అని అపహాస్యం చేస్తాడు. విషయం తెలుసుకొన్న ఆచార్యుడు అగ్రహోదగ్రుడై అతన్ని శపిస్తాడు. గురుశాపం ఫలితంగా ఇందీవరాక్షుడు రాక్షసాకారం ధరిస్తాడు. రాక్షసుడైన ఇందీవరాక్షుడు తన ప్రజలను, చివరకు తన కన్న కుమార్తెను కూడా చంపటానికి వెనుకాడడు. ఈ విధంగా గురుదిక్కారం ఎంత నేరమో పెద్దన గారు మనకు స్పురింపజేస్తారు.
పూజ్యా పూజా వ్యతిక్రమం - అంటే మాన్యులైన పెద్దలను అనాదరించడం వల్ల ఎటువంటి కష్టాలు అనుభవించవలసి వస్తుందో మనోరమ, విభావరి, కళావతి, అనే అమ్మాయిల చరిత్ర వల్ల తెలుస్తుంది. మనోరమ గంధర్వ రాజు కుమార్తె. సౌందర్యవతి అభిమానవతి. అభిజాత్యవతి. ఆమె ఒకనాడు తన చెలికత్తెలైన విభావసీ , కళావతులతో విహరిస్తూ ఒక కొండ గుహలో ఏకాంతంగా తపస్సు చేసుకొంటున్న ఒక వృద్ధ మహర్షిని గడ్డాలూ మీసాలూ కదిలించి పరభవిస్తుంది. క్రుద్దుడైన ఆ మహర్షి శాపం వల్ల మనోరమకు రాక్షసబాధ సంప్రాప్తిస్తుంది. ఆమె తండ్రే (ఇందీవరాక్షుడు) ఆమెను తింటానికి వెంట పడతాడు. మునిని నిందించినందుకు ప్రతిఫలంగా విభావసికి, కళావతికి క్షయవ్యాధి సంక్రమిస్తుంది. ఈ విధంగా అనవసరంగా పెద్దలను అవమానించి నందువల్ల భయంకరమైన బాధలు ప్రాప్తిస్తాయని కవి వ్యంగ్యంగా ఉద్భోదిస్తాడు.
కలి అనే గంధర్యుడు వరూదినిపై మనసుపడి ప్రవరుని రూపంలో వచ్చి ఆమెను మోసగించి మోజు తీర్చుకుంటాడు. వరూధినీ మాయా ప్రవరులకు జన్మించిన వాడు స్వరోచి. కాంతిమంతుడూ, పరాక్రమ వంతుడూ, సౌందర్య వంతుడూ అయిన స్వరోచి మందర పర్వత ప్రాంతంలో రాజధాని నిర్మించుకొని రాజ్య పాలనం చేస్తున్నాడు. ఒకరోజు అతడు అడవిలో వేటకు వెళ్ళాడు. ఇంతలో అర్తురాలైన మనోరమ వచ్చి తనను వెంటాడుతున్న రాక్షసుని బారినుంచి కాపాడమని అతణ్ణి ప్రార్ధిస్తుంది. స్వరోచి రాక్షసుణ్ణి సంహరించి ఆమెను రక్షిస్తాడు. రాక్షసుడు శాపవిముక్తుడై గంధర్వరాజైన ఇందీవరాక్షుడుగా మారి స్వరోచికి మనోరమ నిచ్చి మహావైభవంగా వివాహం చేస్తాడు.
సతీసతులు శయ్యా మందిరంలో ప్రవేశిస్తారు. ఆ ఆనందమయ సమయంలో మనోరమ కన్నీరు పెట్టుకోవటం చూచి స్వరోచి కారణం అడుగుతాడు. అప్పుడు మనోరమ మునిశాపంతో క్షయవ్యాధి గ్రస్తలైన తన చెలికత్తెలు విభావసీ, కళవతులను శాపవిముక్తలనుగా చేయమని భర్తను వేడుకొంటుంది. స్వరోచి మనోరమ మాటలకు స్పందిస్తాడు. వెంటనే ఆమెను వెంట బెట్టుకొని అరణ్యంలో అలమటిస్తున్న విభావసీ కళావతుల వద్దకు వెళ్ళి తన మామ అయిన ఇందీవరాక్షుని వల్ల తనకు సంక్రమించిన ఆయుర్వేద విద్యతో వారి వ్యాధిని నివారించి పరిపూర్ణమైన ఆరోగ్యం కలిగిస్తాడు. మనోరమ అభీష్టానుసారంగా వారిని వివాహమాడతాడు. ఇక్కడ స్వరోచి ఆర్తత్రాణపరాయణత్వం, మనోరమ మైత్రీ మాధుర్యం, మనకు కష్టాల్లో ఉన్న వారినీ ఆదుకోవాలని , స్నేహితులను మరువరాదనే చక్కని సందేశాన్ని అందిస్తాయి.
ఒక స్త్రీ మీద ఒక పురుషునికే ప్రేమ ఉండాలనీ , ఒక పురుషుని మీద ఒక స్త్రీకి ప్రేమ ఉండాలనీ, ఒక భర్తకు పలువురు భార్యల మీద ఉండే ప్రేమ పరిపూర్ణ ప్రేమ కాదనీ ఒక చక్రవాకి చేత హంసికి చెప్పించాడు కవి.
పక్షుల భాష తెలిసిన స్వరోచి ఈ మాటలు విని తన కాముకత్వానికి సిగ్గుపడతాడు.
మరొక సన్నివేశంలో కొన్ని అడలేళ్ళు మగలేడి చుట్టూ చేరి దాని మెడ నాకసాగాయి. అప్పుడు మగలెడి -
హుంకారం బొనరించి "నే తలగుదోహో! నేను స్వరొచినే
పంకె జాక్షులతోడ నెల్లపుడు దర్పస్పూర్తిగ్రీడింప ? ల
జ్ఞాంకూరం బడగించినారు; తలపోయన్ నాకు రోతయ్యే ; మీ
రింకన్ బోయి వరింపు డొక్కరుని భోగెచ్చన్ నివారించితిన్."
అన్నది . ఈ సన్నివేశం కూడా స్వరోచి లో మరికొంత మార్పుకు కారణమయింది.
వరూధిని ప్రవరుని రూపం ధరించి వచ్చిన గంధర్వున్ని నిజమైన ప్రవరుని గానే భావించింది. తాను హృదయపూర్వకంగా ప్రేమించిన ప్రవరుని తేజోమయస్వరూపమే సంభోగసమయంలో కూడా ఆమె ముద్రవేసుకొని ఉన్నది. అందుచేత ఆమెకు జన్మించిన స్వరోచిలో ప్రవరుని ధర్మనిష్ఠ, గంధర్వుని క్షాత్రతేజస్సు , వరూధిని భోగలాలస మూడూ కలసి మూర్తిభవించాయి. ఈ కారణం వల్ల వరూధిని పుత్రుడైన స్వరోచికి మనువు అయ్యే అర్హత ప్రాప్తించలేదు. ఆ యోగ్యత స్వరోచీకి, వనదేవతకీ జన్మించిన స్వరోచిషునికి దక్కింది. ప్రవరుని బ్రహ్మతేజస్సు మాయా ప్రవరుని రాజసం, వరూధిని దివ్య సౌందర్యం స్వరోచి పరాక్రమం, వనదేవత పవిత్రత అతణ్ణి సర్వలక్షణ సంపన్నుడిని చేశాయి. స్వారోచిషుడే రెండవ మనువుగా శ్రీమహవిష్ణువు చేత పట్టాభిక్తుడైనాడు.
ఈ విధంగా పెద్దన్నగారు పెద్దన్నగారి లాగా తన కావ్యంలో తెలుగువారికి ఎన్నెన్నో చక్కని సందేశాలు అందించారు. "స్వారోచిష మనుసంభవం" సర్వంగ సుందరంగా సర్వ సమర్ధంగా , సర్వతోభద్రంగా సంపన్నమయింది. ఆనందంతో పాటు సందేశాన్ని సైతం వెల్లడించిన ఉత్తమోత్తమ మహా కావ్యంగా ప్రకాశించింది.