Previous Page Next Page 
ఋషి పేజి 23


    చూపుడువేలుతో దాన్ని నెమ్మదిగా ... సుతారంగా తాకబోయి ఆగిపోయేడు. హుక్కు చివర మట్టి చెమటకి పేరుకుపోయి వికృతంగా వుంది. ఎక్కువసార్లు వాడటంవల్ల  బాగా నలిగిపోయి ఆఖరి దశలో వుంది.

    కాళ్ళమీద నుంచి ఏదో  పాకటంతో లేచి కూర్చొన్నాడు. ఎలుక మంచం క్రిందకి పరుగెత్తింది. దుప్పటితిసి కప్పకొన్నాడు.... చటుక్కున లేవటంతో మళ్ళి నవ్వారు తిగినట్టుంది. మంచం ఇంకొంచెం  గొయ్యి అయింది- క్రింద ఎలుక పెట్టెలోకి దూరి చప్పుడు చేయటం మొదలుపెట్టింది.

    దుప్పటి మొహంమీద కప్పకోంటే గాలి ఆడటంలేదు. దుప్పటి తీసేశాడు-కిటికీ తెరవటానికి వీల్లేదు- ఆ గది  బ్తేట వ్తెపునే మురిక్కాలవ. తలుపు తీస్తే గుప్పన వాసన కొడుతుంది.

    చెవి దగ్గర దోమ  ఒకటి చేరి'జుయ్' మనసాగింది. చెయ్యివిసిరేడు చెంపకి తగిలింది. క్షణంపాటు సంతృప్తి....మళ్ళి దోమ చెవి దగ్గరికి చేరి అల్లరి చేయసాగింది....ప్రక్కకి తిరగి పడుకున్నాడు. దిండుకి గలిబులేదు- తలకి రాసుకునే నూనె దానికి అంటుకొని, ఎండిపోయి అసహ్యమ్తెన వాసన వేస్తూంది.

    ఒక్కసారిగా ఏదో నిరాశ ఆవరించింది ప్రకాశానికి. తన మీద తనకే జాలి వేసింది. ఎందుకో తెలిదు.

    "ఇంకోన్నాళ్ళకి సీతతో  తనకి పెళ్ళవుతుంది. దేవుడు కూడా  ఆపలేడు....పక్కగదిలో ఇన్నాళ్లూ పడుకోంటున్నదల్లా ఈ గదిలోకి వస్తుంది. అంతే తేడా ఈ మాసినబట్టల దండెం క్రింద- ఈ కుక్కిమంచంమీద ఆవిడతో రోమాన్స్ చేస్తాడు. ఫలితం? ఒకరు తరువాత ఇంకొకరు ___ ఐదారుగురు పిల్లలు- దేముడిచ్చిన పిల్లలు-సితవద్దనదు. వంట్లో రక్తం తగ్గిపోయిందంటడు డాక్టరు. బలమ్తెన టానిక్కులు వాడాలి. చంటాడికి విరోచనాలు- పెద్దపిల్లని స్కూల్లో చేర్పించాలి  కిండర్ గార్డెన్ అయితే డొనేషన్ కట్టాలి. ఇకనుంచి తలూకాఫిసులో తెలుగులోనే వ్రాయాలిట. పిల్లని ఇంగ్లీషు కాన్వెంటులో ఎందుకు చేర్పించాలి? ఛిఛి-నా కూతురు తాలూకాఫిసులో గుమస్తా చేస్తుందా? చెయ్యడు. లేట్ హర్ స్టడి ఇంగ్లీషు. ఒక పెద్ద కంపెనిలో మానె జింగ్  డ్తెరెక్టర్  కి స్టెనో అవుతుంది అప్పటికి సంఘం  మారిపోతుంది. వాడు కుర్రాడు అయితే లవ్ మారేజ్ చేసుకొంటుంది. ముసలోడు అవుతే ఏమవుతుంది?" ఈ ఆలోచన  రాగానే ప్రకాశం ఈ లోకంలోకి వచ్చేడు.

    ఒకదానికొకటి సంబందంలేని ఆలోచన్లు. నిద్రపట్టాలంటే తీయటి ఆలోచన్లు రాప్పించుకోవాలి.

    తన గురించీ ఎవర్తెనా గ్రంధం వ్రాస్తే బావున్ను- ఏముంది వ్రాయడానికి కథకి సంఘటన కావాలి. అవేక్కడున్నాయ్? సగటు  మనిషి తను! తన జీవితాన్ని ఎవర్తెనా  నవలగా రాస్తే, అందులో తను హిరో, మావయ్య విలన్- విలన్ అంటే ఎవరు? మావయ్యకి పనిమనిషి-తనకి సుజాత తను హిరో ఎలా అవుతాడు?.... అవుతాడు. ఒకే సంఘటనలో ఒక పాత్రని హిరోగాన్తెనా విలన్ గాన్తెనా  చిత్రిక  రించవచ్చు. చేసేది వెధవ పంతేనా హిరోచేస్తే ఉదాత్తంగానే ఉంటుంది. కాబట్టి తను హిరో!

    హిరోయిన్ ఎవరు?

    సుజాత.

    చాచా....నాచురల్ గా వుండాలి. సితే హిరోయిన్?

    సీతతో డ్యూయెట్.

    ఇదేమిటి నవల్లోంచి సినిమాలోకి వెళ్ళిపోయేడు? ఫర్లేదు కాణిఖర్చులేని కలే  కాబట్టి ఏకంగా సినిమాయే ఊహించుకోవచ్చు.

    తను ప్రేమించేడు సీతని, పంరందమయ్య వద్దన్నాడు. తను గడ్డం పెంచేసాడు. రెండు విషాదగీతాలు. కలతలు పోయేయి. సీతకి తనకి పెళ్ళి జరిగిందిసన్నాయి క్లోజఫ్.

    మొదటిరోజు రాత్రి అగరొత్తుల పరిమళం ప్లేటునిండా సర్దిన స్వీట్లు తలనిండా మల్లెపూలతో సిత - గుమ్మం దగ్గర నించోలేదు లోపలికి రాగానే  తలుపు గడివేసి- "చాలా ఉక్కబోస్తూంది కాదు బావా-" అంది. తను ప్రేక్షకుడు అయ్యేడు. అతను మాట్లాడకుండా ఉండటం చూసి సంజాయిషి చేనుతున్నట్టు- "సుబ్బులింట్లో ఫెన్ అడగాల్సింది" అంది, టేబుల్ మీద ప్లేటు సరిగ్గా పెడుతూ.

    అంతలో బ్తేట్నుంచి ఎవరో ముత్తయిదువ "అమ్మాయ్! కిటికీ సరిగ్గా వేసుకో" అంది. అట్నుంచి చటుక్కున  అటువ్తెపు తిరిగేడు. కిటికిలోంచి బయట వెలుతురు కనబడుతోంది. గడియ సరిగా పడలేదు. దగ్గరగా వెళ్ళి బలంగాతోసి గడియ వేయబోయాడు. పడలేదు.

    "అది పడదు బావా, ఆ రాయి పెట్టు" అంది పక్కనేవున్న రాయి చూపిస్తూ.

    ప్రకాశానికి నుదుటిమీద చెమట పట్టింది. తలుపులన్ని వెయ్యడము వలన  అగరొత్తుల పొగ దట్టంగా అలుముకోంది. ప్లేటులో అన్ని స్వీట్స్ చూసేసరికి మొహం మొత్తినట్టు ఏది తినబుద్ధికాలేదు. కావలసినంత ఉద్విగ్నత లేదు. ఎక్కడికో పారిపోవాలని వెన్నెలరాత్రి, ఇంకిన సెలయేటి యిసుక తిన్నెల మీద  కూర్చొని- ఆనందబ్తేరవి ఆలాపన___ సెక్స్  ఎవడిక్కావాలి? కరిగిపోవాలి!

    "ఏమిటి బావా ఆలోచిస్తున్నావ్" అన్న మాటలతో ఉలిక్కిపడి చేతిలో గ్లాసు - దానితోపీటు చెయ్యితీసుకుని- ఫార్మల్ గా పాలు కొంచెంత్రాగి -తాగించి - సిగ్గుపడకు సితా- ఇదంతా ఇన్ ఫార్మల్ -నవల్స్ చదివి సినిమాలు చూచి ఇన్ స్పిరేషన్ తెచ్చుకోక. ప్రేమ ఉద్బవించదు. అది రాగరంజిత రాసానుబంధం.

 Previous Page Next Page