Home » Vasireddy seeta devi novels » నిశాగీతం



    "అదేమిటి డాక్టర్ గారూ? ఇంకా పళ్ళు తోముతూనే వున్నారూ? కాఫీ."
    "రాత్రి నువ్వు నా గదిలోకి వచ్చిందీ...."
    "నేను మీ గదిలోకా?" ఆశ్చర్యంగా చూసింది మానసి. సిగ్గు ముంచుకొచ్చినట్టుంది. తల  దించుకొన్నది. చిరుకోపంగా చూసింది. ఆమె  చెక్కిళ్ళు కందిపోయినై.
    "సారీ! మానసీ! వచ్చావేమోననుకొన్నాను." నీళ్ళు నములుతూన్నట్టుగా అన్నాడు. ఇంత పేస్ట్ నురుగు మింగేసినట్టున్నాడు.
    "మంచి కలే వచ్చినట్టుంది! అందుకే ఇంత  పొద్దెక్కినా లేవలేదా ఏం?" అలవోకగాచూస్తూ ముసిముసిగా నవ్వింది మానసి.
    గిల్టీగా ముఖంపెట్టి ఉదయ్  బాత్ రూంలోకి పరుగుతీసినట్టే వెళ్ళాడు.
    ఇదంతా కలేనా? కల వాస్తవమావుతుందా? వాస్తవం కల అవుతూందా? వాస్తవంలేనిదేదీలేదు అవాస్తనికత అంటే వాస్తవంకానిదే గదా? అంటే అవాస్తవం వాస్తవంతో అవినాభావ సంబంధం కలిగి వున్నదనేది స్పష్టమవుతూనే వుంది. భిన్నాభిన్నంగా వున్న స్మృతి శకలాలను ఒక వరుసలో పేర్చిదండ గుచ్చడానికి ప్రయత్నం చేయసాగాడు ఉదయ్.
    గత మూడు రోజులుగా జరుగుతున్నా సంఘటనలు తనమస్తిష్కం మీద ఎంతో ప్రభావాన్ని కలిగించా యన్నది వాస్తవం. సచేతనా అవస్థలో వున్న అస్పష్టత, అభూత కల్పనా  తాలూకూ మానసిక చిత్రాలు ఇలా కలల రూపంలో తను చూడగలుగుతున్నాడేమో? గత మూడురోజులుగా తను విన్నవీ, చూసినవీ అన్నీ  కలల్లో కన్పించే మానసిక  అనుభూతి రూపచిత్రాలుగానూ, కలలో చూసినవన్నీ వాస్తవ దృశ్యరూపకాలగానూ అన్పిస్తున్నాయి? ఎంత చిత్రం? విచిత్రం? మనసు చేసే  గారడీ!?
    బ్రష్ కడిగి పక్కనపెట్టి ముఖం చన్నీళ్ళతో అద్దుకొంటూంటే మనసు హాయిగా వుంది. మత్తు పూర్తిగా వదిలిపోయినట్టయింది అన్నీ వివరంగా ఒక్కొక్కటే మనోఫలకం మీదకు రాసాడు.
    రాత్రి తను డైరీ రాయడం పూర్తిచేసి పడుకొన్నాడు. త్వరగానే నిద్రపట్టింది. కంపోజ్ గా వేలియంగాని అవసరం లేకుండానే నిద్ర పట్టింది. బాగా గుర్తుంది సంగతి. తను  నిద్రలో ఉండగా మానసి  తనగదిలోకి వచ్చింది. తన చేతి మీదకు  వరిగి తల  పెట్టుకున్నది. ఆమె స్పర్శాను భూతిని, ఇప్పటికీ తన మనసు  నెమరువేసుకోగలుగుతూంది.
    "వాడు గది బయటే ఉన్నాడు!" మానసి అన్నది తనకు ఇంకా గుర్తు ఉంది. తను లేచి ఆ ఆమెను  పక్కకునెట్టి బయటకు పరుగెత్తాడు. వాడు మెట్లమీదనుంచి పరుగుతీశాడు. తను వెంటపడ్డాడు. మెట్ల దగ్గిరకొచ్చి చూశాడు. పదమూడో మెట్టు విరిగి ఉందే. తను రైలింగ్ మీదుగా కిందకు దూకాడు. భయంకరంగా వెలుగుతూ ఆ కళ్ళూ-తను  ముందుకు దూకాడు! ఆ తర్వాత ఏమైంది? తను పడిపోయాడు. ఆ  తర్వాత? మెలకువ వచ్చింది. కాదు, మానసి  తనను  తట్టి లేపింది. అంతాకలే! కలల్లో తను అనుభవించినవన్నీ తను వాస్తవంగా గత  రెండు  రాత్రుళ్ళూ చూసినవీ, విన్నవీ, అనుభూతి పొందినవే. అవన్నీ  కలలో రావడంలో వింత ఏమీలేదు. అయితే కలలో కొత్తగా జరిగినది ఒకటుంది. పదమూడో మెట్టు విరగడం! ఈ ఇంట్లో  అందరూ ముఖ్యంగా వీరభద్రుడు ఆ పదమూడో మెట్టుచుట్టూ అల్లినకథ అభూతకల్పనా, కలలో  నిజంగానే  విరిగిపోయింది. విరిగిపోయిన మెట్లమీదనుంచి తనుపడిపోయాడు. పడిపోయిండా? లేదా? రైలింగ్ మీదగా జారి కిందకు దూకాడు. కాదు పడిపోయాడు. అప్పుడే దెబ్బ తగిలింది. దెబ్బ  తగిలింది తనకా? కాదు. అమ్మకు! అమ్మకు దెబ్బ తగిలింది. తమ్మ రక్తం  మడుగులో పడి ఉన్నది. తన చిన్నపిల్ల పాడయిపోయాడు. తను చుట్టూ ఎవరెవరో ఉన్నారు. అతడు తన్ను పలకరిస్తున్నాడు. అడుగుతున్నాడు. అంతా  తమాషాగా ఉంది గుర్తొస్తూంది. ఎవరతడు? ఏమిటడిగాడు? తనేం చెప్పాడూ? అంతా విచిత్రమైన కల. పీడకల! తన  అధికచేతనంలో కలగా పులగంగా ఉన్న ఎన్నో భావశకలాలు కలద్వారా రూపుదిద్దుకొన్నాయి. చిత్రమైన కల! తను చిన్నవాడయిపోవటమేమిటి? తన చనిపోవడమేమిటి? విశ్లేషిస్తే-తన చేతగానితనాన్ని అసమర్థత. అయోమయావస్థ కలలో ఈ రూపంలో బయటపడ్డాయన్నమాట. మానసిని, ఆమెకు తను చేస్తున్న చికిత్సను వదిలేసి వెళ్ళాలనుకొన్నాడు. తన ఆలోచనలూ నిర్ణయాల ఫలితమే ఈ కల. పీడకల!
    ఉదయ్ నిట్టూర్చాడు. మనసు తేలికపడింది. తను రాత్రి అనుభవించిన పీడకలకు సరైన విశ్లేషణ దొరికినందుకు సంతృప్తిగా ఉంది. హాయిగా ఉంది. భుజాన ఉన్న టవల్ తో ముఖం  తుడుచుకొన్నాడు. అడ్డంముందు నిలబడి చెదిరిపోయిన జుట్టుని దువ్వెనతో దువ్వుకుంటూ "అబ్బా!" అంటూ ఒక్కసారిగా అరిచాడు. దువ్వెన అవతల పడేసి తల వెనక జుట్టులోకి వేళ్ళూ పోనిచ్చి చూసుకొన్నాడు. జుట్టుకింద మాడు మీద ఉల్లిపాయంత ఎత్తుగా మెత్తమెత్తగా తగిలింది! చేతివేళ్ళకింద తడితడిగా తగిలింది. సన్నగా బాధ! మెడనరాలు జివ్వున గుంజినట్టుగా ఉంది.
    ఏమిటిది?
    రాత్రి జరిగినది కలా కాదా? నిజమా!
    తనను నిజంగా ఎవరైనా కొట్టారా?
    లేకపోతే తనకు తలమీద ఈ గాయం ఎలా అయినట్టు? అయితే తను చిన్న పిల్లవాడిగా ఎలా అయిపోయాడు? ఇది సగం కలా సగం నిజమా? ఏది కల ఏది నిజం? ఏది వాస్తవం? ఏది  అవాస్తవం? ఏది  సత్యం? ఏది అసత్యం? ఓ మైగాడ్!
    ఉదయ్ బాత్ రూంలోనుంచి గదిలోకి వచ్చాడు.
    మానసి చిరునవ్వు వొలకిస్తూ, ప్లాస్క్ లో నుంచి కాఫీపోసి కప్పు  చేతికి అందించింది. కాఫీకప్పు అందుకొంటూన్న ఉదయ్ చెయ్యి వణికింది.
    "డాక్టర్ గారూ! ఇప్పుడెలా ఉంది?"
    ఉదయ్  ఉలిక్కిపడ్డాడు. మానసిని అనుమానంగా చూశాడు.
    "నాకేమయిందని?" ఆమెకళ్ళల్లోకి గుచ్చిగుచ్చి చూస్తూ అడిగాడు.
    "అబ్బే ఏదో అయిందని కాదు! ఏమైనా  అయిందేమోనని!"
    మానసి సమాధానం ఉదయ్ కి చిరాకనిపించింది. చిరాకుతోపాటు కోపంకూడా వచ్చింది. అంతలోనే  కోపాన్ని దిగమింగుకొని లేని నవ్వును తెచ్చుకొని నవ్వాడు.
    "రాత్రి వాడు మళ్ళీ వచ్చాడుగదూ? అందుకని?" మానసి కనుగుడ్లు గుండ్రంగా తిప్పింది.
    ఉదయ్  గుండెలు చిక్కపట్టాయ్.
    "వచ్చేం చేశాడూ?"
    "వాడు తరుముకోస్తూంటే మీ గదిలోకి పరుగెత్తుకుంటూ వచ్చా! గుర్తులేదా?"
    ఉదయ్ చంద్ర నివ్వెరపోయి చూశాడు! నిజంగా మానసి రాత్రి తన గదిలోకి వచ్చిందా? అయితే జరిగినదంతా వాస్తవమేనా? కలకాదా? అప్రయత్నంగా అతడిచెయ్యి తలమీదుకు వెళ్ళింది.
    "బాగా తగిలిందా? ఏదీ  చూడనీయండి?" అంటూ మానసి ఉదయ్ కు దగ్గరగా  వచ్చి చుట్టూ పాయలుగాచేసి తలమీదున్న గాయాన్ని పశీలించి చూసింది.
    "వాచింది చిట్లలేదు! మెట్లమీదనుంచి కిందపడ్డప్పుడు తగిలినట్టుంది!" మానసి  సానుభూతి చూపించింది.
    "నేను పడలేదు! నన్ను ఎవరోకొట్టారు?" ఉద్రేకంగా అన్నాడు. ఎందుకు తొందరపడ్డానా అన్నట్టు తర్వాత ముఖం పెట్టాడు.
    అది చూసి మానసి తమాషాగా నవ్వింది ఉదయ్  ఇరుకున  పడినట్టుగా చూశాడు.
    "మెట్లమీదనుంచి నేను పడ్డానా?" తనగోంతు తనకే ఆశ్చర్యంగా ఉంది ఉదయ్ కు.
    "అవును! పడ్డారు. వాడు నన్ను వెంటాడుతున్నాడని మీ గదిలోకి వచ్చాను! మీరు నామాట వినకుండా వాడివెంట పడ్డారు! వాడు మిమ్మల్ని వరండాలోంచి పరుగెత్తుతూ మెట్లమీదకు  తీసుకెళ్ళాడు. మెట్ల మీదనుంచి వాడు దిగి కిందకువెళ్ళి విరిగి ఉన్న  ఆ పదమూడోమెట్టు సపోర్టులు తీసివేశాడు. అది చూసుకోకుండా మీరు  మెట్లమీద పరుగెత్తుతూ పదమూడో మెట్టుదగ్గిర కొచ్చేసరికి అమాంతం కిందపడిపోయారు?"
    "అంతా చూసినట్టే చెపుతున్నావ్?" సాలోచనగా అన్నాడు ఉదయ్ చంద్ర.
    "చూశాను కాబట్టే చెపుతున్నాను!"
    "నువ్వెలా  చూడగలిగావ్? నిన్ను గదిలోపెట్టి బయట గొళ్ళెం పెట్టాను! నువ్వెలా బయటికి రాగలిగావ్?"
    మానసి పెదవి విరుస్తూ నవ్వింది.
    "అయ్యో పాపం! పిచ్చి డాక్టర్ గారూ! మీరు మొదటి తలుపురెక్క వెయ్యకుండా రెండోదివేసి గొణ్ణెం పెట్టారు! ఒక్క రెక్క తీసినట్టేగదా!గొణ్ణెం  పెట్టి ఏం ప్రయోజనం? అదీ ఒకందుకు మంచిదే అయింది. మీ వెంటనే  నేను పరుగెత్తుకొచ్చాను. మీరు కిందపడగానే నేను పెద్దగా అరిచాను మా నాన్న, వీరభద్రుడు పరుగెత్తుకొచ్చారు. స్పృహ తప్పి పడి ఉన్న మిమ్మల్ని తీసుకొచ్చి మీ గదిలో పడుకో పెట్టారు."
    "రాత్రంతా  అలా స్పృహ లేకుండానే ఉన్నానా?" అయోమయంగా అడిగాడు ఉదయ్.
    "లేదు! కొంతసేపటికి స్పృహ వచ్చింది!"
    "నేనేమయినా మాట్లాడానా?"
    "మాట్లాడారు! గుర్తులేదా?" కళ్ళు తిప్పుతూ అడిగింది.
    "లేదు! ఏం మాట్లాడానూ?" మానసి కళ్ళల్లోకి సూటిగా అడిగాడు ఉదయ్.
    "అంతా చిన్నపిల్లవాడిలా పలకరించారు!"
    "ఏమనీ?"
    "అమ్మా! నాన్నా అంటూ ఏదేదో మాట్లాడారు. అంతా అస్పష్టంగా అర్థంపర్థం లేకుండా ఉంది మీరు మాట్లాడింది, అయితే అంతా చిన్న పిల్లవాడిలా మాట్లాడారు. ఏడ్చారు కూడా?"
    "నిజమా?" నొసలు ముడిపడ్డాయ్ ఉదయ్ కు.
    "ఏం నమ్మకం లేదా? కావాలంటే మీరే  చూడండి! అక్కడ ఆ మెట్టుచూస్తే  మీకే గుర్తొస్తుంది రండి."
    మానసి ఉదయ్ చేతిలో ఉన్న ఖాళీకప్పు తీసుకుని పక్కకు పెట్టిబయలుదేరింది.
    ఆమె వెనకే ఉదయ్  మెట్లదగ్గరకొచ్చాడు.
    విరిగిన పదమూడో మెట్టు, దాంతోపాటు మరో రెండు మెట్లు వంగి వాలిపోయిన రైలింగ్ గత రాత్రి జరిగిన  సంఘటన  సాక్షీభూతంగా కనపడుతున్నాయి.
    మెట్లపైనే నిలబడి  ఉదయ్  నిశితంగా పరిశీలించి  చూశాడు. రైలింగ్ విరిగి  వంగి ఉంది. అంటే తను దానిమీదగా  కిందకు  జారింది వాస్తవమే అన్నమాట! అయితే రైలింగ్  విరిగి వంగిపోవడంతో తను కిందపడ్డాడా? తలకు తగిలిన దెబ్బ అందువల్లనేనా? అంతవరకూ వాస్తవం కాగా మిగతావన్నీ భ్రమలా?
    హఠాత్తుగా  మెదడులో ఓ ప్రశ్న  మెరపు మెరిసినట్టుగా ముందు కొచ్చింది. మానసివైపు తిరిగాడు.
    "ఆ విరిగిన  మెట్లమీదనుంచి పైకిఎలా వచ్చావ్?" మానసి ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగాడు ఉదయ్.
    మానసి వచ్చే నవ్వుని ఆపుకొంటూ "కిందకు ఎలా వెళ్ళానో అలాగే పైకి వచ్చాను!" అన్నది.
    "అవును! ఆ సంగతి నిజమేగదూ! తనకా విషయం ఎందుకు తట్టలేదు? ముందడగవలసిన ప్రశ్న అదేగదా?
    "ఎలా వెళ్ళానని ఆలోచిస్తున్నారా? వెరీ  సింపుల్ ! ఊహించండి!"
    "అడివయ్యా, వీరభద్రుడూ దించి ఉంటారు!"
    "కాదు!" పెదవి విరిచింది మానసి.
    "బుచ్సిబాబూ, మీ నాన్న శివరంయ్యా!"
    "కాదు! కాదు! నన్నెవరూ దించలేదు. నేనే దిగి వెళ్ళాను."
    "దిగి వెళ్ళావా? ఎలా?"
    "మెట్లమీదగానే  దిగివెళ్ళాను!"
    "విరిగిన మెట్లమీదగా దిగి వెళ్ళావా?"
    ఉదయచంద్ర  ఉరమకుండానే ఆకాశంలోనుంచి పిడుగులు పడ్డట్టుగా ఉంది! ఇంతవరకూ ఎంతో మామూలు మనిషిగా మాట్లాడిన మానసి హఠాత్తుగా పిచ్చిదానిలా మాట్లాడుతూంది. ఆమె జబ్బు లక్షణమే అంతేమో? ఆమె ముఖంలోకి చూస్తూ "ఎలా దిగావో మళ్ళీ ఒకసారి నాకు చూపిస్తావా?" అడిగాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra