Home » Yerramsetti sai » Love Stories


                                       ఓ యింటి రామాయణం

    రాజేశ్వరి శోకదేవతలా వుంది.

    కళ్ళ వెంబడి - మంచుగడ్డ నుంచి ఊరే నీటిచుక్కల్లా కన్నీరు ఉబుకుతూ, తలగడను తడిపేస్తోంది.

    మంచంమీద, ఆమె చుట్టూ పడివున్న ఉత్తరాలమీద శాంతి దస్తూరి కనిపించకుండా వుండుండి కన్నీటి పొరలు అడ్డుకుంటున్నాయ్.

    "రాజీ.

    అత్తగారింటి కొచ్చానన్నమాటేగాని మనసంతా నీమీదే వుంది. ఇక్కడ మా అత్తగారు, ఆడబడుచులూ. మీ బావగారూ- అంతా నన్ను ఓ దేవతలాగా చూచుకుంటున్నారు. కాలుకింద పెట్టనీయడం లేదు. కట్నం అయిదువేలు తగ్గించుకోమంటే, మన సంబంధం వదులుకోడానికి సిద్ధపడింది వీరేనా అని ఆశ్చర్యంగా వుంటుంది నాకు. అమ్మ, నాన్నలకంటే కూడా నీతో ఎక్కువగా ఏర్పడ్డ అనుబంధం వల్ల క్షణక్షణానికీ నువ్వే గుర్తుకొస్తున్నావ్ రాజీ! ఈపాటికి రాజీ కాలేజికి బయల్దేరి వుంటుంది. ఈపాటికి రాజీ కాలేజి నుంచి వచ్చి వుంటుంది. ఇదే అనుకుంటూ ఉంటాను. అలా ఆలోచిస్తూంటే, కొంచెం బాధగా అనిపించినా - ఆ బాధలోనే ఒక విధమైన సంతృప్తిగా కూడా ఉంటోంది. వీలయినంత త్వరలో ఒకసారి వచ్చి మీ అందరినీ చూడాలని ఉంది. అదెన్ని రోజులకు కుదురుతుందో ఏమో...."

    ఉత్తరం ముక్కలు ముక్కలుగా చింపేసింది రాజీ. ఆ ప్రయత్నంగానే మరో ఉత్తరం తీసి చూసింది.

    "రాజీ!

    పదిరోజులయిపోయింది నీ ఉత్తరం వచ్చి. ఉత్తరం రాద్దామని అప్పటినుంచీ అనుకుంటూనే ఆలస్యం చేశాను. కారణం ఏమిటో తెలుసా- బద్ధకం! ఏ పనీ లేకపోయేసరికి బద్ధకం తెగ ఎక్కువయిపోయింది.

    అమ్మానాన్నలను చూడాలని వుందని ఆయనతో చెప్పాను. ఆయన "అమ్మ నడుగు" అన్నారు. అత్తయ్య నడగాలంటే ఏదో బెరుకుగా వుంది. అత్తయ్య ఎప్పుడూ ఆయనగారికోసం చూసిన సంబంధాల గురించి  ఒకటే వర్ణిస్తూ చెప్తూంటుంది. ఒకరు యాభైవేలు కట్నం ఇస్తామన్నారట! ఇంకొకరు నలభై వేలు ఇస్తామన్నారట! ఏవో చిన్న కారణాలవల్ల అంతటి మహత్తరమయిన సంబంధాలు వదులుకున్నారట! అలా చెప్తూంటే నాకెంతో చిరాగ్గా వుంటుంది. కానీ తప్పదు కదా! చెప్పేవన్నీ చిరునవ్వుతో వింటూంటాను. నేను రేడియో ఎప్పుడూ వింటూంటే "నీకు ఉత్తమశ్రోత బహుమతి ఇవ్వలే" అంటూ ఆటలు పట్టించేదానిని గుర్తుందా? ఆ అలవాటు ఇప్పుడెంత ఉపయోగపడిందో చూశావా మరి!...."

    "రాజీ!

    నేనూ, మీ బావగారూ ఉగాది పండుగకు ఇంటికొస్తున్నాం. నిజానికి ఇక్కడికొచ్చిన దగ్గర్నుంచీ ఎదురుచూస్తున్నాను. ఎప్పుడు మిమ్మల్ని చూస్తానా అని! కానీ ఇప్పుడు ఆ సంతోషం లేదు. ఎందుకో తెలుసా రాజీ! నిన్న మా అత్తయ్య పిలిచి నేను ఈ పండగకు అమ్మానాన్నలను ఏమేం వస్తువులు పండుగ బహుమతులుగా అడిగి తేవాలో ఓ లిస్ట్ చదివి చెప్పింది. నాకు ఆమె అంటే మొదటిసారిగా ఎంతో అసహ్యం కలిగింది. ఈ విషయం మీ బావగారి దగ్గర ప్రస్తావించాను. ఆమె కోర్కెలను ఆయన తప్పకుండా నిరసిస్తారని అభిప్రాయపడ్డాను. కానీ ఆయనేమన్నారో తెలుసా రాజీ! "మొదటి పండుగ కదా! ఆ మాత్రం ఖర్చు చేయలేకపోతే ఎలా మీ వాళ్ళు?" అని తేలిగ్గా అనేశారు. అప్పుడుగాని ఆయన ఆంతర్యం నాకు అర్థం కాలేదు.

    "మా వాళ్లు ఎన్నో అప్పులుచేసి పెళ్ళిచేశారండీ! ఇప్పుడు వీటన్నిటికీ ముష్టి ఎత్తుకోవాల్సి వస్తుంది" అన్నాను రోషంగా.

    "ఇవన్నీ ఫార్మాలిటీస్- తప్పదు మరి" అన్నారు నవ్వుతూ. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావటం లేదు. ఇంక ఉత్తరం రాయబుద్ధి కావటం లేదు. మనసు బావుండలేదు..."

    "రాజీ,

    మేము మనింటినుంచి ఇక్కడికొచ్చేశాక పెద్ద యుద్ధం జరిగింది. మీ బావగారితో సహా అందరూ నన్ను నానామాటలూ అంటున్నారు. నేను చేసిన తప్పిదం - వాళ్ళడిగిన లిస్ట్ గురించి అమ్మా నాన్నలతో నేను మాట్లాడలేకపోవడం! ఎవరెన్ని అన్నా నేను మా వాళ్ళనేమీ అడగడానికి సిద్ధంగా లేనని చెప్పాను. దాంతో నన్ను ఇంట్లో అందరూ చీడపురుగులా చూస్తున్నారు. మొత్తం ఇంటి పనంతా నాతోనే చేయిస్తున్నారు. ఈ పని నాకేం కష్టం కాదులే! కానీ ఆ వస్తువులు నాన్నని తెచ్చిమ్మని గొడవ చేయకుండా ఉంటే చాలు ఇలాంటి వెన్నయినా భరిస్తాను. ఈ సంగతులేమీ అమ్మానాన్నలకు చెప్పకేం?..."   

    "రాజీ,

    చివరకు వీళ్ళంతా కలసి ఏం చేశారో చూశావా? "నాన్నకి ఉత్తరం రాశారు. లిస్ట్ లోని వస్తువులు ఇవ్వకపోతే మీ అమ్మాయిని తీసుకెళ్ళి పోండి" అని రాశారట. ఈ విషయం నాన్న దగ్గర నుంచి జవాబు వచ్చాక గానీ నాకు తెలీలేదు.

    నాన్న ఒక పిచ్చివాడు! వాళ్లడిగినవన్నీ వీలు చూసుకుని ఇస్తానని రాశారు. అలా ఎందుకు రాశారో నాకు తెలీటం లేదు. 'నావల్ల కాదు ' అని రాస్తే ఏం జేసేవాళ్లు? మీరెన్ని బాధలు పడుతున్నారో అని ఒకటే ఇదిగా వుంది. దయచేసి నాన్నతో చెప్పు రాజీ! ఇప్పటికే నానా ఇబ్బందులూ పడుతున్నారో పక్క! ఇంకా ఎందుకివన్నీ ఇవ్వటం? "ప్రస్తుతం నేనేమీ ఇవ్వలేను" అని మా అత్తయ్య వాళ్ళకు ఉత్తరం రాసేయమను. తరువాత ఏం జరగాలనుకుంటే అదే జరుగుతుంది. నన్ను ఇంతకంటె ఇంకేం హింసించగలరు వాళ్లు."

    "రాజీ,

    ఇవాళ మొదటిసారిగా ఆయన చేతిలో దెబ్బలు తిన్నాను. ఊహ తెలిశాక నన్నెవ్వరూ కొట్టలేదు. ఎలిమెంటరీ స్కూల్లో మాణిక్యాలరావు టీచర్ గానీ, ఇంట్లో అమ్మా నాన్నలుగానీ -తప్పు చేసినా సరిదిద్దే వారుగానీ కొట్టడం జరగలేదు. అందుకేనేమో ఇక్కడ దెబ్బలు తింటున్నాను. నేను చేసిన తప్పేమిటో తెలుసా? వాళ్ళు చెప్పిన విధంగా నాన్నకు ఉత్తరం రాయడానికి నిరాకరించడం! ఆయన మూర్ఖత్వం చూస్తే నాకు నవ్వాలో ఏడవాలో తెలీటం లేదు. కొట్టి ఆడదాన్ని మార్చేయగలరా?

    రాజీ! ఏ పరిస్థితుల్లోనూ నువ్వ మాత్రం ఇలాంటి దిక్కుమాలిన సంబంధం చేసుకోవద్దు. అతని గురించీ, అతని బుద్ది గురించీ, కక్కుర్తి పడే గుణం గురించీ, భార్యకంటె డబ్బే విలువగలదని నమ్మే మూర్ఖత్వం గురించీ - పూర్తిగా తెలుసుకుని - వీటన్నిటికీ దూరంగా వుండే మనిషినే చేసుకో! ఒకవేళ అలాంటి వ్యక్తి దొరకకపోతే పెళ్లే చేసుకోవద్దు! పెళ్ళి లేకపోతేనేం? హాయిగా ఉద్యోగం చేసుకొంటూ బ్రతకలేవా..."

    "రాజీ,

    చాలా నెలలయిపోయింది కదూ నీకు ఉత్తరం రాసి? నీ ఉత్తరాలు చేరుతున్నాయి కాని. అన్నీ మా అత్తయ్య, మా పెద్దాడపడుచు కలిసి నాకు ఇవ్వకుండా చింపిపారేస్తున్నారు. నీకు ఉత్తరం రాయడానికి కావలసిన కవరు ఖరీదు కూడా నా దగ్గరలేదు. పక్కింటి పాపను బ్రతిమాలితే ఆమె తన పాకెట్ మనీతో ఓ కవరు కొని ఇచ్చింది. తీరా కవరు చేతికొచ్చాక జ్వరం - రెండు నెలలపాటు మంచం దిగలేని పరిస్థితి. కానీ అలాగే ఇంటిపనంతా చేయాల్సిందే! ఇలాంటి జీవితం గడిపేబదులు చచ్చిపోతేనేం అనిపించింది. ఈ గొడవ లిలా వుంటే మరో కొత్త సమస్య! ఆయన పనిచేస్తున్న ఆఫీసులో ఒకావిడ తనను ప్రేమించిందట! ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారట! అందుకు నేను అడ్డంగా వున్నానట నేను ఛస్తే తన జీవితం బాగుపడుతుందట! ఇలా సాధింపు ఎక్కువయిపోతోంది. నాకూ చావాలనే వుందిగానీ ఎలా? బలవంతంగా ప్రాణం తీసుకోవడం మాటలా? దానిక్కూడా చాలా తెగింపు కావాలి. నువ్వేమీ గాభరా పడవద్దు. నేను చచ్చిపోనులే! అంత ధైర్యం లేదు నాకు..."

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra