Home » Kommanapalli ganapathi rao » Miss Menaka IPS


     అవాక్కయిపోంయింది ఆమె. ఆమెకు కోపం రాలేదు.ఒక కెరటంలా ఉబికిన ఆవేశాన్ని సైతం సునాయసంగా అణచుకుంది.

 

     హార్వర్డు బిజినెస్ స్కూల్లో ఎం.బి.ఏ. పూర్తిచేసి వనితకూడా ప్రేమించి  పెళ్ళిచేసుకుంది. తొలిరాత్రే తెలుసుకుంది వ్యాపార దక్షత గురించి చదువుకున్న తాను, జీవితాన్ని వ్యాపారంగా భావించే వ్యక్తికి అయిందన్న విషయం.అయినా మార్చుకోగలననుకుంది. కేవలం డబ్బుకోసం తను ట్రాప్ అయిందని తెలిసినా అలా అయినా బ్రతుకంతా రాజీపడేదే.

 

     కాని చాలా త్వరగా తెలుసుకుంది కట్టుకున్నవాడి గుణగణాల్ని.అతను తాగుబోతు మాత్రమే కాదు, తిరుగుబోతుకూడా అని.

 

    చీకటి కుంపటిగా మారిన బ్రతుకుల అస్పష్టపు భవిష్యత్తు రగులుకోకుండా చూడాలని ఎంత ప్రయత్నం అందనిదయింది. అయినా ఓడిపోయింది.

 

    ఒకనాడు ఆస్తికోసం తనను అంత చేయాలని ప్రయత్నంచిన భర్తనుంచి కాపాడుకునే పోరాటంలో అతన్నే చేసింది.

 

     డాల్ఫిన్స్ నోస్  కొండపైకి పిక్నిక్కని తీసుకెళ్ళిన ఆమె భర్త  ఉన్నట్టుండి ఆమెను సముద్రంలోకి నెట్టాలనుకుటంటే, ఆవేశంలో తననుతాను రక్షించుకోవడంతోబాటు అతన్నే నెట్టింది. పోలీసులకి సరెడరయింది.


    
     ఆ తరువాత కల్బబుల్ మర్డర్ గా మూడేళ్ళ శిక్షతో జైలు జీవితం గడిపింది.

 

     తను తప్పుచేశానన్న భావం  లేదామెకి. పశ్చాత్తాప పడేటంత చిన్న అనుభూతిని సైతం మిగల్చని భర్తగా అతని మరణానికి బాధపడలేదు. అలా ముగిసిన దాంపత్యజీవితం గురించి ఆమె చింతించడం మాని ఇదిగో ఇలా బ్రతకడం అలవాటు చేసుకుంది.

 

    " మీరు జవాబు చెప్పలేదు" రెట్టించాడు మిత్ర. " మీరు మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోవాలనుకోలేదు? మీ స్టేటస్ కి మరో మగాడు దొరక్కేనా?"

 

    " లేదు మిత్రా!" భావరహితంగా  జవాబు చెప్పింది. " దాంపత్య జీవితంపై రోత  పుట్టింది."

 

    " అందుకని అందన్నీ,వయసునీ.... కోపం తెచ్చుకోకండి...ఇలా వృధా చేసుకుంటూ బ్రతికేస్తున్నారు."

 

     నిర్వేదంగా నవ్వింది. " ఇది వృధా అనుకోవడంలేదు .బ్రతుకు గులాబీ వెనుక ఉన్న ముళ్ళని తెలుసుకుని ఒకనాడు బాధపడిన నేను ఈ  జీవితంతో...."

 

    " రాజీ పడుతున్నారు అవునా?"

 

    నిర్వహణ్ణరాలయి చూసింది.

 

    "ఇది రాజీపడటం కాదూ అని మీరనలేరు వనితా. అనగలిగితే గులాబీకి ఉన్న ముళ్ళను తెలుసుకుని బ్రతుకుని మరో  దారిలోకి మళ్ళించేవారు. అదే ... సరిగా నేను ఆలోచించిందగి అలాగే.అందుకే నిరాశావాదంతో కొట్టుకుపోలేక నేనీమార్గంలో అడుగుపెట్టాను.ఇలాగే బ్రతకాలనుకుంటున్నాను."

 

    చాలా బలంగా నిర్మించుకున్న వాదాన్ని తాత్కాలికంగా చెప్పగలుగుతున్న అతని మేధాని అంచనా  వేయడంలేదామె.

 

     వందలసంవత్సరాల కాలంలో వందమంది తాత్వికులు, సంస్కర్తలు శోధించి సాంధించిన జీవిత సత్యాలు అంగీకరించడం ఇష్టంలేని మేధావిచేత, ఎంత సులభంగా తిరస్కృత అయిందీ అర్థంచేసుకున్నట్టు అవాక్కయిచూస్తూంది.

 

                       *    *    *    *                  

                                    
    మూడు నెలల కాలంలో మిత్రని నేరస్థుడిగా నిర్భందిస్తానన్న మేనక ఆ తరువాత మూడురోజులూ కనీసం అతనికి ఫోన్ చేయాలని ప్రయత్నించలేదు.
    


    అన్నది ఆవేశంగానయినా, ఆచరించి తీరాలన్న ఆలోచనతో ఎంత పటిష్టంగా ఏర్పాట్లు చేయడం ప్రారంభించిందీ  అంటే అప్పుడే కొందరు  వ్యక్తుల్ని అతని కదలికను గమనించటానికి 'టైల్స్' గా ఏర్పాటు చేసింది.

 

    'ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్' అన్న సూత్రాల ప్రాతిపదికపై అప్పుడే పోరాటాన్ని మొదలుపెట్టింది.

 

    నేర వ్యవస్థలో అతనెంత లోతుగా దిగిందీ  ఇంకా ఆమెకు తెలీదు. ఓపక్క ఇల్లు  తగలబడి బూడిద కావడానికి సిద్దంగా ఉంటే ఇప్పుడు తను నీళ్ళకోసం బావి తవ్వడం ప్రారంభించిందా అన్న అనుమానము లేకపోలేదు. అయినా నిర్విరామంగా కృషి చేస్తూంది.    

 

     ఆమెకు ఈ విషయంలో ఎక్కువగా సహకరిస్తున్నది ఎస్సై మురారి. తమమధ్య పరిచయాన్ని మురారికి చెప్పలేదామె. పరిచయముందని తెలుసేమోతప్ప ,అది  ఎంత దాకా అన్నది మురారికి తెలియడం ఆమెకి ఇష్టంలేదు.

 

    సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఏ.ఎస్.పి.  మేనక ఛాంబర్ కి   వచ్చాడు మురారి.

 

     ఆ ఉదయమే రణధీర్ రేప్ కేసుకి సంబంధించిన ఛార్జీషీటుని కోర్టులో పైల్ చేయించింది.    

 

     ఇప్పుడు సస్పెండ్ అయిన ఎస్సై రమణ స్థానంలో ఆ స్టేషన్ కి మురారి ట్రాన్స్ ఫర్ చేసింది.

 

     సర్కిల్ ఇన్స్ పెక్టర్ సుధాకర్ ప్రత్యుర్థులకి సహాయపడుతున్నాడన్న అనుమానమో, లేదా ఆ జూరీస్ డిక్షన్ లో తనకు విశ్వసపాత్రుడయి ఓ మనిషి అవసరమన్న భావమో మురారిని ఆ స్టేషన్ మార్చాక ఎక్కువగా అతనితోనే కేసుకి సంబంధించిన వివరాలు తెలుసుకోగలుగుతూంది.    

 

     అప్పటికీ ఎస్సీసైతం కేసుక్లోజ్ చేయమని పరోక్షంగా హెచ్చరిస్తున్నాడు.అయినా ఆమె ఆందోళన పడలేదు. ఒకసారి రిజిష్టర్ చేసిన  ఏ కేసునీ ఎంత పెద్ద ఆఫీసరయినాజోక్యం చేసుకుని నిరోధించలేడన్న ఒకే ఒక్క ధైర్యంతో ముందుకు దూసుకుపోతోంది.

 

      " మేడం" మురారి చెప్పాడు. " మిత్రా ప్రస్తుతం మార్గనెట్ ఇంట్లోకి వెళ్ళాడని తెలిసింది" అయిదు నిముషాలక్రితం టైల్స్ అందించిన సమాచారమది

 

     మేనక నొసలు చిట్లించింది- "మార్గరెట్ అంటే?"

 

    "చాలా ఖరీదయిన కాల్ గర్స్... అఫీషియల్ కాలనీలో ఉంటుంది.ఒక్క మాటలో చెప్పాలీ అంటే రాజధాని నగరందాకా పలుకుబడిగల యువతి ఆమె."

 

    "ఇంకా ఆమె వివరాలు చెప్పగలరా?"

 

    "అసాధారణమయిన అందగత్తె అంతకుమించి వ్యవహార దక్షతగలది."

 

    "ఎప్పుడన్నా మన రికార్డ్స్ లోకి వచ్చిందా?"

 

    "రెండు సార్లు రెయిడ్ జరిగింది.అందులో ఓ సారి నేనూ రెయిడ్ నిర్వహించాను. నేను బలవంతంగా కేసు విత్ డ్రా చేసుకోవాల్సి వచ్చింది . మొండికేసిన మరో ఎస్సై చింతపల్లి ఏజెన్సీకి ట్రాన్స్ ఫర్ అయ్యాడు."

 

    " మీమీద ఒత్తిడి తీసుకొచ్చింది...."

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra