Home » Yandamuri veerendranath » చీకట్లో సూర్యుడు


    ప్రశ్న :  న్యూట్రాన్ స్టార్ అంటే ఏమిటి? దీనిని మనం చూడగలమా?
    (దుర్గాప్రసాద్, గొల్లవానితిప్ప; జి. రవీందర్, పటాన్ చెర్వు; జి. రంగారావు, అల్లీపూర్; ఆర్. వెంకట్రావు, విశాఖపట్నం; యస్. కె జకీర్, రామపురం)

    జవాబు : పూరీలువత్తే గోధుమపిండిని రెండు చేతుల్తోను గట్టిగా నొక్కుతూ పోతే టెన్నీస్ బాల్ సైజునుంచి టేబుల్ టెన్నీసు బంతి సైజుకి తగ్గించటం అసాధ్యం కాదు. అవునా. దీనికి కారణం, అణువుల మధ్య దూరాన్ని  తగ్గించటం. ఈ ప్రపంచంలో అణువులు దూరంగా వున్న పదార్ధం హైడ్రోజన్. అదేవిధంగా సాంద్రత (డెన్సిటీ) అధికంగా గలది ఓసియం అనే పదార్ధం, సాధారణంగా మనం చూసే అన్ని పదార్థాల్లోనూ అంగుళం మేర వస్తువులో 25,000,000 అణువులు (సారీ.....పరమాణువులు అనాలేమేనా) వుంటాయి. కానీ అణువు  అంటే ఏమిటి? ఒక న్యూక్లియస్ చుట్టూ వున్న శూన్యసాంద్రతే కదా! (అర్థమవుతూ వుందా? మరింత కన్ ప్యూజన్ ఎక్కువ అవుతుందా?) ఒక అణువులో లక్షోవంతు మాత్రమే న్యూక్లియస్ వుంటుంది. అంటే అణువును అంత లోపలికి కుదించవచ్చన్నమాట. దీన్ని అటామిక్ న్యూక్లియస్ అంటారు మొత్తం భూమిని రెండు చేతుల్లోను గట్టిగా నొక్కేసి, అటామిక్ న్యూక్లియస్ గా కుదిస్తే అది క్రికెట్ బంతి అంత అవుతుంది. నిజం! దానిమీదే ఇన్ని కోట్లమంది బ్రతుకుతున్నారు. ప్రస్తుతం నక్షత్రాల అంతర్భాగంలో అదే జరుగుతుంది. వాటి కడుపులో వేడికి అణువిచ్చేదనం జరిగి, న్యూట్రాన్స్ అన్నీ పైన చెప్పిన విధంగా కుదించుకుపోయి ముద్దలా తయారవుతున్నాయి.  వీటినే న్యూట్రాన్స్ స్టార్స్ అంటారు. సూర్యుడిమీద అంత వత్తిడి ;లేదు కాబట్టి అతడింకా అలాగే వున్నాడు. అతనేగానీ న్యూట్రాన్ స్టార్ గా కుదించుకుపోతే, ఇప్పుడున్న సైజులో 1,000, 000,000,000,000 వంతు మాత్రమే వుంటాడు. అతడి బరువు మాత్రం మారదు. టెన్నీస్ బంతి సైజులో వున్నా, టేబుల్ టెన్నీస్ సైజులో వున్నా గోధుమ పిండిముద్ద బరువు మారదు కదా. మనకు సుదూరతీరాలలో వున్న న్యూట్రాన్ స్టార్ ఇలాటి కుదించుకుపోయిన ముద్దలే. అందుకు వాటినుంచి ఒక అంగుళం ముక్క కత్తిరించి బరువు తూస్తే అది 25,000,000,000,000 టన్నుల బరువుంటుంది. ఇది అభూత కల్పనలా తోచినా, యదార్థం. ఇవే పల్సర్స్ అంటే.

    ప్రశ్న : బ్లాక్ హోల్ గురించి మరోసారి అర్థం అయ్యేలా చెప్పండి?

                                                                                                   (ఎస్. పద్మావతి, తిరుపతి)

    జవాబు : పిండి వడియాలు మీకు తెలుసుగా! గోళీకాయంత పిండి వడియాన్ని వేడి వేడి నూనెలోవేస్తే గులాబీ పువ్వంత పెద్దగా విచ్చు (Expand)  కుంటుంది. ఇది వేడివల్ల జరుగుతుంది. అలాగే ఏదైనా పదార్థాన్ని ఫ్రిజ్ లో పెడితే సంకోచం చెందుతుంది. దీనికి కారణం అణువుల మధ్య వుండే ఆకర్షణ శక్తి. భూమి, సూర్యుడు, నక్షత్రాలు.....వీటి కేంద్రంలో వున్న ఆకర్షణ శక్తి. భూమి,  సూర్యుడు, నక్షత్రాలు.....వీటి కేంద్రంలో వున్న ఆకర్షణ శక్తివల్లే అణువులన్నీ ఆ కేంద్రాన్ని గోళాకారంలో అంటిపెట్టుకుని వున్నాయి. ఈ ఆకర్షణ శక్తేగాని లేకపోయి వుంటే భూమి మొత్తం అణువులుగా విడిపోయి శూన్యంలో కలిసిపోయి వుండేది. ఇది ఒక పాయింటు.

    ఈ గోళాల పైభాగపు వత్తిడికి, అంతర్భాగంలో విపరీతమైన వేడి జనిస్తుంది. ఆ వేడి గోళాన్ని వ్యాకోచింపజేస్తుంది. ఒకవైపు ఆకర్షణశక్తి గోళాన్ని సంకోచింపజేస్తూంటే, మరోవైపు వేడి వ్యాకోచింపజేస్తుంది. ఈ రెండింటికీ నిరంతం ఘర్షణ కోట్ల కోట్ల సంవత్సరాల్నుంచీ జరుగుతూనే వుంటుంది. ఏదో ఒక స్టేజి దగ్గిర ఈ రెండు శక్తులూ రాజీకి వస్తాయి. ఇది రెండో పాయింటు.

    కొంతకాలానికి, నక్షత్రపు అంతర్భాగంలో వేడి చల్లారిపోయిందనుకోండి. వెంటనే ఆకర్షణ శక్తి విజృంభించి దాన్ని  లోపలికి కుదించుకుంటుంది. ఆ స్టేజీగానీ భూమికి వస్తే  అది పెద్ద  పుట్ బాల్ సైజులోకి దిగిపోతుంది. అలా కుదించుపోయిన గోళాన్ని న్యూట్రాన్ స్టార్స్ అంటారని ఇంతకుముందే చెప్పటం జరిగింది. ఆకారం చిన్నదయ్యేకొద్దీ గురుత్వాకర్షణశక్తి పెరుగుతుంది. భూమి టెన్నిస్  బంతి సైజులోకి కుదించుకుపోయి, నూట్రాన్ స్టార్ గా  మారిందనుకోండి. (మారదు. అయినా అనుకోండి) అప్పుడు 20 పౌండ్ల మీ బాబు ఆ బంతిమీద 4200,000,000,000 పౌండ్ల  బరువువుంటాడు. మీరు నమ్మినా  నమ్మకపోయినా ఇది నిజం.

    మరోరకంగా చెప్పాలంటే, తన చుట్టూ వున్న వస్తువుల్ని కేంద్రం ఇంత దృఢంగా తనవైపు లాక్కొంటుందన్నమాట?!! 'వస్తువులు' అంటే ఏమిటి? అణు సముదాయమేగా! ఈ బలానికి అవి విడిపోయి కేంద్రంవైపు వేగంగా ప్రయాణం చేస్తాయి దాంతో ఆ బంతిమరింత కుదించుకుపోతుంది. ఈ శక్తి ఎంత బలమైనదంటే, తనునుంచి వెలుతుర్ని కూడా బయటకు పోనివ్వక తనవైపు లాక్కుంటుంది. అందువల్ల అది చీకటిగా (బ్లాక్ హోల్) ఉంటుంది. పొరపాటున ఎవరన్నా దీనిలో ప్రవేశిస్తే ఇక అలా లోపలికి ప్రయాణం చేస్తూనే వుంటారు. దీన్నే బ్లాక్ హోల్ అంటారు.

    ఒక బంతి లోపలి భాగానికి అయస్కాంతం అమర్చి అందులో ఒక ఇనుపగోళీని వదలండి. అది అయస్కాంతాన్ని చేరే లోపులో బంతిని గిర్రున తిప్పితే ఆ ఇనుపగోళీ శూన్యంలో అలా ప్రయాణం చేస్తూనే వుంటుంది. దాని కళ్ళకి అయస్కాంతం అంగుళం దూరంలో కనబడుతూనే వుంటుంది. ఎంత ప్రయాణం చేసినా అది దాన్ని చేరుకోదు. బ్లాక్  హొల్ కి  జారిపోతే, అలా ప్రయాణం సాగిపోతూనే వుంటుంది. అంతరిక్షంలో ఇలాంటి బ్లాక్ హోల్స్ ఉనికి కనుక్కోవటం కోసం ఆస్ట్రానమర్స్ ప్రయత్నం చేస్తున్నారు. మీ ప్రశ్నకి ఇంతకన్నా సులభరీతిలో సమాధానాలు చెప్పటం తెలుగులో అసాధ్యమనుకుంటాను పద్మావతిగారూ. పోతే ఇలాటి ఉదాహరణలు చదివి విజ్ఞులు నవ్వుకోవద్దని మనవి.

    ప్రశ్న : మీరొక ప్రశ్నకి సమాధానం ఇస్తూ సూర్యుడి కడుపులో వేడికి, అది కొంతకాలానికి ఎర్రటి మేఘంగా మారి (రెడ్ జెయింట్) ఆకాశమంతా వ్యాపిస్తుందని వ్రాశారు. మరొక ప్రశ్నకు సమాధానం ఇస్తూ, నక్షత్రం కడుపులో వేడి చల్లారగానే అది కుదించుకుపోయి, న్యూట్రాన్ స్టార్ గా  మారుతుంది అన్నారు. రెంటిలో ఏది నిజం?

                                                                                                            (ఎస్.రవీంద్రబాబు, హైద్రాబాద్)

    జవాబు : రెండూ నిజమే. సూర్యుడు నక్షత్రం కాదు కనుక. ఇకపోతే, "కడుపులో వేడి, గొంతులో వేవిళ్ళు" అన్న పదాలు ఆస్ట్రానమీలో ఉపయోగించటానికి బాగోవు కనుక గ్రహాంతర్భాగం అని వాడతాను- మీ కభ్యంతరం లేకపోతే. ఇక విషయానికి వద్దాం. మీరు చదివే  పుస్తకం, చదివే మీ కళ్ళు. మీరు పీల్చే గాలీ, త్రాగే ద్రవాలు, జీవాలు అన్నీ పరమాణువుల్తో నిర్మింపబడినవని మీకు తెలుసు! అణువు అంటే ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు....అంతే. ఇనుమునుంచి ఆక్సిజన్  వరకూ  ఏ పదార్థమైనా  వీటివల్ల మాత్రమే  నిర్మింపబడుతుంది. రకరకాల మిశ్రమాల్తో  రకరకాల వస్తువులు తయారవుతాయే తప్ప విడగొడితే పై మూడే మిగుల్తాయి. ఉదాహరణకు వెయ్యి టన్నుల ఉదజని కాలి కాలి, 993 టన్నుల హీలియంగా  మారుతుంది.993 టన్నుల హీలియం991.5 టన్నుల ఇనుముగా మారుతుంది. నక్షత్రాల  అంతర్భాగంలో నిరంతరం జరిగే చర్య ఇదే! ఇనుము ఇంకా  వేడెక్కితే ఏమవుతుంది? ఒకో సమయంలో నక్షత్రాల అంతర్భాగంలో9,000,000 డిగ్రీల సెంటీగ్రేడు (నీరు వంద డిగ్రీల దగ్గర ఆవిరవుతుంది. దీన్నిబట్టి వేడి తీవ్రతని ఊహించండి) వేడి  వుంటుంది. ఆ వేడికి  లోపలున్న  ఇనుము న్యూట్రినోస్ ని వెదజల్లుతుంది. ఈ  న్యూట్రినోస్ కాంతికన్నా వేగంగా నక్షత్రాల్నుంచి విడివడి శూన్యంలోకి కలిసిపోతాయి. ఆ తరువాత నక్షత్రం వేడి తగ్గిపోయి, కుదించుకుపోయి నోవా, సూపర్ నోవా, న్యూట్రాన్ స్టార్, బ్లాక్ హోల్ గా పరిణామం చెందుతాయి.

    ఈ లోపులో నక్షత్రాల్నుంచి బయటకొచ్చిన న్యూట్రినోస్, శూన్యంలో ప్రయాణం చేసి, చేసి, శూన్యంలో వున్న వాయువుల్తో కలిసి రకరకాల అణువులుగా పరిణామం చెందుతాయి. ఇలా తయారైన వాటిని, "రెండో స్థాయి నక్షత్రాలు" అంటారు. వీటిలో ఉదజని, హీలియం, ఇనుము కాకుండా, ఇంకా చాలా పదార్థాలు వుంటాయి. ఆ కారణంగానే భూమిమీద యురేనియం, బంగారం లాటివి వున్నాయి. సూర్యుడు ఈ విధమైన 'రెండో స్థాయి నక్షత్రమే' తప్ప పూర్తి నక్షత్రం కాదు. కాబట్టి దాని తరువాతి పరిణామం రెడ్ జెయింట్ (ఎర్రమేఘం) అనటమే తప్ప, న్యూట్రాన్ స్టార్ అవదు. ఏదైనా  గొప్ప ప్రభావానికి లోనవుతే ఆ  రెడ్   జెయింట్ కూడా  కుదించుకుపోవటానికి వీలున్నది. కానీ  అది ఇప్పట్లో కాదు.1,00,000 మిలియన్ సంవత్సరాల తరువాత.

    ప్రశ్న : చాలా ఇంగ్లీషు సినిమాల్లో, స్టార్ ట్రెక్ అనే టీ.వీ. సీరియల్ లో  కూడా.... మనుష్యులు ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రానికి వెళ్తూ వుంటారు. కానీ  ఒక నక్షత్రానికి మరో నక్షత్రానికి మధ్య చాలా దూరం కదా. వాళ్ళు  ఎలా వెళ్తారు?  (టి.శ్రీనివాస్, గుంటూరు)

    జవాబు : చాలా చిన్న సమాధానం. "రచయిత వూహించిన అంతరిక్ష వాహనంలో వెళ్తారు." పోతే మీ ప్రశ్న కొంచెం మార్చి ఇలా అడగండి. "ఒక గాలక్సీకి మరొక గాలక్సీ మధ్య దూరం కొన్ని లక్షల కాంతివేగంలో(186,000 x 60 x 60 x x 24 x 365మైళ్ళు వేగంతో) వెళ్ళినా కూడా ఒక నక్షత్రం నుంచి మరో నక్షత్రగ్రహం చేరుకోవటానికి లక్ష సంవత్సరాలు పడుతుంది కదా? మరి అంతకాలం రాకెట్  లోపలి మనుష్యులు ఎలా బ్రతికి వుంటారు?"- అని! నిజమే. ఎటువంటి పరిస్థితుల్లో కూడా  అంతకన్నా  తొందరగా  వెళ్ళటం ప్రస్తుతం మనకు తెలిసిన సాంకేతికపరమైన తర్కం ద్వారా సాధ్యంకాదు. కానీ ఇక్కడ నేను  ఉపయోగించిన "ప్రస్తుతం మనకు తెలిసిన" అన్న పదాల్ని మీరు  మరొక్కసారి చదవండి. ఈ మాత్రం  సందు దొరికితే రచయిత ఈ  రంధ్రంలోంచి ఊహా ప్రపంచంలోకి చొచ్చుకుపోతారు. ఆసిమోవ్ దీన్నే హైబర్ స్పేస్ అన్నాడు. వేగము, దూరము, కాలము అనే మూడు నిరోధకాలను"(Restrictions) దాటటానికి రచయితలు హైపర్ స్పేస్ అనే పదాన్ని కనిపెట్టారు. ఇది ఏమిటో ఒక ఉదాహరణ ద్వారా చెప్తే మీకు బాగా అర్థం అవుతుందనుకుంటాను. ఒక కాగితం తీసుకొని దాని రెండు చివర్ల రెండు చుక్కలు పెట్టి ఒక చుక్క దగ్గిర ఒక చీమని వదలండి. అది రెండో చుక్క దగ్గిరకు చేరటానికి మూడు నిముషాలు పట్టిందనుకోండి. అదే పేపర్ని యు (U) ఆకారంలో మధ్యకి మడవండి. అది రెండో చుక్కల మధ్య దూరం అంగుళం దూరంలోకి వచ్చేస్తుంది. ఇప్పుడా చీమ సదరు ఊహాజనిత రేఖపై కేవలం ఒక సెకనులో ఒక చుక్కనుంచి మరొక చుక్కని చేరుకోగలదు! అవునా.....దీన్నే హైపర్ స్పేస్ అంటారు. ఇప్పటివరకూ మనకు తెలిసినవి మూడు డైమెన్లే! అందువల్ల మీరన్నట్లు ఒక నక్షత్రపు గాలక్సీ నుంచి మరొక గాలక్సీ చేరుకోవటానికి నిజానికి రాకెట్ లోనే వంద తరాలు గడిచిపోవాలి. కానీ ఎప్పుడైతే పై ఉదాహరణ తీసుకున్నామో అప్పుడు ఏదైనా సాధ్యమే? "హైపర్" అంటే అతీతము. ఈ 'ఆతీతము' అన్న పదం మనకి కొత్తకాదు. ఇరవై నాలుగేళ్ళకే ద్రాక్షతోటల్ని ప్లీమత్ కారుల్నీ సంపాదించగలిగే మానవాతీత హీరోలు సాహిత్యంలో వచ్చారు. ఇరవై నాలుగ్గంటలో చేతబడి చేసి చంపగల హైపర్ - సూపర్ విలన్లు  ఆ తరువాత సాహితీ ప్రాంగణంలో పీట వేసుకున్నారు. అద్భుతరసమంటే రచయితలకీ, పాఠకులకీ ఎప్పుడూ ఇష్టమే. పోతే, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అద్భుతమైనది-"సైన్సు" అందులో ముఖ్యంగా 'ఆస్ట్రానమీ?'

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra