Home » Mainanpati bhaskar » The Editor


    ఎవరు ఎంత క్షుద్రంగా ప్రవర్తించినా నిర్వికారంగా వుండగలను ఇప్పుడు. మీరూ ఇంక బిగ్ టైం లోకి ఎంటర్ అవుతున్నారు. ఇకనుంచి మీమీద ప్రచారం మొదలవుతుంది. అసత్యాలు, అపనిందలు, అక్రమ సంబంధాలు అంటగట్టడం - అవినీతిపరుడని ముద్రవేయడం. దటీజ్ ద గేమ్ ఆఫ్ ద సక్సెస్! ముందుకి పొదలుచుకుంటే మీరు ఇవన్నీ మనసులో పెట్టుకోకూడదు. బెదిరిపోకండి" అన్నాడు.
    అయన మాటలు వినగానే అభిషేకన్ గుర్తుకు వచ్చాడు ఉదయర్కర్ కి. ఎవరిమీద పడితే వాళ్ళమీద "బేడ్ కేరెక్టర్" అని సులభంగా స్టాంప్ వేసేయ్యగల అభిషేకన్! అలాంటి మనుషులు ఇంకా ఎంత మంది ఉంటారో, వాళ్ళకి వంతపాడేవాళ్ళు ఇంకెంత మంది ఉంటారో అలాంటి వాళ్ళని ఉపయోగించుకుంటూ పబ్బం గడుపుకోవడానికి రెడీగా వుండేవాళ్ళు మరెంతమంది ఉంటారో!
    వద్దనుకున్నా అతని మనసు కలత చెందడం మానలేదు.
    "నౌ కమింగ్ టూ ద మెయిన్ పాయింట్! సదానంద్ ఇంకో మేగజైన్ ని అప్రోచ్ అయ్యాడు. అతను ఇంక మన దగ్గరికి రాకపోవచ్చు. అతను మనకి చెబుతానన్న ఇన్ఫర్మేషన్ పూర్తిగా చెప్పనేలేదు. తర్వాత ఏం చేద్దామనుకుంటున్నారు?" అడిగారు ఎడిటరు.
    "సదానంద్ యింకో మేగజైను కి వెళ్ళిపోయాడని మీకెలా తెలుసు?" అన్నాడు ఉదయార్కర్ ఆశ్చర్యంగా.
    చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు ఎడిటరు. ఆ చిరునవ్వులో "నేను ఎన్ని విధాల ఎంత అలర్టుగా వుండకపోతే ఇలా నెగ్గుకురాగలుగుతున్నాను" అన్న భావం కనబడింది.

    కాస్త వేదాంతం తళుక్కుమంది.
    ఎడిటర్ వైపు మెప్పుదలగా చూశాడు ఉదయార్కర్. ఎన్ని పెనుతుఫానులు వీచినా, అంగుళమైన అటూ ఇటూ చలించని పర్వతం ఈయన.
    ఈయన దగ్గిర తను నేర్చుకోవలసింది చాలా వుంది.
    ఆయన్ని చూస్తుంటే వచ్చిన కొత్త స్పూర్తితో, ఉత్సాహంతో అన్నాడు ఉదయార్కర్.
    "సదానంద్ లేకపోతేనేం? నేను ఒక్కడినే వెళతాను బ్రహ్మచారి దగ్గరికి."
    తల అడ్డంగా ఊపాడు ఎడిటరు.
    "తను తోడు రాకుండా ఒంటరిగా బ్రహ్మచారి దగ్గరకు వెళ్ళడం ప్రమాదం అనీ, అలా చెయ్యవద్దని హెచ్చరించాడు సదానంద్." అన్నాడు. అతని గొంతులో ఉదయార్కర్ క్షేమం పట్ల ఆదుర్దా ధ్వనిస్తోంది.
    "మరెలా?" అన్నాడు ఉదయార్కర్.
    ఇద్దరూ కాసేపు ఆలోచనలో వుండిపోయారు.
    అకస్మాత్తుగా ఏదో స్పురించినట్లు టేబుల్ మీద ఫైళ్ళ మధ్య ఇరుక్కుపోయి ఉన్న ఒక కాగితాన్ని బయటకు తీశాడు ఎడిటరు. చాలా పాత కాగితం కావడం వాళ్ళ పసుపురంగుకి తిరిగి వుంది అది. ముట్టుకుంటే విరిగిపోయేటట్లుగా పెళుసుగా వుంది. పాతకాలపు ఊటకలంతో కరక్కాయ సీరాతో రాసినట్లు కనబడుతున్నాయి అక్షరాలూ.
    "ఇది చూడండీ!" అన్నాడు దాన్ని ఉదయార్కర్ కి అందిస్తూ.
    దాన్ని అందుకుని పరీక్షగా చూశాడు ఉదయార్కర్.
    అది మామూలు కాగితం కాదు.
    భుర్జా పత్రం!
    కాగితాలు లేని పాతరోజులలో అలాంటి పత్రాలను రాతకోతలకి ఉపయోగించేవారు.
    ఆ గొలుసుకట్టు రాతను కూడబలుక్కుంటూ చదవడం మొదలెట్టాడు ఉదయార్కర్.
    కదళీనాధుడు -------శునక శాల్మని వృక్షం.
    శ్రీగిరి పర్వతమునకు ఉత్తరమున కదళీ వనముకలదు. ఆ వనములో కదళీనాధుడను లింగమున్నది. ఆ లింగమునకు ఎడమ వైపున శివాలయమున్నది. శివాలయమునకు సమీపమున, శునక శాల్మని అను వృక్షము గలదు. ఆ చెట్టు ఫలములు శునకముల ఆకృతి పోలియుండును.  ఆ చెట్టు ఫలములు భుజించిన వారలు నాల్గు జాములు మూర్చగలుగుదురు. తిరిగి తెలివి వచ్చును. తరవాత తన శరీరము తమకు కొత్తగా కనిపించును. ఒక మాసము గడిచిన పిమ్మట శరీరమంతయూ బొత్తిగా మార్పునోంది కుమార రూపుడగును. ఆ వృక్షము యొక్క ఖండము సువర్ణాంజనము. మరియు దాని పట్టు రసభేరి. ఆ చెట్టు యొక్క భైరవుడుండును. ఆషాడమ,మాసంలో సాధకుడు తొమ్మిది దినములు ఉపసించి, ఈ క్రింది మంత్రము జపించవలయును. మం, షం, బం, మం, రం, మం, భం, ఛం కం, ఈ మంత్రమును పరించిన ఇష్టాశిద్ది కలుగును."
    "సదానంద్ దగ్గర ఇలాంటి పత్రాలు ఇంకొన్ని చూశాను. అతను మర్చిపోయి వెళ్ళి వుండాలి దీన్ని" అన్నాడు ఉదయార్కర్ ఎగ్జయిటేడ్ గా.
    "మర్చిపోయాడో, కావాలనే వదిలేశాడో, మనకేమన్నా పనికి వస్తుందా! జానపద కధల్లోలా వుంది ఇన్ఫర్మేషన్" అన్నాడు ఎడిటర్.
    "తప్పకుండా పనికివస్తుంది." అన్నాడు ఉదయార్కర్.
    "ఎలా?"
    "నిధులూ, నిక్షేపాలూ కోసం వెదకడంలో సదానంద్ తో పాటు బ్రహ్మచారికి కూడా ఇంటరెస్టు వుంది."
    "ఇది నిధుల గురించి కాదే! కదళీనాధుడు, శునక శాల్ముకి వృక్షం, కుక్కమూతి పెందేలూ ......భాష్" అన్నాడు ఎడిటర్.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra