Home » Suryadevara rammohan rao » మోడల్


    ప్రపంచంలోని అందమైన నగరాల్లో పారిస్ మొదటిది. విశాలమైన రహదారులు, వాటికిరుప్రక్కల పచ్చని లాన్స్, ప్రతి కిలోమీటరుకి ఒక  పార్క్ రోడ్డెంట నడిచేవారు (తక్కువ) సేదతీరేందుకు పెద్ద పెద్ద వృక్షాలు......ఒక్కసారి పారిస్ లో అడుగు పెడితే మరలా వదలబుద్ధి కానటువంటి సుందర నగరం.నగరం మధ్యగా ప్రవహించే సెయిన్ నదికి దగ్గర్లో1823 నాటి అతి పురాతన కట్టడం 'అండా ల్యూసియన్' కోట......ఫ్రాన్స్ దేశపు సాంస్కృతిక, సాంప్రదాయాలకు ప్రతీకగా తన అస్తిత్వాన్ని నిలుపుకుంటూ కనిపిస్తుంది. కోటకు వెనుకవేపు మరికొన్ని పురాతన కట్టడాలు, వాటి చుట్టూ మనుష్య సంచారం లేక చెట్లు  గడ్డి, పిచ్చిగా పెరిగి పగలే భయం కల్గించేట్లుగా వుంటుంది.

    ఆ కట్టడాల్లో ఓ మూల వున్న దర్భారులాంటి హాల్లో వందమంది యువకులు మరో వందమంది యువతులు చేతుల్లో సిగరెట్లతో, పైపులతో ఒకరిమీద ఒకరు పడిపోతూ, పిచ్చిగా కేకలేస్తూ, నేలమీద  పడి పొర్లుతున్నారు. ఫ్రాన్స్ దేశపు భావిపౌరులు గంజాయిదమ్ము మత్తులో, మార్ఫిన్, మాండ్రెక్స్ మత్తుపదార్థాల కౌగిలిలో తమ అస్తిత్వాన్ని కోల్పోయి, సభ్య ప్రపంచానికి దూరంగా రంగులు పులిమిన నూతన ప్రపంచంలో విహరిస్తూన్నారు.

    వారి గుండెల్లో సూర్యుడు బ్రద్ధలైనట్లు, వారి శరీరంలో కాంతులీసుతున్నట్లు భ్రమిస్తూ అదోరకమైన ట్రాన్స్ లో వున్నారు.

    మితిమీరిన డబ్బు, సౌకర్యాలు అందుబాటులోకి వస్తే యువతకి పట్టే అధోగతికి వీరే నిదర్శనం. పాడుబడిన ఆ కోటగోడల మధ్య పెరిగిన కలుపు మొక్కల్లా వున్నారు పెడదారిన పట్టిన ఆ యువత.

    తెల్ల వారటానికి మరోగంటే వుంది ఒక్కొక్కరు క్రమంగా మత్తు నుండి బయట పడుతూ ఇంటిదారిపట్టే ప్రయత్నాలు మొదలెట్టారు.

    అందులో ముందుగా జేరుకుంది ఓ యువతి. చేతిలో వున్న  ఇంజక్షన్ సిరెంజ్ విసిరికొట్టింది దూరంగా. ఆమెపేరే తరంగిణి. తూలుతూనే లేచి నిలబడి టైమ్ చూసుకుంది. ఓ సారి కళ్ళు నలుముకుంది తరంగిణి.

    అడ్డంగా పడివున్న వారి మీదగానే అంగలేస్తూ బయటకు నడవసాగింది.

    వంటిమీద వున్న షర్ట్ బటన్స్ విడిపోయి ఆమె బిగ్ బస్ట్ గాలికి వదిలేసినట్లుగా వుంది. కళ్ళముందు మెరుస్తున్న కాంతులు ఆమెను, ఆమె గురించి ఆలోచించుకోనట్లు చేస్తున్నాయి. ఐదడుగుల తొమ్మిదంగుళాళ ఎత్తున్న తరంగిణి అంత మత్తులో నడుస్తున్నా అజంతా శిల్పంలా, అపరంజి బొమ్మలా, అందాల హంసలా వుంది. పాడుబడ్డ కోట గోడల్ని దాటుకుంటూ వచ్చి పార్క్ చేసి వున్న కారెక్కింది. మరుక్షణం కారు రివ్వున నేషనల్ పార్క్ వేపుకు దూసుకుపోతోంది.

    నగరం అప్పుడే మేల్కొంటోంది. ఆమెలో క్రమంగా మత్తు దిగిపోయి, ఆ స్థానంలో ఆలోచనలు ముసురుకుంటున్నాయి.

    తనివ్వాళ పదకొండు గంటల ఫ్లయిట్ లో ఇండియా వెళ్ళిపోవాలి.

    టిక్కెట్, వీసా అన్నీ నాలుగురోజుల క్రితమే సిద్దంఅయ్యాయి.

    పాతికేండ్ల క్రితం భారతదేశం నుంచి వచ్చి ఫ్రాన్స్ లో స్థిరపడిన వాతావరణం పరిశోధనా శాస్త్రవేత్త ప్రొఫెసర్ జగన్నాథ్ ఏకైక సంతానం తరంగిణి.

    చదువు, అందం, సంస్కారం అన్నీ సమపాళ్ళలో వున్న తరంగిణి అనుకొని పరిస్థితుల్లో మత్తు పదార్థాల ప్రపంచంలోకి విసిరివేయ బడింది. తండ్రి ఎంతగా ప్రయత్నించినా, తాపత్రయపడ్డా తరంగిణి ఏమాత్రం మారలేదు. ప్రొఫెసర్ జగన్నాథ్ ఆ క్షోభతోనే మంచం పట్టాడు.

    అప్పటినుండి మరీ పెడదారులు తొక్కింది తరంగిణి.

    ఫ్యాషన్స్ డిప్లోమా తీసుకున్న తరంగిణి అప్పుడప్పడు ఫ్యాషన్ షోలలో పాల్గొని ప్రశంసలు కూడా పొందింది.

    జగన్నాథ్, తన భార్యతో ఫ్రాన్స్ వచ్చిన తొలిరోజుల్లో పిల్లల కోసం చాలా  బాధపడేవారు. ఆ బాధనుండి క్రమంగా కోలుకుంటున్న టైమ్ లో తరంగిణి కడుపున పడటం జరగింది. లేక లేక కల్గబోతున్న తమ సంతానంపట్ల జగన్నాథ్ దంపతులు పడిన ఆరాటం, తపన____అనూహ్యం. తరంగిణికి ఇరవై సంవత్సరాలు వచ్చేవరకూ ఎంతో క్రమశిక్షణతో పెరిగింది. అనుకోకుండా ఓ ఫ్రెండ్ సర్కిల్ లో పడటంతో ఆమె జీవితగమనమే మారిపోయింది.

    ఎప్పుడూ, నవ్వుతూ, త్రుళ్ళుతూ, చలాకీగా వుండే తరంగిణి తెలివి తేటలన్నా, అందం అన్నా ఆమె చుట్టూ వుండే ప్రతి ఒక్కరికి ఓ ఆరాధన. కారు ఇంటిముందు ఆగింది. అప్పటికి తరంగిణిలో మత్తు పూర్తిగా దిగిపోయింది. హడావుడిగా ఇంట్లోకి నడిచింది. స్నానం త్వరగా పూర్తిచేసి బట్టలు సర్దుకొని వీసా, ఫ్లయిట్ టిక్కెట్, పాస్ పోర్టు తీసి హేండ్ బేగ్ లో పెట్టుకుంది.

    ఆమెలో హడావుడి క్షణక్షణానికి పెరిగిపోతోంది. ఎంత త్వరగా ఫ్లయిట్ ఎక్కేస్తే అంత క్షేమమన్న ఆలోచన ఆమెను నిలువనివ్వటం లేదు. లంకంత ఇంటిలో, ఓ మూల గదిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న తండ్రిని పలకరించాలనిపించింది ఆమెకు ఓ క్షణం.

    తను చేస్తున్నది, చేయబోతున్నది, తప్పు అని తెలిసినా తనను తాను నిగ్రహించుకోలేని మానసిక అస్థిరత్వంలో వుంది. సర్దిన లగేజ్ అంతా  ఓ ప్రక్క పెట్టుకొని తండ్రి గదివైపు నడిచింది.

    గదిముందు ఆగింది. ఓ క్షణం. తండ్రికి ఎదురుగా నిలబడాలంటే, తన అంతరంగంలో సుళ్ళు తిరుగుతున్న న్యూనతాభావం వలన సాధ్యం కావటంలేదు. మనస్సు మార్చుకొని గిరుక్కున వెనక్కు తిరిగింది.

    వడివడిగా అడుగుల వేస్తూ ఫోన్ వైపు నడిచింది.


                                *    *    *


    మనోహర్ అతి కష్టంమీద సంపాదించుకున్న వీసాతో ఎయిర్ ఇండియా ప్లయిట్ ఎక్కి ఆరు గంటలయింది. ఆ ఫ్లయిట్ ఢిల్లీనుండి సరాసరి పారిన్ వెళుతుంది. మనోహర్ లో ఆలోచనలు జెట్ స్పీడ్ లో పరుగులెడుతున్నాయి.

    తరంగిణి ఎక్కడుంటుందో తెలియదు. పారిన్ లాంటి మహా నగరంలో ఆమె అడ్రస్సు కనుక్కోవడం అంత తేలికైన పనికాదు. కనుక్కున్నా ఆమె తనతో ఇండియా వస్తుందా? మోడలింగ్ కి ఒప్పుకుంటుందా మనోహర్ మానసికస్థితి అల్లకల్లోలంగా వుంది.

    ముక్కూ, మొహం తెలీని ఓ యువతితో మోడలింగ్ చేయించాల్సిన పరిస్థితి ఏ యాడ్ ఫోటో గ్రాఫర్ కి వచ్చి వుండదు. అంత ఆందోళనలోనూ, క్లిష్ట పరిస్థితిలోనూ ప్రదీప్ గురుకొచ్చాడు మనోహర్ కు.

    పరమ కర్కోటకుడైనా, తనకెంతో  శత్రువైనా ప్రదీప్ మాస్టర్ బ్రెయిన్ మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు మనోహర్.

    ఈ ఫీల్డ్ లో నిలదొక్కుకోవాలంటే సృజనాత్మకత ఒకటే చాలదు. ప్రతి మెట్టుపైనా నెగ్గి, నెట్టుకురాగల చాకచక్యం కావాలి మంగళ, కమలిని మధు చక్రవర్తి, చందూ, రోమాకౌర్. రూపాచక్రవర్తి, రాంభూపాల్, కిరణ్, గిరీష్___అందరూ ఒక్కసారి మనోహర్ స్మృతిపథంలో మెదిలారు. ప్రతి ఒక్కరి గుండెల్లోనూ ఆందోళన గూడుకట్టుకుంది.

    ఈ పందెం ఎక్కడికి దారితీస్తుంది? ఎందర్ని బలితీసుకుంటుంది. ఎవర్ని ఏ ఒడ్డుకు విసుర్తుంది?


                              *    *    *   


    "కైలాష్.......మనోహర్ వేట మొదలైంది. అతని ప్రతి పని రాకెట్ స్పీడ్ లో వుంటుంది. అతన సక్సెస్ అయ్యాడా  నా పరువు ప్రతిష్టలు మంటగలిసిపోతాయి. ఒకప్పుడు వర్క్ కోసం నా వెంట తిరిగిన మనోహర్ ఈనాడు నన్నే చాలెంజ్ చేసి బరిలోకి దూకాడు అతను గెలిస్తే మనమీ ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోవలసిందే.

    ఈ విషయం అప్పుడే వైల్డ్ ఫైర్ ళా యాడ్ వరల్డ్ అంతా పాకిపోయింది. ఇవ్వాళ ఇతను, రేపు మరొకడు మనమీదకు కాలు దువ్వుతారు. చివరకు మన ఉనికికే ముప్పు వస్తుంది.

    కనుక మనం అన్నిటికి సిద్ధపడాలి. ప్రపంచానికి తెలియకుండా మనోహర్ ని మనం అడుగడుగునా చావుదెబ్బ తీయాలి. కాని ఆ దెబ్బలు పోలీసు దెబ్బల్లా పైకి కనబడకూడదు. వాటికి ఆధారాలు దొరక్కూడదు.

    ఆ చావు దెబ్బలతో మనోహర్ లో ఆత్మవిశ్వాసం  సడలిపోవాలి. అతన్ని వెన్నంటి వున్నవారికి గుండెల్లో రైళ్ళు పరిగెత్తించాలి. ఎంత డబ్బయినా ఖర్చుపెట్టు....." చెబుతూ, చెబుతూ, ఓ క్షణం ఆగి ఆరిన తన చేతిలోని పైప్ వంక చూసుకున్నాడు.

    కైలాష్ గోల్డెన్ లైటర్ తో ప్రదీప్ పైవ్ వెలిగించాడు.

    ఓసారి పైప్ నోట్లో పెట్టుకొని ఓ దమ్ము లాగి స్టయిల్ గా పొగ వదులుతూ "మనం చేసే పనులు ఏ మాత్రం బయటపడ్డా, యాడ్ వరల్డ్ లో మనమంటే భయం స్థానంలో అసహ్యం, మనోహర్ మీద సానుభూతి ఏర్పడే ప్రమాదం వుంది."

    "ఓకే.....సార్.....మీరు చెప్పదల్చుకున్నది అర్ధమయింది....."భుజాలెగురవేస్తూ అన్నాడు కైలాష్.

    మనోహర్ వేట నిష్ప్రయోజనం ఆ అమ్మాయి దొరకదు అతని టైమ్ అంతా తరంగిణిని వెతుకులాడటంతోనే వృధా అయిపోతుంది.

    ఏప్రిల్ రెండవ వారంలో కోరమాండల్ కంపెనీ సోప్స్ వరల్డ్ మార్కెట్ లో లాంచింగ్ ప్రోగ్రామ్ ఫిక్సయిందని వ్యాస్ ఇంతకుముందే చెప్పాడు. ఆపాటికి......అంటే మార్చి ఆఖరుకు మనోహర్ యాడ్ ఫిల్మ్స్ అందించలేడు. దాన్నే మనం తెలివిగా ఉపయోగించుకోవాలి.

    మన కోరమాండల్ సోప్స్ మీద నాలుగు యాడ్ ఫిల్మ్స్ తీయాలి. అనుకున్న టైంకి మనోహర్ ఫిల్మ్స్ అందించలేడు. దాంతో ఇంటర్నేషనల్ లెవెల్ లో లాంచింగ్ కి ఏర్పాట్లు చేసుకుంటున్న కోరమాండల్ కంపెనీ ఖంగుతింతుంది.

    పబ్లిసిటీ మెటీరియల్ తయారుకాలేదని లాంచింగ్ ఆపితే అది వారి కంపెనీకే  అప్రదిష్ట. దాంతో వాళ్ళు క్రిటికల్ పొజిషన్ లో పడిపోతారు.

    ప్రోడక్టు లాంచింగ్ ఆపితే ఒక నష్టం......ఆపకపోతే, ఏమాత్రం పబ్లిసిటీ జరగకపోవటం మూలాన ప్రోడక్టు పోయే అవకాశం వుండక, మరో రకంగా నష్టం ఎదుర్కోవాలి ఆ కంపెనీ.

    అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మనం షూట్ చేసిన ఫిల్మ్స్, తయారుచేసిన పబ్లిసిటీ మెటీరియల్ చూపిస్తాం.

    గత్యంతరం లేని పరిస్థితిలో మన వర్క్ ని అంగీకరిస్తారు.

    ఫార్మాలిటీస్ లేకుండా మన ఏజన్సీకి అపాయింట్ మెంట్ లేకుండానే  మనకు కోరమాండల్  కంపెనీ క్లెయింట్ అయిపోతుంది.

    దాంతో  అటు మనోహర్ కి సమాధి, ఇటు మల్టీ నేషనల్ కంపెనీ, మన గుప్పెట్లోకి వస్తాయి. అర్ధమయిందా........." కైలాష్ శ్రద్ధగా వింటున్నాడో, లేదో గమనించి మరలా మొదలెట్టాడు ప్రదీప్.....

    "వెంటనే నాలుగు  యాడ్ ఫిల్మ్స్ కి ఏర్పాట్లు ప్రారంభించు. మన మోడల్ కోఆర్టినేటర్స్ ని పిలిపించు. వేటకుక్కల్లా దేశంమీద పడమను ఫెంటాస్టిక్ ఫీచర్స్ వున్న అమ్మాయిల్ని పట్టుకోమను. వారికితోడు నలుగురు పాతవారిని కూడా సిద్ధం చేయమని చెప్పు.

    కెమేరామన్ సిద్దిక్ ని కాంటాక్టు చేయి.

    కాపీరైటర్ ని, విజువలైజర్ ని, మేకప్ మాన్ అందర్ని అప్రమత్తం చేయ్. లోకేషన్ సెలక్షన్ కోసం ఇద్దర్ని పంపించు, లోకేషన్ సెలెక్షన్ లో రాంభూపాల్ ఎక్స్ పర్ట్ అతన్ని పిలిపించు......."

    "సార్.......అన్నీ సిద్ధం చేయగలను. కాని రాంభూపాల్ ని పట్టుకోవటం కష్టం. వారం రోజులుగా  అతను కనిపించటంలేదు......." నసుకుతూనే అన్నాడు కైలాష్.

    ప్రదీప్ కి కోపం వచ్చింది ఆ మాటకు. కళ్ళద్దాలుతీసి కైలాష్ వైపు తీక్షణంగా చూసాడు.

    కైలాష్ గజగజ వణికిపోయాడు.

    "యూ.....ఇడియాట్......పదేండ్లనుంచి నా దగ్గర వర్క్ చేస్తున్నావ్ ఆ మాత్రం బుర్ర పనిచేయదా? సిటీలో ఎంతమంది మోడల్స్ వున్నారో చెక్ చేయ్. వాళ్ళు ఎక్కడెక్కడ వున్నారో తెలుసుకో. రాత్రుళ్ళు వాళ్ళతో ఎవరిదగ్గరో ఒకరి దగ్గర రాంభూపాల్ దొరుకుతాడు. ఏమాత్రం  ఆలస్యంచేయవద్దు" అంటూ ప్రదీప్ లేచాడు.

    అర్ధమయినట్లుగా కైలాష్ ప్రదీప్ వెనుకే బయలుదేరాడు.

    ప్రదీప్ దుర్మార్గాలన్నీ విజయవంతం అవుతున్నాయంటే అది కైలాష్ వల్లనే. కైలాష్ మహా క్రూరుడు.

    ఏ మోడల్ ని ఎలా గుప్పెట్లోకి తెచ్చుకోవాలో, వార్ని ఎలా వాడుకోవాలో____వార్ని అడ్డం పెట్టుకొని బిజినెస్ ఎలా తెచ్చుకోవాలో బాగా తెలుసు. కైలాష్ పగ పాము పగ.

    మనస్సు చంపుకొని, ఆత్మాభిమానాన్ని సమాధి చేసుకొని అతను చెప్పినట్టల్లా ఆడతారు అతని దుర్మార్గం తెలిసిన చాలామంది మోడల్స్.

    చట్టానికి దొరక్కుండా మోడల్స్ ని చిత్రహింసలు పెట్టడంలో సుశిక్షితమైన అనుభవాన్ని పొందాడు ప్రదీప్ దగ్గర కైలాష్.

    యాడ్ ఫిల్మ్స్ లో తమ అందాల్ని నగ్నంగా కెమేరా ముందుంచటానికి మనస్సును చంపుకొనే కొందరు మోడల్స్, ప్రదీప్ ఏజెన్సీకి బిజినెస్ తెచ్చిపెట్టడానికి పెద్ద పెద్ద  కంపెనీ డైరెక్టర్స్ పడకలపై కర్కశంగా నలిగిపోవాల్సిరావటం తీవ్రమైనా వేదనకు గురిచేస్తుంది.

    అలా అని ఫీల్డ్ ని వదిలేద్దామన్నా ప్రదీప్ ఊరుకోడు. వెంటాడి. వెంటాడి వేధిస్తాడు, మోడల్స్ కుటుంబాలపై అతని విషపుచూపు పడుతుంది.

    వీటికి తోడు మెరుపులా మరకల యాడ్ ప్రపంచాన్ని వదులుకో లేని బలహీనత ఒకప్రక్క సాలెగూడులాంటి యాడ్ వరల్డ్ లో సరుకుల్ని అమ్మిపెట్టే సరుకులు మోడల్స్! సమ్మోహితుల్ని చేసే సరుకులు మోడల్స్!! అసందర్భంగా అందాల్ని పరవాల్సిన సరుకులు మోడల్స్!!

    అనుక్షణం ఛస్తూ, బ్రతుకుతూ-బ్రతుకుతూ ఛస్తూ, ఆ చావు బ్రతుకుల సందిలో సుఖాన్ని, భోగలాలసను, కీర్తిప్రతిష్టలను, ధనాన్ని చూసి ఆశగా పరిగెత్తే మోడల్స్-అందమైన మోడల్స్ మరీ మరీ అందంగా దోచుకోబడుతుంటారు.

    మెట్లు దిగుతూ ఓ క్షణం ఆగి వెనుతిరిగి కైలాష్ వైపు చూస్తూ "మధుర కంపెనీ యాడ్ ఫిల్మ్ వర్క్ ఈ రోజు పూర్తిచేయాలి. మోడల్ మాయాడిసౌజా ఈపాటికి వచ్చేవుంటుంది. ఆమెతో జాగ్రత్తగా మసులుకొండి. పనిలోపని సాయంత్రం నాలుగు గంటలకి రోమాకౌర్ వర్క్ ఫినిష్ చేయాలి.....అర్ధమైందా.....?" అంటూ కారెక్కాడు ప్రదీప్.

    కారు డోర్ మూస్తూ చిరునవ్వు నవ్వాడు కైలాష్. ఆ నవ్వులో చిందిన విషం ఎవర్నో ఒకర్ని కాటేయక మానదు.

   
                                                                     *    *    *


    మార్చి ఐదున ఉదయం ఏడుగంటలకు ఫ్యారిస్ ఎయిర్ పోర్ట్ లో దిగాడు మనోహర్.

    కస్టమ్స్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకొని బయటపడేసరికి ఎనిమిదయి పోయింది. వెంటనే ఎయిర్ పోర్టు బయటకొచ్చి టాక్సీ ఎక్కి లారెంట్ అడ్రస్సు చెప్పాడు. టాక్సీ టారెంట్ ఇంటివైపు రివ్వున దూసుకు పోతోంది. గడిచిపోతున్న ఒక్కొక్క క్షణం మనోహర్ లో అసహనాన్ని పెంచుతూ పోతోంది.

    కారు లారెంట్ కాంప్లెక్స్ ముందు ఆగగానే బుల్లెట్ లా లోపలికి వెళ్ళిపోయాడు. సమయానికి లారెంట్ ఆఫీసులోనే వున్నాడు.

    "ఏమిటి హడావుడి మనోహర్.......?" పైప్ పీలుస్తూ ప్రశ్నించాడు టారెంట్.

    టూకీగా జరిగినదంతా చెప్పాడు మనోహర్.

    "చాలా థ్రిల్లింగ్ గా వుంది నీ ప్రాజెక్టు. ఇందులో నువ్వు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. కాస్ట్యూమ్స్ నన్ను తయారుచేయమన్నావ్! చార్జీ......ఎంత వుద్దనుకుంటున్నావ్......?" తమాషాగా అడుగుతూ ప్రక్కనే వున్న బాయ్ కి సైగ చేశాడు.

    "నేను చేస్తూన్న కేంపైన్ ఓ మల్టీ నేషనల్ కంపెనీ తయారు చేస్తూన్న సోప్స్ మీద. మీ చార్జీ భరించగలను ఎందుకంటే వా క్లయింట్ నాకు ఆఫర్ చేస్తున్నా ఎమౌంట్ వెరీ ఎట్రాక్టివ్....."టారెంట్ తో మాట్లాడుతూనే ఆ మహానగరంలో తరంగిణిని పట్టుకొనే దారులకోసం తీవ్రంగా ఆలోచిస్తున్నారు.

    "ఓ.కె......నువ్వు వెళ్ళేలోపే తయారుచేసి ఇస్తాను. బైదిబై నీ పేరుమీద, తరంగిణి పేరుమీద ఈ రోజు సాయంత్రమే స్విస్ ఎయిర్ లో టిక్కెట్స్ రిజర్వ్ చేయించాను....."

    "థాంక్యూసర్....నాకు ఒకర్ని తోడిస్తే ఆమె అడ్రస్సు కనుక్కొనే ప్రయత్నం ప్రారంభిస్తాను" మనోహర్ లో ఆతృత, ఆరాటం క్షణక్షణానికి పెరిగిపోతున్నాయి.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra