Home » Dr. dasaradhi rangacharya » Rigveda Samhitha - Part 1


    2. సముద్రుడు నేలమీది జలములను గ్రహించును. ఇంద్రుడు అంతరిక్షమున ఉండి సముద్ర జలమును గ్రహించును. ఇంద్రుని సాహసమునకు కలకాలముగ పేరున్నది. అట్టి ఇంద్రుడు సోమపానమును ఉత్సహించుచున్నాడు.

    3. ఇంద్రుడు తనకొఱకు మేఘములను సృష్టించలేదు. అతడు మహాధనవంతులను పాలించుచున్నాడు. అతని వీర్యము ప్రసిద్ధము. ఉగ్రుడయిన ఇంద్రుడు సర్వకార్యములకు అగ్రముడు అగుచున్నాడు.

    4. అరణ్యమునందలి జమలు ఇంద్రునకు నమస్కరించుచున్నారు. నుతించుచున్నారు. ఇంద్రుడు తన బలదర్పములను జనులకు ప్రదర్శించుచున్నాడు. ఇంద్రుని రక్షణయందు ధనవంతులగు యజమానులు ఇంద్రునకు హవిస్సులు అర్పించుచున్నారు. ఇంద్రుని స్తుతించుచున్నారు. అట్టి యజమానుల అభీష్టములను ఇంద్రుడు తీర్చుచున్నాడు.

    5. ఇంద్రుడు యోధుడు, ప్రజలకొరకే వధ సాధనమయిన తన వజ్రమును ఆడించుచున్నాడు. సమస్త తేజములతో యుద్ధములు చేయుచున్నాడు. దీప్తిమంతుడు అగుచున్నాడు. అందువలననే జనులకు ఇంద్రునిమీద విశ్వాసము కలిగినది.

    6. యశము కోరిన ఇంద్రుడు శత్రువుల కృత్రిమ పురములను ధ్వంసము చేసినాడు. భూమి సహితముగ పెరిగినాడు. సూర్య, చంద్ర నక్షత్రాదులను పరిధులు లేకుండ చేసినాడు. యాగములను, యాగకర్తలను రక్షించుటకు వర్షములు వర్షించినాడు.

    7. ఇంద్రా ! సోమపాయీ ! స్తోత్రప్రియా ! మాకు ఇచ్చుటకు నీకు మనసు ఉండవలెను. నీ సారథులు ప్రమాదములు కాచుకోగల సమర్థులు. నీగుఱ్ఱములు మాకు అభిముఖముకానిమ్ము. ఇంద్రా ! నిన్ను ఏ శత్రువూ హింసింపలేడు.

    8. ఇంద్రా ! నీవు ప్రసిద్ధుడవు. తరగని ధనమునుచేత పట్టినావు. శత్రువులకు లొంగని బలము కలిగినావు. నీరు తోడుకొనుటకు జనులు నూతిచుట్టు చేరుదురు. నీవు చేసిన మహత్కార్యములు నిన్ను చుట్టి ఉన్నవి.

        ఏబది ఆరవ సూక్తము, ఋషి-సవ్యుడు, దేవత-ఇంద్రుడు, ఛందస్సు-జగతి.

    1. యజమాని చమసములలో సోమరూపములగు అన్నములను ఉంచినాడు. మగ గుఱ్ఱము ఆడు గుఱ్ఱమును చేరదీసినట్లు ఇంద్రుడు ఆ సోమములను అందుకున్నాడు. బంగారు రథము నెక్కినాడు. సర్వకార్య సాధకము అగు సోమమును త్రావినాడు.

    2. ధనము కోరిన వర్తకులు యానమునకు సంద్రమును ఆశ్రయింతురు. స్తోత్రము చేయు యాజకులు సర్వవ్యాపకుడయిన ఇంద్రుని ఆశ్రయింతురు. స్తోత్రా ! వృద్ధి కలిగించువాడును, యజ్ఞపతియు అయిన ఇంద్రుని స్తోత్రము చేయుడు. స్త్రీలు, పూలు, పండ్లకొఱకు పర్వతమును ఆశ్రయింతురు. అట్లే ఇంద్రుని స్తుతులతో ఆశ్రయింపుడు.

    3. ఇంద్రుడు ఇనుప కవచము తొడిగినాడు. శాత్రవులను దూలించినాడు. సోమము త్రావినాడు. మత్తెక్కినాడు. తన బలమును సర్వమును శోషింప చేసినాడు. మాయావులను సంకెలలందు ఇరికించినాడు. ఇంద్రుని దోషరహితమయిన బలము యుద్ధములందు పర్వత శిఖరమువలె ప్రకాశించుచున్నది.

    4. ఇంద్రుని బలమునకు ఎదురులేదు. అతడు తిమిర రూపుని వధించినాడు. యాజకులు ఇంద్రుని బలము వర్ధిల్లుటకు స్తోత్రపాఠములు చేసినారు. అవి సూర్యుడు ఉషస్సును చేరినట్లు ఇంద్రుని చేరినవి. అపుడు ఇంద్రుని శత్రువులు హింసలు అనుభవించినారు.

    5. జలములు నాశరహితములు. ప్రాణాధారములు. వాటిని వృత్రుడు మూసిపెట్టినాడు. ఇంద్రుడు జలములను విడిపించినాడు. ద్యులోకమున నిలిపినాడు. ధనార్థమయిన యుద్ధమున హర్షోల్లాసమున ఇంద్రుడు వృత్రుని కొట్టినాడు. అప్పుడు ఇంద్రుడు మేఘములను అధోముఖముగ వర్షింపచేసినాడు.

    6. ఇంద్రా ! జలము భూమికి ఆధారభూతము. ఆ జలమును నీవు ద్యులోకమున ఉండి ధరించుచున్నావు. నీవు సోమము సేవించినావు. మదమెక్కినావు. వృత్రుని శిలతోబద్దలు కొట్టినావు. వర్షము కలిగించుచున్నావు.

        ఏబది ఏడవ సూక్తము, ఋషి-సవ్యుడు, దేవత-ఇంద్రుడు, ఛందస్సు-జగతి.

    1. ఇంద్రుడు ఉత్తమదాత. మహాగుణవంతుడు. ధనపతి. సత్యబలశాలి. సుందరాకారుడు. అతని బలమును, పల్లమునకు పారునీటిని ఆపుట ఎవ్వరి తరముకాదు. సర్వత్ర వ్యాపించిన ధనపు వాకిళ్లను ఇంద్రుడు తెరచినాడు.

    2. ఇంద్రుడు శత్రుసంహారము చేయడలచినాడు. బంగారు వజ్రము పట్టినాడు. వృత్రుని విషయమున జాగ్రత్తపడినాడు. అపుడే జగములన్నియు ఇంద్రుని శ్లాఘించినవి. సవనములన్నియు పల్లమునకు నీరువలె ఇంద్రుని చేరినవి.

    3. ఇంద్రుడు శుభంకరుడు. స్తవనీయుడు. అరిభయంకరుడు. ఉషోదేవీ ! ఇంద్రునికై చేయు యాగములకు హవిస్సులను ఆర్జింపుము. ఇంద్రా ! నీ తేజస్సు ప్రాణాధారము. సారథి గుఱ్ఱమును అటునిటు నడిపించును. అట్లే నీ తేజస్సును సర్వత్ర వ్యాప్తి చేయుటకు నడుపుము.

    4. అనంత ధనవంతా ! ఇంద్రా ! స్తోత్రప్రియా ! మేము నిన్నే ఆధారము చేసికొని జీవించుచున్నాము. మేము నీవారము. స్తుతించుటకు నిన్నుమించినవాడులేడు. భూమి ప్రాణులను కోరినట్లు నీవు మా స్తుతులను వాంఛింపుము.

    5. ఇంద్రా ! నీ వీర్యము విస్తారము. దానిని ద్యులోకము సహితము కీర్తించుచున్నది. పృథ్వి సహితము నీ బలముముందు తలవాల్చినది. అట్టి నిన్ను నుతించుచున్నాము. మా కోరికలను తీర్పుము.

    6. వజ్రధారీ ! ఇంద్రా ! మేఘము విశాలమయినది. పొడవయినది. ఆ మేఘమును కణుపుకు ఒక ముక్కగా కొట్టినావు. వర్షము కలిగించినావు. కావున లోకములందలి బలములను అన్నింటిని నీవే ధరించినావు. ఇది కేవలము సత్యము. పత్రా విశ్వం దధిషే కేవలం సహః

                              (ప్రథమ మండలమున పదవ అనువాకము సమాప్తము.)

                 పదకొండవ అనువాకము - ఏబది ఎనిమిదవ సూక్తము
           ఋషి - నోధస్సు, దేవత - అగ్ని, ఛందస్సు - 1-5 జగతి, 6-9 త్రిష్టుప్.


    1. అగ్ని అరణులు మధించగా పుట్టినవాడు. అమృతుడు. శీఘ్రముగ జ్వలించువాడు. అగ్ని యజమానికి హవ్యవాహనుడు అయినాడు. అతడు ఆమార్గముననే వెళ్లినాడు. అగ్ని అంతరిక్షమును నిర్మించినాడు. హవిస్సుతో దేవతలకు పరిచర్యచేసినాడు.   

    2. అగ్నికి ముదిమిలేదు. ఆరగించుదానిని తనలో చేర్చుకొనును. ఆరగించనున్నవానిలో చేరి ఉండును. గుఱ్ఱము అటు ఇటు ఉరికినట్లు అగ్నిజ్వాలలు అటు ఇటు తిరుగును. ప్రకాశించును. ఆ మంటలు ద్యులోకమును అంటును. ధ్వనులు కలుగచేయును.

    3. అగ్ని హవ్యవాహనుడు. రుద్రులు, వసువులు అగ్నిని తమ ముందు ఉంచుకున్నాడు. అగ్ని దేవదూత, అమరుడు, తేజోవంతుడు. శత్రుధనమును హరించువాడు. యజమానులు అగ్నిని స్తుతింతురు. అగ్నివారికి ధనద్రవ్యములను ఇచ్చును.

    4. అగ్నిని వాయువు ప్రేరేపించును. అప్పుడు అగ్ని మహాధ్వని చేయును. నాలుకలువాచి మండును. తన తేజమున అనాయాసముగ వృక్షాగ్రములను ఆరోహించును. జ్వాలల, కీలల అగ్ని అడవిని దహించునపుడు వృషభమువలె ఉండును. అగ్ని నడచినదారి నల్లనిదారి అగును.

    5. అగ్నికి జ్వాలలు ఆయుధములు. వాయువు ప్రేరకుడు. అగ్ని మంటల మూకలతో సాగును. అడవిలోని పచ్చిపండు చెట్లను దహించును. అగ్ని ఎదురుగా సాగునపుడు ఎంతవానివయినను లక్ష్యము చేయడు. అందరిని తిరస్కరించును. వృషభమువలె గంతులువేయును. అందువలన అగ్నిని చూచి సకల చరాచరములు వడకుచున్నవి.

    6. అగ్నీ ! నీవు యజమానికి దేవదూతవు. యజ్ఞస్థానమున నివసించువాడవు. వరేణ్యుడవు. మిత్రునివలె సుఖప్రదుడవు. భృగువులు తమకు దేవజన్మకోరినారు. మానవులకు శుభములు కలుగచేయు ధనమువంటి నిన్ను మానవులకు అర్పించినారు.

    7. ఋత్విజులు హవించు సప్త యజ్ఞములందును, యజ్ఞకర్తలందును అగ్ని శ్రేష్ఠుడు. అగ్నిదేవతలను ఆహ్వానించువాడు. అట్టి అగ్నిని సేవించువారికి సమస్తము లభించును. అందువలన నేను అగ్నికి హవిస్సులు అర్పింతును. సర్వ కర్మ ఫలము పొందుదును.

    8. అగ్నీ ! నీవు బలపుత్రుడవు. అనుకూలకాంతులుగలవాడవు. నిన్ను స్తుతించుచున్నాము. మాకు తరగని సుఖములను ప్రసాదించుము. ఇనుప కవచము వంటి రక్షణను అనుగ్రహింపుము. పాపముల నుండి కాపాడుము.

    9. అగ్నీ ! నీవు విశేష ప్రకాశవంతుడవు. ధనవంతుడవు. నిన్ను స్తుతించువారికి గృహమును ఇమ్ము. సుఖప్రదుడవు అగుము. నీవు కర్మఫలప్రదాతవు. ప్రాతఃకాలమున విచ్చేయుము.

        ఏబది తొమ్మిదవ సూక్తము, ఋషి-నోధస్సు, దేవత- అగ్ని, ఛందస్సు-త్రిష్టుప్.

    1. అగ్నీ ! ఇతర అగ్నులు నీకు శాఖలే అగును. నీవు ఉన్నప్పుడే దేవతలు హర్షింతురు. నీవు సకల జీవుల జఠరాగ్నివి. జనుల నాభిస్థానమునందు స్థాపించబడినావు. గృహమునకు స్తంభమువలె ప్రజలకు ఆధారభూతుడవు.

    2. అగ్ని ద్యులోకమునకు శిరస్సు, భూలోకమునకు నాభి వంటిది. అగ్ని భూమ్యాకాశములకు, అధిపతి. తేజోరూపుడు అయిన వైశ్వానర, జఠర అగ్నిని సర్వదేవతలు నరుల కొఱకు సృష్టించినారు. 

    3. సూర్యునకు నిశ్చలములయిన కిరణములున్నవి. అగ్నికి అనంత ధనములు ఉన్నవి. అందువలన పర్వతములందు, ఓషధులందు, జలములందు, నరులందు ఉన్న ధనములకు అగ్ని అధిపతి అయినాడు.

    4. అగ్ని భూమి, అంతరిక్షములకు పుత్రుడు. పుత్రుని గుణగణములకు అవి ఉప్పొంగుచున్నవి. చెరసాలలో ఉన్నవాడు రాజును స్తుతించును. అట్లే హోత అగ్నిని బహువిధముల స్తుతించుచున్నాడు.

    5. అగ్నీ ! నీవు వైశ్వానరుడవు. జాతవేదవు. ద్యులోకము గొప్పది. నీవు దానికన్న ఎదిగినావు. మానవులకు రాజువు అయినావు. అసురులు హరించిన సంపదను తెచ్చి దేవతలకు ఇచ్చినావు.

    6. విద్యుదగ్ని వృత్రుని సంహరించినాడు. వర్షము కురిపించినావు. అందుకే నరులు అగ్నిని సేవించుచున్నారు. అట్టి వైశ్వానరాగ్ని ప్రభావము చెప్పుచున్నాను :-

    వైశ్వానరాగ్ని దస్యుని దహించినది. శంబరుని చంపినది. వర్షమును నేలకు తెచ్చినది.

        అరువదవ సూక్తము, ఋషి-నోధస్సు, దేవత-అగ్ని, ఛందస్సు-త్రిష్టుప్.

    1. అగ్ని హవ్యవాహనుడు, యశస్వి, యజ్ఞప్రకాశకుడు, రక్షకుడు, దేవదూత. హవ్యమును వెంటనే దేవతలకు చేర్పును. 'ద్విజన్మానమ్' అనగా ద్యావా-పృథ్వులు లేక అరణులకు పుట్టినవాడు. ధనమువంటి ప్రఖ్యాతమగు అగ్నిని, వాయువు భృగువునకు మిత్రునిగా చేసినాడు.

    2. అగ్ని శాసకుడు అగును. అగ్నిని హవ్యము కోరు దేవతలును, హవ్యములు ఇచ్చు యజమానులను స్తుతింతురు. ఏలననగా అగ్ని పూజ్యుడు. కోరదగినవాడు. ఫలదాత. ప్రజాపతి. సూర్యునికన్న ముందటివాడు.

    3. ఋత్విజులు, నరులు, హవ్యాన్నముగల జనులు యుద్ధములందు అగ్నిని పుట్టించినారు. అగ్ని, ప్రాణము హృదయము నుండి పుట్టినది. అది జ్వాలలు కలది. మాదకము. అట్టి అగ్నిని నుతించు స్తోత్రములు కొంగ్రొత్తవయి పరివ్యాప్తముకావలెను.

    4 అగ్ని ఆహుతులను కోరును. అతడు పావకుడు. ఆధారభూతుడు. కోరదగినవాడు. అతడు మానవులకొఱకు అవతరించినాడు. అగ్ని మానవ శత్రువులను హింసించును. గృహపాలకుడు అగును. యజ్ఞగృహమున నిలుచును. ధనమును ఇచ్చును.

    5 అగ్ని అన్నమును భరించువాడు. ధనమును ధరించువాడు అగును. గోతమ గోత్రులమగు మేము గుఱ్ఱమును శుభ్రము చేసినట్లు మంచి స్తోత్రములచే అగ్నిని నుతింతుము. బుద్ధిచే ధనమును సంపాదించువాడవగు అగ్నీ ! నీవు తెల్లవారుతుండగా త్వరగా విచ్చేయుము.

        ఆరువది ఒకటవ సూక్తము, ఋషి-నోధస్సు, దేవత-ఇంద్రుడు, ఛందస్సు-త్రిష్టుప్.

    1 ఇంద్రుడు సంపన్నుడు. శీఘ్రుడు. గుణాధికుడు. బుక్కు లందలివాడు. నిరాటంకుడు. ఆకలిగొన్నవానికి అన్నము సిద్ధపరుతుము. అట్లే ఇంద్రునికొఱకు ఉత్తమ స్తుతులను పూర్వులు మెచ్చిన హవిస్సులను సిద్ధపరచినాము. 

    2 నరునకు అన్నమువలె ఇంద్రునకు స్తుతులు సమర్పించుచున్నాను. శత్రువును బాధించునవి, మనసును ఆకర్షించునవి అయిన స్త్రోత్ర ధ్వనులను సమకూర్చుచున్నాను.

    3 ఇంద్రుడు ప్రసిద్ధుడు, ఆదర్శప్రాయుడు, దాత, విద్వాంసుడు. అతని వృద్ధికొఱకు నేను నోటితో ధ్వనిచేయుచున్నాను. అది అర్థవంతమయినది. మంచిమాటలుగలది. మధురమయినది అగును.

    4 రథము నిర్మించువాడు రథమును యజమానివద్దకు పంపును. అట్లే ప్రశంసాత్మకమయిన స్తుతులను ఇంద్రునకు పంపుచున్నాను. శస్త్రములవంటి శుభంకర వచనములు సమర్పింతును. మేధావి ఇంద్రుని కొఱకు హవిస్సు అర్పింతును.

    5 ఇంద్రుడు శత్రుంజయుడు. దాత. శత్రుపుర ధ్వంసకుడు. రథమునకు గుఱ్ఱమును పూన్చినట్లు ఇంద్రునికొఱకు వాక్కుతో స్తుతిమంత్రములు కూర్చుచున్నాను.

     6. ఇంద్రుడు శత్రుహింసకుడు. ధనస్వామి. బలవంతుడు. అతడు వజ్రాయుదముచే వృత్రుని ఆయువుపట్టును నొప్పించినాడు. ఆ వజ్రాయుధములు శుభకర్మలు చేయును. శత్రువును పరిమార్పును. ఆ వజ్రాయుధమును విశ్వకర్మ ఇంద్రుని కొరకే పదును పెట్టినాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra