Home » Mucherla rajani sakuntala » గెస్ట్ హౌస్

ఓ మూలకు తాళపత్ర గ్రంథాలున్నాయి. ప్రొఫెసర్ పరమహంస, సీరియస్ గా అన్ని పుస్తకాలను పరిశీలిస్తున్నాడు.
రెండ్రోజులుగా అతను ఈ పనిలోనే వున్నాడు. మధ్య మధ్య తరళ టీ తెచ్చి ఇస్తూ వుంది.
పుస్తకాల గుట్టమధ్య ఉన్నట్టున్నాడు పరమహంస. అతను చాలా ఆందోళనగా వున్నాడు.

                                       * * *
తరళ తాళపత్ర గ్రంథాలు ముందేసుకుని కూచుంది.
పురాతన కాలం నాటి తాళపత్ర గ్రంధాలవి.
పరమహంస అతి కష్టంతో సేకరించాడు.
తరళ సింగపూర్ లో చాలా భాషలు నేర్చుకుంది. సంస్కృతంలో కూడా ఆమెకు పరిచయం వుంది.
ఆ తాళపత్ర గ్రంధాలను క్షుణ్ణంగా చూస్తూ వుంది.
టైమే తెలియటంలేదు.
మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు.
చిత్రావతి రహస్యం తెలుసుకోవాలనే ఆమె పట్టుదల. చిత్రావతి రహస్యం తెలిస్తే గెస్ట్ హౌస్ మిస్టరీ వీడిపోతుంది.
గెస్ట్ హౌస్ మిస్టరీ విడిపోతే పీటర్సన్ ఇండియాకు రావడంలో ఆంతర్యం అర్ధమవుతోంది. తన ధ్యేయం అది కాకపోయినా పీటర్సన్ ను చంపడానికి ఇదీ ఒక మార్గమే అనుకుంది తరళ.
తాళపత్ర గ్రంథాల్లోని విషయాలు అస్పష్టంగా వున్నాయి. కొన్ని సంస్కృతానికి సంబంధించినవే, మరికొన్ని అప్పటి ఆచార వ్యవహారాలు, రాజుల గొప్పతనాలకు సంబంధించినవే.
ఓ ప్రక్క విసుగ్గా కూడా వుంది తరళకు. అయినా విసుగును పైకి రానివ్వకుండా ఓపిగ్గా చూస్తూనే వుంది.
టైం అలా గడిచిపోతూనే వుంది. అక్కడ పరమహంస కానీ, ఇక్కడ తరళ కానీ ఏ మాత్రం ప్రోగ్రెస్ సాధించలేదు.
పరమహంస ఆవులిస్తూ లేచాడు.
అతనికి నిద్ర ముంచుకొని వస్తోంది.

                                       * * *                 
"ఏమైంది అంకుల్...లాభం లేదా?" అడిగింది తరళ పరమహంసను.
"అన్ని పుస్తకాలూ చూసాను. ఎక్కడా మనకు కావలసిన ఇన్ ఫర్మేషన్ దొరకలేదు. దొరుకుతుందన్న నమ్మకంకూడా లేదు. గుడ్డిగా ఆ నచికేతను ఫాలో అవ్వాల్సిందే..." చెప్పాడు పరమహంస.
"అంతేనా అంకుల్?" పెదవి విరిచి అడిగింది తరళ.
"చూద్దాం...రేపటివరకూ టైం వుందిగా?" అన్నాడు పరమహంస.
"యస్సెస్..." అంటూ లేచింది తరళ.
సరిగ్గా అప్పుడు పడిందామె దృష్టి ఆ గదిలో ఓ మూలన పడివున్న తాళపత్ర గ్రంథమ్మీద. ఉదయం తాళ పత్ర గ్రంథాలన్నీ తీసుకువస్తుంటే జారి పడినట్టుంది.
తరళ వెళ్లి ఆ గ్రంథాన్ని చూసింది. దానిమీద వున్న భాష అర్ధం కావడంలేదు.
వెంటనే పరమహంసకు ఇచ్చింది. పరమహంస కళ్లజోడు పెట్టుకుని చూశాడు.
ఆ అక్షరాలు అతనికే అర్ధం కావడంలేదు.
"ఇదేం భాష అంకుల్...ఎక్కడా చూసినట్టు లేదు" అంది తరళ.
"నేనూ అదే అనుకుంటున్నాను..." అంటూ మరోసారి పరిశీలనగా చూడసాగేడు.
"ఇది మీకు ఎక్కడ దొరికింది అంకుల్" అడిగింది. దానివంక చూస్తూ...
"గుర్తు లేదమ్మా...బహుశా ఇరవయ్యేళ్ల క్రితం దీన్ని సింగపూర్ లోనే కొన్నట్టు గుర్తు...
"ఇరవయ్యేళ్ల క్రిందటా?"
"సరిగ్గా గుర్తు లేదమ్మా...అప్పట్లో తాళపత్ర గ్రంథాలు విపరీతంగా సేకరించాను...నాకు తెలిసిన, నాకు అర్ధంకాని భాష ఉన్న తాళపత్రం గ్రంథం ఇది...అప్పట్లో దీన్ని చాలామందికి చూపించాను కూడా...బహుశా ఇది భాష కూడా కాదనుకుంటా...సంజ్ఞల ద్వారా ఏమైనా వివరాలు ఇచ్చారేమో..." అన్నాడు మరోసారి పరిశీలనగా ఆ గ్రంథం వైపు చూస్తూ...
అది హిబ్రో అన్న మంత్రగాళ్ల తెగకు సంబంధించిన భాష అని...ఆ తాళపత్ర గ్రంథంలో బిత్రోచి గురించి ఉందన్న విషయం వాళ్లకు తెలియదు.
తాళపత్ర గ్రంథం వయస్సు నూట యాభై సంవత్సరాలు...సరిగ్గా బిత్రోచి నిద్రలేచిందీ అప్పుడే...
   
                                   * * *
రాబర్ట్ పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు.
నచికేత ఇంటినుంచి సరాసరి హోటల్ రూమ్ కు వచ్చాడు.
అర్ధరాత్రి పన్నెండు అవుతుండగా...
పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు...
వాకర్ శవంలోని క్షుద్రశక్తులను నిర్వీర్యం చేసాక అతనికి ఎన్నో అనుమానాలు కలిగాయి...
నచికేతను, అతని స్నేహితులను ఎందుకు ఆవహింపజేసే ప్రయత్నం జరిగింది? ఆ ప్రయత్నం ఎవరు చేసారు? ఈ ప్రశ్నలను అన్వేషిస్తూనే రాబర్ట్ సుసిరియోని తలచుకొని తనకు ఈ ప్రయత్నంలో సహకరించాల్సిందిగా...దిశైవను ప్రార్ధించడానికి సిద్దమయ్యాడు. సరిగ్గా అదే సమయంలో రాబర్ట్ ని అతిక్రూరమైన క్షుద్ర తంతుతో చంపడానికి సిద్దపడుతున్నాడు రామయ్య.

                                                           17
ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు రాబర్ట్.
తను కూచున్న గది వేడిగాలితో నిండిపోయిందని తెలుస్తోంది...వేడి...వేడి...వేడి...
భరించలేని వేడి...క్రమక్రమంగా ఆ వేడి అంతా ఆ గదిని ఆక్రమించుకుంది.
ఒక్కక్షణం వణికిపోయాడు రాబర్ట్.
ఎవరో తనమీద మంత్ర ప్రయోగం చేస్తున్నారు...అతని దృష్టి అంతా ఆ గది తలుపులమీద పడింది. ఆ గది తలుపులు మూసే వున్నాయి. కానీ, ఆ గది తలుపుల సందులోనుంచి పొగలాంటిది తన గదిలోకి దూసుకువచ్చి తనను ఉక్కిరి బిక్కిరి చేస్తోందని అర్ధమైంది.
క్షణక్షణానికి ఆ గదిలో ఉష్ణోగ్రత పెరిగిపోతోంది. రాబర్ట్ కళ్ళు గట్టిగా మూసుకున్నాడు..మనసులో సుసిరియోను తలుచుకున్నాడు.
"సుసిరియో...మంచికోసం నువ్వుచేసిన ప్రాణ త్యాగం ఇంకా నా కళ్ళముందు మెదులుతూనే వుంది. నువ్వు పూర్తి చేయలేని పనిని నేను పూర్తి చేయాలని అనుకుంటున్నాను...నాకా శక్తిని ప్రసాదించవూ..."
సుసిరియో ఆత్మ మౌనంగా ఉండిపోయింది.
"నాకు మరణం అంటే భయంలేదు...కానీ నేను చావడానికి ముందు చేయవలసిన పని ఒకటి మిగిలింది..." రాబర్ట్ పెదవులు కదులుతున్నాయి...
సుసిరియో ఆత్మ రాబర్ట్ నుదురు భాగాన్ని స్పృశించింది.
ఒక్కక్షణం చల్లదనం.
"మిస్టర్ రాబర్ట్...నేను నిస్సహాయ ఆత్మని నా శక్తి ఆ 'కుశైవ' ని ఎదుర్కోవడానికి సరిపోదు. నేను నీలో ప్రవేశిస్తున్నాను.కొద్ది క్షణాలు నీకు ఉపశమనం కలుగుతుంది.
"ఈలోగా దిశైవను ప్రసన్నం చేసుకున్నాక...తన శక్తిమేర నీకు సాయం చేస్తుంది దిశైవ...ఇంకనీకు మరే మేలు చేయలేను..."
"చాలు మిత్రమా..." రాబర్టు మనసులోనే అనుకుని పెదవులు విప్పి మంత్రోచ్చారణ మొదలు పెట్టాడు ఏకాగ్రతతో...తను చచ్చిపోయినా పర్లేదు కానీ తన మంత్రోచ్చారణ ఆగకూడదు అన్నంత పట్టుదలతో.

                                                               * * *
శ్మశానంలో...
ఓ సమాధి మీద రక్తంతో తడిచిన గోచితో కూచోని ఉన్న రామయ్య కళ్ళు తెరిచాడు.
అతని చూపులు తీక్షణంగా వున్నాయి.
ఎంత తీక్షణం అంటే...అతని ఎదురుగా ఓ చెట్టుమీద ఉన్న గుడ్లగూబ భయంగా బిగదీసుకుపోయింది.   ఎవరో తన క్షుద్రశక్తిని నియంత్రిస్తున్నారు...కుశైవను ఎదుర్కోవడానికి దిశైవను రంగంలోకి దింపారు.
ఆ ఆలోచన రావడంతోనే రామయ్య పిడికిళ్ళు బిగించాడు. అతని పిడికిట్లో నిమ్మాకాయ వుంది.
నిమ్మకాయలో నుంచి రక్తం చుక్కలు చుక్కలుగా పడుతోంది.
ఆ రక్తం చుక్కలు సమాధి మీద పడి మెల్లిమెల్లిగా ఇంకిపోసాగాయి.
తల విదిల్చాడు రామయ్య....

                                        * * *
రాబర్ట్ మనసు ఇప్పుడు ప్రశాంతంగా వుంది. గదిలోని వేడి వేడి సెగలు క్రమక్రమంగా కనుమరుగై చల్లదనం ఆక్రమించుకోసాగిందా గదిని.
రాబర్ట్ పెదవులమీద చిర్నవ్వు...
"దిశైవా...నీకు చేతులో జోడించి వినమ్రంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎప్పుడూ నువ్వు నా వెంటే వుండి నేను చేసే మంచి పనికి సాయం చేయి..."
రాబర్ట్ లేచాడు. తాత్కాలికంగా తానో ప్రమాదం అంచునుంచి ఎస్కేప్ అయ్యాడు. కానీ ఇది శాశ్వతం కాదు. పీటర్సన్ తో పాటు ఇంకా చాలామంది వున్నారు. బిత్రోచిని నమ్మేవాళ్ల సంఖ్య అధికంగా ఉన్నట్టు తెలిసింది.
రామయ్య మీద అనుమానం మరింత బలపడింది, నచికేత రామయ్య మీద తనకున్న అనుమానం చెప్పాక.

                                       * * *
'వాట్ హేపెండ్ మిస్టర్ రామయ్య...అడిగాడు పీటర్సన్ రామయ్య మొహంలో ఆందోళన చూసి...
"నచికేతకూ, అతని ఫ్రెండ్స్ కూ ఎవరో సహకరిస్తున్నారు..." చెప్పాడు రామయ్య.
"ఓహ్..." అని పగలబడి నవ్వి "ఆ మాత్రానికే భయపడి పోతే ఎలా?" అన్నాడు తేలిగ్గా ఆ విషయాన్ని కొట్టి పారేస్తూ...
"నో మిస్టర్ పీటర్సన్...అంత ఈజీగా కొట్టి పారేయాల్సిన  విషయం కాదు. శత్రువును ఎప్పుడూ తక్కువుగా అంచనా వేయకూడదు. అందులోనూ దిశైవను ఆహ్వానించగలిగే వ్యక్తిని..." రామయ్య తాపీగా అన్నాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra