Home » Suryadevara rammohan rao » సూపర్ స్టార్



    "ఇంతకీ అతనెవ్వరన్నారు.........?" వెళ్తున్న ప్రభును చూస్తూవెనక నుంచి ప్రశ్నించింది.

    ప్రభు ఆమె వేపుకు తిరిగి

    "అతనో విచిత్రమైన క్రిమినల్. అతని క్రిమినల్ ఏక్టివిటీస లో ఎక్కడా రక్తపాతం జరగదు- కనిపించదు. అతను ప్రతి పథకం చాపక్రింద నీరులా నిశ్శబ్దంగా పూర్తయిపోతుంటుంది. ఎక్కడా ఏ ఆధారం దొరకదు. దొరకనివ్వడు. ఒక పథకం వేసాడంటే అందులోని ప్రతి అడుగు ఎంతో ప్లాన్ గా ఉంటుంది. ఎక్కడా అది బెసకడు. ఒకవేళ ఆ పథకం మధ్యలో మాకేదన్నా ఆచూకీ దొరికినా దాంతో మిగతా కేసుల్లో లాగా ముందుకెళ్ళలేం.  అదక్కడితో తెగిపోతుంది. ఎంత ప్రయత్నించినా వెనక్కిగాని, ముందుకుగాని మూవ్ అవలేం. అతను పథకాల్ని అమ్ముకొంటుంటాడు. ఎవరైనా అతన్ని కలిస్తే చేయాలనుకుంటున్న లూటీ విలువ అంచనా వేస్తాడు ముందు. దానికి సంబంధించిన అనుపాను లన్నిటిని కొన్ని రోజులపాటు అవగాహన చేసుకుంటాడు. మా బలాన్ని, బలగాన్ని  అంచనా వేస్తాడు. మాలోని ఇంటెలిజెంట్స్ ని, లంచగొండి అధికారుల్ని పసిగడతాడు. కొనవలసిన వాళ్ళని కొంటాడు. ఆ కొనబడినవాళ్ళు నోరు తెరవరు. అయితే అతనితో పని చేయించుకొనే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. బాగా డబ్బున్నవాళ్ళు. లేదంటే అతని పథకాల్ని కొనలేరు. ఒక్కో సందర్భంలో అతని పథకం ఒక్కొక్కటీ పాతిక, ముఫ్పై లక్షలు పలికిన సందర్భాలున్నాయి...."

    అతను చెప్పటం ఆపి ఆమెకేసి అభ్యర్థనగా చూశాడు.

    ఆమె ఆశ్చర్యంగా చూస్తోంది అప్పటికే.

    "మీరు సహకరిస్తే మేం వెళ్ళేందుకు సులువవుతుంది....ప్లీజ్..... అంటూ బయటకు నడిచాడు.

    ఆమె అలాగే ఆలోచిస్తూ కూర్చుండి పోయింది.

    అంతలో ఫోన్ మ్రోగింది. ఆమె చప్పున ఫోన్ ఎత్తి చెవికానించుకుంది.

    "ఊరేగింపును షూట్ చేశావట? ఎక్కువ కాలం బ్రతకాలని లేదా?"

    ఫోన్ కి ఆ వేపు నుంచి వినిపించిన బెదిరింపు ఆమెను అలర్ట్ చేసింది.

    కరుగ్గా ఉన్న పురుషుడి కంఠం అది.

    "అప్పుడే వాటికోసం ఆ ప్రభు వచ్చాడా?"

    షాక్ తిందామె.

    కొద్ది క్షణాలు ఆమెకేం తోచలేదు.

    ఏమిటిదంతా తనవెనుక...?

    ఆమెకు అప్పుడు గుర్తుకొచ్చింది- తనను ఎడిట్ చేసివ్వమన్న అగంతకుడి సంఘటన.

    వెంటనే బెల్ నొక్కి భవానీ రాగానే "గోవా క్యాసెట్ ని  వెంటనే తెప్పించాలి. లేబ్ ప్రాసెస్ తరువాత చూసుకోవచ్చు...." అంది అర్జెన్సీని కనబరుస్తూ.

    భావాన్ని వెంటనే బయటకు వెళ్ళిపోయాడు.

    ఆమె లాగే ఆలోచిస్తోంది.

    అంతలో విల్సన్ వచ్చాడు లోపలకు.

    "ఏదో ఒకటి డిసైడ్ చేస్తే మంచిది మేడమ్....." వినయంగా సూచన అందించాడు విల్సన్ .

    ఆమె ఇంకా మౌనంగానే ఉంది.

    "ఆ రెండో క్యాసెట్ లోని వ్యక్తికి నేను వ్యతిరేకం కాదు. ఆహ్తని పెర్ ఫార్మెన్స్ అద్భుతంగానే వుంది. ఎవ్వరూ  ఆ విషయాన్ని కాదనలేరు. కాని అతనికి సంబంధించిన ఏ వివరం లేకుండా ఎలా ప్రొసీడ్ అవ్వగలం...." పోనీ కావలసినంత టైమున్నా ఆ పని చేయగలిగే వాళ్ళం. ఇంకా ఆరురోజులు మాత్రమే ఉంది పైలట్ సబ్ మిట్ చేయటానికి....." నసుగుతున్నట్టుగా అన్నాడు విల్సన్.

    ఆమె చప్పున తలెత్తి విల్సన్ వేపు సాలోచనగా చూస్తూ "సరే....అరేంజ్ మెంట్ చేయండి..... హీరోయిన్ ఎవరన్నది కూడా డిసైడ్ చేయాలి కదా?"

    "ఇంత హడావుడిగా అదీ కష్టమే -స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చి నందినినే పెట్టుకుంటే పోతుందేమో.....? పైగా ఆ పాత్ర చాలా క్లిష్టమైనది. కొత్తగా ఎవరినన్నా సెలక్ట్ చేసుకున్నా అనుభవం లేక కంగారుపడవచ్చు. మన కాలాన్ని మ్రింగేయవచ్చు. నిజానికి నందినిని పెట్టుకోవటం నాకూ ఇష్టంలేదు. కాని పరిస్థితులలా ముంచుకొస్తున్నాయి. కాలయాపన ఈ సమయంలో తగదేమో? ఆమెకు ప్రశాంత్ అంటే ఇష్టం. ప్రశాంత్ కి మీ మీద గౌరవం ఉంది. ప్రశాంత్ ద్వారా ఆమెను కంట్రోల్ చేసుకుంటూపోతే అంతగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. మీరు వూ....అంటే నేనా ఏర్పాట్లలో ఉంటాను...." విల్సన్ ఆమెను ఒప్పించాలని ఆతృతపడుతున్నాడు.

    "ఓకే.....మేక్ ది అరేంజ్ మెంట్స్...." అందామె సీట్లోంచిలేస్తూ."

    విల్సన్ ఊపిరి తీసుకున్నాడు సమస్యనుంచి బయటపడ్డందుకు.

    ఆమె తన గదిలోంచి బయటకొచ్చి మెట్లవేపు సాగిపోయింది.

    భవానీ వీడియో లాబ్ లో ఉన్న క్యాసెట్ తీసుకొని ఆఫీస్ కేసి బయలుదేరాడు.

    మోటార్ సైకిల్ శబ్దంలో వెనకగా తనను ఫాలో అవుతూ వస్తున్న కారు సంగతి పట్టించుకోలేదు భవానీ.

    ఓ రోడ్ టర్న్ తిరుగుతూ సైడ్ మిర్రర్ లో చూశాడు అనుకోకుండా.

    తను రోడ్ కి ఎడంవేపుకి వెళ్ళి కారుకి దారిచ్చాడు.

    కొద్ది క్షణాలు గడిచాయి.

    అయినా కారు తనను ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేయకపోవటంతో ఒకింత అనుమానించాడు భవానీ.

    ఇకా క్షణం నుంచి సైడ్ మిర్రర్ లోకి ఓరగా చూస్తూ బైక్ ని నడపసాగాడు.

    ఐదు నిమిషాలు అలాగే ముందు భవానీ మోటార్ బైక్, వెనుక ఆ కారు ప్రయాణించాయి.

    అతనికో క్షణం ఏం చేయాలో తోచలేదు.

    శత్రువులా.....?

    అలా తన వెనకే పడటంలో ఉద్దేశ్యం తనను ఎటాక్ చేయాలనా? దోచుకోవాలనా? అదే వారి ఉద్దేశ్యం అయితే తాత్సారం చేయటం దేనికి.....?

    భవానీ స్వతహాగా ధైర్యశాలి....

    అవసరం వస్తే ఇద్దరు ముగ్గుర్ని అవలీలగా మట్టుబెట్టగల సామర్ధ్యం ఉన్నవాడే.

    అందుకే కారు తనను అదేపనిగా వెంటాడుతున్న స్థయిర్యాన్ని కోల్పోలేదు.

    అదేదో తేల్చుకోవటమే బెటరని మొండిగా బైక్ ని ఓ చోట ఆపి కీ తీసి ఆయిల్ చెక్ చేసుకుంటున్నట్లుగా నటించసాగాడు.

    కారు తన దగ్గరకు వచ్చింది.

    భవానీ శరీరాన్ని ఉక్కుముక్కలా చేసి సిద్ధంగా ఉన్నాడు.

    వీధంతా దాదాపు నిర్మానుష్యంగా ఉంది. కారు తనను దాటిపోయింది.

    భావాన్నీ ఆశ్చర్యంగా చూస్తుండగానే కారు ఆగిపోయింది.

    అందులోంచి ఓ వ్యక్తి దిగి భవానీ కేసి రాసాగాడు.

    భవానీ బైక్ స్టాండ్ వేసి ఒకింత తలవంచుకునే ఏదో చేస్తున్నట్లుగా నటించసాగాడు.

    "హలో...." అని వినిపించటంతో భవానీ తలెత్తి ఆ అంగతకుడి వేపు చూశాడు ఏమిటన్నట్లు.

    "సూటిగా విషయంలోకి వస్తాను.... నేనెవరన్నది నీకనవసరం. మీకు..... అంటే.... మీ మేడమ్ కి వారం క్రితం ఫోన్ చేశాను. గోవాలో షూట్ చేసిన క్యాసెట్ లో ఓ చిన్న ముక్క ఎడిట్ చేసి పంపించమన్నాను..... కానింతవరకు ఆ విషయాన్ని మీరు పట్టించుకోలేదు. ఆ ముక్క ఇచ్చినంత మాత్రాన మీకొచ్చే నష్టమేమీ లేదు. దీన్నిబట్టి మా అవసరాన్ని మీరు కేష్ చేసుకునే ఉద్దేశ్యంలో పడినట్లుగా అర్థం చేసుకుంటున్నాను. అది మీ ఒంటికంత మంచిదికాదు. అరగంట క్రితం మీ మేడమ్ కి నేను ఫోన్ చేశాను. ఆ మరుక్షణం నీ మోటార్ సైకిల్ బయటకు దూసుకుపోయింది. నువ్వు సరాసరి వీడియో లేబ్ కి వెళ్ళావు. అక్కడి నుంచి ఐదు నిముషాల్లో తిరిగి మీ ఆఫీస్ కు బయలుదేరావు. సో.....ఇప్పుడు నీ దగ్గర క్యాసెట్ ఉందని అర్థమై పోతోంది. మర్యాదగా ఆ క్యాసెట్ ఇలా ఇచ్చేసి వెళ్ళిపో. మాక్కావల్సిన ముక్కను మేంతీసుకొని మిగతాది భద్రంగా మీకు పంపిస్తాం."

    అదేదో హక్కన్నట్లు, జబర్ధస్తీగా మాట్లాడిన ఆ ఆగంతకుడ్ని చూసి భవానీ నరాలు ఆవేశంతో ఉప్పొంగాయి.

    "నిజానికి మా మేడమ్ మీకు సంబంధించిన సంఘటనను ఎడిట్  చేసి పంపించాలనే అనుకున్నారు. అయితే హడావుడిలో మర్చిపోయారు అదిప్పుడే చేసి పంపిస్తాను. నా మాటమీద నమ్మకం ఉంటే అడ్డుతప్పుకో ధైర్యంగానే అన్నాడు భావాన్ని అవసరమొస్తే యుద్ధానికి కూడా సిద్ధపడుతూ.

    అతను తల మాత్రం వెనక్కి తిప్పి కారువేపు చూశాడు.

    ఛెంగున కారులోంచి నలుగురు వ్యక్తులు దూకి వడివడిగా తనకేసే రాసాగారు.

    భవానికేం చేయాలో ఓ క్షణం తోచలేదు. వాళ్ళతో యుద్ధానికి సిద్దపడాలా? లేక మెరుపు వేగంతో తప్పించుకొని పారిపోవాలా?

    ఓ నిర్ణయానికొచ్చేలోపే ఆ నలుగురు భవానీకి నలువేపుల కాపుకాసేశారు.

    "మర్యాదగా కేసట్ బయటకుతీయ్...." ముందుగా తనతో మాట్లాడిన వ్యక్తి దబాయించాడు.

    "నేనివ్వను..." అంటూనే భవాని మోటార్ సైకిల్ స్టాండ్ తీశాడు.

    అంతే....ఒక్కసారి ఆ నలుగురు భవానీమీద విరుచుకుపడ్డారు.

    ఆ ప్రమాదాన్ని ముందుగానే ఊహించిన భవానీ మోటార్ సైకిల్ ని ఓ వేపుకు వంచుతూ ఆ వేపుకున్న ఇద్దరి గుండెల మీదకు వాలిపోయాడు.

    చూస్తుండగానే ఆ ప్రాంతమంతా రణరంగంలా మారిపోయింది.

    క్షణాలు....నిమిషాలు గడిచిపోతున్నాయి.

    భవానీ క్రమంగా అలసిపోతున్నాడు. అంతలో అటుగా ఓ వ్యక్తి రావటం చూసి "హెల్ప్.....హెల్ప్..." అంటూ అరిచాడు భవానీ.

    ఆ వ్యక్తి చటుక్కున భవానీకేసి తిరిగి చూసి ఒకింత కంగారుపడ్డాడు.

    అతన్ని చూసి భవానీ ఆశ్చర్యపోయాడు. "ప్లీజ్.....రండి.... హెల్ప్ చేయండి.." అంటూనే ధైర్యంగా ఆ నలుగురితో పోరాడుతున్నాడు భవానీ.

    ఆ వ్యక్తి అదేమీ పట్టించుకోనట్లు కంగారు కంగారుగా ముందుకు సాగిపోయాడు.

    భవానీ ఉన్నట్టుండి ఆ నలుగుర్ని దూరంగా విసిరి బైక్ కేరియర్ బాక్స్ లోని కేసెట్ తీసుకొని షర్టులోపల వేసుకొని అతన్ని అందుకొనేందుకు పరుగు లంఘించుకొన్నాడు.

    క్యాసెట్ తీసుకొని పారిపోతున్నాడని భావించి ఆ నలుగురు భవానీ వెనుక పడ్డారు.

    ముందు ఆ వ్యక్తి-
   
    అతని వెనుక భవానీ.....

    భవానీ వెనుక ఆ నలుగురు అగంతకులు....

    రన్నింగ్ రేస్ లా ఉంది వార్ని చూస్తున్న  పాదచారులకు.

    ఆ వ్యక్తి భవానీకి చిక్కలేదు గానీ..... భవానీ మాత్రం ఆ నలుగురికి చిక్కాడు.

    పారిపోతున్న వ్యక్తిని చూసి నిస్పృహగా తల విదిలించాడు భవానీ....

    ఆ వ్యక్తి..... అనిల్........

    ఓ మనిషి కష్టంలో ఉండడం చూస్తూ పట్టించుకొనట్లు వెళ్ళిపోయిన అనీల్ ని చోసిఉ భవానీ చకితుడయ్యాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra