Home » Suryadevara rammohan rao » సూపర్ స్టార్


    కెమేరా పని చేసుకుపోతూనే ఉంది.

    దాదాపు పది నిముషాలకు కెమేరా ఆఫ్ చేస్తూ 'రిలాక్స్ మిస్టర్ ప్రశాంత్" అంది హంపి పెద్దగా.

    అప్పటివరకు ఊపిరి బిగబట్టి చూస్తున్న యూనిట్ సభ్యులు ఆ టెన్షన్ నుంచి రిలాక్స్ అయ్యారు.

    చకచకా పది నిముషాల్లో యూనిట్ కి బయలుదేరమని సంజ్ఞ చేసి హంపీ ప్రశాంత్ దగ్గరకు వస్తూ "థాంక్యూ వెరీ మచ్ మిస్టర్ ప్రశాంత్, కేవలం ట్రైల్ షాట్ కోసం చాలా బాగా సహకరించారు...." అంది.

    అతనుఆరాధనగా ఆమె కేసే ఒక క్షణం చూసి కళ్ళతోనే ఫర్వాలేదన్నట్లు సంజ్ఞ చేసి తన కారు దగ్గరకు నడిచాడు.

    యూనిట్ మొత్తం తిరుగు ప్రయాణం కట్టింది.


                                          *    *    *

    నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో హంపీ, విల్సన్, భవాని ఉన్నారు.

    క్యాసట్ రివైండ్ చేసి ప్లేలో పెట్టారు.

    రెండు గంటల క్రితం స్మశానంలో చిత్రీకరించిన దృశ్యాలు టీవీ స్క్రీన్ పై రాసాగాయి.

    ఆమె ఆసక్తిగా చూడసాగింది.

    విల్సన్ కి హంపీ అభిప్రాయాన్ని తెలుసుకోవాలని ఆతృతగా ఉంది. క్యాసట్ మూవ్ అవుతోంది.

    ఒక్కొక్క దృశ్యం స్క్రీన్ మీద అద్భుతంగా కనిపిస్తోంది. ప్రశాంత్  ముఖంలో పలికిన ప్రతి ఎక్స్ ప్రెషన్ స్పష్టంగా కనిపిస్తోంది.

    అతని స్థాయిలో అతను అద్భుతంగా నటిస్తున్నట్లే అనిపించింది విల్సన్ కి అలా అని బయటపడి తన అభిప్రాయం చెప్పేస్తే తనేదో లోపాన్ని వ్యక్తం చేస్తుంది.

    పదిహేను నిమిషాలకి క్యాసట్ పూర్తయింది.

    "భవాని.....మరలా ప్లే చేయ్" అంది సాలోచనగా. భవాని క్యాసట్ ని రివైండ్ చేసి తిరిగి ప్లే నొక్కాడు. ఒక్కో దృశ్యం కదిలిపోతోంది.

    ఆమె సడన్ గా విల్సన్ వైపు తిరిగి "ఏదో లోపం కనిపిస్తోంది కదా! అఫ్ కోర్స్! బాగా చేశాడనే అనిపిస్తోంది కాని మనలో జాలి పుట్టించలేక పోతున్నాడు.

    "ఫర్ ఫెక్ట్ గా ఎడిట్ చేసి, రీరికార్డింగ్ చేస్తే ఆఫీలింగ్ రావచ్చేమో.....' విల్సన్ నెమ్మదిగా అన్నాడు.

    ఆమె తిరిగేం మాట్లాడలేదు.

    పన్నెండు నిమిషాలు ఏకబిగిన నడిచే ఒకే ఒక షాట్ అది.

    మరలా క్యాసట్ పూర్తయిపోయింది.

    "ఒకవేళ ఇంతకంటే బాగా నటించే ఆర్టిస్టు ఉండవచ్చేమో కాని ఇప్పటికిప్పుడు అంటే సాధ్యంకాదు మేడమ్. మీరనుకునే ఎఫెక్టు వచ్చేలా అతన్ని మరింత ఉత్సాహపరిస్తే సరిపోతుందేమో.....ఎందుకంటే వారంలో పైలట్ పూర్తిచేసి సబ మిట్ చేయాలి. ఆ తరువాత నెలలోనే మరో మూడు ఎపిసోడ్స్ పూర్తీ చేసివ్వాలి..... ఇన్ని టెన్షన్స్ లో మనం టైమ్ విషయంలో జాగ్రత్త పడాలి మేడమ్" వినయంగా అన్నాడు విల్సన్.

    ఆమె ఆలోచిస్తోంది.....

    ఆ ఇద్దరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు.

    "మిస్టర్ భవానీ......మొన్న స్మశానంలో తీసిన క్యాసట్ తీసుకురా...." అంది ఆలోచిస్తూనే.

    భవాని బీరువాలో ఉన్న ఆ క్యాసట్ ని బయటకుతీసి "ప్లే చేయమంటారా?" అన్నాడు. హంపీ కేసి చూసి.

    ఆమె తలూపింది.

    భవాని ఆ క్యాసట్ ని డెక్ లో ఇన్సర్ట్ చేసి రివైండ్ చేసి తిరిగి ప్లే చేశాడు.

    ఒక్కో దృశ్యం అద్భుతం ముందుకు కదిలిపోతోంది.

    ఆమె తన్మయంగా చూస్తోంది.

    ఆమె ఆ క్యాసట్ ని ఎందుకు ప్లే చేయమందో ముందు అర్థం కాలేదు. కానిప్పుడు చూస్తుంటే అనిపిస్తోంది అదికదా అభినయం అంటే.....

    "అతను తల్లి అని 18నిమిషాలకు గానీ గమనించలేదు. కేకేస్తూ విరుచుకుపడే సంఘటనకు ముందు 20 క్షణాల్ని లెక్కలోకి తీసుకోకుండా దానికి ముందు చూడాలి. కేవలం నూటయాభై రూపాయలకోసం గుండెలు ద్రవింపజేసేలా నటించాడు. రియల్లీ హి ఈజ్ ట్రెమండస ఆర్టిస్ట్. అతను వృత్తిరీత్యా నటుడు కాకపోవచ్చు. ఒకవేళ అయినా సరే..... చూడండి.....అతని కళ్ళలో ఎంతటి విషాదం గూడుకట్టుకుందో......?

    ప్రశాంత్.....చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చాడు. నాకెందుకో అది ఒకింత చిరాగ్గా అనిపించింది. నిజంగా అత్యంత ఆత్మీయులు, ప్రాణానికి  ప్రాణమైనవారు చనిపోతే ఘనీభవించిపోతారు. మంచుముద్దలా మారిపోతారు. షాక్ తింటారు. ఇటీవలే విడుదలైన ఓ  సినిమాలో కమల్ హాసన్ తన కొడుకు చనిపోయిన సంఘటనలో నటించాడు. గమనించారా? ఒక్కసారి వెర్రికేక వేసి ఫెయింట్ అయి పడిపోతాడు. అది ఎంత సహజంగా ఉంది.....? ఆర్టిస్టు ఇన్ వాల్వుమెంట్ అంటే అది.....

    ప్రశాంత్ నటనలో ఇన్ వాల్వుమెంట్ లేదని అనటంలేదు. కాని అవగాహన మాత్రం లేదని చెప్పగలను. ఒక సీన్ చెప్పినప్పుడు నిజమైన ఆర్టిస్టు తనకు తానుగా మథనపడాలి. యోచించాలి తపించాలి. ఆ సిట్యువేషన్ కూలంకషంగా జీర్ణించుకోవాలి దాని గురించి శోధించాలి. సగటు మానవుడి సామాజిక స్థితిగతుల్ని అర్థం చేసుకోగల్గాలి. వారి మధ్య ఉండే బంధాలు, బంధుత్వాలు ఎటాచ్ మెంట్స్ క్షుణ్ణంగా తెల్సుకోగలగాలి. పైగా మారుతున్న కాలమాన పరిస్థితుల్ని, పారిశ్రామికరణాన్ని తద్వారా సగటుమానవుడి ఫీలింగ్స్ లో వచ్చే పరిణామక్రమాన్ని అర్థం చేసుకోగలగాలి. నటన.....ఓహ్..... అదో మహాసముద్రం....." ఆమె టీవీ స్క్రీన్ వైపే చూస్తూ ఉద్వేగంగా అంది.

    ఆ ఇద్దరూ విస్తుపోయి చూశారు.

    "ణా కెందుకో ఇతనయితే మన సీరియల్ కి బాగా పనికొస్తాడనిపిస్తోంది. మంచి పర్సనాలిటీ ఉంది. సౌమ్యుడిగా, పౌరుషవంతుడిగా కూడా బాగా నటించగలిగే ఫీచర్స్ అన్నీ ఇతనికున్నా యనిపిస్తోంది. అతనెవరో ఎక్కడుంటాడో? ఏం చేస్తుంటాడో? తెలిస్తే బావుంటుంది...."

    విల్సన్, భవానీ ఆశ్చర్యపోయారు ఆమె ఆలోచనకు.

    ప్రశాంత్ ని హీరోగా పెట్టుకోకపోతే ఎదురయ్యే కష్టానష్టాల్ని ఆ ఇద్దరూ బాగా అంచనావేయగలిగారు కనుకే వాళ్ళంతగా ఆశ్చర్యపోయారు.

    అలా అని ఆమెకు ఎదురుచెప్పే సాహసం చేయలేకపోయారు.

    ఆమె తిరిగి మౌనంగా ఉండిపోయింది.

    ఎదురుగా టీ.వీ. వి.సి.ఆర్. ఆ ప్రక్కనే రెండు క్యాసెట్స్..... ఏ నిర్ణయం తీసుకోవాలనేది ఆమెకి సందిగ్ధంగానే ఉంది.

    ప్రశాంత్ పాతిక సీరియల్స్ లో నటించిన అనుభవమున్న సీరియల్ ఆర్టిస్ట్.

    ఇతనెవరో తెలీదు.

    ప్రశాంత్ నటించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతని వృత్తేమిటో తెలీదు. అడిగితే ఒప్పుకుంటాడో లేదో తెలీదు.

    ప్రశాంత్ ని హీరోగా పెట్టుకుంటే స్పాన్సరర్స్ పెద్ద  ప్రాబ్లమ్ కాదు.

    అదే ఇతన్ని పెట్టుకుంటే తన కాలంలో కొంత భాగాన్ని స్పాన్సరర్స్ ని వెతికి పట్టుకునేందుకు ఉపయోగించాల్సి రావచ్చు.

    ఒక మంచి సీరియల్ కోసం ఎన్ని సమస్యలనైనా ఎదుర్కోవాలా? లేక  వ్యాపారపరంగా యోచిస్తూ ఒక సాధారణమైనసీరియల్ ని ప్రొడ్యూస్ చేసి సొమ్ము చేసుకోవాలా?

    ఎంతకీ ఆమెలో ఆలోచనలు తెగటంలేదు.

    విల్సన్ మరో విధంగా భయపడుతున్నాడు. అతనెవరో తెలీదు. ఎక్కడుంటాడో తెలీదు కనీసం పేరైనా తెలీదు. ఒకవేళ ఆమె అతను కావాలని అడిగితే.....?

    ఆమె ఓ నిర్ణయానికి రాకుండానే తన గదిలోకి వెళ్ళిపోయింది.

    "ఇదొకటి వచ్చి పడిందే.? అతనేవరయ్యా బాబూ? ఒకవేళ అతనే కావాలని మేడమ్  అడిగితే ఏమైపోతాం మనం.....?" విల్సన్ ఇబ్బందిగా మొఖం పెట్టి అన్నాడు.

    భవాని ఏం మాట్లాడలేదు.

    అంతలో క్రిందనుంచి ఎవరో పైకి వస్తున్నట్లు బూట్ల శబ్దం వినిపించింది.

    ఇద్దరూ తలలు తిప్పి వెనక్కి చూశారు. ప్రభువస్తూనే "హంపీ గార్ని కల్సేందుకు వచ్చాను....." అన్నాడు.

    "ఒన్ మినిట్....." భవానీ లోపలకు వెళ్ళాడు. హంపీ కళ్ళు మూసుకొని రొటేటింగ్ ఛెయిర్ లో నెమ్మదిగా, లయబద్దంగా ఊగుతోంది.

    రేక్ లో ఉన్న స్టీరియోలోంచి 'దేదీప్యమానమైన స్వాతంత్రపు వెలుగులకు సంబంధించిన బ్యాగ్రవుండ్ మ్యూజిక్ వస్తోంది.

    ఆమె ఆ స్థితిలో ఉండగా డిస్ట్రబ్ చేయటం  ఇష్టంలేక భవానీ వెంటనే వెనుతిరిగాడు.

    "వాట్ భవానీ.....?"

    ఆమె పిలుపుకు చప్పున వెనుదిరిగి ఆశ్చర్యపోతూ "మీ కోసం ఎవరో వచ్చారు మేడమ్....." అన్నాడు వినయంగా.

    "రమ్మని చెప్పు" అంది కుర్చీలో సర్దుకు కూర్చుంటూ.

    అతన్ని చూస్తూనే గుర్తుపట్టింది హంపీ.

    "సారీ ఫర్ ది డిస్ట్రబెన్స్....." అన్నాడు మర్యాదపూర్వకంగా. ఆమె కూర్చోమన్నట్లుగా సంజ్ఞచేసి "చెప్పండి....." అంది.

    అతనామె మోములోని భావాల్ని చదివేందుకు ప్రయత్నించాడు.

    కొద్దిక్షణాలు నిశ్శబ్దంగా గడిచింది.

    "ణా వృత్తిరీత్యా మిమ్మల్ని  కలవక తప్పటంలేదు. ఇఫ్ యు డోంట్ మైన్డ్....." అతను ఆమె మూడ్ ని తెల్సుకునే ప్రయత్నంలో మాటల్ని  కట్ చేశాడు.

    "ఫర్వాలేదు చెప్పండి....." అందామె అటెన్షన్ లోకి వస్తూ.

    "ఢిల్లీ ఎయిర్ పోర్టులో తీసిన క్యాసెట్ పూర్తిగా చూడలేదు. ఈలోపు మరో వార్నింగ్ వచ్చిపడింది నాకు. జయధీర్ ఇక్కడే ఉన్నట్లు మా డిపార్ట్ మెంట్  అనుమానిస్తోంది. అందుకు బేస్ కూడా లేకపోలేదు. మొన్న జరిగిన  వినాయక నిమజ్జనంలో విచిత్రమైన పద్ధతుల్లో లూటీ జరిగింది. కాని ఒక్క వ్యక్తికూడా అందుకు సంబంధించి పట్టుబడలేదు. దొంగ సొమ్ము కూడా ఒక్కటీ వారి  నుంచి చేజారలేదు. అంత పకడ్బందీగా లూటీ చేయించగల వ్యక్తి ఒక్క జయధీరే మా రికార్డు ప్రకారం. దీన్నిబట్టే జయధీర్ ఇక్కడకు వచ్చినట్లు అనుమానిస్తున్నాం. ఇకపోతే మీ దగ్గరకు రావడానికి కారణం - మీరు నిమజ్జనాన్ని షూట్ చేసినట్లు తెలిసింది. ఆ క్యాసెట్ ఓసారి చూస్తే నాకేదన్నా సమాచారం దొరుకుతుందేమోనన్న ఆశ....."

    ఆమె అప్పటికే ఆలోచనల్లో పడిపోయింది.

    "చెప్పండి....." అన్నాడు ఆమె సమాధానం కోసం ఎదురుచూస్తూ.

    "అయితే ఓ పని చేయండి. మొత్తం నాలుగు క్యాసెట్స్ లో ఆ ఊరేగింపు రికార్డ్ అయిఉంది. సాయంత్రం వస్తే మీరిక్కడే వాటిని చూడవచ్చు" అంది సౌమ్యంగానే.

    ప్రభు మొఖం. వికసించింది. పోయినసారిలాగే చిరాకు పడకుండా ఆ మాత్రం రెస్పాన్స్ ఇవ్వడం అతనికి ఆనందంగా ఉంది.

    థాంక్స్ చెప్పి లేచాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra