్చి నాటకం ఆడింది" సిస్టర్ అసూయగా అన్నది.
    "వాట్  డుయూ మీన్?"
    "మీరే అన్నారుగా మానసి మిమ్మల్ని ట్రాప్ చేసిందని. ఇంతకు పెళ్ళెప్పుడూ?"
    "పెళ్ళా?" పకపక విరగబడి  నవ్వాడు ఉదయ్.
    "డాక్టర్ మీరామె వలలో పడిపోయారనుకొన్నాను" పెద్దనిట్టూర్పు విడిచింది.
    "వలలో పడ్డమాట వాస్తవమే  కానీ...." ఆమె కళ్ళల్లోకి చూశాడు.
    విజయకుమారి చెక్కిళ్ళు ఎరుపెక్కాయి.
    "అయితే అందరు మగాళ్ళలాగే...."
    "నో!నో! సిస్టర్ మా ఇద్దరి మధ్యా అలాంటిదేమీ జరగలేదు. అవును. మానసి నన్ను ట్రాప్ చేసింది. అయితే ఆమె నన్ను మోహించో ప్రేమించో ఆ పని చెయ్యలేదు."     

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra