Home » Vasireddy seeta devi novels » నిశాగీతం


    "అలాగే! తప్పకుండా!"
    ఆశ్చర్యంగా చూశాడు ఉదయ్. నిజంగానే మెట్లమీదనుంచి దూకుతూందా? కాళ్ళూ విరిగో, తలపగిలో....
    "ఊ,రండీ! అలా నిలబడ్డారేం? నాతో రండీ!" అంటూ మానసి  వెనక్కు తిరిగింది.
    ఇదేమిటి? ఇక్కడ  ఇప్పుడే  దిగుతానందీ? ఇంతలోనే  వెనక్కుతిరిగి తనతో  రమ్మంటుంది.
    "ఏమిటాలోచిస్తున్నారు డాక్టర్? నా మాటమీద మీకు నమ్మకం  లేదా?"
    "నమ్మకం  సంగతి అలా ఉంచు! ఇప్పుడే ఈ మెట్లమీద నుంచి దిగుతానన్నావ్!ఒక్క నిముషం  కాకముందే  వెనక్కు జారుకొంటున్నావ్?"
    "ఇప్పుడు మాత్రం నేను దిగనన్నానా? నాతో రమ్మన్నాను అంతే గదా!"
    "అయితే  దిగు! మెట్లు ఇటు-ఇటూ, ఇక్కడున్నాయ్, అటెందుకు వెళ్తావ్?" ఉదయ్ కంఠం కటువుగా ఉంది.
    ఆమె విరగబడి  నవ్వింది. అది వెర్రివాళ్ళ నవ్వులా అనిపించింది ఉదయ్ కు.
    "మానసీ!" గద్దించాడు.
    మానసి  ముడుచుకుపోయింది.
    "మీరే అడిగారు. మేడమీదకు ఎలా వచ్చావనీ?"
    "అవును అడిగాను! అడిగితే?సమాధానం సరిగా చెప్పాలి!"
    "నేను  సరిగానే చెప్పాను. మీరే సరిగా అర్థంచేసుకోలేదు."
    "నేనా?" ఆశ్చర్యంగా ఉందతనికి.
    "అవును! మీరే?" బుంగామూతి పెట్టింది.
    "ఓ.కే. సరే! ఇప్పుడు సరిగ్గా చెప్పు. మేడమీద నుంచి ఎలా దిగావు?" అనునయంగా అడిగాడు. కాని  అంతలో ఏదో స్ఫురణకొచ్చి కలవరపడ్డాడు.
    రాత్రి మానసి కిందకు  వెళ్ళానంటుంది. అంతకుముందే చెప్పింది మానసి తన  గదిలోకి రాత్రి రాలేదని! తను పైకి రాకపోతే క్రిందకు వెళ్ళే ప్రశ్నేలేదు.
    "మానసీ?" మృదువుగా పిల్చాడు. మందహాసంచేస్తూ, ధోరణి మార్చాడు. మానసిని బుజ్జగించి, మంచి చేసుకొని నిజమేదో రాబట్టాలన్న ప్రయత్నంలో ఉదయ్.
    టపటపా కనురెప్పలార్చి కళ్ళు మెరిపించింది మానసి. ఉత్సాహంగా ఉదయ్ కళ్ళల్లోకి చూసింది.
    "రాత్రి నువ్వు నా గదిలోకి...."
    "నా అంతట నేను రాలేదు! వాడు తరుముకొస్తే వచ్చాను. అంతేగానీ  మీరనుకొంటున్నట్లు నేను మీ గదిలోకి కావాలని...." ఆమె గొంతు పూడిపోయింది. పొంగివస్తూన్న దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూన్న మానసిని చూస్తూంటే ఉదయ్ కు జాలివేసింది. మనసు బాధపడింది. తను అసభ్యంగా ప్రవర్తించాడా? అవతల ఆడపిల్లతో వ్యవహరిస్తున్నాననే ఇంగితజ్ఞానంకూడా నశించిపోయిందా? పోయినా ఆశ్చర్యం లేదు. అనూహ్యమయిన వింత సంఘటనలు, అభూత కల్పనలు, వింత మనుషులూ, వికృత ప్రవర్తనలూ, ఈ భయంకర భీభత్సవాతావర మనుషులూ, వికృత ప్రవర్తనలూ, ఈ భయంకర భీభత్సవాతావరణమూ పరిసరాలూ ఎంతటి దృఢచిత్తుడయినా ఇట్టే బెంబేలు పడిపోతాడు. విచలితమయిన మనసువిచక్షణా జ్ఞానాన్ని కోల్పోతుంది. మానసిని తను ప్రశ్నించిన ధోరణి హేయమయింది. అసభ్యమయిందీ కావచ్చు! అందుకామెను క్షమాపణ కోరినా తప్పులేదు.
    "సారి! మానసీ! నన్ను క్షమించు! నీ మనసుకు బాధ కలిగించడం నా ఉద్దేశ్యంకాదు. నేను అడిగిన ప్రశ్న వెనుక ఏ దురుద్దేశ్యమూ లేదు. పైగా ఉదయం  నేను ఏ స్థితిలో ఉన్నానో నీకు తెలియందికాదు!"అని ఆగి ఆలోచనలో పడ్డాడు ఉదయ్. తను ఏ స్థితిలో ఉన్నాడు? మానసి మాట్లాడుతున్నదాంట్లో తెలిసి మాట్లాడిందా? తెలియక మాట్లాడేదెంత పాలు? నిజమెంత? నాటకమెంత? అడివయ్య, వీరభద్రుడూ తనను చెదరగొట్టడానికి శాయశక్తులా కృషిచేశారు. బుచ్చిబాబు చేయగలిగిందేదో చేశాడు. ఇహ  ఇప్పుడు మానసి వంతేమో? మిగిలిపోయింది శివరామయ్య! అతడూ తను ఇక్కడ్నుంచి బయటకు వెళ్లేలోపున తనవంతు కార్యక్రమాన్ని పూర్తీచేసిన చెయ్యొచ్చు!
    "ఏమిటాలోచిస్తున్నారూ? మీరు నన్ను క్షమాపణ అడగవలసినంత తప్పు పనేమీ చేయలేదులెండి! ఏదో తమాషాగా అన్నాను. బాధపడకండి! ఆమాత్రం స్వతంత్రం  మీరు తీసుకోవచ్చు. ఆ అర్హతా, హక్కూ డాక్టరుగా మీకుంది. అవునా?" అన్నది మానసి.
    ఉదయ్ ఉక్కిరిబిక్కిరయిపోయాడు. 'క్షణ క్షణముల్ జవరాళ్ళ చిత్తముల్' చిన్నప్పుడు చదివిన పద్యమేదో గుర్తుకొచ్చింది. మానసి మానసిక స్థాయినీ, స్థితినీ అంచనా వేయడం అంత తేలికయిన విషయంకాదని గ్రహించాడు.
    "రండిమరీ? ఇంకా అలా నిలబడ్డారేం డాక్టర్ గారూ!" అంటూ  మానసి ముందుకు నడిచింది. ఉఅదాయ్ మారుమాట్లాడకుండా మౌనంగా వరండాలో ఆమెను అనుసరించాడు.
    ఇప్పుడామె ఏమి చేయబోతోంది?కొంపతీసి పిట్టగోడమీదనుంచి దూకదుకదా? లేక గోడమీదనుంచి తనను తోసివేసినా తోసివేయవచ్చు! ఆ రోజు బావి ఒడ్డున నిలబడివున్న తనను తోసిందెవరూ? ఈమేనా? ఆ ప్రయత్నం విఫలమైంది. ఇది మరో ప్రయత్నమా ఉదయ్ బుర్ర వేడెక్కిపోయింది. రక్తం ఉడికిపోతోంది. తనను వెళ్ళేమనుకుంటున్నారో? వీళ్ళ అంతేదో తను తేల్చుకోనిదే......
    తనముందు నడుస్తున్న మానసిని చూస్తుంటే రాజకుమారుడ్ని పాతాళ గుహలోకి తీసుకుపోతున్నా మాయలమారి గుర్తొస్తూంది. నాగలోకానికి దారితీస్తున్న నాగకన్య కాళ్ళముందు కదలాడగా ఉదయ్ చంద్రకు వళ్ళు గగురుపొడిచింది.
    ఏమిటి తను ఇలా వెర్రిగా ఆలోచిస్తున్నాడు? ఇదంతా తనభ్రమేనా? మానసి తనను ద్వేషించడానికి కారణమేముంది? ఆ మాటకొస్తే శివరామయ్యకు, అడివయ్యకూ, వీరభద్రుడికి మాత్రం ఏమి అవసరం?
    అసలు తను ఇక్కడికెందుకొచ్చాడు? శివరామయ్య తనను రమ్మని అడగలేదు. మానసిక చికిత్సకోసం కూతురిని తనదగ్గరకు తీసుకొచ్చాడు. డాక్టర్- పేషెంట్ . ఇంతకుమించి వాళ్ళకూ తనకూ సంబంధం ఏమిటి? తనే స్వయంగా రావాలని నిర్ణయం తీసుకొన్నాడు. మానసి ఉన్న వాతావరణ, మానసిక  భౌతిక పరిస్థితులేమిటో స్వయంగా అధ్యయనంచేసి మానసికి  ట్రీట్ మెంట్ ఇవ్వడం  మంచిదని తనే స్వయంగా నిర్ణయించు కొన్నాడు. మరొకరి ప్రోద్చలంగాని, బలవంతంగానీ ఏమీలేదు. తను వచ్చి విచిత్రమైన పరిస్థితులూ, మనుష్యుల మధ్య ఇరుక్కుపోయాడు. మానసికి నిజంగా జబ్బో కాదో కూడా తెలుసుకునే స్థితిలో లేడు తను! నిజంగా ఆమెను ఎవడయినా వెంటాడుతున్నాడా? అయితే వాడెవడూ? వీరభద్రుడా? అడివయ్యా? బుచ్చిబాబా? శివరామయ్య? నో! నో! శివరామయ్య కూతుర్నెందుకు అలా చేస్తాడూ? శివరామయ్య మానసిక రోగగ్రస్తుడా? ఆ స్థితిలో అతడికేమీ తెలియదా? అందుకైనా బలమైన కారణమేమైనా ఉండాలిగదా? శివరాయ్యకి చనిపోయిన భార్యమీద అనుమానం ఉందా? మానసి తనకు పుట్టలేడనే  భావన ఏమైనా  ఉందా? అదో చేతనంలో ఇంకిపోయిన ఆ భావం ప్రజ్వరిల్లి అప్పుడప్పుడూ రాత్రిళ్ళు మానసివెంట పాడుతుంటాడా? అలా అయితే  ప్రశాంత నర్సింగ్ హొమ్ లో ఉన్నప్పుడు అలాటివేమీ జగరలేదు. ఇక్కడి పరిసరాల్లోనూ, ముఖ్యంగా అలా ఇంట్లో ఉంటేనే ప్రత్యేకమయిన ఆ మానసిక సంక్షోభానికి గురి అవుతాడా? కాని గత రెండురోజులుగా జరిగిన సంఘటనలను పరిశీలించి చూస్తే,మానసి తనవెంట ఎవడో  పడుతున్నాడని పరుగులుతీసినప్పుడు శివరామయ్య ఓసారి తనముందే నిలబడి ఉన్నాడు. లేక ఇదంతా మానసిమానసిక భ్రమేనా? లేక తన భ్రమా? వీళ్ళంతా కలిసి ఆడుతున్న నాటకమా అది? అలా చేస్తే వాళ్ళకేమొస్తుంది? తననుంచి ఏమి ఆశించి చేస్తున్నారు?
    ఆలోచిస్తున్నకొద్ది తన ఆలోచనలు ఎంత అసంబద్డంగాఉన్నాయో తనకే అర్థమయింది ఉదయచంద్రకు. ముందునడుస్తూన్న మానసి ఆగి వెనక్కు తిరిగి చూసింది. తన మనసులో సాగుతూన్న ఆలోచనలను పసి గట్టిందా అనిపించింది ఉదయ్ కు. తన వెనకే  నడుస్తున్నాడని గమనించిన మానసి  గెస్ట్ రూందాటి చిన్న సైజు హాల్లోకి దారితీసింది. హల్లోనుంచి కుడివైపు తలుపుతెరిచి, ఉదయచంద్రను చూసింది. ద్వారందాటి అడుగు పెడుతూనే నిశ్చేష్టుడయిపోయాడు.
    "డాక్టర్ గారూ? ఇదిగో చూశారుగా? ఈ  మెట్లమీదనుంచే దిగివెళ్ళాను. ఈ మెట్లమీదనుంచే ఉదయం మేకు కాఫీ పట్టుకొని మేడమీద కొచ్చాను. ఈ చిన్న విషయాన్ని...గొరింతలు, కొండంతలు చేసి మాట్లాడుతున్నారు మీరు? మరి ఎందుచేతో?" మానసి సూటిగా అతడి ముఖంలోకి చూసింది.
    డాక్టర్ ఉదయచంద్ర ముఖం పాలిపోయింది. నిజంగా ఆమె అన్నట్లే  అయింది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టయింది! రెండో స్టెయిర్ కేస్ ఉంటుందని అతను ఎందుకు ఆలోచించలేకపోయాడు. ఇంత పెద్ద బంగళాకు రెండో స్టయిర్ కేస్ ఉండటం  చాలా మామూలు విషయం. ప్రధాన ద్వారం ఉన్నట్లు ఉండే మెట్లవరస కాక, మరో మెట్లవరస లోపలి భాగం నుంచి ఉండటం సాధారణమైనదే! ఆ మాత్రం అతను ఆలోచించలేకపోయాడు.
    "ముందే చెప్పొచ్చుగా?" కోపంగా అన్నాడు.
    "ఏమనీ?" నొసలు ముడిపడ్డాయి. మానసి సాగదీస్తూ అడిగింది.
    "రెండో స్టెయిర్  కేస్  ఉందని?"
    "మీరడగందే?"
    "ఎలా వచ్చానని అడిగానుగా?"
    "మెట్లమీదనుంచే అని చెప్పానుగా?" నవ్వుతూ చెప్పింది మానసి.
    ఉదయ్ కు మెదడు పిండేసినట్టయింది! మానసి  సరిగానే చెప్పింది. తనే పోరపడ్డాడు. విరిగిన మెట్లమీదనుంచి ఎలా రాగలిగిందా అని అనుకున్నాడు! కాని వేరేమేట్లు ఉండి ఉంటాయన్న ఆలోచనే రాలేదు-ఎందుకని?
    తూనిగల్లా లేస్తున్న ఊహాచిత్రాలను అదుపు చేసుకొంటూ ఉదయ్ మానసి వెనకే నడవసాగాడు.
    "ఈసరికి మెడక్రిందభాగం గ్రౌండ్ ఫ్లోర్ కు వచ్చి  ఉండాలి. ఇరవై మూడో ఇరవైనాలుగో మెట్లు దిగాడు. అయినా ఇంకా మెట్లున్నాయి. వృత్తాకారంలో తిరిగి క్రిందకుపోతూన్న మెట్లనుచూస్తూ అనుకున్నాడు ఉదయ్.
    "మానసీ?"
    ఆమె ఆగి వెనక్కు తిరిగి చూసింది.
    "ఈ మెట్లు?"
    "సెల్లార్ లోకి"
    "సెల్లార్ లోకా?"
    "అవును! సెల్లార్ లో నుంచి ఇంటి వెనుక భాగంలోకి త్రోవఉంది. పాతకాలపు ఇల్లుకడా? ఆ రోజుల్లో ఇదొక రహస్యమార్గంగా ఉండేదేమో మరి?"
    "రహస్యమార్గమా?" అంటూ ఉదయ్  మెట్లమీద ఆగిపోయాడు.
    "ఏమిటి? అంత ఆశ్చర్యంగా ఉందా? ఇది పాతకాలంనాటి జమీందారుగారిల్లు! నగనట్రా, వజ్రవైఢూర్యాలు యీ నేలమాళిగలోనే దాచి పెట్టెవారట! అందుకని ఈ దారి రహస్యంగా ఉంచేవాళ్ళు!" మానసి మెట్లు దిగుతూ "ఊఁ రండీ! ఆగిపోయారేం?" అన్నది.
    ఉదయ్  మానసిని నిశితంగా చూస్తూ మెట్లు దిగసాగాడు.
    డాక్టర్ ఉదయచంద్ర వెనక్కు తిరిగి చూశాడు.
    "ఎందుకు ఆగారు డాక్టర్ గారూ?"
    "ఆఁ! ఏమీలేదు ఎన్నిమెట్లు దిగానూ అని చూస్తున్నాను."
    "కాదు నిజం చెప్పండి. మనవెనక ఎవరో వస్తున్నట్టుగా మీకు అనుమానంగా వుంది. అవునా డాక్టర్?" అడిగింది మానసి.
    ఉదయచంద్ర మెల్లగా నవ్వాడు.
    "నీకు మాత్రంలేదా?"
    "ఏమిటి?" ఆశ్చర్యంగా చూసింది.
    "అదే! మనల్ని ఎవరో వెంబడిస్తున్నారన్న అనుమానం!" సూటిగా ఆమెకళ్ళల్లోకి చూశాడు ఉదయ్.
    "అయితే త్వరగా నడవండి" అని మానసి అతడిచెయ్యి పట్టుకొని గబగబా మెట్లు దిగసాగింది.
    "ఇదిగో, ఈ గదిలోనుంచి బయటికి దారివుంది" అంటూ తలుపు బలంగా తోసింది.
    ఇనతలుపు కిర్రుమంటూ తెరుచుకొన్నది.
    అంతా కటికిచీకటిగా వుంది.
    తెరిచిన తలుపు సందునుంచి ప్రసర్తిస్తోన్న వెలుగులో గదిలోని కొంతభాగం మాత్రం కన్పిస్తూంది.
    ఇంతపెద్ద సెల్లార్ గదా!
    ఆశ్చర్యపోయాడు ఉదయ్ చంద్ర.
    "జాగ్రత్త! మెల్లగా దిగండి" అంటూ మనసి తాను ముందు సెల్లార్ లోకి దిగి, ఉదయ్ ను చెయ్యిపట్టుకొని దించింది.
    "రండి డాక్టర్ గారూ! ఇటు  ఎడమవైపుకు వెళ్తే ద్వారం వుంది ఆ ద్వారంగుండా వెళితే దిగుడుబావి దగ్గర వున్న షెడ్డులోకి వెళ్తాం."
    "ఇదేదో భూగృహంలోనుంచి రహస్యమార్గ ద్వార...."
    "అవును డాక్టర్ గారూ! ఇది వందేళ్ళక్రితం జమీందార్లు కట్టించిన భవనం గదా! నేల మాళిగలూ, రహస్య ద్వారాలూ వుండటంలో ఆశ్చర్యం ఏముంది?" మానసి ఎడమవైపుకు తిరిగి రెండడుగులు ముందుకు వేసింది.
    అంతా చీకటిగా వుంది. ముందేమీ కన్పించడంలేదు. తెరిచిన ద్వారంలో నుంచి ప్రసరిస్తున్న వెలుగు, మలుపు తిరిగి నడుస్తున్నా వాళ్ళకు దూరం అవుతోంది.
    "డాక్టర్!" హఠాత్తుగా అరిచింది మానసి.
    ఉదయ్  చీకట్లో తడుముకుంటూ నడిచాడు, గోడకు అనుకొని నిల్చునివున్న మానసి స్పర్శ చేతులకు తగిలింది.
    "ఏమైంది మానసీ?"
    "ఈ తలుపు రావడంలేదు. చూడండి."
    గోడకు బిగించివున్న నాలుగడుగుల ఎత్తు రెండడుగుల వెడల్పూ వున్న ఇనుప తలుపును తడిమి చూశాడు ఉదయ్. రెండు చేతులతో అదిమి పెట్టి తోశాడు.
    మానసి అతడి పక్కనే నిలబడి, తలుపుతోస్తూ సహాయపడింది.
    ఇద్దరూ కలిసి కొద్ది నిముషాలు ప్రయత్నించారు.
    "లాభంలేదు బయటినుండి గడియవేసినట్టుంది. కమాన్  లెటజ్ గెట్ బ్యాక్!" అంటూ మానసి చెయ్యి పట్టుకొని వెలుగు కన్పిస్తున్న వైపుకు వేగంగా పరుగుతీశాడు.
    హఠాత్తుగా వెలుగు మాయమైంది.
    వెంటనే పెద్దధ్వని ఏదో విన్పించింది.
    అది రాతిగోడకు ఇనుప తలుపు బలంగా తాకినశబ్దం అని ఉఅదాయ్ గ్రహించాడు. మానసి చెయ్యి వదిలి తలుపువైపుకు పరుగుతీశాడు. మూసి వున్న తలుపు నుదురుకు కొట్టుకున్నది. బాధగా వెనక్కు ఒరిగాడు.
    మానసి అతడ్ని పట్టుకున్నది.
    ఉదయ్ నుదుటిమీద చెయ్యిపెట్టి చూసుకొన్నాడు. చేతికి తడి తగల్లేదు. చర్మం చిట్లలేదనీ, వాచీపోయిందనీ తెలుసుకున్నాడు. అరిచేత్తో బొప్పికట్టిన నుదుటిన రుద్దుకొన్నాడు.
    మానసి తలుపుదగ్గర నిలబడి పెద్దగా అరుస్తూ కేకలు పెట్టసాగింది. అరిచి అరిచి సోమ్మసిల్లిపోయి మురికి గచ్చుమీద ఉదయ్ చంద్రకు ఎదురుగా కూలబడిపోయింది.
    ఉదయ్ చంద్ర మెదడు మొద్దుబారిపోయింది. కళ్ళముందు కటిక చీకటి. మస్తిష్కంలో చీకటి.
    చేష్టలుడిగి అలా ఎంతసేపు కూర్చుండిపోయాడో అతడికే  తెలియదు.
    అంతవరకూ మసక మసకగా కన్పిస్తోన్న మానసి స్పష్టంగా కన్పించసాగింది. కొన్ని గంటలు గడిచేసరికి అతడికళ్ళు చీకటికి అలవాటు పడ్డాయి!

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra