Home » Dr. dasaradhi rangacharya » Sukla Yajurveda Samhitha


                            జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |
                    ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే ||

1.    అగ్నేస్తనూరసి విష్ణవేత్వాసోమస్య తనూరసి విష్ణవే
    త్వాతిథేరాతిథ్యమసి విష్ణవేత్వాశ్యేనాయ త్వాసోమభృతే
    విష్ణవే త్వాగ్నయే త్వారాయస్పోషదే విష్ణవేత్వా ||

    గాయత్రీ ఛందమా! సోమ సామ్రాట్టు భృత్యుడగు అగ్నికి నీవు శరీరమవు. హావీ! నేను బహుయజ్ఞ వ్యాపక సొమము కొరకు భూమి మీద స్థాపించుచున్నాను.

    త్రిష్టుప్ ఛందమా! నీవు సోమసామ్రాట్టు సేవకుడగు అగ్నికి నీవు శరీరమవు. హావీ! నేను బహుయజ్ఞ వ్యాపక-సోమము కొరకు భూమి మీద స్థాపించుచున్నాను.

    త్రిష్టుప్ ఛందమా! నీవు సోమ సామ్రాట్టు  భృత్యుడగు అతిథికి అతిథి సత్కారమవు. హావీ! నేను - బహుయజ్ఞ వ్యాపక సోమము కొరకు నిన్ను భూమి మీద స్థాపించుచున్నాను.
    స్వర్గము నుండి సోమము  కొరకు నిన్ను భూమి మీద స్థాపించుచున్నాను.

    స్వర్గము నుండి సోమము తెచ్చు శ్యేన రూపమగు గాయత్రీ ఛందము మరియు బహుయజ్ఞ వ్యాపక సోమము కొరకు హవీ! నిన్ను భూమి మీద స్థాపించుచున్నాను.

    సోమసామ్రాట్టు అన్యభృత్యులు- ధనసమృద్ధి నొసంగు అగ్ని - బహుయజ్ఞ వ్యాపక సోమము కొరకు హవీ! నిన్ను భూమి మీద స్థాపించుచున్నాను.

    విష్ణవే బహుయజ్ఞవ్యాపినే అనిమహీధరుడు.

    2. ప్రస్తరఖండమా! నీవు అగ్నిని పుట్టించువాడవు. (రెండు దర్భలను అందుకొని) దర్భలారా! మీరు అత్యంత సమర్ధులు.

    అగ్నిని మధించు దిగువ అరణీ! నీవు ఊర్వశివి. అగ్నిని మధించు మీది అరణీ! నీవు పురూరవుడవు.

    అగ్నీ! నేను నిన్ను గాయత్రీ ఛందస్సుచే మధించి ప్రకటింతును. అగ్నీ! నేను నిన్ను  త్రిష్ణుప్ ఛందస్సుచే మధించి ప్రకటింతును. అగ్నీ! నేను నిన్ను జగతీ ఛందస్సుచే మధించి ప్రకటింతును.

    (అగ్నిని మూడు సార్లు మధించవలెను)

    3. మధించి పుట్టించిన మరియు ఆహవనీయ అగ్నులారా! మీరా మా కొరకు  సమానమనస్కలు సమాన చిత్తలు - నిష్పాపములు కండి. మీరు ఈ యజ్ఞమునకు విఘాతకులు కారాదు. యజ్ఞపతిని బాధించరాదు. ఇకముందు మీ ఉభయ అగ్నులు మాకు శుభంకరులు కావలెను.

    4. ఋత్విజులకు పుత్రరూప - వారు మధించి పుట్టించినందున - అగ్నీ! నిందలనుండి రక్షింటు మధిత - ఆహవనీయ అగ్నులందు ప్రవేశింపుము. యజన కార్యమును నిర్వాహించుము.

    సుఖకర, అత్యంత యజనీయ అగ్నీ! నీవు ఆలస్యము కానీయక సదాదేవతలకు హవి హొమము చేయుము. అగ్నయే స్వాహా.

    5. (పాత్రలో నింపిన ఆజ్యమున జుహువున తీసి)

    జుహువునందున్న అజ్యమా! నిరంతరగతి కలిగి -సర్వ వ్యాప్త ప్రజాపతికి పౌత్రుడును సర్వ ఆధార భూత ఆకాశమునకు పుత్రుడును - సర్వకర్మ సమర్థుడు, అత్యంత శక్తిశాలి అయిన వాయువు కొరకు నిన్ను అందుకున్నాను.

    (పరస్పరము ద్రోహము చేయకుండుటకు ఋత్విక్కు ఘృతమును తాకి) మేము శపథము చేయు ఋత్విజులము. పూర్వకాలమున నీవు మాచే ఎట్టినిందలు లేనివాడవుగా చేయబడినావు. నేడు సహితము నీవు నిందలు లేనివాడవు అయినావు.

    ఘృతము నిందారహితము. నిందలనుండి రక్షించునది. అనిందనీయము. త్రికాల సత్యము. అట్టి ఘృతము  మాకు సులభముగా లభించవలెను. ఘృతమా! నీవు నన్ను సుప్రాప్తన్య స్వర్గ లోకమునకు చేర్చుము.

    6. అగ్నీ! నీవు వ్రతపాలకుడవు. నేను నిన్నే ఆశ్రయించుచున్నాను.

    వ్రతపాలక అగ్నీ! ణీ జ్వాలారూపదేహము నాలో లీనము కావలెను. నా దేహము 'నీలో లీనము కావలెను.

    వ్రతపతి అగ్నీ! మనఉభయుల వ్రతములు ఒకేసారి సమాప్తము కావలెను.

    దీక్షాపతి సోమమా! నా దీక్షను ఆమోదించుము. తపముల స్వామి సోమము నా ఉపసద్రూప తపమును ఆమోదించవలెను.

    7. సోమమా! ఇంద్రుడు ఏకమాత్ర సోమరసధనమును అందుకొనువాడు. అతని కొరకు  నీ ప్రత్యంశము అభివృద్ధి చెందవలెను. నిన్ను పానము చేయుటకు ఇంద్రుని శరీరము అభివృద్ధి చెందవలెను. ఇంద్రుని కొరకు రసపూర్ణవమగుము.

    సోమమా! నీవు ధనలాభము కలిగించువాడవు. మేము మేధోజీవులము - మిత్రులము- ఋత్విజులము. మాకు అభ్యుదయము కలిగించుము. నాకు శుభములు కలుగవలెను. మేము అభిషవక్రియ పూర్తి చేయకలుగవలెను. మేము సత్యవాదులము. మాకు కోరిన ధనము, సౌభాగ్యము, సత్యము లభించవలెను.

    నమోద్యావాపృథివీభ్యాం, ద్యావాపృథ్వులకు నమస్కారము.

    8. అగ్నీ! ఈపృథ్వివి మీద అసురుల లోహపురములున్నవి. నీశరీరము అందు ఉన్నది. అది కోరకలు తీర్చునది. నిగూఢము. ఆ శరీరమే దేవతల ఆకలిదప్పుల వలన కలిగిన దారుణ వచనములను శమింపచేసినది. మేము పాపము చేసినామా" మున్నగు అమర్షవచనములను ఉపశమింప చేసినది. ప్రియమగు నీదగు ఆమూర్తికి స్వాహా.(ప్రథమ దిన ఉపసద హొమము చేయవలెను)

    అగ్నీ! అంతరిక్షమున అసురుల రజత పురములున్నవి. అచట నీ జ్వలామయ దేహము ఉన్నది. అది దేవతల ఆకలి దప్పుల వలన కలిగిన దారుణ వచనములను ఉపశమింపచేసినది. పాపములు చేసినామన్న దేవతల అమర్ష వచనములను ఉపశమింప చేసినది. అట్టి నీ దేహమునాకు స్వాహా. (ద్వితీయ దిన ఉపసద హొమము చేయవలెను)
   
    అగ్నీ! ద్యులోకమున అసురుల సువర్ణ పురములున్నవి. అచట నీవు ఉన్నావు. నీవు దేవతల ఉగ్ర, ప్రదీప్త వచనములను ఉపశమింపచేసినావు. అట్టి నీకు స్వాహా.

    9. పృథివీ! నీవు నన్ను తపింప చేయుదానవు - జీవిక కొరకు అటునిటు ఉరికించుదానవు. నీవు నాకు విత్తము నిచ్చు దానవు. విత్తము కొరకు ఉరికించుదానవు. నీవు నన్ను యాచనల నుండి రక్షింపుము. దుఃఖముల నుండి రక్షింపుము.

    (వేది నిర్మించుటకు మట్టి తీయుటకు గాను తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణములకు నేలమీద గీతలు గీయవలెను. స్ఫనతో మట్టిని త్రవ్వి ఎత్తి ఉంచవలెను.)

    మృత్తికా! నిన్ను నభనామముగల అగ్నియే ఎరుగును. అంగిరస అగ్నీ! "ఆయువు" అను పేరా నిన్ను ఉత్తర వేది మీద స్థాపించుచున్నాను. నీవు భూమి మీద ఉన్నవాడవు.

    అగ్నీ! నీది అఘర్షిత యజనీయ నామము. ఆపేరనే నిన్ను ఉత్తర వేడిన స్థాపించుచున్నాను. (మొదటిసారి మట్టిని తెచ్చిపోయవలెను)

    నభనామ అగ్నీ! ఈ తెచ్చిన మట్టిని తెలిసికొనుము. నీవు నీ గతిమయ నామమున ఇచట- ఉత్తర వేదిన స్థిరపడుము. నీవు ద్వితీయ పృథ్వియగు అంతరిక్షమున ఉన్నవాడవు. నీది అఘర్షిత- యజనీయ నామము. ఆనామముతోనే ఉత్తర వేదిన నిలుపుచున్నాను. (రెండవసారి మట్టి తెచ్చి పోయవలెను)

    నభనామ అగ్నీ! ఈ తెచ్చిన మట్టిని తెలిసికొనుము. గతిశీల అగ్నీ! నీవు గతిశీలుడవు అంగిర నామము గల వాడవు. ఆ నామముతోనే నిన్ను ఉత్తర వేదిన నిలుపుచున్నాను. నీవు తృతీయ పృథ్వియగు ద్యులోకమున ఉన్నవాడవు. నీది అఘర్షిత - యజనీయ నామము. ఆ నామముననే నిన్ను ఉత్తర వేదిన నిలుపుచున్నాను. (మూడవ, నాలుగువ సారి మట్టిని తెచ్చి పోయవలెను)

    మృత్తికా! నిన్ను దేవతల ప్రీతి కొరకు తెచ్చినాను.

    10. (ఉత్తర వేదిని నిర్మించుచు) హే వాక్! నీవు శత్రువులను దునుమాడు సింహినివి. దేవతల కొరకు  నీవు వేది రూపము దాల్చుము, (వేదిని శుద్ధి చేసి) హే వాక్! నీవు శత్రువులను దునుమాడు సింహినివి. వేదీ! నీవు శుద్ధివగుము. నీవు శత్రువును దునుమాడు సింహినివి.. వేదీ! నీవు దేవతల కొరకు అలంకృతవగుము. (నీళ్లు చల్లి నేలను చదును చేయవలెను)

    11. ఉత్తరవేదీ! వసువుల సహితుడైన ఇంద్ర ఘోష నామ దేవత నీకు తూర్పు దిక్కు నుండి వచ్చు ఆపదలను నివారంచవలెను. ఏకాదశరుద్ర సహితుడై విశేష జ్ఞానము గల వరుణుడు నీకు పడమటి దిక్కు నుండి వచ్చు ఆపదలను నివారించవలెను. పితరుల సహితుడైన యముడు నీకు దక్షిణ దిశ నుండి వచ్చు ఆపదలను నివారించవలెను. (నీళ్లుపోసి వేదిని అలకవలెను) ఇప్పుడు ఈ నీరు మురికియైనది. పారబోయదగినది అయినది. దీనిని యజ్ఞవేది నుండి పరిహరింతును. (నీరు పారబోయవలెను)

    12. వేదికా! నీవు సింహినివి. ఇది నీ హవి. నీవు ఆదిత్యుని ప్రసన్నుని చేయు సింహినివి స్వాహా. నీవు బ్రాహ్మణ, క్షత్రియులను ప్రసన్నులను చేయు సింహినివి స్వాహా, నీవు మంచి సంతానము, అన్నమును ప్రసాదించు సింహినివి స్వాహా.

    వేదికా! నీవు సింహినివి. యజమానికి శుభములు కలిగించుటకు దేవతలను తీసికొని రమ్ము స్వాహా.

    హొమ మందున ఆహుతులు ఇచ్చుటకు ఘృతము నిండు జుహువా! సర్వభూత కళ్యాణము కొరకు నిన్ను ఎత్తి ఆహుతులు అర్పింతును.

    13. మధ్య పరిధీ! నీవు అత్యంత స్థిరమవు. పృథివిని దృఢపరచుము. దక్షిణ పరిధీ! నీవు అటల యజ్ఞమున స్థిరమవు. అంతరిక్షమును దృఢపరచుము. ఉత్తర పరిథీ! నీవు అగ్ని యజ్ఞమున స్థిరమవు. ద్యులోకమును స్థిరపరచుము.

    (గుగ్గులాది యజ్ఞ సంభారము -గొర్రె వెంట్రుకల గుచ్ఛమును వేదిక మధ్యమున వేయవలెను.)

    14. యజమాని విద్వాంసుడు, మహామహుడు. అతని ఋత్విజులు విద్వాంసులు. మహామహులు. వారు యజ్ఞ కర్మమున తమ మనసులను లగ్నము చేయుదురు. వీరు తమ బుద్ధులను కూడ యజ్ఞమున లగ్నము చేయుదురు.

    'బ్రహ్మ' అను ఒక ఋత్విజుడు ప్రజ్ఞావంతుడు. అతడు ఆరుగురు వషట్కర్తలను యజ్ఞకర్మమున నియోగించును.

    ఇది సవితృ దేవుని మహిమాన్వితస్తుతి. సవితాయై స్వాహా.

    15. విష్ణువు దీనినంతటిని అతిక్రమించినాడు. అతడు మూడుమారులు తన పాదమును ఉంచినాడు. అతని పాదన్యాసముందే సమస్త లోకములు నిలిచిఉన్నవి. అట్టి విష్ణువునకు స్వాహా

    (దక్షిణ హవిర్ధాన శకట మార్గమున బంగారము ఉంచి అధ్వర్యు అచటనే ఆహుతి ఇవ్వవలెను)

    16. ద్యావాపృథ్వులారా! మీరు జలవతులు - గోవతులు. యజమానికి యజ్ఞమునకు వలసిన సామగ్రి ప్రసాదించువారు.

    విష్ణో! నీవు స్వకిరణములచే ద్యావాపృథ్వులను స్తంభింపచేసినావు. పృథ్విని భరించినావు. అట్టి  కిరానాములకు స్వాహా.

    (ఉత్తర హవిర్ధాన శకట మార్గమున బంగారము ఉంచి ప్రతిప్రాస్థాత అచటనే ఆహుతులు అర్పించవలెను)

    17.(ప్రస్థాత హుత శేష ఘృతమును యజమాన పత్నికి ఇచ్చును. ఆమె ఆ ఘృతమును హవిర్ధాన శకటపు రెండు ప్రక్కలకు పూయును.)

    అక్ష, ధురములారా! మీరు దేవతలందు విఖ్యాతలు. మీరు యజ్ఞమును గురించి - దేవతలకు ప్రకటించండి. యజ్ఞమును నిర్వహింపచేయండి. ప్రకర్షమున ముందుకు సాగండి. మీరు యజ్ఞమును పైపైకి దేవతల వద్దకు చేర్చండి. మీరు యజ్ఞమున కుటిలముగా ప్రవర్తించరాదు.

    గృహస్వరూప శకటాభిమానినీ దేవతలారా! యజమాని గృహమున గోవులు సంపన్నలై ఉండవలెనని పలుకండి. మీరు యజమాని ఆయువును - అతని సంతానమును నష్టపరచకండి. మీరు ఇచట పృథ్వి యొక్క శ్రేష్ఠ స్థానమగు. యజ్ఞమున ఆనందించండి.

    18. నేను విష్ణువు వీర కార్యములను వర్ణించుచున్నాను. విష్ణువు దీర్ఘపాదముల వాడు. అతడు మూడు అడుగులు వేసినాడు. భూమి, లోకముల కొలతలు వేసినాడు. ఉత్తమ స్థానమగు దేవలోకమును స్తంభింపచేసినాడు. అట్టి విష్ణువునకు స్వాహా. (దక్షిణ శకటపు ముందున్న బండిని ఎత్తి ఉంచు కర్రలను భూమి మీద నిలుపవలెను.)

    19. విష్ణో! ద్యులోకము, భూలోకము, మహర్లోకము. విస్తృత అంతరిక్షముల నుండి నీ రెండు చేతులందు ధనము నింపుకొనుము. అట్లు తెచ్చిన దానిని నీ కుడి - ఎడమ చేతులతో మాకు అందించుము. విష్ణవే స్వాహా.

    (ఉత్తరమున నిలిచి ఉన్న హవిర్దాన శకటపు ఎత్తి ఉంచుకర్రలను ఆనించి బండిని నిలుపవలెను.)

    20. విష్ణువు అత్యంత బలవీర్యములు గలవాడు. అతడు సర్వత్ర సంపూజ్యుడు. అతడు గుహలో ఉన్న సింహము వలెను, బయటనున్న సింహము వలెను భయంకరుడు. అతని మూడు విక్రమములందే లోక -లోకాంతరములు - నిలిచి ఉన్నవి.

    (మధ్య ఛాద్యమును ముట్టుకొనవలెను)

    21. (రెండు హవిర్ధాన శకటముల గూళ్ళను ముట్టుకొని) మీరు విష్ణువు లలాటము వంటివారు. (రెండు ఇరుసులను తాకి) మీరు విష్ణువు పెదవుల వంటివారు. (పగ్గమును తాకి) నీవు విష్ణువు సంధాత్రివి. (ముడివేయుచు) నీవు విష్ణువు స్థిరత్వమవు.

    హవిర్దాన మంటపమా! నీవు విష్ణు దేవతాకమవు. నేను నిన్ను విష్ణు దేవుని నిమిత్తము తాకుచున్నాను.

    22. అభ్రీ! నేను సవితా దేవుని ఆజ్ఞానువర్తిని. నేను నిన్ను అశ్వినుల బహువులతో పూష హస్తములతోనూ పట్టుకొను చున్నాను. నీపేరు అభ్రి - నేలను త్రవ్వు కర్రసాధనము. నిన్ను చేతపట్టి నాలుగు గుంతలు త్రవ్వి రాక్షసుల గొంతులు కోయుదును.

    (తూర్పున ప్రారంభించి దక్షిణ శకటము క్రింద నాలుగు దిశలందు నాలుగు 'ఉపరవము'లను గుంతలు త్రవ్వవలెను)

    ఉపరవ నామగర్తలారా! మీరు మహానులు. మహా ధ్వని చేయువారు. బృహద్రవకర్త ఇంద్రుని నిమిత్తము మహా ధ్వనిని ఉచ్చరించండి.

    23. స్తోతలారా! రాక్షసులను వధించునదియు - కృత్య రూప అస్థికేశాదులను ధ్వంసము చేయునదియు - విష్ణు సంబంధి స్తుతిని ఉచ్చరించండి. నా శత్రువులు కృత్యమ పాతిపెట్టినారు. నేను దానిని పెరికి పారవేయుదును.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra